pelait project
-
బోధనాసుపత్రుల పరిధిలోకి దవాఖానాలు
- పెలైట్ ప్రాజెక్ట్‌గా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఎంపిక - వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్ : బోధనాసుపత్రుల పరిధి కి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను తీసుకురావాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. పెలైట్ ప్రాజెక్టు కింద వరంగల్ ఎంజీఎం బోధనాసుపత్రిని ఎంపిక చేశారు. ఆసుపత్రికి 50 కిలోమీటర్ల పరిధిలోని ఆసుపత్రులను దీని పరిధిలోకి తీసుకొస్తారు. ఇక్కడ అమలుతీరు ఆధారంగా రాష్ట్రంలోని ఇతర చోట్ల అమలుచేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులను వ్యవస్థీకరించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ ఈ కార్యక్రమానికి నడుం బిగించింది. బోధనాసుపత్రుల పరిధిలోకి సమీప ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తీసుకురావ డం వల్ల ఒకట్రెండు ఆసుపత్రుల మీద పడుతోన్న ఒత్తిడిని తగ్గిస్తారు. ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా ఉండే ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి వీలవుతుంది. సమన్వయం ఇలా..: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం వంటి నాలుగైదు జిల్లాలకు వరంగల్ ఎంజీఎం అత్యాధునిక వైద్యాన్ని కల్పిస్తోంది. దీంతో ఆ ఆసుపత్రిపై అధిక భారం పడుతోంది. తాజా నిర్ణయం ప్రకారం ఎంజీఎం కిందకు ఆ జిల్లాలోని ఇత ర ఆసుపత్రులను తీసుకొస్తారు. ఎంజీఎంకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు, 35 కిలోమీటర్ల దూరంలో నర్సంపేట సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. అలాగే వాటి పరిధిలో గణపురం, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, పస్ర పీహెచ్‌సీలు కూడా ఉన్నాయి. ఆయా పీహెచ్‌సీల పరిధిలో 31 ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. వీటన్నింటినీ ఎంజీఎం కిందకు తీసుకురావాలన్నదే సర్కారు ఉద్దేశం. అలా డీఎంహెచ్‌వో పరిధిలోని పీహెచ్‌సీలు, డీసీహెచ్ పరిధిలోని జిల్లా, ఏరియా, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఎంజీఎం లాంటి బోధనాసుపత్రులన్నీ సమన్వయం అవుతాయి. ఈ ముగ్గురు విభాగాల అధికారులు మొత్తం ఆసుపత్రుల పరిపాలనా వ్యవస్థను చూసేలా ఏర్పాట్లు చేస్తారు. దీనివల్ల అన్ని ఆసుపత్రుల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. స్థానికంగా నయం కాని రోగులు ఆపైన పీహెచ్‌సీకి, అక్కడా సాధ్యం కాకపోతే సామాజిక ఆరోగ్య కేంద్రాలకు వస్తారు. అక్కడా నయం కాకుంటే ఎంజీఎంకు వస్తారు. అలా కింది నుంచి పై వరకు రోగులను రిఫర్ చేస్తారు. దీంతో క్రమేణా రోగులు కూడా ఈ పద్ధతికి అలవాటు పడతారు. ఇలా చేయడం వల్ల పడకల కొరత, మందులు లేకపోవడం, వెంటిలేటర్లు దొరకకపోవడం వంటి సమస్యలకు బ్రేక్ పడుతుంది. -
సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం
పెలైట్ ప్రాజెక్టుగా వరంగల్ ఎంపిక జిల్లాకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్ వేగంగా అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అంగరంగ వైభవంగా అవతరణ వేడుకలు అమరుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు ఉత్తములకు అవార్డుల పంపిణీ హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాల అమల్లో ముందున్న జిల్లాలో ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం(సెప్టెంబర్ 8) నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించే లక్ష్యంతో జిల్లాను పెలైట్ జిల్లాగా ఎంపిక చేసి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అ న్నారు. దేశం యావత్తు రాష్ట్రం వైపు చూస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని తరవాత జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు. జిల్లాలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, భూమి కొనుగోలు పథకం వివరాలు కడియం వివరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల ను పురస్కరించుకుని గురువారం హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీహరి ఉదయం 9గంటల కు పతాకావిష్కరణ చేసి పోలీస్ వందనం స్వీకరించారు. రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 72మందికి న గదు, ప్రశంసాపత్రం, మెమొంటోలు అందజేశారు. ఈ సం దర్భంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై ప్రసంగించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే... ‘పది’ ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి స్థానం ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో 95.13 శాతంతో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకు కృషి చేసిన అధికార యంత్రాంగానికి అభినందనలు. జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్‌స్కూల్, వ్యవసాయ కళాశాల, వెటర్నరీ కళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. ఇ దే క్రమంలో అంబేద్కర్ 120వ జయంతిని పురస్కరించుకు ని జిల్లాకు 11ఎస్సీ, ఆరు ఎస్టీ, నాలుగు మైనార్టీ గురుకులా లు, నాలుగు మహిళా డిగ్రీ కాలేజీలు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా 450 పీఎస్‌ల్లో ఆంగ్లమాధ్యమ భోదనకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే 1500 మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శి క్షణ ఇప్పించాం. సంపూర్ణ అక్ష్యరాస్యత కోసం జిల్లాను పైల ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామపంచాయతీల పరిధిలో 15నుంచి 50ఏళ్ల మధ్య వారిని అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం చేశాం. సెప్టెంబర్ 8నాటికి లక్ష్యం పూర్తి చేయాలని పట్టుదలతో యంత్రాంగం పనిచేస్తోంది. మిషన్ కాకతీయ, భగీరథ.. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను తెలంగాణ ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుని మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టింది. ఇది జిల్లా బిడ్డలుగా మనకెంతో గర్వకార ణం. జిల్లాలో రూ.404.89 కోట్లతో 1082 చెరువులు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటి దశ పనుల్లో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఎస్సారెస్పీ-1, 2, కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. మిషన్ భగీరథ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 50 మండలాల్లోని 3405 గ్రామాల్లో రూ. 4,433 కోట్లతో ఐదు సెగ్మెంట్లలో పనులు సాగుతున్నాయి. తొలిదశ లో జులై 31నాటికి 11మండలాల్లోని 704 గ్రామాలకు తాగునీరు అందిచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. జిల్లాను టెక్స్టైల్ హబ్, ఇండ్రస్ట్రియల్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం పలుమార్లు జిల్లాలో పర్యటించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో పరిశ్రమల కోసం 3600 ఎకరాల భూమి గుర్తించి ఉంది. హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అడపిల్ల పెళ్లి పేద తలిదండ్రులకు భారం కావద్దని ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ కార్యక్రమాలు అమలు చేస్తోంది. జిల్లాలో షాదీముబారక్ ద్వారా 1478 జంటలకు రూ.7055కోట్లు, కళ్యాణలక్ష్మి ద్వారా 3295 జంటలకు రూ.17కోట్లు అందజేయడం జరిగింది. నిరుపేదల సంక్షేమం ప్రభుత్వం బాధ్యతగా గుర్తించి అమలు చేస్తున్న ఆసరా పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 4,33,666 మందికి ప్రతినెలా రూ.45.12కోట్లు పెన్షన్లు విడుదల చేస్తున్నాం. రైతులకు ఇప్పటికే రెండు విడతల్లో రూ.940కోట్లు రుణ మాఫీ చేసిన ప్రభుత్వం మూడో విడత మాఫీకి చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా రైతుల కోసం వరి, మొక్కజొన్న దాన్యం ఆరబెట్టేందకు రూ.కోటితో డ్రయ్యర్లను ఏర్పాటు చేశాం. అదేవిధంగా జిల్లాలో నూతనంగా 45 గోదాముల నిర్మాణం జరుగుతోంది. రైతుల సంక్షేమం, అభివృద్ధికి బాటలు వేస్తూ వ్యవసాయ రంగానికి 9గంటలు నాణ్యమైన కరంట్ సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం రూ.175కోట్లతో 517 కిలోమీటర్లు 33కేవీ లైన్ ఏర్పాటు చేశాం. అదనంగా అవసరం మేరకు ట్రాన్స్ఫారాలు ఏర్పాటు చేశాం. వైద్యం, ఆరోగ్యం.. జిల్లాలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్థాపించి ఈ విద్యా సంవత్సరం మెడికల్, పీజీ అడ్మిషన్లు, డెంటల్, నర్సింగ్, ఆయూష్, ఫిజియోథెరపీ, పారామెడికల్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నాం. యూనివర్సిటీ భవన నిర్మాణానికి సెంట్రల్ జైల్ ఆవరణలో 35 ఎకరాలు మంజూరు చేయనున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. భవన నిర్మాణానికి రూ.25కోట్లు కేటాయించారు. జిల్లాలో రూ.6కోట్లతో 12నూతన పీహెచ్సీ భవన నిర్మాణాలు పూర్తి చేశాం. రూ.కోటి 80 ల క్షలతో 20సబ్‌సెంటర్లు నిర్మాణాలు చేపట్టాం. ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, ఏటూరునాగారం సీహెచ్‌సీల్లో ప్రత్యేక నవజాత శశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆర్థిక చేయూత జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.77కోట్లతో 7447మందికి, బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.18కోట్లతో 2233 మందికి, ఐటీడీఏ ద్వారా 7.48కోట్లతో 1138మందికి, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 3.35కోట్లతో 407 మందికి ఉపాధి కల్పన కోసం రుణాలు మంజూరు చేశాం. మహిళా సాధికారత కోసం 3,35,947మంది మహిళలకు రూ.646.46కోట్లు బ్యాంకులింకేజీ, స్త్రీనిధి బ్యాంకు నుంచి ఇప్పించాం. జెడ్పీ సాధారణ నిధుల కింద రూ.3కోట్లతో 169పనులు మంజూరు కాగా 83 పనులు పూర్తిచేశాం. ఎస్ఎఫ్సీ నుంచి రూ.24.25 కోట్ల నిధులతో 2234పనులు మంజూరి కాగా1681 పనులు పూర్తయ్యాయి. మిగతావి ప్రగతిలో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు. -
గ్రామాల గొంతెండుతోంది..!
నిలిచిపోయిన పొందుగులలోని పెలైట్ ప్రాజెక్టు రెండు నెలలుగా సరఫరా కాని తాగునీరు అడుగంటిన మంచినీటి బావులు నీరు మోసుకొచ్చేందుకు అగచాట్లు పడుతున్న మహిళలు దాచేపల్లి మండలంలో తీవ్ర తాగునీటి ఎద్దడి మనిషి మనుగడకు ఆధారం జలం. భూమాత ఒడిలో సేదతీరే జలరాశి రోజురోజుకూ అందనంత దూరంగా జరిగిపోతోంది. మనిషి పెంచిన కాలుష్యం కాలచక్రం గతిని తప్పించడంతో వర్షాకాలంలో కూడా వానజల్లు పలకరించని పరిస్థితులు దాపురించాయి. దీంతో భూగర్భజలాల వినియోగం పెరిగి జలరాశి ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఏడాదికేడాది గంగ పాతాళానికి జారిపోతూ భవిష్యత్తుపై బెంగపెంచుతోంది. చిలకలూరిపేట : పాతాళగంగ ఉబికి రానంటోంది. జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతుండడంతో తీవ్ర నీటి కష్టాలు ఎదురుకానున్నాయి. భూగర్భ జలాల సంరక్షణకు ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాలతో అరకొర నీటి సరఫరా జరిగినా అవి పూర్తి స్థాయిలో తాగునీటి అవసరాలను తీర్చలేకపోయాయి. నవంబరులోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్నరోజుల్లో పరిస్థితి మరింతగా దిగజారే అవకాశం ఉందని భావిస్తున్నారు. తగ్గుతున్న భుగర్భ జలాలు.. ఈ ఏడాది అప్పుడప్పుడు మురిపించిన నల్లని మబ్బులు తప్పా సరైన వర్షం కురవలేదు. దీంతో పలు గ్రామాల్లో మంచినీటి చెరువులు ఎండిపోయాయి. పట్టణ ప్రాంతాల్లో గతంలో కంటే భూగర్భ జలాలు అడుగంటాయన్న నివేదికలు కలవరానికి గురిచేస్తున్నాయి. వర్షం నీరు వృథా కాకుండా ఏ విధంగా భద్రపరచాలన్న విషయంలో స్పష్టమైన ప్రణాళికలు అధికారులు, పాలకుల వద్ద లేవు. కొందరు నిబంధనలు అతిక్రమించి ఇష్టానుసారంగా బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలోని గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 2014 మేలో 29.80 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉంటే 2015 మే నాటికి 34.62 మీటర్ల లోతుకు వెళ్తే కానీ నీరు లభ్యంకాని పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపాలిటీ వారీగా పరిశీలిస్తే నరసరావుపేటలో గతంలో 2.93 మీటర్ల లోతులో లభ్యమయ్యే నీరు 3.34 మీటర్లకు, చిలకలూరిపేటలో 1.50 నుంచి 1.28 మీటర్లకు తగ్గింది. మాచర్లలో అయితే గత ఏడాది 6.78 మీటర్ల లోతులో లభ్యమయ్యే నీరు ఈ ఏదాది 12.92 మీటర్లకు దిగజారింది. వినుకొండలో గతంలో 4.78 మీటర్లుగా ఉన్న నీటి లభ్యత ప్రస్తుతం 10.27 మీటర్ల పెరిగింది. పొంచిఉన్న ముప్పు.. వర్షాభావ పరిస్థితుల ప్రభావం భూగర్భ జలాలపై పడింది. జిల్లాలో 51,407 వేల వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వీటి ద్వారా 1.50 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. వర్షాలు లేకపోవడంతో సమీప ప్రాంతాల్లో పొలాల రైతులు కూడా వ్యవసాయ బోర్లపై ఆధారపడే పంటల సాగు చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాల వాడటం పెరిగింది. తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్న పరిస్థితిలో పట్టణాల్లో సైతం విచ్చలవిడిగా వేసిన బోర్లు భూగర్భ జలాలను హరించివేశాయి. వివిధ ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు అనుమతులు లేకుండా వేసినబోర్లు రోజుకు లక్షల లీటర్ల భూగర్భ జలాలను పీల్చివేశాయి. శాస్త్రీయ అంచనాల ప్రకారం ప్రతి మనిషికి రోజుకు 135 లీటర్ల నీరు అవసరమవుతుంది. వర్షాభావ పరిస్థితులతో నీటి అవసరాల కోసం పూర్తిగా భూగర్భ జలాలపై ఆధారపడటంతో భవిష్యత్తు అంధకారంగా మారనుంది. 50 ఏళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా వాగులు, చెరువులు పూర్తిస్థాయిలో ఎండిపోవడంతో వాటిపై ఆధారపడిన రైతులు, పశువులకు కూడా నీరు అందని పరిస్థితి కొనసాగుతోంది. అధికారులు భూగర్భ జలాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేస్తే తప్ప పొంచిఉన్న ప్రమాదం నుంచి బయటపడే అవకాశం కనిపించటం లేదు. -
కొత్త వెలుగు!
* ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు.. * సిద్దిపేట, గజ్వేల్ ఎంపిక * పెలైట్ ప్రాజెక్టుగా భారత్‌నగర్‌లో అమలు * విద్యుత్ వినియోగంలో ఆదాకు ప్రయోగం * నేడు రాజధానిలో త్రిసభ్య సమావేశం సిద్దిపేట జోన్: జిల్లాలోని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేట, నగర పంచాయితీ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఇకపై ఎల్ఈడీ వెలుగులు విరజిమ్మనున్నాయి. రెండు ప్రాంతాల్లో ఎల్ఈడీ వీధి దీపాల వ్యవస్థను అమలు చేసే నిమిత్తం నేడు కీలక ఒప్పందం కుదరనుంది. విధానం అమలులో భాగంగా సిద్దిపేటలోని భారత్‌నగర్ పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. సాధారణ విద్యుత్ వినియోగం భారంగా మారిన క్రమంలో దీనికి ఎల్ఈడీ ద్వారా చెక్ పెట్టాలని భావిస్తున్నారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తింపు పొందిన సిద్దిపేటలో ఏటా మున్సిపల్‌కు విద్యుత్ చార్జీల చెల్లింపు భారంగా మారుతోంది. పట్టణంలోని 6352 వీధి దీపాల ద్వారా ప్రతి నెలా సగటున రూ. 19 లక్షల మేర విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రాష్ట్రంలోని 12 పట్టణాల్లో ఎల్ఈడీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంకల్పించి.. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, రామగుండం కార్పొరేషన్లతో పాటు సిరిసిల్ల, మహబూబ్‌నగ ర్, మంచిర్యాల, నల్లగొండ, తాండూర్, సిద్దిపే ట మున్సిపాలిటీలు, గజ్వేల్ నగర పంచాయితీ ని గుర్తించింది. సిద్దిపేట పట్టణంలోని భారత్‌నగర్ ప్రాంతంలో పెలైట్ ప్రాజెక్ట్‌గా ఎల్ఈడీ వి ధానం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈ ఎస్ఎల్తో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్వహించేం దుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. నేడే అధికారిక ఒప్పందం.. ఎల్ఈడీ విధానం అమలులో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సమక్షంలో జరిగే త్రిసభ్య సమావేశానికి సిద్దిపేట, గజ్వేల మున్సిపల్ కమిషనర్లకు ఆహ్వానం అందింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈఎస్ఎల్ (ఎన ర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్), మున్సిపల్ కమిషనర్ల నేతృత్వంలో అధికారిక ఒప్పందం కుదరనుంది. సిద్దిపేట పట్టణ సమగ్ర నివేదిక తో మున్సిపల్ కమిషనర్ రమణాచారి హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి వెళ్లనున్నారు. ఒ ప్పందం అనంతరం కేంద్ర ప్రభుత్వ రంగ సం స్థ ఈఈఎస్ఎల్ సిద్దిపేటలో ఎదురయ్యే సత్ఫలితాలకు అనుగుణంగా పట్టణమంతా ఎల్ఈడీ వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. సిద్దిపేటలో ఒకే ప్రాంతం.. సుమారు లక్షన్నర జనభా గల సిద్దిపేట పట్టణంలో 6352 వీధి దీపాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్న క్రమంలో భారాన్ని తగ్గించుకునేందుకు పట్టణాన్ని 5 ప్రాంతాలుగా మున్సిపల్ అధికారులు విభజించారు. ఈ ప్రాంతాల్లో ఎల్ఈడీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ప్రయోగాత్మకంగా భారత్‌నగర్‌లోని 16,17,18,21 వార్డుల పరిధిలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు రూపకల్పన చేశారు. 204 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో 150, 69, 40 ఓల్ట్లతో కూడిన 135 వీధి దీపాలపై ప్రభుత్వం సగటున రూ.1.40 లక్షలను విద్యుత్ బిల్లుల రూపంలో చెల్లిస్తోంది. ఎల్ఈడీ లైట్ల బిగింపు వల్ల 60 శాతం విద్యుత్ ఆదాతో పాటు బిల్లుల భారం తగ్గే అవకాశముంది. -
‘పల్లె సేవాకేంద్రాల’ ప్రక్రియ ప్రారంభం
* పెలైట్ ప్రాజెక్ట్ కింద 125 గ్రామాలు ఎంపిక * అక్టోబర్ 2న ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వివిధ రకాల పౌర సేవలన్నీ ఒకేచోట లభ్యమయ్యేలా ‘పల్లె సమగ్ర సేవాకేంద్రాల (వన్‌స్టాప్‌షాప్)’ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 8,695 గ్రామాల్లో దశల వారీగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్కారు సంకల్పించింది. సాధారణ పౌర సేవలతో పాటు రెవెన్యూ, ఆర్థిక సేవలను కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తున్నందున తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో ఈ వన్స్టాప్షాప్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. పెలైట్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్రంలోని తొమ్మిది (హైదరాబాద్ మినహా)జిల్లాల్లో 125 గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో అక్టోబర్ 2న ఈ కేంద్రాలను ప్రారంభించనున్నారు. జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు మండల రెవెన్యూ కార్యాల యం నుంచి లభించే వివిధ రకాల పౌరసేవలు, ఉపాధిహామీ కూలీలకు వేతన చెల్లింపు లు, ఆసరా లబ్ధిదారులకు పింఛను చెల్లింపు లు కూడా ఈ కేంద్రాల నుంచే నిర్వహిస్తారు. నేటి నుంచి శిక్షణ పల్లె సమగ్ర సేవాకేంద్రాల నిర్వహణ బాధ్యతలను ఆయా గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు మాత్రమే అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్‌గా ఉండాలని నిర్దేశించారు. ఈ మేరకు 125 గ్రామాల నుంచి తగిన విద్యార్హతలున్న మహిళల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. ఆన్లైన్ సేవాకేంద్రం నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థలో శనివారం నుంచి రెండురోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. పల్లె సమగ్ర సేవాకేంద్రాలను గ్రామ పంచాయతీ భవనంలోనే ఏర్పాటు చేస్తారు. నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మహిళకు వివిధ రకాల సేవలకు గాను లబ్ధిదారులు చెల్లించిన మొత్తం నుంచి కమీషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కేంద్రం నిర్వాహకురాలికి నెలకు కనీసం రూ.7వేలు ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
రైతు రక్ష....
అన్నదాతల కోసం కార్పొరేట్ సంస్థల సహకారంతో ముందుకు సెప్టెంబర్ 1న ప్రారంభం పెలైట్ ప్రాజెక్ట్‌గా తుమకూరు జిల్లాలో తొలి దశలో 40 వేల రైతు కుటుంబాలకు లబ్ధి బెంగళూరు :రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థల సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) నిధులను అన్నదాతలను ఆదుకునేందుకు వినియోగించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం పెలైట్ ప్రాతిపదికన తుమకూరు జిల్లాలో వచ్చేనెల 1 నుంచి ‘రైతు రక్ష’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ఇటీవల రైతుల బలవన్మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. వీటికి అడ్డుకట్ట వేయడంతో పాటు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా తుమకూరు, శిరా, పావగడ తాలూకాల్లో దాదాపు 40 వేల రైతు కుటుంబాలను ఎంపిక చేయనుంది. ఒక్కొక్క కుటుంబానికి వేర్వేరు నేపథ్యం ఉంటుంది. అందువల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఒక్కొక్క రైతు కుటుంబానికి కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.20 వేల వరకు సహాయధనాన్ని అందజేస్తారు. అటుపై రాష్ట్ర పశు సంవర్ధకశాఖ, మత్స్యశాఖ, ఉద్యానశాఖల సంయుక్త సహకారంతో వర్మీకంపోస్ట్ ఎరువు, పుట్టుగొడుగుల పెంపంకం, మేకలు, గొర్రెల పెంపకం వంటి వ్యవసాయ ఆధారిత పనులను చేపట్టడానికి వీలుగా రుణాలను అందజేస్తారు. ఆయా కుటుంబ నేపథ్యం సభ్యుల ఆసక్తిని అనుసరించి పనులను కేటాయిస్తారు. మొత్తంగా సీఎస్ఆర్ నిధులను ప్రభుత్వ పథకాలకు తోడుగా రైతు రక్ష పథకం కింద దయనీయ స్థితిలో ఉన్న అన్నదాతలకు అందించి మూడేళ్లలోపు వారిని ఆర్థికంగా గట్టెంక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడాది పాటు ఈ జిల్లాలో రైతు రక్షను అమలు చేసి అటు పై రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకూ ఈ పథకాన్ని విస్తరించే ఆలోచన ఉన్నట్లు తుమకూరు జిల్లా ఇన్ఛార్జ్ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ షాలినీ రజినీష్ తెలిపారు. -
ఇక రాత్రిళ్లూ రిజిస్ట్రేషన్లు..
రెండు షిఫ్టులుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పనివేళలు నేటి నుంచి పెలైట్ ప్రాజెక్టుగా ప్రయోగం బోయినపల్లిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మారేడుపల్లిలో మధ్యాహ్నం 2 గం॥నుంచి రాత్రి 8 గంటల వరకు సిటీబ్యూరో: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఇక సులభతరం కానున్నాయి. రోజుల తరబడి జాప్యం కాకుండా వెంట వెంటనే రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాత్రి 8 గంటల సమయంలోనూ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది. స్థిరాస్తుల దస్తావేజుల నమోదు ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండటంతోపాటు..పెరుగుతున్న తాకిడిని అధిగమించేందుకు ముంబయి తరహాలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు రెండు షిఫ్టుల పద్ధతిలో సేవలందించేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ సిద్ధమైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర పనుల్లో బిజీగా ఉండే వారికి వెసులుబాటు ఉండే విధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా సోమవారం నుంచి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని బోయిన్పల్లి, మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రెండు షిఫ్టులుగా పనిచేయనున్నాయి. ప్రతి రోజు రెండేసి షిఫ్టులుగా వేర్వేరు సమయాల్లో ఆరుగంటల చొప్పున సిబ్బంది సేవలందించనున్నారు. పనివేళలు ఇలా... నగరంలోని బోయినపల్లి, మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజుల నమోదు ప్రక్రియ రెండు షిఫ్టులుగా కొనసాగనుంది. ఉదయం షిఫ్టుగా బోయినపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్టు మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పనిచేయనుంది. ఇలా రెండు షిఫ్టులు కార్యాలయ సిబ్బంది సేవలందిస్తారు. ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానం అమలులో ఉన్న కారణంగా ఒక రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలోని రెండు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఈ కారణంగా రెండు కార్యాలయాల్లో దాదాపు 12 గంటలపాటు రిజిస్ట్రేషన్ల సేవలు అందుబాటులో ఉంటాయి. కాగా ఈ రెండు కార్యాలయాల్లో ప్రవేశపెడుతున్న షిఫ్టుల పద్ధతికి స్పందన లభిస్తే..రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సైతం దీన్ని విస్తరించనున్నారు. అనంతర రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
దోచేద్దాం!
కంప్యూటర్ బిల్లులకు మంగళం పెలైట్ ప్రాజెక్టు పేరిట కాలక్షేపం మద్యం వ్యాపారులకు ప్రభుత్వం వత్తాసు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు.. అమలు చేస్తున్న విధానాలకు పొంతనలేకుండా పోతోంది. ‘పచ్చ’బాబులకు ఇబ్బంది కలిగితే చాలు చట్టాలనే మార్చేయడం అలవాటైపోయింది. ఇందుకు నిలువెత్తు నిదర్శనం మద్యం వ్యాపారమే. మొదట్లో మద్యం విక్రయాలకు కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు ఆ విధానానికి మంగళంపాడేందుకు సిద్ధమైంది. పెలైట్ ప్రాజెక్టుపేరుతో కాలయాపన చేస్తూ మందుబాబులను గుల్లచేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. చిత్తూరు (అర్బన్): జిల్లాలో 410 ప్రైవేటు మద్యం దుకాణాల నిర్వహణకు మేలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండేళ్ల పాటు పాలసీకి ప్రతీ దుకాణంలో తప్పనిసరిగా మద్యం బాటిళ్లు విక్రయించేప్పుడు కంప్యూటర్ బిల్లులు ఇవ్వాలని గెజిట్‌లో పేర్కొంది. షరతులకు అంగీకరించే జిల్లాలో 341 మద్యం దుకాణాలను వ్యాపారులు దక్కించుకున్నారు. కల్తీని నివారించాలని.. కర్ణాటక నుంచి అక్రమ మద్యం నివారించడం, కల్తీ మద్యాన్ని పసిగట్టడం సులభతరమవుతుంది. ప్రతి మద్యం బాటిల్‌పై కంప్యూటరైజ్డ్ హోలోగ్రామ్ స్టిక్కర్లు వేసి, దానికి బార్ కోడింగ్ నెంబరు సైతం కేటాయిస్తారు. వీటిని దుకాణాల్లో డీకోడింగ్ చేసి ఆ మద్యం ఎక్కడ తయారయ్యింది..? ఎప్పుడు దుకాణంలోకి వచ్చింది..? ఎప్పుడు అమ్ముతున్నారు..? ఎంతకు విక్రయిస్తున్నారే వివరాలను రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి ఆన్లైన్లో లింకుచేస్తారు. అక్కడి సర్వర్ ఆధారంగా జిల్లాలోని మద్యం బాటిళ్ల పంపిణీ గోడౌన్లకు, దుకాణాలకు, డెప్యూటీ కమిషనర్ కార్యాలయాల కు ఆన్‌లైన్‌ను అనుసంధానం చేస్తారు. ప్రతి దుకాణం లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ‘కార్వే’ అనే సం స్థతో ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ప్రతి నెలా దుకాణం నుంచి రూ.5 వేల అద్దె తీసుకోవడం.. లేనిపక్షంలో ఒకే సారి రూ.90 వేలు చెల్లించి కంప్యూటర్ పరికరాలు కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందించా రు. ఈ విధానం జూలై 15 నుంచి జిల్లా వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. ఇలా కాలక్షేపం జిల్లాలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారిలో 90 శాతం వ్యాపారులు టీడీపీ నాయకులే. రాష్ట్రంలో సైతం మద్యం దుకాణాలు చేజిక్కించుకున్న తమ సానుభూతి పరులను కాపాడడానికి ఉత్తర్వులను తీసుకొచ్చారు. జిల్లాలో 341 దుకాణాలకు గానూ పెలైట్ ప్రాజెక్టు కింద కేవలం చిత్తూరులో 2, తిరుపతిలో 1 చోట కంప్యూటర్ బిల్లులను ఏర్పాటు చేయడానికి రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తిస్థాయిలో ఈ మూడు చోట్లా కంప్యూటర్ బిల్లులు విజయవంతంగా నడిస్తే జిల్లా మొత్తం అమలు చేస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు సైతం ఇప్పట్లో అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో ఆన్లైన్ ఏర్పాటు చేయకపోవడం, జిల్లాలో సైతం మద్యం బాటిళ్ల పంపిణీ గోదాముల్లో ఈ విధానం అమల్లోకి రాలేదు. ఈ మూడు దుకాణాల్లో కూడా వచ్చే ఏడాది నుంచి కంప్యూటరైజ్డ్ విధానం అమలుకానుంది. నకిలీ మద్యం, కర్ణాటక మద్యం దిగుమతి చేసుకుని ఇష్టానుసారం వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వమే పచ్చజెండా ఊపినట్లయ్యింది. ఇదే అదునుగా మద్యం వ్యాపారులు మందుబాబుల బలహీనతను సొమ్ము చేసుకోవడానికి ఉన్న అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. -
త్వరలో ‘ఇంటర్‌సెప్టర్’ వాహనాలు
పెలైట్ ప్రాజెక్టు కింద ట్రాఫిక్ విభాగంలో ఒక వాహనం ప్రవేశం ‘ఇన్నోవా’కు నాలుగు వైపుల సీసీకెమెరాల ఏర్పాటు వాహనంలో డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే ఉంటారు {పత్యక్ష ప్రసారం కూడా చేస్తుంది సిటీబ్యూరో: నగరం పోలీసు శాఖకు త్వరలో ఇంటర్‌సెప్టర్ వాహనాలు రాబోతున్నాయి. పెలైట్ ప్రాజెక్ట్ కింద బుధవారం ట్రాఫిక్ విభాగంలో ఒక వాహనాన్ని ప్రవేశపెట్టారు. వీటి పని తీరు పరీక్షించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ వాహనాలను రంగంలోకి దింపుతారు. ఇంటర్‌సెప్టర్ వాహనాలుగా ఇన్నోవాలను వినియోగిస్తున్నారు. ఈ కార్లకు నాలుగు వైపుల నాలుగు సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. ఈ వాహనంలో డ్రైవర్‌తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే ఉంటాడు. ఇటు శాంతి భద్రతలు, అటు ట్రాఫిక్ విభాగంలోను ఇంటర్‌సెప్టర్ వాహనాలు ప్రవేశపెట్టబోతున్నారు. వాహనానికి నాలుగు వైపుల రహదారిపై ఉన్న దృశ్యాలను వాహనంలో అమర్చిన కంప్యూటర్లో ఆపరేటర్ చూసుకునే సదుపాయం ఉంది. అలాగే కంప్యూటర్లో 3-జీ ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం కూడా ఉంది. రహదారిపై దృశ్యాలను బషీర్‌బాగ్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కు నేరుగా ప్రత్యక్ష ప్రసారాలను సైతం అధికారులు వీక్షించే అవకాశం కల్పించారు. ట్రాఫిక్ విభాగంలో ఇలా... ఈ వాహనం రోడ్డుపై వేగంగా తిరుగుతూ నో పార్కింగ్, రాంగ్ పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపిన వాహనాలను చిత్రీకరిస్తుంది. కాలనీలు, అపార్ట్మెంట్ల ముందు, షాపింగ్ సెంటర్లు, సినిమా థియేటర్ల వద్ద, కళాశాలలు, పాఠశాలల వద్ద అక్రమంగా పార్కింగ్ చేస్తే ఈ వాహనం ఫొటోలు తీసి ఫుటేజీని భద్రపరుస్తుంది. దాని ఆధారంగా వాహనదారుడికి పోలీసులు చలాన్ పంపిస్తారు. శాంతి భద్రతల్లో ఇలా... ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, మత ఘర్షణలు, దాడులు, అల్లర్లు జరిగిన సమయంలో నిందితులను గుర్తించేందుకు ఈ వాహనం చాలా ఉపయోగపడుతుంది. నిందితుల వివరాలు చెప్పేందుకు ప్రత్యక్ష సాక్షులు భయపడతారు. అలాంటి సమయంలో ఈ వాహనం ఘటనా స్థలానికి చేరుకొని చాలు నాలుగు వైపులా ఉన్న సీసీకెమెరాల ద్వారా దృశ్యాలన్నీ రికార్డు చేస్తుంది. ఈ చిత్రాలు కోర్టులో సాక్ష్యాలుగా పని చేస్తాయి. దీంతో నిందితులు శిక్షల నుంచి తప్పించుకోలేరు. సమావశాలు, సభల వద్ద నుంచి... సమావేశం, సభలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో అసాంఘిక శక్తుల కదలికలను కనిపెట్టేందుకు ఈ వాహనాన్ని అక్కడికి పంపిస్తారు. అక్కడి దృశ్యాలను సీసీకెమెరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
19న జిల్లాకు ముఖ్యమంత్రి రాక
తిరుపతి సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 19న జిల్లాకు రానున్నారు. ఆయన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలుగుగంగ సీఈ సుధాకర్ సోమవారం తెలిపారు. తంబళ్ళపల్లె నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న పెలైట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా జిల్లాలోని ఏ ప్రాతంలోనైనా జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను ఇంటర్నెట్ సాయంతో పరిశీలించుకునే అవకాశం ఉంటుంది -
రేషన్‌కూ ఈ-పాస్!
శ్రీకాకుళం పాతబస్టాండ్:ప్రజాపంపిణీ విధానాన్ని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేయడం ద్వారా పేదలకు సరుకులను ఈ-పాస్ విధానంలోనే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి పెలైట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. వీటిలో శ్రీకాకుళం జిల్లా కూడా ఉండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ విధానం అమలుకు జిల్లాకు 1919 ఈ-పాస్, ఎలక్ట్రానికి కాటాల సెట్లు మంజూరు చేసింది. వీటిని రేషన్ డీలర్లకు అందజేస్తారు. ఈ యంత్రాలను సరఫరా చేసే టెండరును ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు. త్వరలో ఈ యంత్రాలు జిల్లాకు చేరనుండగా.. రెండు మూడు నెలల్లో పూర్తిగా ఆధునిక విధానంలోనే సరుకులు సరఫరా చేయనున్నారు. జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 7.90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 1989 రేషన్ డిపోల పరిధిలో ఉన్న ఈ కార్డుదారులకు ప్రస్తుతం మాన్యువల్ విధానంలో సరుకులు సరఫరా చేస్తున్నారు. పంపిణీ ప్రక్రియను ఇప్పటికే ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేయడం దాదాపు పూర్తి కావచ్చింది. కొత్త ఈ-పాస్ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించారు. తొలిదశలో ఈ పథకాన్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా రూ.49,710 విలువ చేసే ఈ పాస్, ఎలక్ట్రానిక్ కాటాల సెట్‌ను ప్రతి డీలరుకు అందజేస్తారు. పని చేసే విధానం ఈ-పాస్ యంత్రాల్లో రేషన్‌కార్డుల నెంబర్లు, కార్డుదారుల కుటుంబంలోని ఒకరి బొటనవేలి ముద్ర ముందుగానే నిక్షిప్తం చేస్తారు. సరుకుల పంపిణీ సమయంలో లబ్ధిదారుని రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయడంతోపాటు, బొటనవేలి ముద్ర తీసుకుంటారు. యంత్రంలో నిక్షిప్తమైన వాటితో అవి సరిపోలితే ఆ కార్డుకు అందజేయాల్సిన సరుకుల వివరాలతో ఒక స్లిప్ వస్తుంది. దాని ఆధారంగా ఎలక్రాటనిక్ కాటాలో సరుకులు తూచి లబ్ధిదారుడికి అందజేస్తారు. లబ్ధిదారులకు కష్టం ఈ-పాస్ విధానం అమల్లోకి వస్తే లబ్ధిదారులతో పాటు డీలర్లు కూడా గురికాక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలామంది డీలర్లపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే 500 కంటే ఎక్కువ రేషన్ కార్డులున్న డిపోలను విభజించి కొత్తవారికి డిపోలు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. వీటికి తోడు ఈ-పాస్ విధానం అమల్లోకి వస్తే సరుకుల పంపిణీలో ఇబ్బందులు తప్పవంటున్నారు. కాగా పేద లబ్ధిదారులు ఉపాధి కోసం నెలల తరబడి వలస వెళుతుంటారు. వారి తరఫున కుటుంబ సభ్యుల్లో ఎవరికి వీలుంటే వారు వెళ్లి సరుకులు తీసుకుంటుంటారు. కానీ ఈ-పాస్ విధానంలో ఎవరో ఒకరి వేలిముద్ర మాత్రమే నమోదై ఉంటుంది. అందువల్ల ప్రతి నెలా ఆ వ్యక్తి మాత్రమే వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. వలస వెళ్లిన వారికి, కూలి పనులకు వెళ్లేవారికి ఇది ఇబ్బందికరమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
పంచాయతీల్లో పవన విద్యుత్!
సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ఎత్తై ప్రాంతాల్లోని గ్రామాలు, తండాల్లో ఏర్పాటు మెదక్ జిల్లాలో పెలైట్ ప్రాజెక్టు అవసరమైతే పంచాయతీల ద్వారా నిధులిస్తామని సూచన కసరత్తు ప్రారంభించిన జెన్కో సాక్షి, హైదరాబాద్: తక్కువ విద్యుత్ విని యో గం ఉండే చిన్న పల్లెలు, ఆవాస ప్రాంతాలు, తండాల్లో పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం గుట్టలు, కొండలతో కూడిన ఎత్తై ప్రాం తాలను గుర్తించాలని.. సాధ్యాసాధ్యాలను, ప్రయోజనమెంత అనే అంశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. తొలుత తన నియోజకవర్గం గజ్వేల్‌లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ఏర్పాటు చేసి పరిశీలించాలని సూచించారు. తెలంగాణ లో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు ముందుకొచ్చిన గ్రీన్కో కంపెనీ ప్రతినిధులతో జరిపిన సంప్రదింపుల్లో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. భౌగోళికంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గుట్టలు, కొండలు విస్తరించి ఉన్నాయని... ఎత్తై ఈ ప్రాంతాల్లో గాలి వేగం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. జిల్లాల వారీగా పవన విద్యుదుత్పత్తికి సాధ్యమయ్యే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని.. కేవలం వీధి దీపాలు, రాత్రి పూట బల్బులు తప్ప విద్యుత్ గృహోపకరణాలు లేనటువంటి చిన్న పంచాయతీలను ఎంచుకోవాలని చెప్పారు. కొండలు, గుట్టల పరి సరాల్లోని తండాలు, చిన్న పంచాయతీల పరిధిలో ఈ ప్లాంట్లు నెలకొల్పితే ఎంత విద్యుత్ సరఫరా చేసే వీలుంది, ఎంత ప్రయోజనం ఉం టుందనే అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రయోగాత్మకంగా మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. అవసరమైతే పంచాయతీల ద్వారా ఈ యూనిట్లు నెలకొల్పేందుకు ఆర్థిక వనరులు సమకూరుస్తామని అధికారులకు సీఎం చెప్పారు. ఒక పల్లెలో ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుంది, ఎన్ని పల్లెల్లో పవన విద్యు త్ ఉత్పత్తికి అనువైన అవకాశాలున్నాయనే అంశాలను అధ్యయనం చేయాలని సూచించా రు. సీఎం ఆదేశం మేరకు అవసరమైన సమాచా రం సేకరణకు జెన్కో కసరత్తు ప్రారంభించింది. రెండు జిల్లాల్లో ఎక్కువ.. రాష్ట్రంలో ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పవన విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రైవేటు కంపెనీలు మాత్రం మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే గ్రీన్కో కంపెనీ మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో 750 ఎకరాల విస్తీర్ణంలో 200 మెగావాట్ల సౌర విద్యుత్‌తో పాటు విండ్ పవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అదే జిల్లాలోని ఆమనగల్లులో 150 మెగావాట్ల ప్రాజెక్టుకు తెలంగాణ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఎంవోయూ చేసుకుంది. దీంతో పాటు కొడంగల్‌లో 200 మెగావాట్ల పవన, 100 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు, మెదక్ జిల్లా కంగ్టిలో 200 మెగావాట్ల పవన, 100 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్కో కంపెనీ గతంలోనే ప్రతిపాదనలు సమర్పించింది. వీటితో పాటు మైత్రి సంస్థ రంగారెడ్డి జిల్లా పరిగిలో 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌కు ఎంవోయూ చేసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పవన ప్లాంటులోని ఒక్క యూనిట్‌తో (ఒక గాలి మర) గరిష్ఠంగా 2.4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దీంతో ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకునే లక్ష్య సాధనతో పాటు.. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ఇది మార్గంగా ఉపకరిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. -
భూమి లేదట..!
దళితులకు భూ పంపిణీ మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలేలా ఉంది. 2,096 కుటుంబాలను భూమి పొందేందుకు అర్హులుగా ఎంపిక చేశారు. కేవలం 9 మందికి మాత్రమే లబ్ధిచేకూర్చిన అధికారులు అప్పుడే ‘భూమి లేదు’ అన్న పాట అందుకున్నారు. ఈ తొమ్మిది మందికి 21 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇచ్చినందుకు రూ.1.14 కోట్లు ఖర్చయిన నేపథ్యంలో మిగిలిన 2,087 మందికి భూమి కొనివ్వడం అసాధ్యమనే భావనను అధికారులు ముందుకు తీసుకొస్తున్నారు. సాక్షి, ఖమ్మం: దళితులకు భూ పంపిణీ పథకం ముందుకు సాగడం లేదనేందుకు కళ్యాణి మాటలే నిదర్శనం. ఆరంభ శూరత్వంగా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించినా ఆ తర్వాత చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జిల్లాలో తొమ్మిది మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 22.14 ఎకరాలు పంపిణీ చేశారు. నాలుగు నెలలు గడిచినా మిగతా లబ్ధిదారులకు భూమి కొనుగోలు చేయలేదు. భూమిలేని దళితులకు మూడెకరాలు భూ పంపిణీ చేయాలని నూతన ప్రభుత్వం భావించింది. ఎంత ఖర్చు చేసైనా దళితులకు సాగు భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే ఎకరం భూమి జిల్లాలో రూ.5 లక్షలకు పైగా పలుకుతుండడంతో అధికారులు బిత్తరపోతున్నారు. 1/70 చట్టం ప్రభావంతో ఈ పథకాన్ని తొలుత ఖమ్మం రెవెన్యూ డివిజన్ వరకే వర్తింపజేశారు. డివిజన్లోని 17 మండలాల్లో ఒక్కో గ్రామం చొప్పున 17 గ్రామాలను పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో ఎన్ని ఎస్పీ కుటుంబాలు ఉన్నాయో సర్వే చేశారు. 6,487 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 4,391 కుటుంబాలకు భూ మి ఉండగా 2,096 కుటుంబాలకు భూమి లేదని నిర్ధారించారు. ప్రభుత్వానికి నివేదిక పంపారు. వీరికి తొలి విడతలో భూ పంపిణీ చేయాలి. భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న రైతులు, కూలీలు ఇలా కేటగిరీల వారిగా పేర్కొంటూ అర్హుల జాబితా సిద్ధం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15న ప్రభుత్వం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని జిల్లా యంత్రాం గాన్ని ఆదేశించింది. హడావిడిగా జిల్లాలో కేవలం తొమ్మిది మందికి మాత్రమే 21 ఎకరాలు భూమి పంపిణీ చేశారు. రూ. 1.14 కోట్లు దీనికి ఖర్చు చేశారు. ఆ తర్వాత అర్హులు తమకు కూడా భూ పంపిణీ చేస్తారని ఆశలు పెట్టుకున్నారు. వారిని జాబితాకే పరిమితం చేయడంతో భూ పంపిణీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. భూమి దొరకటం లేదనే సాకుతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఎక్కడ చూసినా రూ.లక్షల్లో భూమి ఖమ్మం రెవెన్యూ డివిజన్లో 16 మండలాలు నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. సారవంతమైన ఈ భూములు రూ.లక్షల విలువ పలుకుతున్నాయి. ఏ గ్రామ దళితులకు ఆ గ్రామంలోనే భూమి కొనుగోలు చేసి ఇవ్వాలనే నిబంధన ఉండటంతో ఇక్కడ భూముల రేట్లను చూసి అధికారులు నివ్వెరపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో వైరా మండలం గొల్లెనపాడు, ముదిగొండ మండలం గంధసిరి, కూసుమంచి మండలం నేలపట్ల గ్రామాల్లో ఎకరం రూ.5 లక్షల వరకు వెచ్చించి భూమి కొనుగోలు చేసి అర్హులకు పంచారు. ఖమ్మం డివిజన్ అంతా రూ.లక్షల్లో ఎకరం భూమి రేటు ఉండడంతో అధికారులు మాత్రం భూమి దొరకడం లేదని తప్పించుకుంటున్నారు. భూమి కొనుగోలుపై అధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2,096 కుటుంబాలకు ఎలా ఇస్తారు..? ఇప్పుడే భూమి దొరక్కపోతే జిల్లాలో అర్హులైన 2,096 మంది లబ్ధిదారులకు భూ పంపిణీ ఎలా చేస్తారన్నది ప్రశ్నార్థకం. ఈ సంఖ్య ప్రకారం అర్హులైన వారికి తొలి దశ కింద పంపిణీ చేయాలంటే 6 వేల ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేయాలి. కానీ భూమి దొరకడం లేదని అధికారులు చేతులెత్తేయడంతో దళితుల ఆశలు అడియాశలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సంబంధిత అధికారులు గ్రామాల వారీగా భూముల వివరాలు, అమ్మకానికి పెట్టే రైతుల సమాచారం గ్రామస్థాయిలో తెలసుకొని వారికి నిర్ణీత రేటు చెల్లించి భూమి అమ్మాలని ప్రోత్సహించాలి. కానీ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఆ దిశగా అధికారులు ముందుకు సాగటం లేదు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన భూమి పట్టాలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. దళితులను ఈ భూమిలో సాగుకు ప్రోత్సహించలేదు. కనీసం వచ్చే ఖరీఫ్ నాటికైనా తమకు ఇచ్చిన భూమిని సాగు చేసుకునేందుకు సర్కారు సహాయం అందించాలని లబ్ధిదారులు వాపోతున్నారు. -
బండికీ ఆధార్ం
ఆర్టీఏ అనుసంధాన ప్రక్రియ పెలైట్ ప్రాజెక్టుగా గుడివాడ ఎంపిక సోమవారం నుంచి ఇంటింటి సర్వే డ్వాక్రా మహిళలతో నిర్వహణ గుడివాడ : వాహనాల భద్రత, వ్యక్తిగత భద్రత పేరుతో ఆర్టీఏ చేపట్టిన వాహనాలకు ఆధార్ అనుసంధానం పెలైట్ ప్రాజెక్టుగా గుడివాడ ఎంపికయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండుచోట్ల పెలైట్ ప్రాజెక్టులుగా ఎంచుకోగా రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల పట్టణాన్ని, కోస్తా జిల్లాల్లో గుడివాడ పట్టణాన్ని పెలైట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశారు. ఇందుకోసం సోమవారం నుంచి డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 36 వార్డుల్లో సర్వే.. గుడివాడ పట్టణాన్ని ఆధార్ అనుసంధానానికి పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో ఆర్టీఏ శాఖ ఉన్నతాధికారులు సైతం కదలి వచ్చి యుద్ధప్రాతిపధికన సర్వే పనులపై కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర జాయింట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ కమిషనర్ ప్రసాదరావు స్వయంగా వచ్చి డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇచ్చారు. గుడివాడ పట్టణంలో ఉన్న 36 వార్డుల్లో ఈసర్వే చేయాల్సి ఉంది. ప్రతి వార్డుకు ఇద్దరు చొప్పున డ్వాక్రా మహిళలు ఇంటింటి సర్వేచేసి వాహనం నంబరు, వాహనదారుని పేరు, వాహన దారుడి ఆధార్ నంబరు, ఫోన్ నంబరు సేకరించాల్సి ఉంది. అలాగే లెసైన్సు ఉంటే లెసైన్సు దారుడు పేరు లెసైన్సు నంబరు లేదా రిఫరెన్స్ నంబరు, లెసైన్స్ దారుడి ఫోన్ నంబరు వీరు సేకరించాలి. ఒక్కో వాహనదారుడి వివరాలు సేకరించినందుకు రూ.8 చెల్లిస్తుంది. వివరాలను ఏరోజుకు ఆరోజు కంప్యూటరీకరించాల్సి ఉంది. ఇలా ప్రతి అడ్రస్సు కంప్యూటరీకరించినందుకు మరో రూ.3 చెల్లిస్తారు. ఉపయోగం ఏమిటంటే.. ఆధార్ అనుసంధానం చేయడం వల్ల వాహనం నంబరు ఆన్లైన్లో చూడగానే యజమాని పూర్తి వివరాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కానీ వాహనానికి ఆధార్ అనుసంధానం చేస్తే ఆదాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని వాహన యజమానులు అనుమానిస్తున్నారు. దీంతో డ్వాక్రా సభ్యులకు వాహన యజమానులు ఎంతవరకు సహకరిస్తారో వేచిచూడాల్సిందే. -
పొదుపు కాంతులు
ఎల్ఈడీ బల్బుల వినియోగంలో గిరిజనుల ఘనత గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్సుకు సిఫారసు పాడేరు: విశాఖ జిల్లా పాడేరు మండలం డి.గొందూరు, బర్సింగి పంచాయతీల్లో 1002 మంది విద్యుత్ వినియోగదారులు ఎల్ఈడీ బల్బులను అమర్చుకొని ప్రపంచ స్థాయిలోనే రికార్డు సాధించారని పంచాయతీ విస్తరణ అధికారి(పీఈవో) కె.వెంకన్నబాబు తెలిపారు. ప్రభుత్వం విద్యుత్ పొదుపునకు ప్రాధాన్యమిస్తోంది. పెలైట్ ప్రాజెక్టుగా నాలుగు జిల్లాల్లో రూ.10కే ఎఈడీ బల్బులు పంపిణీకి నిర్ణయించింది. ఈ కార్యక్రమం అమలు కాకమునుపే విశాఖ జిల్లాలోని మారుమూల గిరిజన పంచాయతీల్లోని ఆదివాసీలు ఎల్ఈడీ బల్బుల వినియోగంతో విద్యుత్‌ను పొదుపు చేయడం విశేషం. ఈ మేరకు గురువారం ఆయా గ్రామాలను పీఈవో సందర్శించారు. ఎల్ఈడీ బల్బులు వినియోగిస్తున్న గిరిజనులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గతంలో సీఎఫ్ఎల్ బల్బులను నాతవరం మండలం ఎస్.బి.పట్నంలో అమర్చినందుకు తెలుగుబక్ఆఫ్ రికార్డుల్లో నమోదయిందన్నారు. అదే తరహాలో ఈ రెండు పంచాయతీల గిరిజనులు కూడా ఎల్ఈడీ బల్బులను వినియోగించి విద్యుత్ పొదుపుకు స్పూర్తిగా నిలిచారని తెలిపారు. దీనికి ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చేలా గిన్నీస్‌బుక్ ఆఫ్ రికార్డ్సు జ్యూరీ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. డి.గొందూరు, బర్సింగి సర్పంచ్‌లు సీదరి రాంబాబు, సీదరి పార్వతమ్మ, న్యాయవాది కొండలరావులను అభినందించారు. -
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
అల్లూరు: కొంతకాలంగా అల్లూరు మండలంలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన అల్లూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పెలైట్ ప్రాజెక్ట్ నిర్మాణం ఎంతో కాలంగా అసంపూర్తిగా ఉందని, త్వరలోనే అవసరమైన నిధులు మంజూరు చేయించి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ప్రజాసేవ విషయంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా పనిచేసి ప్రజాభిమానం చూరగొనాలన్నారు. ఎంపీ నిధులుగా ఏటా వచ్చే రూ.5 కోట్లలో ఎక్కువ శాతం కావలి నియోజకవర్గ అభివృద్ధికే ఖర్చు చేస్తున్నానని చెప్పారు. కొద్ది రోజుల క్రితమే అల్లూరు మండలానికి రూ.75 లక్షలు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అల్లూరు అభివృద్ధికి కృషి :అల్లూరు మండల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. మండలంలోని హాస్టళ్లకు రూ.6 లక్షలతో మరమ్మతులు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలు, హాస్టళ్లలో మరుగుదొడ్లు లేక విద్యార్థినులు అవస్థ పడుతున్నారని, వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి : అర్హత కలిగిన వారందరికీ పింఛన్ల పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి పలువురు ఎన్నో అపోహలతో తమ వద్దకు వస్తున్నారన్నారు. 65 ఏళ్లు నిండిన వారికే పింఛన్ ఇస్తామని ప్రభుత్వం ఇటీవల విడుదల చేసి ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ప్రజలు అమోయమానికి గురవుతున్నారన్నారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా పింఛన్ పథకం అమలు చేయాలన్నారు. అల్లూరు-దగదర్తి మండలాలకు సంబంధించి గతంలో ఉన్న బస్సును తొలగించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులతో మాట్లాడి ఆ బస్సును పునరుద్ధరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు దండా పద్మావతి, మండల పరిషత్ అధ్యక్షురాలు గంగపట్నం మంజుల, ఎంపీడీఓ కనకదుర్గాభవాని, అల్లూరు సర్పంచ్ చంద్రలీలమ్మతో పాటు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, యువజనవిభాగం కన్వీనర్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఉస్మాన్‌షరీఫ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బీద రమేష్‌బాబు, ఎ.బాలకృష్ణంరాజు, పి.రత్తయ్య, ఎన్వీ సాయికుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
సుజల.. దాహం తీర్చేనా?
ఆరుగురుండే కుటుంబానికీ 20 లీటర్లే! చాలకపోతే ఎలా సర్దుకోవాలి? ఎన్టీఆర్ సుజల స్రవంతి పెలైట్ ప్రాజెక్టుగా కుప్పం కుప్పం నియోజకవర్గంలో మొత్తం 16 ప్లాంట్లు మంజూరు స్క్రాచ్ కార్డు సిస్టమ్‌తో శుద్దినీరు పంపిణీ రోజుకు ఒక్కసారి మాత్రమే నీళ్లు వైద్యుల సూచన ప్రకారం మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 6 లీటర్ల నీరు తాగాలి. ప్రతీ ఇంట్లో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారనుకున్నా కుటుంబంలో ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరికి రోజుకు 36 లీటర్ల నీరు అవసరం. కానీ చంద్రబాబు సర్కారు మాత్రం స్క్రాచ్‌కార్డు అమలు చేసి రోజుకు 20 లీటర్లు మాత్రమే ఇస్తుందట. అంతకు మించి చుక్కనీరు ఇవ్వదట. దీనికి ‘స్కాచ్ సిస్టమ్’ అమలు చేస్తున్నారు. తాగే మంచినీళ్లకు కూడా రేషన్ విధిస్తుంటే ‘సుజల’ ద్వారా జనాల దప్పిక ఏ మేరకు తీరుతుందో ఇట్టే తెలుస్తోంది. చిత్తూరు(టౌన్): జిల్లాలో ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పథకాన్ని ప్రభుత్వం చేపడుతోంది. 14 నియోజకవర్గాలకు కలిపి రూ.53 కోట్లు కేటాయించగా ఒక్కకుప్పం నియోజకవర్గంలో మాత్ర మే రూ.20 కోట్లతో పనులు చేపడుతున్నారు. నియోజకవర్గానికో చోట ఈ పథకాన్ని ఏర్పాటు చేసి ఆక్టోబర్ 2న జిల్లా వ్యాప్తంగా వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం యోచించింది. అయితే తక్కువ సమయం ఉండడంతో అది సాధ్యం కాదనుకుని తొలుత సీఎం నియోజకవర్గమైన కుప్పంలోని దళవాయికొత్తపల్లె చెరువులో పెలై ట్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న ప్లాంటును మాత్రమే సీఎం చేత అక్టోబర్ 2న ప్రారంభించేట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిం ది. ఈ మేరకు కుప్పం నియోజకవర్గంలో రూ.20 కోట్లతో 16 ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక ప్లాంటుకు గంటకు 20 వేల లీటర్ల నీరు అవసరం. దానికోసమే ఒక్కో ప్లాంటు పరిధిలో విధి గా అయిదేసి బోర్లను డ్రిల్ చేస్తున్నారు. తొలుత దళవాయికొత్తపల్లె చెరువులో ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ప్లాంటును పెలైట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక్కడ నాలుగు బోర్లు వేశారు. అయిదో బోరు డ్రిల్ చేయనున్నారు. జిల్లాలోని మిగిలిన 13 నియోజకవర్గాల్లో ప్లాంట్ల ఏర్పాటును స్విస్ టెక్ కంపెనీ చేపడుతోంది. కుప్పంలో మాత్రం ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా పనులు చేపడుతున్నట్టు ఆ కంపెనీ కన్సల్టెంట్ శ్రీనివాస్ తెలిపారు. 20 గ్రామాలకు ఒక ప్లాంటు కుప్పంలో అమలు చేస్తున్న ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద 20 గ్రామాలకు ఒక ప్లాం టు చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ మినీ ట్యాంకులు నిర్మిస్తారు. ప్లాంటులో శుద్దిచేసిన నీటిని ట్యాంకర్ల ద్వారా దానిపరిధిలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన మినీ ట్యాంకుల్లో నింపుతారు. ఆ తర్వాత మినీట్యాంకుల ద్వారా అన్ని గ్రామాల ప్రజలకు కొత్త టెక్నాలజీ ద్వారా సరఫరా చేస్తారు. దీనికోసం ఒక్కో ప్లాంటు పరిధిలో నాలుగేసి ట్రాక్టర్లను కూడా కొనుగోలు చేయనున్నారు. స్క్రాచ్ సిస్టమ్‌తో నీటి సరఫరా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద కొత్త టెక్నాలజీని తొలుత కుప్పం నుంచే అవలంబించనున్నారు. నీటిని స్క్రాచింగ్ విధానంలో సరఫరా చేస్తారు. దానికోసం ముందుగా స్క్రాచ్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్డు ద్వారా ఒకసారి స్క్రాచ్‌చేస్తే 20 లీటర్లు మాత్రమే ట్యాంకు నుంచి విడుదలవుతుంది. ఇలా రోజులో ఒక్కసారి మాత్రమే స్క్రాచ్‌కార్డు పనిచేస్తుంది. అంటే రోజుకు ఒక కుటుంబానికి 20 లీటర్లు మాత్రమే ఇస్తారు. ఈ నీరు ఎక్కువమంది సభ్యులున్న కుటుంబానికి సరిపోదని ప్రజలు అంటున్నారు. తాగే మంచినీటిని కూడా చాలీచాలకుండా ఇవ్వ డం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం ప్రజల దాహార్తిని ఏమాత్రం తీర్చదని అంటున్నారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా రాజంపేట
రాజంపేట: రాజంపేట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికైన నేపథ్యంలో మంగళవారం మన్నూరు ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన వార్డు సభల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజంపేట మున్సిపాలిటీని పెలైట్ ప్రాజెక్టుగా గుర్తించి, ప్రగతి పథంలో పయనించేందుకు ప్రణాళిక సిద్ధం చే స్తోందన్నారు. ఈనెల 10న పూర్తి నివేదికను మున్సిపాలిటీ కలెక్టర్‌కు అంద జేస్తుందన్నారు. దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. అక్టోబర్ 2 నుంచి పింఛన్ వెయ్యిరూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటిన్ల ద్వారా మున్సిపాలిటీల్లో ఐదు రూపాయలకే భోజన వసతి కల్పిస్తామన్నారు. స్పెషలాఫీసర్, ఆర్డీఓ ఎం.విజయసునీత మాట్లాడుతూ 13జిల్లాల్లో రాజంపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు పెలైట్ ప్రాజెక్టుపై ఎంపిక చేసిందన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై ఈనెల 10న కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామన్నారు. ఈనెల 16న సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో ఒక సంస్థను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తారని ఆమె వివరించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ ఎస్.ఫజులుల్లా, తహశీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు పత్తిపాటి కుసుమకుమారి, టీడీపీ నాయకులు సుధాకర్, ఉమామహేశ్వరరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. -
వరాల వాన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఇందూరుకు వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాపై వరాల వాన కురిపించారు. నాలుగేళ్లలో అన్ని పనులు సాధించి తీరుతామని ప్రజలకు భరోసా ఇచ్చారు. నగరంలో నిమ్స్ తరహాలో మెగా ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని, తెలంగాణలోనే దీనిని తొలి పెలైట్ ప్రాజెక్టుగా తీసుకుంటామని చెప్పారు. జక్రాన్‌పల్లిలో విమానాశ్రయ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆర్మూరులో కీలక అంశంగా ఉన్న ఎర్రజొన్నల బకాయిలు రూ.10.83 కోట్లు వారం రోజులలో చెల్లించాలని అధికారులను ఆదేశించారు. సాగు నీరు, వైద్యం, పర్యాటక, కనీస సౌకర్యాల కల్పనపై స్పష్టమైన హామీ ఇచ్చారు. జిల్లాలోని రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్కు కట్టబెట్టిన ప్రజల కోసం ఏమై నా చేస్తానన్నారు. గురువారం ఆయన ఆర్మూర్, అంకాపూర్, నిజామాబాద్‌లో పర్యటించారు. ఆరేళ్ల ‘ఎర్రజొన్నల’కు మోక్షం ఆరేళ్లుగా నలుగుతున్న ఎర్రజొన్నల వివాదానికి కేసీఆర్ ఎట్టకేలకు తెరదించారు. వారం రోజులలో ఎర్రజొన్నల బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఈ మేరకు ఉత్తర్వులు కూడ జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు రైతుల ఇళ్లకే వెళ్లి బకాయిలు చెల్లించాలని సూచించారు. దీంతో ఆరేళ్ల క్రితం పోలీసు కాల్పులకు దారితీసిన ఎర్రజొన్నల బకాయిలకు మోక్షం కలిగినట్లయ్యింది. ఆర్మూరులో రూ.114.11 కోట్లతో శంకుస్థాపన చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని ఏడాదిలో పూర్తి చేసి తానే ప్రారంభిస్తానన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు జిల్లాలోని ఆటోలు, ట్రాక్టర్లు, ట్రాక్టర్ ట్రాలీల కు రవాణా పన్ను రద్దు చేస్తామన్నారు. వచ్చే దసరా, దీపావళి పండగల మధ్యలో వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున ఫించను అందజేస్తామన్నారు. గత పాలకుల హయాంలో జరిగిన అవినీతి గుట్టు రట్టయ్యాక, జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.3.50 లక్షలు వెచ్చించి రెండు పడక గదుల పక్కా ఇళ్లను నిర్మిస్తామని, మొదట ఆర్మూరు, అంకాపూర్‌లో మోడల్ కాలనీలను రూపొందిస్తామని సీఎం స్పష్టం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఈ పంద్రాగస్టు నుంచే పంపిణీ చేస్తామన్నారు. కళ్యాణలక్ష్మి పథకం కింద పెళ్లి చేసుకునే ప్రతి గిరిజన, దళిత యువతికి ప్రభుత్వం రూ.50 వేలు అందజేస్తుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక కార్యాచరణ నిజాంసాగర్, గుత్ప, అలీసాగర్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించిన సీఎం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిం చనున్నట్లు ప్రకటించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు ప్రాంతాలైన ఆర్మూర్, వేల్పూర్, జక్రాన్‌పల్లి మండలాలకు సాగునీరు అం దిస్తామన్నారు. అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచి బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని వేల్పూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లి, ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మాక్లూర్ మండలంలోని 18 గ్రామాలకు సాగునీరందే ఏర్పాటు చేస్తామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులపైనా దృష్టి సారిం చనున్నామన్నారు. ప్రధానంగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి వ్యవసాయరంగాన్ని పటిష్టం చేయనున్నామన్నారు. నగరంపైనా దృష్టి జిల్లా కేంద్రంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ), బైపాస్ రహదారి అసంపూర్తిగా ఉండటం నగర ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజాప్రతినిధులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఆ రెండు ప్రాజెక్టులను సత్వరంగా పూర్తి చేసేలా మార్గ నిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమాలలో కేసీ ఆర్ వెంట రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, షకీల్ అహ్మద్, బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీలు పాతూరి సుధా కర్‌రెడ్డి, డి.రాజేశ్వర్, సీఎంఓ కార్యదర్శి స్మితసబర్వాల్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నగర మేయర్ ఆకుల సుజాత ఉన్నారు. -
ఇక వెలుగులే వెలుగులు!
అక్టోబర్ రెండు నుంచి నిరంతర విద్యుత్ సరఫరా కేంద్రం పెలైట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ఎంపిక గృహావసరాలకు తొలి ప్రాధాన్యం వ్యవసాయం, పరిశ్రమలకు ఇచ్చేందుకు కృషి విజయవాడ : జిల్లా వాసులకు త్వరలో కరెంటు కష్టాలు తీరనున్నాయి. అక్టోబర్ రెండో తేదీ నుంచి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎస్పీడీసీఎల్) అధికారులు చేస్తున్నారు. దేశంలో విద్యుత్ సమస్యను తీర్చి నిరంతరంగా కరెంటు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 24 ఁ 7 విద్యుత్ సరఫరా చేసేందుకు ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లను ప్రయోగాత్మకంగా (పెలైట్ ప్రాజెక్టు) ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు రాష్ట్రాల్లో నిరంతర సరఫరాకు అవసరమైన విద్యుత్‌ను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. 10.50 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం జిల్లాలో 13.82 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. నిత్యం 10.50 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. వేసవిలో జిల్లాలో 13.5 మిలియన్ యూనిట్లు అవసరం కాగా, అందులో నగరానికి సుమారు ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జిల్లా అంతటికీ విద్యుత్ ఇవ్వకపోయినా ఎంపిక చేసిన నగరాల్లో విజయవాడ ఉండడంతో నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుందని భావిస్తున్నారు. ఆచరణలో సాధ్యమేనా? గత వేసవిలో జిల్లాలో 12 గంటలు, నగరంలో ఐదు గంటలు విద్యుత్ కోతలు విధించారు. ఇప్పటికీ గ్రామాల్లో వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ నాలుగైదు గంటలకు మించి ఇవ్వడం లేదు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి నిరంతర విద్యుత్ సరఫరా అంటే ఎంతమేరకు సాధ్యమనే ప్రశ్న ఉదయిస్తోంది. అవసరమైన అదనపు విద్యుత్‌ను నేషనల్ గ్రిడ్ నుంచి మన రాష్ట్రానికి కేటాయిస్తేనే ఇక్కడ నిరంతర సరఫరా సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు అవకాశాలున్నాయి నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు నగరాన్ని ఎంపికచేసిన మాట వాస్తవమే. అందుకు సరిపడా మౌలిక సదుపాయాలు మన వద్ద ఉన్నాయి. వేసవిలో పెరిగే విద్యుత్ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. నిరంతర విద్యుత్ సరఫరా వల్ల వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడదు. వాడుకున్న విద్యుత్‌కు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది వ్యవసాయ, గృహావసర ఫీడర్లను మాత్రమే వేరుచేస్తే సరిపోతుంది. -ఎన్.వెంకటేశ్వర్లు, డీఈ -
ఇక పల్లెల్లో సౌర వెలుగులు!
- కరెంటు కొరతకు అధిగమించేందుకు సర్కార్ ప్లాన్ - సిద్దిపేట కేంద్రంగా ప్రయోగం - 3 గ్రామాల్లో పెలైట్ ప్రాజెక్ట్ - ఫలిస్తే తెలంగాణ అంతటా అమలు సిద్దిపేట రూరల్: తెలంగాణను పట్టిపీడిస్తున్న కరెంటు కొరతను అధిగమించేందుకు సర్కార్ ప్లాన్ సిద్ధం చేసింది. గుజరాత్ లాగా మన రాష్ట్రంలోనూ సౌర విద్యుత్‌తో పల్లెల్లో వెలుగులు నింపాలని భావిస్తోంది. ఇందుకోసం సిద్దిపేట కేంద్రంగా ప్రయోగం ప్రారంభించింది. సోలార్ ప్రాజెక్టు ప్రయోగం కోసం సిద్దిపేట మండలంలోని మూడు గ్రామాలను ఎంపిక చేసిన సర్కార్ నాలుగు దశల్లో ఇక్కడ ప్రయోగాలు చేసి ఫలితాలను సమీక్షించాక సౌరకాంతులను తెలంగాణ అంతటా ప్రసరింపజేయాలని భావిస్తోంది. గుజరాత్‌ను ఆదర్శంగా... బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ సర్కార్ కరెంటు కొరతను అధిగమించడమే ప్రధాన లక్ష్యంగా ఎం చుకుంది. ఇందుకోసం గుజరాత్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని సోలార్ ప్రాజెక్టు చేపట్టింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సూచన మేరకు సిద్దిపేట కేంద్రంగా నాబార్డ్, మెడ్క్యాబ్లఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్టు చేపట్టిన అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. సోలార్ ప్రయోగాలకు వేదికలుగా నిలిచిన సిద్దిపేట మండలం ఎల్లుపల్లిలో ఆండ్రోమెడ సోలార్ పవర్ ప్యాక్ కంపెనీ, బంజారుపల్లిలో టాటా సోలార్, కోదండరావుపల్లిలో సైబర్ మోషన్ కంపెనీలు సోలార్ పరికరాలను అమర్చడం, సరఫరా చేయడం బాధ్యతలను స్వీకరించాయి. ఈ క్రమంలోనే ఆయా కంపెనీల ప్రతినిధులు శనివారం గ్రామాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీరికి విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయ తదితర శాఖల అధికారులు సహకరిస్తున్నారు. తొలిదశలో సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసి సౌర శక్తితో తయారైన విద్యుత్‌ను గ్రామాల్లోని అన్ని ఇళ్లకు సరఫరా చేస్తారు. ఈ ప్రయోగ ఫలితాన్ని పరిశీలించిన అనంతరం రెండో దశలో గ్రామంలోని వ్యవసాయ బావుల వద్ద సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసి పంపుసెట్లకు సౌరశక్తిని సరఫరా చేస్తారు. మూడో దశలో ఉత్పత్తి చేసిన సౌర శక్తిని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ద్వారా సరఫరా చేసే విధానాన్ని అమలు పరుస్తారు. ఈ మూడు దశల అనంతరం ఏవైనా లోపాలు తలెత్తితే వాటిని సవరించి పక్కాగా సౌర విద్యుత్‌ను తయారు చేసి గ్రామంలోని అన్ని విద్యుత్ అవసరాలకు సరఫరా చేస్తారు. ఈ మూడు గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్‌లు విజయవంతమైన అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు దశల వారీగా విస్తరించడానికి నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు సోలార్ కంపెనీల ప్రతినిధులు చర్చలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని విద్యుత్ వినియోగంపై సర్వే ప్రారంభమైంది. 15 రోజుల్లో ఈ సోలార్ పవర్ పెలైట్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. -
విద్యుత్ ప్రమాదాల నివారణకు కదిలిన సర్కార్
ప్రత్యేక కార్యాచరణతో ముందుకు.. - పెలైట్ ప్రాజెక్ట్ కింద గజ్వేల్ ఎంపిక - వెల్లడించిన ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి - ఎర్తింగ్ లోపాల నివారణకు మండలానికో రూ. లక్ష - సబ్స్టేషన్లను సందర్శించిన సీఎండీ గజ్వేల్: పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద సొంత మరమ్మతుల కారణంగా జిల్లాలో రైతులు పిట్టల్లా రాలిపోతున్న దుస్థితిపై సర్కారు ఎట్టకేలకు దృష్టిసారించింది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పరిస్థితి అధ్వానంగా ఉండటంతో ఈ నియోజకవర్గాన్ని పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి పూర్తి స్థాయిలో ప్రమాదాల నివారణకు కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 15న జిల్లాలోని సమస్య తీవ్రతను ఎత్తిచూపుతూ ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో స్పందించిన ఎస్పీడీసీఎల్ (సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) సీఎండీ రఘుమారెడ్డి బుధవారం గజ్వేల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 33/11కేవీ, 133/33కేవీ సబ్‌స్టేషన ఆవరణలోని ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల నివారణకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పంటపొలాల్లో వేలాడుతున్న స్తంభాలు, వైర్లను సరిచేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతామన్నారు. మరోవైపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ లోపాల నివారణకు మండలానికో లక్ష రూపాయలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని ఏఈ కార్యాలయాల్లో ఫిర్యాదుల రిజిష్టర్‌ను నిర్వహిస్తామని తెలిపారు. రైతులు, ప్రజలు ఎవరైనా తమ ఫిర్యాదును నమోదు చేస్తే పరిశీలన జరిపి వారంరోజుల్లో నివారణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతులు సొంతంగా మరమ్మతులు చేసి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని కోరారు. సిబ్బంది కొరత వల్ల గ్రామాల్లో ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవమేనని వెల్లడించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. మరోవైపు ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాల్లో వేగంగా సేవలందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. రైతులు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వచ్చిన వెంటనే రెండుగంటల్లోపు దానిని మరమ్మతు చేయించి ఇవ్వడం లేదా కొత్త ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం చేస్తామన్నారు. మరమ్మతు కేంద్రాల్లో సేవలకు రైతులు ఒక్కరూపాయి కూడా ఇవ్వొద్దని, ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. గజ్వేల్‌లో లోడింగ్, అన్లోడింగ్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేయగా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ రాములు, డీఈ యాదయ్య, గజ్వేల్ ఏడీఈ జగదీష్, ఏఈ అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
మెరుగువాడలు
పేదలవాడల్లో మార్పునకు శ్రీకారం చుట్టనున్న జీహెచ్ఎంసీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యం సీఎం ఆదేశాలతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు పెలైట్ ప్రాజెక్టుకు కసరత్తు రూ. 624 కోట్లతో అంచనా మురికివాడల రహితంగా గ్రేటర్ హైదరాబాద్ రూపుదిద్దుకోనుంది. డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం.. మౌలిక వసతులు మెరుగుపర్చడం ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. నియోజకవర్గానికో మురికివాడను పెలైట్ ప్రాజెక్టు కిందకు తీసుకురానున్నారు. పెలైట్ ప్రాజెక్టు అమలుకు రూ. 624 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల హామీల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌ను మురికివాడల రహిత నగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదల వాడల్లో పక్కా ఇళ్లు నిర్మించడంతో పాటు మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో వివిధ పథకాల కింద పక్కా ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటన్నింటినీ పక్కనబెట్టి స్లమ్ ఫ్రీ సిటీగా మార్పు చేసేందకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు అధికారులు పనులు వేగవంతం చేశారు. పెలైట్ ప్రాజెక్టు కింద ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో మురికివాడను ఎంపిక చేసే పనిలో పడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు మౌళిక వసతులు కల్పించనున్నారు. తాజా గణాంకాల మేరకు గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో 1476 స్లమ్స్ ఉన్నాయి. వీటిని మూడు రకాలుగా (1. ఇన్‌సిటు రీ డెవలప్మెంట్ 2. ఇన్‌సిటు అప్‌గ్రేడేషన్ 3. రీ లొకేషన్లుగా) విభజించారు. తొలి దశలో రీ లొకేషన్ మినహాయించి మిగతా రెండు విధానాలను నియోజకవర్గానికి ఒక్కో స్లమ్‌ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోనున్నారు. ఇందుకుగాను దాదాపుగా రూ. 648.24 కోట్లు ఖర్చవుతుందని ప్రా థమికంగా అంచనా వేశారు. ప్రభుత్వ ఆమోదంతో దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. గతంలో చేపట్టిన జేఎన్ఎన్యూఆర్ఎం, రాజీవ్ ఆవాస్‌యోజన(రే) పథకాల్లో ఒక్కో ఇంటికి వ్యయ పరిమితి ఉండగా.. స్లమ్ ఫ్రీ లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి పరిమితి పేర్కొనలేదు. రెండు బెడ్రూమ్ల ఇంటి నిర్మాణానికి దాదాపు రూ. 6.55 లక్షలు అవుతుందని అంచనా. రే పథకం ద్వారా ఇళ్లకు రూ. 5 లక్షల వరకు కేంద్రం మంజూరు చేస్తుంది. అదనపు వ్యయాన్ని రాష్ట్రప్రభుత్వం భరించినా ఆ మేరకు కేంద్రం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసే స్లమ్స్‌లో ఎదురయ్యే సాదకబాధకాలను పరిగణనలోకి తీసుకొని.. తదుపరి చర్యలు తీసుకోనున్నారు. పెలైట్ ప్రాజెక్టులో పొందుపర్చిన అంశాలు ఇలా ఉన్నాయి. నగరంలో ఏ గృహనిర్మాణ పథకం చేపట్టినా పలు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. స్లమ్ ఫ్రీ సిటీలోనూ కాలనీల స్వరూపం మారే అవకాశం ఉన్నా ప్రజల నుంచి సహకారం ఎంతవరకు ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. స్లమ్స్‌లో తక్కువ విస్తీర్ణంలో ఇళ్లున్నవారు... ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లున్న వారు ఉన్నారు. కొత్త గృహాల్లో అందరికీ ఒకే విధంగా కేటాయించనుండడంతో ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు ఉన్నవారు ఒప్పుకునే అవకాశాల్లేవు. రే పథకంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అందరికీ ఇండి పెండెంట్ ఇళ్లు ఇవ్వడం న గరంలో సాధ్యమయ్యేలా లేదు. అంతస్తుల్లో ఫ్లాట్లంటే ఒప్పుకునేందుకు ముందుకొచ్చేదీ అనుమానమే. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఈ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తాయో వేచి చూడాలి. ప్రతిపాదించిన మూడు విధానాలు 1. ఇన్‌సిటు రీ డెవలప్మెంట్: స్లమ్‌లోని ఇళ్లన్నింటినీ కూల్చివేసి కొత్తగా నిర్మించడం. అందరికీ సరిపడినన్ని ఇళ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించడం. 2. ఇన్‌సిటు అప్‌గ్రెడేషన్: ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేయకుండా.. ఉన్న ఇళ్లకే అదనపు నిర్మాణాలు చేసి అభివృద్ధి పరచడం. మౌలిక సదుపాయాలు కల్పించడం. 3.రీ లొకేషన్: సమీపంలో ప్రమాదకర పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇతర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వడం. వారిని వేరే ప్రాంతానికి తరలించడం ద్వారా ఉపాధి కోల్పోయే వారి జీవనోపాధి కల్పించడం. పైలట్ స్లమ్స్ ఎంపిక... నియోజకవర్గానికి ఒక స్లమ్ చొప్పున ఇన్‌సిటు రీ డెవలప్మెంట్ అంచనా వ్యయం రూ. 18.01 కోట్లు. 24 నియోజకవర్గాలకు వెరసి 24 స్లమ్స్ రీ డెవలప్మెంట్కు 18.01్ఠ24 = రూ. 432.24 కోట్లు. నియోజకవర్గానికి ఒక స్లమ్ చొప్పున ఇన్‌సిటు అప్‌గ్రెడేషన్ అంచనా వ్య యం ఒక్కో స్లమ్‌కు రూ. 9.00 కోట్లు. 24 నియోజకవర్గాలకు వెరసి మొత్తం రూ. 9.00్ఠ24= రూ. 216.00 కోట్లు. రెండు కేటగిరీలకు వెరసి మొత్తం అంచనా వ్యయం రూ. 648.24 కోట్లు -
సిరిసిల్లకు ఆధునిక హంగులు
- వైఫై కనెక్టివిటీ.. సీసీ కెమెరాలు - ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ ఏర్పాటు - ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక టీంలు - తొలిసారిగా సిరిసిల్లలో పెలైట్ ప్రాజెక్ట్ సిరిసిల్ల పట్టణానికి ఆధునిక హంగులు దరిచేరుతున్నాయి. లక్ష జనాభాతో విస్తరించిన కార్మిక క్షేత్రంలో టెక్నాలజీ సేవలు విస్తరిస్తున్నాయి. పోలీసు శాఖ సిరిసిల్ల పట్టణాన్ని వైఫై(వైర్లెస్ ఫెడిలిటీ) సేవలతోపాటు ట్రాఫిక్ నియంత్రణకు సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఇంజినీరింగ్ విద్యార్థులతో సర్వేలు పూర్తిచేసింది. సిరిసిల్లను పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలతో నిఘా నేత్రంలోకి తీసుకొచ్చేందుకు పెలైట్ ప్రాజెక్ట్‌గా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. - సిరిసిల్ల సీసీ కెమెరాలతో శ్రీకారం.. సిరిసిల్ల ప్రధాన కూడళ్లలో తొలిదశలో సీసీ కెమెరాలు అమర్చి నిరంతరం నిఘా పెట్టేందుకు ఏర్పాటుచేస్తున్నారు. ప్రధాన రోడ్ల వెంట ట్రాఫిక్ నియంత్రించేందుకు బ్లూకోల్డ్ విధానం ఇప్పటికే అమలు చేస్తుండగా, పూర్తిస్థాయిలో విజిబుల్ పోలీసు వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నారు. దీంతో నేరాలు, దొంగతనాలు జరగకుండా కట్టడి చేయనున్నారు. రోడ్ల వెంట నిర్ధిష్ట పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటుచేస్తున్నారు. రోడ్లపై మార్కింగ్ ఏర్పాటుచేసి ఆ ప్రాంతంలోని వాహనాలను పార్కింగ్ చేసేలా సూచనలిస్తున్నారు. సిరిసిల్ల గాంధీచౌక్, అంబేద్కర్‌చౌరస్తా, పాతబస్టాండ్, కొత్తబస్టాండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు. ఆటో అడ్డాలు, ఫోర్‌వీల్ వాహనాల పార్కింగ్ స్థలాలను కేటాయించనున్నారు. ఇందుకోసం సిరిసిల్ల టౌన్ సీఐ విజయ్‌కుమార్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. సిరిసిల్ల శివారుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి వాహన తనిఖీలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలోకి భారీ వాహనాలు రాకుండా బారికేడ్లను నిర్మించనున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు భారీ వాహనాలు రోడ్లపై నిలపకుండా నిలువరించేందుకు నిర్ధిష్ట వేళలను నియమించనున్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న సిమెంట్ గోదాంలను పట్టణ శివారుల్లోకి తరలించనున్నారు. కూరగాయల మార్కెట్ విస్తరణ సిరిసిల్లలో ఒకేచోట కూరగాయల మార్కెట్, చేపలు, మటన్ మార్కెట్ ఉండడంతో రద్దీగా ఉంటోంది. పట్టణ నడిబొడ్డున పండుగ వేళల్లో ట్రాఫిక్ సమస్య ఇబ్బందిగా ఉంది. దీన్ని అధిగమించేందుకు మున్సిపల్ అధికారుల సహకారంతో కొత్తబస్టాండ్, శివనగర్, శాంతినగర్, వెంకంపేట ప్రాంతాల్లో మినీమార్కెట్లను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నారు. ఈ విధానంతో ఒకే ప్రాంతంలో రద్దీ తగ్గడంతో పాటు కూరగాయల వ్యాపారులు సైతం రోడ్డుపైకి రాకుండా ఉంటుంది. అనువైన స్థలాలను మున్సిపల్ అధికారులతో చర్చించి మినీ మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నారు. హైటెక్ హంగులు సిరిసిల్లలో వైఫై సేవలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించడంతో పట్టణాన్ని ఆధునీకరించడంలో భాగంగా వైఫై సేవలు ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైఫై ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్ తరహాలో ముఖ్య కూడళ్లలో వైఫై కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పటికే పోలీసుశాఖ ఇందుకోసం కసరత్తులు చేస్తుండగా.. సిరిసిల్ల పట్టణానికి ఆధునిక హంగులు దరి చేరనున్నాయి. సిరిసిల్లలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోనే సిరిసిల్లను పెలైట్ ప్రాజెక్ట్‌గా ఆధునీకరించేందుకు తొలిదశలో ఎంపిక చేసినట్లు సమాచారం. రూ.15కోట్లతో ఫోర్‌లేన్.. నాలుగులైన్ల రహదారిగా వేములవాడ- సిరిసిల్ల రహదారిని విస్తరించేందుకు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శని వారం పనులు ప్రారంభించారు. మొత్తం 7 కిలోమీటర్ల ఈ రహ దారి రూ.15 కోట్లతో రూపుదిద్దుకోనుంది. రహదారి పొడవునా సెంట్రల్ లైటింగ్ సిస్టంతో అధునీకరించనున్నారు. దీంతో రోడ్డు శోభాయామనంగా మారనుంది. సిరిసిల్ల చుట్టూ ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. పలు అంశాలను ప్రతిపాదించాం సిరిసిల్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు వంటివి ప్రతిపాదించాం. పట్టణంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు పలు అంశాలను పరిశీలిస్తున్నాం. ఇంజినీరింగ్ విద్యార్థులతో సర్వేలు చేశాం. సిరిసిల్లలో పూర్తిస్థాయిలో రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్ తరహాలో ఆధునీకరించేందుకు ప్రతిపాదించాం. - దామెర నర్సయ్య, డీఎస్పీ -
ఇసుక రవాణాకు,,, ప్రత్యేక సెక్యూరిటీ పర్మిట్
మంత్రి టీబీ జయచంద్ర రోబో ఇసుక వాడకం తప్పనిసరి ఆన్లైన్లో ఇసుక విక్రయాల యోచన మైసూరు జిల్లాలో త్వరలో పెలైట్ ప్రాజెక్ట్ ప్రారంభం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించడంతో పాటు నకిలీ పర్మిట్లను అరికట్టేందుకు ఈ నెల ఒకటో తేది నుంచి కొత్త ప్రత్యేక భద్రతా పర్మిట్ పేపర్‌ను ప్రవేశ పెట్టినట్లు న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర వెల్లడించారు. ప్రజా పనుల శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్పతో కలసి శుక్రవారం సాయంత్రం విధాన సౌధలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇక మీదట ఎం-ఇసుక(మాన్యుఫ్యాక్చర్డ్ (తయారీ) ఇసుక) వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. దీనినే రోబో ఇసుక అని కూడా వ్యవహరిస్తారని చెప్పారు. స్టోన్ క్రషర్లలో తయారయ్యే ఈ ఇసుక వినియోగం ద్వారా పర్యావరణానికి కొంత మేర నష్టం వాటిల్లకుండా చూడవచ్చని చెప్పారు. కాగా ఇసుక ఏయే ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నదీ ఆన్లైన్లో తెలుసుకోవడానికి నర్మద ఫర్జిలైజర్ కంపెనీతో కలసి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి పరచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు వందల నుంచి ఏడు వందలస్టోన్ క్రషర్లు చట్ట పరిధిలో పని చేస్తున్నాయని తెలిపారు. నదుల్లో ఇసుక తవ్వకాలను సమతుల్య పరచే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఇంకా స్టోన్ క్రషింగ్‌కు అవకాశమున్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం నిర్మాణ రంగానికి పది నుంచి 15 శాతం రోబో ఇసుక లభిస్తోందన్నారు. ప్రభుత్వ నిర్మాణాలకు విధిగా రోబో ఇసుకను వాడాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ఏటా రెండు కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం కాగా 90 లక్షల టన్నుల నది ఇసుక మాత్రమే లభ్యమవుతోందని చెప్పారు. కాగా ఆన్లైన్లో ఇసుక విక్రయాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వారు వెల్లడించారు. గనులు, భూగర్భ వనరుల శాఖ వెబ్సైట్లో ఎక్కడెక్కడ ఇసుక అందుబాటులో ఉన్నదీ తెలుసుకోవచ్చన్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు ఇసుక రేటును నిర్ణయిస్తారని, ప్రతి జిల్లాలో కంట్రోల్ పాయింట్ల నుంచి ఇసుకను పొందవచ్చని వివరించారు. త్వరలో మైసూరు జిల్లాలో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో రెండు నెలల్లో 201 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న 117 చెక్‌పోస్టులతో సహా సీసీటీవీ కెమెరాలను నెలకొల్పనున్నట్లు వారు వెల్లడించారు.