ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
గుడ్లూరు: ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఇన్నోవా వాహనం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో.. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలి వెళ్తున్న వాహనం మోచర్ల వద్ద ప్రమాదానికి గురైంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతులంతా కావలికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.