వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్.. హైబ్రిడ్ మల్టీపర్పస్ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ వర్షన్ ధరను వేరియంట్‌ను బట్టి రూ.18.3– 19.2 లక్షలుగా నిర్ణయించింది. జనవరి మధ్యకాలం నుంచి డెలివరీలు ఉంటాయని కంపెనీ ప్రకటించింది.
సెల్ఫ్‌చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వర్షన్ ధర వేరియంట్‌ను బట్టి రూ.24–29 లక్షలుగా ఉంది. ఈ–డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్ సిస్టమ్‌తో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. మైలేజీ లీటరుకు 23.24 కిలోమీటర్లు అని కంపెనీ ప్రకటించింది.
ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లోనూ లభిస్తుంది. మైలేజీ లీటరుకు 16.13 కిలోమీటర్లు. బుకింగ్స్ నవంబర్ 25 నుంచే ప్రారంభం అయ్యాయి. 2005లో భారత్‌లో అడుగుపెట్టిన ఇన్నోవా ఇప్పటి వరకు 10 లక్షలకుపైగా యూనిట్లు రోడ్డెక్కాయి. సంస్థ మొత్తం అమ్మకాల్లో ఈ మోడల్ వాటా ఏకంగా 50 శాతం పైమాటే.
Comments
Please login to add a commentAdd a comment