టాప్-10 ప్యాసింజర్ కార్లు ఇవే! | Vitara Brezza, Innova make it to top-selling list in May | Sakshi
Sakshi News home page

టాప్-10 ప్యాసింజర్ కార్లు ఇవే!

Published Mon, Jun 27 2016 11:52 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

టాప్-10 ప్యాసింజర్ కార్లు ఇవే! - Sakshi

టాప్-10 ప్యాసింజర్ కార్లు ఇవే!

న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ కొత్త కాంపాక్ట్ ఎస్ యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) విటారా బ్రీజా రయ్యిమని దూసుకుపోతోంది. ఈ మోడల్స్ అమ్మకాల్లో అదుర్స్ మనిపిస్తూ టాప్-10 ప్యాసెంజర్ వెహికిల్ జాబితాలో చోటు సాధించింది. టాప్-10 అమ్మకాల జాబితాలో ఆరు మోడల్స్ మారుతీ సుజుకీవే ఉన్నాయి. మే నెలలో 7,193 యూనిట్ల అమ్మకాలతో మారుతీ సుజుకీ విటారా బ్రీజ్ 10వ స్థానంలో నిలవగా.. ఎంట్రీ లెవల్ మోడల్ ఆల్టో 19,874 యూనిట్లతో అగ్రస్థానంలో ఉందని భారత ఆటోమొబైల్ తయారీ సంఘ సొసైటీ(సియామ్) గణాంకాల్లో తెలిపింది.

14,413 యూనిట్ల అమ్మకాలతో మారుతి సుజుకీ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ రెండో స్థానంలో ఉంది. మారుతీ సుజుకీ బ్రాండ్లు వాగన్ ఆర్ మూడో స్థానం, స్విప్ట్ నాలుగోస్థానం, ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనో ఏడో స్థానం, సెలిరియో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. 12,005 యూనిట్లతో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఐదో స్థానానికి ఎగబాకగా, 10,472 యూనిట్ల అమ్మకాలతో ప్రీమియం కాంపాక్ట్ ఎలైట్ ఐ20 ఆరో స్థానానికి ఎగిసిందని సియామ్ తెలిపింది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ బహుళ ప్రయోజన వాహనం ఇన్నోవా క్రిస్టా కూడా టాప్-10 జాబితాలో చోటు దక్కించుకుంది. 7,259 యూనిట్లతో టయోటా ఇన్నోవా తొమ్మిదో స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement