Mahindra Scorpio N Automatic, 4Wd Prices Revealed: Check Details In Telugu - Sakshi
Sakshi News home page

మహీంద్రా స్కార్పియో-N ఆటోమేటిక్‌: ధరలు ఎలా ఉన్నాయంటే..!

Published Fri, Jul 22 2022 11:51 AM | Last Updated on Fri, Jul 22 2022 1:22 PM

Mahindra Scorpio N automatic 4WD prices revealed - Sakshi

Mahindra Scorpio N Price, సాక్షి,ముంబై:  మహీంద్ర లేటెస్ట్‌  మిడ్‌ సైజ్‌ వెహికల్‌ 2022 మహీంద్రా స్కార్పియో-N ధరలను కంపెనీ ప్రకటించింది. లాంచ్‌ అయిన నెల తరువాత ఆల్-న్యూ మహీంద్రా స్కార్పియో-N ఆటోమేటిక్ వేరియంట్‌లు, టాప్-స్పెక్ 4X4 ట్రిమ్‌ వేరియంట్ల ధరలు తాజాగా బహిర్గత మైనాయి. వేరియంట్ వారీగా ఈ  కారు ధరలు రూ. 11.99 లక్షల నుండి రూ. 23.90 లక్షల (ఎక్స్-షోరూం) వరకు ఉండనున్నాయి. 

బుకింగ్‌లు ఆన్‌లైన్‌లో, ఏకకాలంలో మహీంద్రా డీలర్‌షిప్‌లలో జూలై 30, ఉదయం 11 గంటల నుండి  ప్రారంభం. బుకింగ్‌లు 'ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్' ప్రాతిపదికన,  కస్టమర్ ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి డెలివరీ తేదీ ఆధారపడి  ఉంటుంది.సెప్టెంబరు 26న ప్రారంభమయ్యే రాబోయే పండుగ సీజన్‌లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 15 అర్ధరాత్రి వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రమే బుకింగ్‌  ఎడిట్‌ చేసుకునే చాన్స్‌ ఉంటుంది.

మాన్యువల్ ట్రిమ్  తో పోలిస్తే Z4 నుండి Z8 L వరకు ప్రతి ఆటోమేటిక్ ట్రిమ్‌ ధర 1.96 లక్షలు అదనం. అంతేకాదు ప్రారంభ ధరలు మొదటి 25,000 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తాయని మహీంద్రా తెలియజేసింది.

2022 మహీంద్రా స్కార్పియో-ఎన్
మహీంద్రా స్కార్పియో-ఎన్ గత నెలలో ఇండియాలో లాంచ్‌  అయింది. దీని  ప్రారంభ ధర రూ. 11.99 లక్షల ఎక్స్-షోరూమ్ వద్ద ప్రారంభించగా, టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర  రూ. 23.90 లక్షలుగా ఉంటుంది. ఐదు ట్రిమ్స్‌లో  లభ్యం.  Z2, Z4, Z6, Z8 & Z8 L, అనే వేరియంట్లలో పెట్రోలు, డీజిల్‌ వెర్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. 


 

2022 మహీంద్రా స్కార్పియో-ఎన్: వేరియంట్ వారీగా ధరలు (ఎక్స్-షోరూమ్)
Z2 రూ.11.99 లక్షలు  నుంచి రూ.12.49 లక్షలు 
Z4 ధరలు: రూ.13.49 లక్షలు,  రూ.15.45 లక్షలు,  రూ.13.99 లక్షలు,  రూ.16.44 లక్షలు రూ.15.95 లక్షలు, రూ.18.40 లక్షలు
Z6 ధరల: రూ.14.99 లక్షలు , రూ.16.95 లక్షలు 
Z8 ధరలు: రూ.16.99 లక్షలు, 18.95 లక్షలు, 17.49 లక్షలు, 19.94 లక్షలు, రూ19.45 లక్షలు రూ.21.90 లక్షలు
Z8 L ధర :  రూ.18.99 లక్షలు,  రూ.20.95 లక్షలు,  రూ.19.49 లక్షలు,  రూ.21.94 లక్షలు రూ.21.45 లక్షలు,  రూ. 23.90 లక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement