పీలేరులో ఘోర రోడ్డు ప్రమాదం | Brutal Road Accident In Pileru | Sakshi
Sakshi News home page

పీలేరులో ఘోర రోడ్డు ప్రమాదం

Published Thu, Apr 26 2018 7:25 AM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

Brutal Road Accident In Pileru - Sakshi

సాక్షి, పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని తానావడ్డెపల్లి వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఇన్నోవా కారును లారీ ఢీకొట్టి జాతరకు వెళ్తున్న కళాకారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.

క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. మృతులు నిమ్మనపల్లె మండలం కొండసానివారిపల్లె వాసులుగా గుర్తించారు. కళాకారులు డప్పు వాయిస్తూ జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement