పెలైట్ ప్రాజెక్టు కింద ట్రాఫిక్ విభాగంలో ఒక వాహనం ప్రవేశం
‘ఇన్నోవా’కు నాలుగు వైపుల సీసీకెమెరాల ఏర్పాటు
వాహనంలో డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే ఉంటారు
{పత్యక్ష ప్రసారం కూడా చేస్తుంది
సిటీబ్యూరో: నగరం పోలీసు శాఖకు త్వరలో ఇంటర్‌సెప్టర్ వాహనాలు రాబోతున్నాయి. పెలైట్ ప్రాజెక్ట్ కింద బుధవారం ట్రాఫిక్ విభాగంలో ఒక వాహనాన్ని ప్రవేశపెట్టారు. వీటి పని తీరు పరీక్షించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ వాహనాలను రంగంలోకి దింపుతారు. ఇంటర్‌సెప్టర్ వాహనాలుగా ఇన్నోవాలను వినియోగిస్తున్నారు. ఈ కార్లకు నాలుగు వైపుల నాలుగు సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. ఈ వాహనంలో డ్రైవర్‌తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే ఉంటాడు. ఇటు శాంతి భద్రతలు, అటు ట్రాఫిక్ విభాగంలోను ఇంటర్‌సెప్టర్ వాహనాలు ప్రవేశపెట్టబోతున్నారు. వాహనానికి నాలుగు వైపుల రహదారిపై ఉన్న దృశ్యాలను వాహనంలో అమర్చిన కంప్యూటర్‌లో ఆపరేటర్ చూసుకునే సదుపాయం ఉంది. అలాగే కంప్యూటర్‌లో 3-జీ ఇంటర్‌నెట్ కనెక్షన్ సదుపాయం కూడా ఉంది. రహదారిపై దృశ్యాలను బషీర్‌బాగ్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కు నేరుగా ప్రత్యక్ష ప్రసారాలను సైతం అధికారులు వీక్షించే అవకాశం కల్పించారు.
ట్రాఫిక్ విభాగంలో ఇలా...
ఈ వాహనం రోడ్డుపై వేగంగా తిరుగుతూ నో పార్కింగ్, రాంగ్ పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపిన వాహనాలను చిత్రీకరిస్తుంది. కాలనీలు, అపార్ట్‌మెంట్ల ముందు, షాపింగ్ సెంటర్లు, సినిమా థియేటర్ల వద్ద, కళాశాలలు, పాఠశాలల వద్ద అక్రమంగా పార్కింగ్ చేస్తే ఈ వాహనం ఫొటోలు తీసి ఫుటేజీని భద్రపరుస్తుంది. దాని ఆధారంగా వాహనదారుడికి పోలీసులు చలాన్ పంపిస్తారు.
శాంతి భద్రతల్లో ఇలా...
ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, మత ఘర్షణలు, దాడులు, అల్లర్లు జరిగిన సమయంలో నిందితులను గుర్తించేందుకు ఈ వాహనం చాలా ఉపయోగపడుతుంది. నిందితుల వివరాలు చెప్పేందుకు ప్రత్యక్ష సాక్షులు భయపడతారు. అలాంటి సమయంలో ఈ వాహనం ఘటనా స్థలానికి చేరుకొని చాలు నాలుగు వైపులా ఉన్న సీసీకెమెరాల ద్వారా దృశ్యాలన్నీ రికార్డు చేస్తుంది. ఈ చిత్రాలు కోర్టులో సాక్ష్యాలుగా పని చేస్తాయి. దీంతో నిందితులు శిక్షల నుంచి తప్పించుకోలేరు.
సమావశాలు, సభల వద్ద నుంచి...
సమావేశం, సభలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో అసాంఘిక శక్తుల కదలికలను కనిపెట్టేందుకు ఈ వాహనాన్ని అక్కడికి పంపిస్తారు. అక్కడి దృశ్యాలను సీసీకెమెరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
త్వరలో ‘ఇంటర్‌సెప్టర్’ వాహనాలు
Published Thu, Feb 19 2015 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement