నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం | Thank You For Your Skepticism Anand Mahindra Responds To Trolls Trash Cars Comment | Sakshi
Sakshi News home page

నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం

Published Thu, May 2 2024 5:09 PM | Last Updated on Thu, May 2 2024 5:49 PM

Thank You For Your Skepticism Anand Mahindra Responds To Trolls Trash Cars Comment

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా'.. ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపైన ఒక నెటిజన్ స్పందిస్తూ మహీంద్రా కార్లు అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీపడలేవని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనికి ఆనంద్ మహీంద్రా రిప్లై కూడా ఇచ్చారు.

ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన మహీంద్రా XUV 3XO కారును ఆనంద్ మహీంద్రా తన ఫాలోవర్లకు షేర్ చేశారు. ఈ వీడియోపైన ఘాటుగా వ్యాఖ్యానించిన వ్యక్తికి ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో సమాధానం ఇస్తూ.. మీ సందేహానికి ధన్యవాదాలు, ఇలాంటివి మాలో ఇంకా కసిని పెంచుతాయని అన్నారు.

1991లో నేను కంపెనీకి చేరినప్పుడు సరిగ్గా ఇలాగే అన్నారు. కార్ల తయారీ రంగంలో తప్పుకోవాలని అంతర్జాతీయ సంస్థలు సూచించాయి. కానీ అవన్నీ తట్టుకుని నిలబడగలిగాము. వచ్చే వందేళ్ల తరువాత కూడా మా బ్రాండ్ ఉండాలని కోరుకుంటున్నాము. దీనికోసం ప్రతిరోజు పోరాడుతూ ఉంటామని.. ఆనంద్ మహీంద్రా సున్నితంగా సమాధానం ఇచ్చారు.

నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానం అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ పోస్టుకు ఇప్పటికే లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. లెక్కకు మించిన యూజర్స్ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడి నేతృత్వంలో మహీంద్రా బ్రాండ్ వందేళ్ల తరువాత కూడా నిలిచే ఉంటుందని నమ్ముతున్నట్టు మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement