Innova
-
రెండేళ్లు.. లక్ష సేల్స్: ఈ కారు రేటెంతో తెలుసా?
భారతదేశంలో వాహన విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రజలు కొన్ని బ్రాండ్ కార్లను మాత్రమే అధికంగా కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన కార్లలో ఒకటి ఇన్నోవా హైక్రాస్. ఇప్పటికే ఈ కారును లక్ష మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. కేవలం రెండేళ్లలో కంపెనీ ఈ అరుదైన ఘనతను సాధించింది.2022లో అమ్మకానికి వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఇన్నోవా క్రిస్టాతో పాటు అమ్ముడైంది. ప్రారంభంలో అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నపటికీ.. ఆ తరువాత సేల్స్ భారీగా పెరిగాయి. ఈ కారు పెట్రోల్ - హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ పొందుతుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: పెరగనున్న బీఎండబ్ల్యూ ధరలు: ఎప్పటి నుంచో తెలుసా?టయోటా ఇన్నోవా హైక్రాస్ నాన్-హైబ్రిడ్ వేరియంట్లు 172 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. టాప్ వేరియంట్లు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 184 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతాయి. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 19.77 లక్షల నుంచి రూ. 30.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ధరలు మీరు ఎంచుకునే వేరియంట్ ఆధారంగా మారుతూ ఉంటాయి. -
భారత్‌పై అంతర్జాతీయ ఐటీ సంస్థ దృష్టి - వచ్చే ఏడాది నుంచి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఐటీ సంస్థ ఇన్నోవా సొల్యూషన్స్ భారత మార్కెట్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. వచ్చే ఏడాది (2024) ఇక్కడ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు పెద్ద ఎత్తున నియామకాలను కూడా చేపట్టనుంది. సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, భారత విభాగం హెడ్ ప్రదీప్ యడ్లపాటి ఈ విషయాలు తెలిపారు. అమెరికాలోని జార్జియా కేంద్రంగా పనిచేస్తున్న ఇన్నోవా సొల్యూషన్స్ 1998లో ప్రారంభమైంది. 2010లో పేరోల్ సిస్టమ్స్, 2016లో టెక్నాలజీ సొల్యూషన్స్ విభాగంలోకి కంపెనీ ప్రవేశించింది. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా), కమ్యూనికేషన్స్, మీడియా తదితర రంగాల్లో వెయ్యికి పైగా క్లయింట్లకు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం అమెరికా, భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాల్లో 100 పైచిలుకు కార్యాలయాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా 55,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉండగా.. భారత్‌లో 10,000 మంది సిబ్బంది ఉన్నారు. భారత్, ఆసియా–పసిఫిక్‌లోని తమ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఈ ఏడాది తొలినాళ్లలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కీలక హోదాలో ఉన్న యడ్లపాటిని నియమించుకుంది. -
కొత్త కారు కొన్న ఆనందంతో చిందులేసిన యూట్యూబర్ - వీడియో వైరల్
Youtuber New Toyota Innova Hycross: సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరు తమకంటూ ఓ మంచి ఇల్లు, కారు ఉండాలని కలలు కంటూ ఉంటారు. కన్న కలలు నిజం చేసుకోవడం మాటల్లో అనుకునేంత సులభమైతే కాదు. దీనికోసం అహర్నిశలు కష్టపడాలి. ఈ మార్గంలో ఎవరి ఆలోచన వారిదే..! కొంతమంది జాబ్ చేస్తే మరికొందరు సొంతంగా ఏదైనా చేసి డబ్బు సంపాదించాలనుకుంటారు. ఈ మార్గంలో నేటి యువత ఎక్కువగా యూట్యూబ్ మీద పడి సంపాదించడం మొదలెట్టారు. గతంలో చాలా సందర్భాల్లో కొంత మంది యూట్యూబర్స్ ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మరో సంఘటన తాజాగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రైడర్ గర్ల్ విశాఖ అనే యూట్యూబర్ (ప్రముఖ ఉమెన్ మోటార్‌సైకిలిస్ట్) తాజాగా టయోటా కంపెనీకి చెందిన కొత్త ఇన్నోవా హైక్రాస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో తన ఛానల్లో అప్లోడ్ చేసింది. కారుని డెలివరీ చేసుకోవడానికి తన ఫ్యామిలీతో షోరూంకి రావడం డెలివరీ తీసుకునే సమయంలో చేసిన హంగామా మొత్తం ఈ వీడియో చూడవచ్చు. ఇప్పటికే ఈమె మహీంద్రా థార్ కూడా కొనుగోలు చేసింది. టయోటా ఇన్నోవా హైక్రాస్.. టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్ లేటెస్ట్ మోడల్. దీని ధర రూ. 18.82 లక్షల నుంచి రూ. 30.26 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ యూట్యూబర్ కొనుగోలు చేసిన కారు బ్రాండ్ హైఎండ్ మోడల్. కావున ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇందులో స్టాండర్డ్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ 172 బిహెచ్పి పవర్ అండ్ 205 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 184 బిహెచ్పి పవర్ డెలివరీ చేస్తుంది. ఈ కారులో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లేదు. -
టయోటా ఇన్నోవా హైక్రాస్.. అదిరే లుక్, డెలివరీ అప్పటినుంచే!
వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్.. హైబ్రిడ్ మల్టీపర్పస్ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ వర్షన్ ధరను వేరియంట్‌ను బట్టి రూ.18.3– 19.2 లక్షలుగా నిర్ణయించింది. జనవరి మధ్యకాలం నుంచి డెలివరీలు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. సెల్ఫ్‌చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వర్షన్ ధర వేరియంట్‌ను బట్టి రూ.24–29 లక్షలుగా ఉంది. ఈ–డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్ సిస్టమ్‌తో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. మైలేజీ లీటరుకు 23.24 కిలోమీటర్లు అని కంపెనీ ప్రకటించింది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లోనూ లభిస్తుంది. మైలేజీ లీటరుకు 16.13 కిలోమీటర్లు. బుకింగ్స్ నవంబర్ 25 నుంచే ప్రారంభం అయ్యాయి. 2005లో భారత్‌లో అడుగుపెట్టిన ఇన్నోవా ఇప్పటి వరకు 10 లక్షలకుపైగా యూనిట్లు రోడ్డెక్కాయి. సంస్థ మొత్తం అమ్మకాల్లో ఈ మోడల్ వాటా ఏకంగా 50 శాతం పైమాటే. చదవండి: టెక్ దిగ్గజం యాపిల్‌కు రూ.870 కోట్ల ఫైన్! -
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీ కొట్టిన లారీ
-
కారు, లారీ ఢీ..9 మంది దుర్మరణం
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి సమీపంలో ఆదివారం రాత్రి 7.10 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 9 మంది ఇన్నోవా వాహనంలోనే మరణించగా.. దాన్ని నడుపుతున్న పెళ్లికుమార్తె తండ్రి, బీజేపీ నేత కోకా వెంకటప్పనాయుడు (58) ఆస్పత్రిలో ప్రాణాలొదిలారు. అనంతపురం–బళ్లారి జాతీయ రహదారిపై ఇన్నోవా వాహనం, ఇనుప ఖనిజం లోడుతో వెళుతున్న పెద్దలారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. పోలీసులు, బంధువుల కథనం మేరకు.. ఉరవకొండ మండలం నింబగల్లుకు చెందిన వెంకటప్పనాయుడు కుమార్తె వివాహవేడుక ఆదివారం కర్ణాటక బళ్లారిలో జరిగింది. పెళ్లి ముగిశాక వెంకటప్పనాయుడు, ఆయన బంధువులు 8 మంది ఇన్నోవా వాహనంలో నింబగల్లుకు బయలుదేరారు. వెంకటప్పనాయుడు డ్రైవింగ్ చేయసాగారు. బూదగవి వద్ద వీరి వాహనం, అనంతపురం నుంచి బళ్లారి వైపు ఇనుప ఖనిజం లోడుతో వెళుతున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు రోడ్డుపక్కనున్న పొలంలోకి దూసుకెళ్లాయి. ఇన్నోవా ముందుభాగం నుజ్జునుజ్జయింది. మృతదేహాలన్నీ ఛిద్రమై.. ఇన్నోవాలోనే ఇరుక్కుపోవడంతో జేసీబీ సాయంతో వెలికి తీయాల్సి వచ్చింది. చదవండి: చిన్నారిని లాక్కొని గొంతు నులుముతూ.. గొలుసివ్వకపోతే.. చంపేస్తాం! అంతా బంధువులే.. ప్రమాదంలో కోకా వెంకటప్పనాయుడుతో పాటు బంధువులు బొమ్మనహాళ్ మండల కేంద్రానికి చెందిన సరస్వతి(60), ఆమె కుమారుడు అశోక్(35), కుమార్తె స్వాతి(38), స్వాతి కవల పిల్లలు జాహ్నవి (12), జశ్వంత్ (12), కణేకల్లు మండలం హనుమాపురానికి చెందిన రాధమ్మ(48), రాయలప్పదొడ్డికి చెందిన సుభద్రమ్మ(60), పిల్లలపల్లికి చెందిన శివమ్మ (35) మృతిచెందారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఇన్నోవా వంద కిలోమీటర్లకుపైగా వేగంతో వెళుతున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదస్థలాన్ని ఎస్పీ ఫక్కీరప్ప, గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప తదితరులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రి మార్చురీలోని మృతదేహాలను మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పరిశీలించి, మృతుల కుటుంబాలను ఓదార్చారు. కాగా మృతుల కుటుంబాలకు ఎంపీ తలారి రంగయ్య సానుభూతి తెలిపారు. -
Krishna: కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లిన ఇన్నోవా వాహనం
కృష్ణా (విజయవాడ): కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలో.. కృష్ణాకరకట్టపై ఇన్నోవా వాహనం అదుపుతప్పి కేఈబీ కెనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనం కొంతదూరం కొట్టుకుపోయింది. ఇన్నోవాలో ప్రయాణిస్తున్నవారంతా మోపిదేవి మండలం చిరువోలు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనలో చిరువోలు గ్రామానికి చెందిన కైలా ప్రశాంత్(25) మృతి చెందాగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. క్షత గాత్రులను స్థానికుల సహయంతో, అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. చదవండి: నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసు: కదులుతున్నడొంక.. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
సాక్షి, కడప: మైదుకూరు –బద్వేలు జాతీయ రహదారి డి. అగ్రహారం వద్ద శుక్రవారం అర్ధరాత్రి 1గంట ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా, మినీ లారీ ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఎస్ఐ శ్రీనివాసులు వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఏడుగురు వ్యక్తులు ఇన్నోవాలో కడపకి వివాహానికి వస్తున్నారు. మరోవైపు చిత్తూరు నుంచి టమాటా లోడుతో మినీ లారీ వెళుతోంది. డి.అగ్రహారం వద్ద స్పీడ్ బ్రేకర్ల కారణంగా ఇన్నోవా, లారీఎదురెదురుగా ఢీకొని ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను, మృతదేహాలను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలపారు. -
మహబూబ్ నగర్: ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర రోడ్డు ప్రమాదం; ఇద్దరి మృతి
సాక్షి, వనపర్తి(మహబూబ్ నగర్): వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి 44 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వ్యాపారం నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తుండగా సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఘటన స్థలంలోనే చనిపోయారు. మృతులు అనంతపురం జిల్లా గుత్తి మండలానికి చెందిన బంగారు వ్యాపారి ఆనంద్ కుమార్, పామిడికి చెందిన డ్రైవర్ నూర్ అహ్మద్‌గా గుర్తించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఆదిలాబాద్‌లో విషాదం: అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి -
పీలేరులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని తానావడ్డెపల్లి వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఇన్నోవా కారును లారీ ఢీకొట్టి జాతరకు వెళ్తున్న కళాకారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. మృతులు నిమ్మనపల్లె మండలం కొండసానివారిపల్లె వాసులుగా గుర్తించారు. కళాకారులు డప్పు వాయిస్తూ జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈపూరు కారు.. ప్రొద్దుటూరులో ప్రత్యక్షం
కంకిపాడు: గుంటూరుజిల్లాలో చోరీ అయిన ఇన్నోవా కారు మండల పరిధిలోని ప్రొద్దుటూరులో ప్రత్యక్షమైంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా వినుకొండ పరిధిలోని ఈపూరులో ఓ ఇన్నోవా కారు చోరీకి గురైం ది. దీనిపై అక్కడ కేసు నమోదైంది. అయితే సోమవారం రాత్రి ప్రొద్దుటూరు–దావులూరు పొలిమేరలోని శ్మశాన వాటిక వద్ద ఓ కారు అనుమానాస్పదంగా పార్కింగ్ చేసి ఉండటాన్ని స్థానిక రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ప్రొద్దుటూరు పొలిమేర డొంక వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. కారు నంబరు ఆధారంగా గుంటూరు జిల్లాలోని సంబంధిత వ్యక్తులకు సమాచారం అందించారు. కారు చోరీకి గురైందని సమాచారం తెలిపారు. కారును మంగళవారం ఉదయం కంకిపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. సీసీఎస్ పోలీసులు రికార్డులతో స్టేషన్‌కు వచ్చి చోరీకి గురైన కారును తమ వెంట తీసుకెళ్లినట్లుగా సిబ్బంది తెలిపారు. -
లారీని ఢీకొట్టిన ఇన్నోవా: ముగ్గురి మృతి
గుడ్లూరు: ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఇన్నోవా వాహనం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో.. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలి వెళ్తున్న వాహనం మోచర్ల వద్ద ప్రమాదానికి గురైంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతులంతా కావలికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. -
ఇన్నోవా బోల్తా, నలుగురు దుర్మరణం
-
ఇన్నోవా బోల్తా, నలుగురు దుర్మరణం
విశాఖపట్టణం : విశాఖ జిల్లా రాయవరం సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఓ ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనం ముందుగా డివైడర్‌ను ఢీకొని అనంతరం పంటకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. వీరంతా గాజువాక నుంచి పాయకరావుపేట వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు గాజువాకకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇన్నోవా- లారీ ఢీ: ముగ్గురి మృతి
తిరుపతి: తిరుపతి రూరల్ మండలం గాంధీపురం వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఇన్నోవాను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. కృష్ణా పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. మృతులు మదనపల్లెకి చెందిన నాగరాజు, భారతి, కృష్ణమూర్తిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టాప్-10 ప్యాసింజర్ కార్లు ఇవే!
న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ కొత్త కాంపాక్ట్ ఎస్ యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) విటారా బ్రీజా రయ్యిమని దూసుకుపోతోంది. ఈ మోడల్స్ అమ్మకాల్లో అదుర్స్ మనిపిస్తూ టాప్-10 ప్యాసెంజర్ వెహికిల్ జాబితాలో చోటు సాధించింది. టాప్-10 అమ్మకాల జాబితాలో ఆరు మోడల్స్ మారుతీ సుజుకీవే ఉన్నాయి. మే నెలలో 7,193 యూనిట్ల అమ్మకాలతో మారుతీ సుజుకీ విటారా బ్రీజ్ 10వ స్థానంలో నిలవగా.. ఎంట్రీ లెవల్ మోడల్ ఆల్టో 19,874 యూనిట్లతో అగ్రస్థానంలో ఉందని భారత ఆటోమొబైల్ తయారీ సంఘ సొసైటీ(సియామ్) గణాంకాల్లో తెలిపింది. 14,413 యూనిట్ల అమ్మకాలతో మారుతి సుజుకీ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ రెండో స్థానంలో ఉంది. మారుతీ సుజుకీ బ్రాండ్లు వాగన్ ఆర్ మూడో స్థానం, స్విప్ట్ నాలుగోస్థానం, ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనో ఏడో స్థానం, సెలిరియో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. 12,005 యూనిట్లతో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఐదో స్థానానికి ఎగబాకగా, 10,472 యూనిట్ల అమ్మకాలతో ప్రీమియం కాంపాక్ట్ ఎలైట్ ఐ20 ఆరో స్థానానికి ఎగిసిందని సియామ్ తెలిపింది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ బహుళ ప్రయోజన వాహనం ఇన్నోవా క్రిస్టా కూడా టాప్-10 జాబితాలో చోటు దక్కించుకుంది. 7,259 యూనిట్లతో టయోటా ఇన్నోవా తొమ్మిదో స్థానంలో నిలిచింది. -
మార్కెట్లోకి టయోటా ఇన్నోవా ‘క్రిస్టా’
ధర శ్రేణి రూ. 14.06 లక్షలు- రూ. 21.13 లక్షలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ సంస్థ టయోటా తాజాగా ఇన్నోవాకి సంబంధించి రెండో తరం వాహనం ‘క్రిస్టా’ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 14.06 లక్షలు-రూ. 21.13 లక్షల దాకా (ఎక్స్-షోరూం హైదరాబాద్) ఉంటుంది. టయోటా కిర్లోస్కర్ మోటార్ జీఎం ఆర్ వెంకటకృష్ణన్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించారు. ఇన్నోవాకు మరిన్ని అదనపు హంగులు జోడించి 7 ఎయిర్‌బ్యాగ్స్ తదితర ఫీచర్లతో రూపొందిన క్రిస్టా.. ఆటోమేటిక్, మ్యాన్యువల్ వేరియంట్స్‌లో లభిస్తుందని తెలిపారు. మైలేజి లీటరు డీజిల్‌కు 14.29-15.10 కి.మీ. ఉంటుందన్నారు. క్రిస్టా రాకతో తొలితరం ఇన్నోవాల విక్రయం నిలిపివేస్తున్నట్లు వెంకటకృష్ణన్ చెప్పారు. క్రిస్టాకు 2-4 నెలల పరిమాణం మేర బుకింగ్స్ వచ్చినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎంపీవీ విభాగంలో తమకు 43 శాతం మార్కెట్ వాటా ఉందని పేర్కొన్నారు. మొత్తం 3.10 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్ధ్యం గల రెండు ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. డీజిల్ వాహనాల అమ్మకాలపై ఆంక్షలు తొలగించాలంటూ అత్యున్నత న్యాయస్థానానికి పరిశ్రమ విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. -
టయోటా.. కొత్త ఇన్నోవా క్రి స్టా
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎట్టకేలకు తన మల్టీ పర్పస్ వెహికల్ ఇన్నోవాను అప్డేట్ చేసింది. కంపెనీ తాజాగా ‘ఇన్నోవా క్రిస్టా’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.13.84 లక్షలు- రూ.20.78 లక్షల (ఎక్స్ షోరూమ్ ముంబై) శ్రేణిలో ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభ్యం కానున్నది. 2.8 లీటర్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ లీటరుకు 14.29 కిలోమీటర్ల మైలేజ్‌ని, 2.4 లీటర్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ లీటరుకు 15.10 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే ‘ఇన్నోవా క్రిస్టా’ ప్రధానంగా జీ, జీఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్ అనే నాలుగు వేరియంట్లలో లభ్యంకానుంది. వీటి బుకింగ్స్ సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని, డెలివరీ మే 13 నుంచి జరుగుతుందని కంపెనీ తెలిపింది. -
ఇన్నోవా-జీపు ఢీ: ఆరుగురికి గాయాలు
గుంటూరు: గుంటూరు జిల్లాలోని గురజాల మండలం అంబాపురం వద్ద బుధవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎదురెదురుగా వస్తున్న ఇన్నోవా, జీపు ఒక్కసారిగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన ఇన్నోవా
గుంటూరు: వేగంగా వెళ్తున్న ఇన్నోవా బైక్‌ను ఢీకొనడంతో పాటు మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో శనివారం జరిగింది. పొన్నూరు నుంచి గుంటూరు వెళ్తున్న ఇన్నోవా డ్రైవర్‌కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో.. స్థానిక దారా ఇమాం పంజా మసీదు సమీపంలోని మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న షేక్ నబిపాషా, పర్విన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇన్నోవా డ్రైవర్‌కు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
ట్రా‘వెల్’ బిజినెస్!
* ప్రచారంలో రోజుకు వేల సంఖ్యలో అద్దె వాహనాలు * గత వారం రోజులుగా భారీగా పెరిగిన వినియోగం సాక్షి, సిటీబ్యూరో: ఇంటిల్లిపాదీ కలసి ఇన్నోవా, టవేరా వంటి వాహనాలను అద్దెకు తీసుకొని తిరుమలేశుని దర్శనానికో... బంధువుల ఇళ్లకో వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మరో వారం రోజులు ఓపిక పట్టాల్సిందే. అవును... ప్రస్తుతం నగరంలోని అద్దె వాహనాలన్నీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాయి. రాజకీయ పార్టీల అభ్యర్థులకు వాహనాలు సమకూర్చడంలో ట్రావెల్స్ కంపెనీలు బిజీబిజీగా ఉన్నాయి. గత వారం రోజులుగా నగరంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచార రథాలు, అభ్యర్థుల పర్యటనలకు వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ఇండికా వంటి చిన్నవి మొదలుకొని.. క్వాలిస్, స్విఫ్ట్‌డిజైర్, ఫార్చునర్, ఎర్టిగా, గ్జైలో తదితర వాహనాల కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ట్రావె ల్స్ కంపెనీల వద్ద బారులు తీరుతున్నారు. ఒక్కసారిగా తాకిడి పెరగడంతో ట్రావెల్స్ కంపెనీలు సైతం బాగానే డిమాండ్ చేస్తున్నాయి. వాహనం సామర్థ్యాన్ని బట్టి రోజుకు రూ.2000 నుంచి రూ.5000 వరకు వసూలు చేస్తున్నాయి. చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి సుమారు 100కు పైగా ట్రావెల్స్ కంపెనీలకు ఎన్నికల కాలం బాగా కలసి వస్తోంది. నగరంలో ప్రస్తుతం 1,333 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. వీరు నిత్యం 10 వేల వరకు వాహనాలను వినియోగిస్తున్నట్లు అంచనా. ఈ వాహనాలపై రోజుకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు వ్యాపారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారానికి నాయకులు, కార్యకర్తలను బస్తీలకు, కాలనీలకు తరలించడంలోనూ, ముఖ్యమైన నాయకుల రోడ్‌షోలకు వాహనాల వినియోగం తప్పనిసరి కావడంతో చాలా మంది అభ్యర్థులు సగటున 5 నుంచి 10 వాహనాలు అద్దెకు తీసుకుంటున్నారు. నగరంలోని ట్రావెల్స్‌కు డిమాండ్ ఉండడంతో వరంగల్, నల్లగొండ, మెదక్, ఖమ్మం తదితర జిల్లాల నుంచీ వాహనాలను తీసుకొస్తున్నారు. ఆటోలకూ గిరాకీ... చిన్న చిన్న బస్తీలు, కాలనీలు, శివారు ప్రాంతాల్లో అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి ఆటోలను వినియోగిస్తున్నా రు. దీంతో వీటికీ డిమాండ్ పెరిగింది. పార్టీ బ్యానర్లు, అభ్యర్థుల నిలువెత్తు చిత్రాలు, ప్రచార సామగ్రి, మైక్సెట్లతో హోరెత్తించే ఆటోరిక్షాలు నగరంలో విరివిగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఐదారు వేలకు పైగా ఆటోలు ప్రచార రథాల అవతారమెత్తాయి. వీటికి ఏ రోజుకు ఆ రోజు వారు తిరిగిన దూరం మేరకు రూ.500 నుంచి రూ.700 వరకు చెల్లిస్తున్నారు. ‘అధికార’ ఒత్తిడి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వాహనాల కోసం తమపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు కొన్ని ట్రావెల్స్ కంపెనీలు ఆరోపిస్తున్నాయి. అతి కష్టంగా వాహనాలను సమకూర్చినప్పటికీ డబ్బులు చెల్లించడం లేదని కొందరు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ఎంత ఇస్తే అంత పుచ్చుకోవాల్సి వస్తోందని... ఇది ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. -
ఇన్నోవా-లారీ ఢీ: ముగ్గురి మృతి
-
ఇన్నోవా-లారీ ఢీ: ముగ్గురి మృతి
చిత్తూరు: బంగారుపాల్యం మండలం మొగిలి ఘాట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. ఇన్నోవా, లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతులు కర్ణాటకకు చెందిన నరేష్, సురేష్, నయిల్గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
70 కిలోల గంజాయి స్వాధీనం
ఖమ్మం జిల్లా అశ్వాపురం పోలీసులు 70 కిలోల గంజాయిని శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఇన్నోవా వాహనంలో గంజాయిని తీసుకెళుతుండగా పట్టుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకోవడంతోపాటు సుమారు 70 కిలోల గంజాయి, ఇన్నోవా వాహనం, రూ.2 లక్షల నగదు ను సీజ్ చేశారు. -
కార్యరూపం దాల్చని జీపీఎస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నూతన వాహనాలను కొనుగోలు చేసినా లక్ష్యం నెరవేరడం లేదు. కొత్త పుంతలు తొక్కుతున్న నేరస్తులను ఆటపట్టించేందుకు నూతన సాంకేతికతను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కె.చంద్రశేఖర్‌రావు మొదటగా పోలీసుశాఖపైనే దృష్టి సారించారు. సింగపూర్ తరహాలో పోలీసుశాఖను బలోపేతం చేసి తద్వారా శాంతిభద్రతలను అదుపుచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అన్ని పోలీసుస్టేషన్లకు కొత్త వాహనాలు అందించాలని ప్రణాళికలు రూపొందించింది. దీని కోసం 340 కోట్ల రూపాయలు వెచ్చించి 15 వందల ఇన్నోవాలు, సుమోలు, అదేస్థాయిలో ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసింది. అయితే, వాహనాలు కొనుగోలు చేసి ఏడాది గడచినా వాటిల్లో ఉపయోగించాల్సిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) టెక్నాలజీని ఇప్పటి వరకు పొందుపరచలేదు. జీపీఎస్ కోసం ప్రయత్నించిన ప్రతీసారి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాజాగా అన్ని రాష్ట్రాలను కలుపుతూ నిర్భయ నిధులతో ఒక వ్యవస్థను రూపొందిస్తామంటూ కేంద్రం ప్రకటిం చింది. దీంతో జీపీఎస్ టెండర్ల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. జీపీఎస్ ఉంటే.. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా బాధితులు ‘డయల్ 100’కు కాల్ చేసిన వెంటనే కంట్రోల్ రూం ద్వారా దగ్గర్లోని పెట్రోలింగ్ వాహనానికి కాల్ కనెక్టు అవుతోంది. పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే స్పందించేలా రూపకల్పన చేశారు. వాహనంలో ల్యాప్‌టాప్, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను చూసేందుకు సదుపాయం కల్పించారు. సంఘటనాస్థలంలో లభించే వేలిముద్రలు తదితర ఆధారాలను వెంటనే జీపీఎస్ ద్వారా కంట్రోల్‌రూం సహాయంతో పరిశీలించవచ్చు. జీపీఎస్ లేకపోవడంతో ఏడాది కింద కొనుగోలు చేసిన వాహనాలకు స్టిక్కర్లు వేసి, కూతలు పెట్టిస్తూ తిప్పుతున్నారు. నిర్వహణ బాధ్యతపై సందిగ్ధత! జీపీఎస్ టెక్నాలజీ కొనుగోలు చేసినా నిర్వహణ బాధ్యత ఎవరు చూడాలన్న ప్రశ్న పోలీసు ఉన్నతాధికారులను పట్టి పీడిస్తోంది. టెక్నాలజీ సమకూర్చినవారికే అవుట్సోర్సింగ్ పద్ధతిలో నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని మొదట్లో భావించినా, అలాంటి విధానం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. శాంతిభద్రతల విషయంలో బయటి వ్యక్తులకు అవకాశం ఇస్తే సమాచారం బయటకు పొక్కే ప్రమాదముందని భావిస్తున్నారు. పోలీసుశాఖలోని టె క్నికల్ సర్వీసును పర్యవేక్షించే విభాగానికి బాధ్యతలు అప్పగించాలనుకున్నా అది సాధ్యపడేలా లేదు. ఈ వ్యవస్థను నిర్వహించాలంటే పెద్దసంఖ్యలో సిబ్బంది అవసరమవుతారు. టెక్నికల్ సర్వీసు విభాగం వద్ద సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నతాధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు. -
బైక్, ఇన్నోవా ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు
రొంపిచర్ల(గుంటూరు): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండల కేంద్రం సమీపంలోని అద్దంకి- నార్కెట్‌పల్లి రోడ్డుపై ఇన్నోవా వాహనాన్ని, బైకు ఢీకొట్టడంతో బైకు పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు రొంపిచర్ల మండలానికి చెందిన వారిగా సమాచారం. -
ఇన్నోవా బోల్తా: ఒకరు మృతి
అనంతపురం: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బత్తులపల్లి మండలంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని జ్వాలాపురం సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఇన్నోవా వాహనం చెట్టును ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు మదనపల్లి టీజీఎం కోర్టు సూపర్డెంట్ టి. రమేష్ బాబుగా పోలీసులు నిర్ధరించారు. అనంతపురంలోని ఓ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. -
సినిమా ఫక్కీలో కారు దొంగిలించబోయి..
పోలీసులకు చిక్కిన ముఠా ఇంజిన్ కోసం మరో కారు చోరీ యత్నం బాడుగకు కారు మాట్లాడుకుని డ్రైవర్‌పైనే దాడి, కారుతో పరార్ గంట వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు పలమనేరు: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి. కా రును దొంగిలించేందుకు పక్కా ప్లాన్‌చేసి డ్రైవర్‌పై దాడిచేసి ఇంకాసేపట్లో తప్పించుకొనేలోపే పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు ఓ తమిళనాడు ముఠా. సినీఫక్కీలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆదివారం రాత్రి పలమనేరు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఇ న్నోవా కారు ఉంది. అయితే ఆ వాహనానికి రికార్డులు లేవు. దీంతో ఇలాంటి వాహనాన్నే చోరీ చేసి దాని ఇం జిన్, ఛాసిస్‌లను తన కారుకు అమర్చుకోవాలనుకున్నాడు. తనతో పాటు మరో నలుగురితో కలసి తిరుపతికెళ్లాడు. అక్కడ ఏపీ03 డబ్ల్యూ 8509 అనే నెంబరు గల ఇన్నోవా వాహనాన్ని అద్దెకు మాట్లాడుకున్నారు. తాము తమిళనాడులోని కృష్ణగిరి వెళ్లాలని చెప్పారు. అక్కడి నుంచి ఆదివారం సాయంత్రం మూడు గంట లకు ఈ నలుగురు బయలుదేరారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో పలమనేరు సమీపంలోని ఓ డాబా వద్ద ఆపి మద్యం సేవించారు. అక్కడి నుంచి కుప్పం రోడ్డు మీదుగా వెళుతూ మండలంలోని కొలమాసనపల్లె సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద 8.30కు మూత్రవిసర్జన కోసం అని డ్రైవర్ చెప్పి కారును ఆపించారు. ఉన్నట్టుండి డ్రైవర్‌పై కత్తితో దాడిచేసి అతని మొబైల్‌ను లాక్కొని అక్కడినుంచి కారులో పరారయ్యారు. దీంతో డ్రైవర్ గోవిందరాజులు రోడ్డుపక్కనే ఉన్న సబ్‌స్టేషన్ వద్దకెళ్లి జరిగిన విషయాన్ని వారికి చెప్పి అక్కడినుంచి పలమనేరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లతో పాటు తమిళనాడు, కర్ణాటక పీఎస్‌లకు సమాచారం అందించారు. సరిహద్దు చెక్‌పోస్టులనుసైతం అప్రమత్తం చేశారు. ఇలా ఉండగా 9.30 గంటలపుడు కుప్పం పట్టణం వద్ద సిద్ధంగా ఉన్న పోలీసులను చూసి ఆ కారు వేగంగా వెళ్లిపోయింది. దీంతో కుప్పం పోలీసులు ఛేజ్ చేసి ఆ కారుతో పాటు అందులోని నలుగురు నిందింతులను పట్టుకున్నారు. వారిని పలమనేరు పోలీసులకు అప్పగించారు. వీరిలో ప్రధాన నిందితుడు తమిళనాడులోని కాట్పాడికి చెందిన శివకుమార్‌గా తెలిసింది. ఈ సంఘటనలో కేసును పోలీసులు కేవలం గంట వ్యవధిలోనే ఛేదించడం గమనార్హం. -
త్వరలో ‘ఇంటర్‌సెప్టర్’ వాహనాలు
పెలైట్ ప్రాజెక్టు కింద ట్రాఫిక్ విభాగంలో ఒక వాహనం ప్రవేశం ‘ఇన్నోవా’కు నాలుగు వైపుల సీసీకెమెరాల ఏర్పాటు వాహనంలో డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే ఉంటారు {పత్యక్ష ప్రసారం కూడా చేస్తుంది సిటీబ్యూరో: నగరం పోలీసు శాఖకు త్వరలో ఇంటర్‌సెప్టర్ వాహనాలు రాబోతున్నాయి. పెలైట్ ప్రాజెక్ట్ కింద బుధవారం ట్రాఫిక్ విభాగంలో ఒక వాహనాన్ని ప్రవేశపెట్టారు. వీటి పని తీరు పరీక్షించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ వాహనాలను రంగంలోకి దింపుతారు. ఇంటర్‌సెప్టర్ వాహనాలుగా ఇన్నోవాలను వినియోగిస్తున్నారు. ఈ కార్లకు నాలుగు వైపుల నాలుగు సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. ఈ వాహనంలో డ్రైవర్‌తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే ఉంటాడు. ఇటు శాంతి భద్రతలు, అటు ట్రాఫిక్ విభాగంలోను ఇంటర్‌సెప్టర్ వాహనాలు ప్రవేశపెట్టబోతున్నారు. వాహనానికి నాలుగు వైపుల రహదారిపై ఉన్న దృశ్యాలను వాహనంలో అమర్చిన కంప్యూటర్లో ఆపరేటర్ చూసుకునే సదుపాయం ఉంది. అలాగే కంప్యూటర్లో 3-జీ ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం కూడా ఉంది. రహదారిపై దృశ్యాలను బషీర్‌బాగ్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కు నేరుగా ప్రత్యక్ష ప్రసారాలను సైతం అధికారులు వీక్షించే అవకాశం కల్పించారు. ట్రాఫిక్ విభాగంలో ఇలా... ఈ వాహనం రోడ్డుపై వేగంగా తిరుగుతూ నో పార్కింగ్, రాంగ్ పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపిన వాహనాలను చిత్రీకరిస్తుంది. కాలనీలు, అపార్ట్మెంట్ల ముందు, షాపింగ్ సెంటర్లు, సినిమా థియేటర్ల వద్ద, కళాశాలలు, పాఠశాలల వద్ద అక్రమంగా పార్కింగ్ చేస్తే ఈ వాహనం ఫొటోలు తీసి ఫుటేజీని భద్రపరుస్తుంది. దాని ఆధారంగా వాహనదారుడికి పోలీసులు చలాన్ పంపిస్తారు. శాంతి భద్రతల్లో ఇలా... ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, మత ఘర్షణలు, దాడులు, అల్లర్లు జరిగిన సమయంలో నిందితులను గుర్తించేందుకు ఈ వాహనం చాలా ఉపయోగపడుతుంది. నిందితుల వివరాలు చెప్పేందుకు ప్రత్యక్ష సాక్షులు భయపడతారు. అలాంటి సమయంలో ఈ వాహనం ఘటనా స్థలానికి చేరుకొని చాలు నాలుగు వైపులా ఉన్న సీసీకెమెరాల ద్వారా దృశ్యాలన్నీ రికార్డు చేస్తుంది. ఈ చిత్రాలు కోర్టులో సాక్ష్యాలుగా పని చేస్తాయి. దీంతో నిందితులు శిక్షల నుంచి తప్పించుకోలేరు. సమావశాలు, సభల వద్ద నుంచి... సమావేశం, సభలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో అసాంఘిక శక్తుల కదలికలను కనిపెట్టేందుకు ఈ వాహనాన్ని అక్కడికి పంపిస్తారు. అక్కడి దృశ్యాలను సీసీకెమెరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ప్రాణాలు తీసిన పొగమంచు
విశాఖపట్నం జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసులు నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన ఈ ఆరుగురూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా నక్కపల్లి మండలం గొడిచర్ల వద్ద పొగ మంచు వల్ల దారి కనిపించక వీరి కారు ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతిచెందినవారిలో గరిమెళ్ల గోవర్ధనరావు (40), కొండపల్లి శివరామకృష్ణశాస్త్రి (44), వంగా ప్రకాశరావు (55), నల్లమోతు రవి సుధాకర్ (47) ఉన్నారు. * ఆగివున్న లారీని ఢీకొట్టిన ఇన్నోవా * విశాఖపట్నం జిల్లా గొడిచర్ల వద్ద ప్రమాదం * జిల్లా వాసులు నలుగురు మృతి * మరో ఇద్దరికి తీవ్ర గాయాలు నక్కపల్లి (విశాఖపట్నం జిల్లా) : పొగమంచు నలుగురి ప్రాణాలను బలిగొంది. మండలంలోని గొడిచర్ల జంక్షన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి విపరీతమైన పొగమంచు కమ్ముకుంది. ఎదురుగా వస్తున్న, ముందు వెళుతున్న వాహనాలు కనపడని పరిస్థితి. ఈ నేపథ్యంలో శనివారం వేకువవారుజామున జాతీయరహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో విజయవాడకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. వివరాలిలా ఉన్నాయి. విజయవాడ పరిసరప్రాంతాలకు చెందిన ఆరుగురు సిండికేట్‌గా ఏర్పడి రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. విజయవాడలో విక్రయించిన భూమికి సంబంధించి అడ్వాన్సు తీసుకునేందుకు ఇన్నోవా కారులో శుక్రవారం రాత్రి విశాఖపట్నం బయలుదేరారు. విశాఖ జిల్లా నక్కపల్లి సమీపంలో గొడిచర్ల జంక్షన్ వద్ద శనివారం వేకువజామున మూడు గంట లకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజ యవాడ పరిసర ప్రాంతాలకు చెందిన గరిమెళ్ల గోవర్ధనరావు (40, డ్రైవింగ్‌చేస్తున్న వ్యక్తి), కొండపల్లి శివరామకృష్ణశాస్త్రి (44), వంగా ప్రకాశరావు (55), నల్లమోతు రవి సుధాకర్ (47) దుర్మరణం పాలయ్యారు. వీరితో పాటు ప్రయాణిస్తున్న పరశురాం, ఎండీ ఫారుఖ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై విజయ్‌కుమార్, హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరికి ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎయిర్ బ్యాగులున్నప్పటికీ.. కారు అమర్చిన ఎయిర్‌బ్యాగ్‌లు తెరచుకున్నప్పటికీ వాహనం వేగానికి, ఢీకొట్టిన తీవ్రతకు పేలిపోయాయే తప్ప ముందు సీట్లో కూర్చున్న వారి ప్రాణాలు కాపాడలేకపోయాయి. ఈ సమయంలో వాహనాన్ని విజయవాడ రామవరప్పాడుకు చెందిన గోవర్థన్‌రావు నడుపుతున్నాడు. కారుముందు భాగం నుజ్జవడంతో అతడు సీట్లోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచాడు. మిగతావారి తల, ఛాతిపైన బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్త స్రావ మై మరణించారు. పోలీసులు కూడా దీనినే ధ్రువీకరించారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానిక పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది అతికష్టం మీద బయటకు తీశారు. ఆరుగురూ రియల్ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములు. ఇటీవల విజయవాడలో స్థలం విక్రయించినట్లు సమాచారం. దానికి సంబంధించి అడ్వాన్సు తీసుకునేందుకు విశాఖ బయలు దేరినట్టు తెలిసింది. మృతుల్లో ఒకరైన సుధాకర్ ఏపీ న్యూస్ పేరుతో న్యూస్‌చానల్ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. దీని ఏర్పాట్ల గురించి కూడా చర్చించేందుకు, అవసరమై స్థలాన్ని, వసతిని పరిశీలించేందుకు విశాఖ బయలుదేరినట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించిన గుర్తింపుకార్డు ఒకటి మృతుని వద్ద లభించింది. వారివద్ద ఉన్న ఆధారాల మేరకు కుటంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. లారీ కోసం గాలింపు... ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్నవారు మరణించిన విషయాన్ని లారీ డ్రైవర్ గుర్తించాడు. వెంటనే లారీతో సహా వెళ్లిపోయాడని సమాచారం. లారీ ఆగిఉన్న సమయంలో వాహనం ఢీకొట్టిందా? లేక ప్రయాణిస్తూ సడన్ బ్రేక్‌వేయడం వల్ల ఢీకొట్టిందా? అన్నది నిర్ధారించుకోవడానికి పోలీసులు లారీ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వేంపాడు టోల్గేట్లో సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి లారీ ఆచూకీ కనుగొనేందుకు యత్నిస్తున్నారు. రవిసుధాకర్ కుటుంబంలో విషాదం ఇబ్రహీంపట్నం : విశాఖపట్నం వద్ద శని వారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇబ్రహీంపట్నం శక్తినగర్కి చెందిన నల్లమోతు రవిసుధాకర్(47) మృతి చెందడంతో ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రవిసుధాకర్ గతంలో పలు దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఆయన రంగమ్మను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె శ్రీజ బీఫార్మసీ చేస్తోంది. కుమారుడు రాజు రామ్ ఇంటర్ చదువుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో రవిశంకర్ మృతిచెందినట్లు తెలియగానే కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు విశాఖ జిల్లాకు బయలుదేరి వెళ్లారు. గోవర్ధనరావు కుటుంబంలో.. రామవరప్పాడు : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గరిమెళ్ల గోవర్థనరావు ప్రసాదంపాడులోని సాయిబాబా ఆలయం సమీప ప్రాంత వాసి. గోవర్థనరావు మరో ఐదుగురు రియల్ ఎస్టేట్ పనిమీద శుక్రవారం రాత్రి కారులో విశాఖపట్నం వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది గోవర్థన్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతడి తల్లిదండ్రులు అడవినెక్కలంలో నివాసం ఉంటున్నారు. ప్రమాదం గురించి తెలియగానే గోవర్థనరావు సమీప బంధువైన ప్రసాదంపాడు ఉప సర్పంచ్ కోమ్మా కోటేశ్వరరావు తదితరులు హుటాహుటిన విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. ఫారుక్ పరిస్థితి విషమం కారులో వీరితోపాటు ప్రయాణిస్తున్న యనమలకుదురు వాసి ఫారుక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఫారుక్ ఆటోనగర్‌లో బ్యాటరీల దుకాణం నిర్వహిస్తుంటాడు. అతడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అతడి కుటుంబసభ్యులు, బంధువులు విశాఖపట్నం బయలుదేరారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు సమీపంలోని పూతలపట్టు వద్ద ఇన్నోవో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిని దగ్గర్లోని....ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని సమాచారం. తీవ్రంగా గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్టీఓ అధికారుల తనిఖీలో డబ్బే డబ్బు !
-
టయోటా కార్ల ధరలు పెరుగుతున్నాయ్
న్యూఢిల్లీ: టయోటా కంపెనీ కొన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతోంది. ఈ నెల 21 నుంచి కొన్ని మోడళ్ల కార్ల ధరలను 1.5% (రూ.24,000) వరకూ పెంచుతున్నామని కంపెనీ మంగళవారం తెలిపింది. పెరిగిపోతున్న ఉత్పత్తి వ్యయం, తరిగిపోతున్న రూపాయి విలువ కారణంగా ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది. ఇటియోస్, ఇటియోస్ లివా, ఇన్నోవా, కొరొల్లా ఆల్టిస్ ధరలను పెంచుతున్నామని వివరించింది. రూ.9.77 లక్షలు-రూ.14.42 లక్షల రేంజ్లో ఉన్న ఇన్నోవా ధరలను రూ.7,000 నుంచి రూ.11,000వరకూ, రూ.11.74 లక్షలు-రూ.15.89 లక్షల రేంజ్లో ఉన్న కొరొల్లా ఆల్టిస్ ధరలను రూ.11,000 నుంచి రూ.24,000 వరకూ, రూ.5.45 లక్షల నుంచి రూ.8.15 లక్షల రేంజ్లో ఉన్న ఇటియోస్ ధరలను రూ.4,000 నుంచి రూ.8,000 వరకూ, రూ.4.46 లక్షల నుంచి రూ.6.59 లక్షల రేంజ్లో ఉన్న ఇటియోస్ లివా ధరలను రూ.4,500 నుంచి రూ.8,600 వరకూ పెంచుతున్నామని పేర్కొంది. రూపాయి పతనం కారణంగా ఇప్పటికే ఫోర్డ్ ఇండియా, మెర్సిడెస్-బెంజ్, జనరల్ మోటార్స్ ఇండియా, బీఎండబ్ల్యూ గ్రూప్, ఆడి కంపెనీలు కూడా ధరలు పెంచాయి.