మార్కెట్లోకి టయోటా అర్బన్‌ క్రూజర్‌ టైజర్‌ | Toyota Urban Cruiser Taisor SUV launched | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి టయోటా అర్బన్‌ క్రూజర్‌ టైజర్‌

Published Thu, Apr 4 2024 5:23 AM | Last Updated on Thu, Apr 4 2024 12:19 PM

Toyota Urban Cruiser Taisor SUV launched - Sakshi

ధర రూ.7.73 లక్షల నుంచి ప్రారంభం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) తాజాగా మార్కెట్లోకి ఎంట్రీ లెవెల్‌ ఎస్‌యూవీ ‘అర్బన్‌ క్రూజర్‌ టైజర్‌’ను విడుదల చేసింది. దీని ధర రూ. 7.73 లక్షల నుంచి రూ. 13.03 లక్షల వరకు (ఎక్స్‌–షోరూమ్‌) ఉంటుంది. ఇది మారుతీ సుజుకీకి చెందిన ఫ్రాంక్స్‌కి టీకేఎం వెర్షన్‌గా ఉంటుంది.

టైజర్‌ పెట్రోల్, ఈ–సీఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రీమియం ఇంటీరియర్స్, కీ లెస్‌ ఎంట్రీ, 360 వ్యూ కెమెరా, 9 అంగుళాల హెచ్డీ స్మార్ట్‌ప్లే, యాంటీ–థెఫ్ట్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. రూ. 11,000తో టైజర్‌ను బుక్‌ చేసుకోవచ్చు. మే నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేందుకు ఈ మోడల్‌ తమకు ఉపయోగపడగలదని కంపెనీ డిçప్యూటీ ఎండీ తడాషి అసాజుమా తెలిపారు. కస్టమర్లు చిన్న కార్ల నుంచి క్రమంగా పెద్ద కార్ల వైపు మళ్లుతున్నారని, అందుకే మరిన్ని కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టేందుకు తాము ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement