టయోటా.. కొత్త ఇన్నోవా క్రి స్టా | Toyota launches Innova Crysta priced up to Rs 20.78 lakh | Sakshi
Sakshi News home page

టయోటా.. కొత్త ఇన్నోవా క్రి స్టా

Published Tue, May 3 2016 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

టయోటా.. కొత్త ఇన్నోవా క్రి స్టా

టయోటా.. కొత్త ఇన్నోవా క్రి స్టా

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎట్టకేలకు తన మల్టీ పర్పస్ వెహికల్ ఇన్నోవాను అప్‌డేట్ చేసింది. కంపెనీ తాజాగా ‘ఇన్నోవా క్రిస్టా’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.13.84 లక్షలు- రూ.20.78 లక్షల (ఎక్స్ షోరూమ్ ముంబై) శ్రేణిలో ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభ్యం కానున్నది. 2.8 లీటర్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ లీటరుకు 14.29 కిలోమీటర్ల మైలేజ్‌ని, 2.4 లీటర్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ లీటరుకు 15.10 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే ‘ఇన్నోవా క్రిస్టా’ ప్రధానంగా జీ, జీఎక్స్, వీఎక్స్, జెడ్‌ఎక్స్ అనే నాలుగు వేరియంట్లలో లభ్యంకానుంది. వీటి బుకింగ్స్ సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని, డెలివరీ మే 13 నుంచి జరుగుతుందని కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement