ఇన్నోవా- లారీ ఢీ: ముగ్గురి మృతి
తిరుపతి: తిరుపతి రూరల్ మండలం గాంధీపురం వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఇన్నోవాను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. కృష్ణా పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. మృతులు మదనపల్లెకి చెందిన నాగరాజు, భారతి, కృష్ణమూర్తిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.