ఇన్నోవా బోల్తా: ఒకరు మృతి | one dies as innova turns turtle in ananthapur district | Sakshi
Sakshi News home page

ఇన్నోవా బోల్తా: ఒకరు మృతి

Published Mon, Aug 17 2015 7:22 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

one dies as innova turns turtle in ananthapur district

అనంతపురం: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బత్తులపల్లి మండలంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని జ్వాలాపురం సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఇన్నోవా వాహనం చెట్టును ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

మృతుడు మదనపల్లి టీజీఎం కోర్టు సూపర్‌డెంట్ టి. రమేష్ బాబుగా పోలీసులు నిర్ధరించారు. అనంతపురంలోని ఓ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement