![Youtuber Rider Girl Vishakha New Toyota Innova Hycross - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/3/youtuber-new-innova-hycross-car.jpg.webp?itok=w32ahwvo)
Youtuber New Toyota Innova Hycross: సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరు తమకంటూ ఓ మంచి ఇల్లు, కారు ఉండాలని కలలు కంటూ ఉంటారు. కన్న కలలు నిజం చేసుకోవడం మాటల్లో అనుకునేంత సులభమైతే కాదు. దీనికోసం అహర్నిశలు కష్టపడాలి. ఈ మార్గంలో ఎవరి ఆలోచన వారిదే..! కొంతమంది జాబ్ చేస్తే మరికొందరు సొంతంగా ఏదైనా చేసి డబ్బు సంపాదించాలనుకుంటారు. ఈ మార్గంలో నేటి యువత ఎక్కువగా యూట్యూబ్ మీద పడి సంపాదించడం మొదలెట్టారు.
గతంలో చాలా సందర్భాల్లో కొంత మంది యూట్యూబర్స్ ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మరో సంఘటన తాజాగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రైడర్ గర్ల్ విశాఖ అనే యూట్యూబర్ (ప్రముఖ ఉమెన్ మోటార్‌సైకిలిస్ట్) తాజాగా టయోటా కంపెనీకి చెందిన కొత్త ఇన్నోవా హైక్రాస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో తన ఛానల్లో అప్లోడ్ చేసింది. కారుని డెలివరీ చేసుకోవడానికి తన ఫ్యామిలీతో షోరూంకి రావడం డెలివరీ తీసుకునే సమయంలో చేసిన హంగామా మొత్తం ఈ వీడియో చూడవచ్చు. ఇప్పటికే ఈమె మహీంద్రా థార్ కూడా కొనుగోలు చేసింది.
టయోటా ఇన్నోవా హైక్రాస్..
టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్ లేటెస్ట్ మోడల్. దీని ధర రూ. 18.82 లక్షల నుంచి రూ. 30.26 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ యూట్యూబర్ కొనుగోలు చేసిన కారు బ్రాండ్ హైఎండ్ మోడల్. కావున ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది.
ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇందులో స్టాండర్డ్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ 172 బిహెచ్‌పి పవర్ అండ్ 205 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 184 బిహెచ్‌పి పవర్ డెలివరీ చేస్తుంది. ఈ కారులో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లేదు.
Comments
Please login to add a commentAdd a comment