
భారతీయులకు వాహనం అంటే చాలా సెంటిమెంట్. అది కార్ అయినా కావచ్చు.. బైక్ అయినా కావచ్చు. కొత్తగా వాహనం కొంటే ఇంటిల్లిపాదికి అదొక పండుగ లాంటి సందర్భం. ఇలాగే ఛత్తీస్‌గఢ్‌లో ఒక కుటుంబం ఇటీవల నెటిజెన్ల దృష్టిని ఆకర్షించింది.
ఇదీ చదవండి: టాప్ బిజినెస్ టైకూన్స్ మాతృమూర్తుల గురించి తెలుసా?
వారు కొన్న మహీంద్రా స్కార్పియో-N ఎస్‌యూవీ డెలివరీ సందర్భంగా కుటుంబం మొత్తం కారు ముందు డ్యాన్స్ చేశారు. యువకులు పిల్లలు, పెద్దలు అందరూ ఓ హిందీ పాటకు ఉత్సాహంగా చిందులు వేశారు. ఈ వీడియోను కార్ న్యూస్ గురు అనే ట్విటర్ పేజీ షేర్ చేయగా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని కూడా ఆకర్షించింది. ఆయన దానిపై స్పందిస్తూ రీట్వీట్ చేశారు. వారి ఆనందం చూస్తుంటే తాను వాహన తయారీ రంగంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇంతకు మించిన అవార్డులు ఏముంటాయని పేర్కొన్నారు. ఆనంద మహీంద్రా ట్వీట్‌ను వేలాది మంది లైక్ చేశారు. పలువురు తమకు తోచిన విధంగా కామెంట్లు పెట్టారు.
This is the real reward and joy of working in the Indian auto industry… https://t.co/ormA7i8sQq
— anand mahindra (@anandmahindra) May 19, 2023
ఇలాంటి ఆసక్తికర ట్రెండింగ్ అప్‌డేట్ల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూస్తూ ఉండిండి
Comments
Please login to add a commentAdd a comment