భారతీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థలలో ఒకటి. ఇప్పటికే థార్, XUV700, స్కార్పియో క్లాసిక్ వంటి వాటిని విక్రయిస్తూ అమ్మకాల్లో దూసుకెళ్తోంది. అయితే గత కొన్ని రోజులకు ముందు స్కార్పియో-ఎన్ SUV సన్‌రూఫ్ లీక్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మహీంద్రా స్కార్పియో సన్‌రూఫ్ లీక్ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన యూట్యూబర్ అరుణ్ పన్వార్ ఇప్పుడు చాలా హ్యాప్పీగా ఉందంటూ మరో వీడియో పోస్ట్ చేసాడు. దీనికి కారణం కంపెనీ ఎటువంటి చార్జెస్ తీసుకోకుండా సన్‌రూఫ్ బాగుచేసి అతడికి అప్పగించడమే.
గతంలో వెలువడిన వీడియోలో అరుణ్ పన్వర్ తన మహీంద్రా స్కార్పియో-ఎన్ కారుని జలపాతం కిందకి తీసుకెళ్లినప్పుడు, నీరు సన్‌రూఫ్ నుంచి లోపలికి వచ్చాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ చేసాడు. అయితే అదే జలపాతం కింద కంపెనీ అలాంటి కారుని నిలిపి ఎటువంటి లీక్ లేదని నిరూపించింది. అంతే కాకుండా కస్టమర్ అసౌకర్యానికి కంపెనీ బాధ్యత వహిస్తూ అతని కారు సన్‌రూఫ్ బాగు చేసింది. దీనికి రూ. 53,000 ఖర్చయింది. కానీ కస్టమర్ నుంచి డబ్బు తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ చేసింది. మొత్తానికి యూట్యూబర్ ఇప్పుడు చాలా హ్యాప్పీగా ఫీలయ్యాడు.
కంపెనీ అతనికి కారుని అందించిన తరువాత మహీంద్రా స్కార్పియో-ఎన్ జలపాతం కిందికి వెళ్లే సమయంలో సన్‌రూఫ్ కొంత ఓపెన్ అయి ఉండటం వల్ల నీరు లోపలికి వచ్చిందని నివేదించింది. అంతే కాకుండా జలపాతం కిందికి వెళ్లడం ప్రమాదమని, అది కొన్ని సందర్భాల్లో అనుకోని ప్రమాదాన్ని ఆహ్వానిస్తుందని చెప్పుకొచ్చింది. సాధారణంగా కంపెనీ కారులో ఇలాంటి సమస్యలు గతంలో ఎప్పుడూ వెలుగులోకి రాలేదని కూడా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment