సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం | Absolute literacy goal | Sakshi
Sakshi News home page

సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం

Published Fri, Jun 3 2016 1:27 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

Absolute literacy goal

పెలైట్ ప్రాజెక్టుగా వరంగల్ ఎంపిక
జిల్లాకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్
వేగంగా అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
అంగరంగ వైభవంగా అవతరణ వేడుకలు
అమరుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు ఉత్తములకు అవార్డుల పంపిణీ

 

హన్మకొండ అర్బన్ :  రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాల అమల్లో ముందున్న జిల్లాలో ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం(సెప్టెంబర్ 8) నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించే లక్ష్యంతో జిల్లాను పెలైట్ జిల్లాగా ఎంపిక చేసి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అ న్నారు. దేశం యావత్తు రాష్ట్రం వైపు చూస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని తరవాత జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు. జిల్లాలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, భూమి కొనుగోలు పథకం వివరాలు కడియం వివరించారు.


తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల ను పురస్కరించుకుని గురువారం హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీహరి ఉదయం 9గంటల కు పతాకావిష్కరణ చేసి పోలీస్ వందనం స్వీకరించారు. రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 72మందికి న గదు, ప్రశంసాపత్రం, మెమొంటోలు అందజేశారు. ఈ సం దర్భంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై ప్రసంగించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే...

 
‘పది’ ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి స్థానం

ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో 95.13 శాతంతో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకు కృషి చేసిన అధికార యంత్రాంగానికి అభినందనలు. జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్‌స్కూల్, వ్యవసాయ కళాశాల, వెటర్నరీ కళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. ఇ దే క్రమంలో అంబేద్కర్ 120వ జయంతిని పురస్కరించుకు ని జిల్లాకు 11ఎస్సీ, ఆరు ఎస్టీ, నాలుగు మైనార్టీ గురుకులా లు, నాలుగు మహిళా డిగ్రీ కాలేజీలు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా 450 పీఎస్‌ల్లో ఆంగ్లమాధ్యమ భోదనకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే 1500 మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శి క్షణ ఇప్పించాం. సంపూర్ణ అక్ష్యరాస్యత కోసం జిల్లాను పైల ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామపంచాయతీల పరిధిలో 15నుంచి 50ఏళ్ల మధ్య వారిని అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం చేశాం. సెప్టెంబర్ 8నాటికి లక్ష్యం పూర్తి చేయాలని పట్టుదలతో యంత్రాంగం పనిచేస్తోంది.

 
మిషన్ కాకతీయ, భగీరథ..

కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను తెలంగాణ ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుని మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టింది. ఇది జిల్లా బిడ్డలుగా మనకెంతో గర్వకార ణం. జిల్లాలో రూ.404.89 కోట్లతో 1082 చెరువులు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటి దశ పనుల్లో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఎస్సారెస్పీ-1, 2, కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. మిషన్ భగీరథ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 50 మండలాల్లోని 3405 గ్రామాల్లో రూ. 4,433 కోట్లతో ఐదు సెగ్మెంట్లలో పనులు సాగుతున్నాయి. తొలిదశ లో జులై 31నాటికి 11మండలాల్లోని 704 గ్రామాలకు తాగునీరు అందిచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. జిల్లాను టెక్స్‌టైల్ హబ్, ఇండ్రస్ట్రియల్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం పలుమార్లు జిల్లాలో పర్యటించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో పరిశ్రమల కోసం 3600 ఎకరాల భూమి గుర్తించి ఉంది. హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

 
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్

అడపిల్ల పెళ్లి పేద తలిదండ్రులకు భారం కావద్దని ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ కార్యక్రమాలు అమలు చేస్తోంది. జిల్లాలో షాదీముబారక్ ద్వారా 1478 జంటలకు రూ.7055కోట్లు, కళ్యాణలక్ష్మి ద్వారా 3295 జంటలకు రూ.17కోట్లు అందజేయడం జరిగింది. నిరుపేదల సంక్షేమం ప్రభుత్వం బాధ్యతగా గుర్తించి అమలు చేస్తున్న ఆసరా పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 4,33,666 మందికి ప్రతినెలా రూ.45.12కోట్లు పెన్షన్లు విడుదల చేస్తున్నాం. రైతులకు ఇప్పటికే రెండు విడతల్లో రూ.940కోట్లు రుణ మాఫీ చేసిన ప్రభుత్వం మూడో విడత మాఫీకి చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా రైతుల కోసం వరి, మొక్కజొన్న దాన్యం ఆరబెట్టేందకు రూ.కోటితో డ్రయ్యర్లను ఏర్పాటు చేశాం. అదేవిధంగా జిల్లాలో నూతనంగా 45 గోదాముల నిర్మాణం జరుగుతోంది. రైతుల సంక్షేమం, అభివృద్ధికి బాటలు వేస్తూ వ్యవసాయ రంగానికి 9గంటలు నాణ్యమైన కరంట్ సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం రూ.175కోట్లతో 517 కిలోమీటర్లు 33కేవీ లైన్ ఏర్పాటు చేశాం. అదనంగా అవసరం మేరకు ట్రాన్స్‌ఫారాలు ఏర్పాటు చేశాం.

 
వైద్యం, ఆరోగ్యం..

జిల్లాలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్థాపించి ఈ విద్యా సంవత్సరం మెడికల్, పీజీ అడ్మిషన్లు, డెంటల్, నర్సింగ్, ఆయూష్, ఫిజియోథెరపీ, పారామెడికల్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నాం. యూనివర్సిటీ భవన నిర్మాణానికి సెంట్రల్ జైల్ ఆవరణలో 35 ఎకరాలు మంజూరు చేయనున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. భవన నిర్మాణానికి రూ.25కోట్లు కేటాయించారు. జిల్లాలో రూ.6కోట్లతో 12నూతన పీహెచ్‌సీ భవన నిర్మాణాలు పూర్తి చేశాం. రూ.కోటి 80 ల క్షలతో 20సబ్‌సెంటర్లు నిర్మాణాలు చేపట్టాం. ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, ఏటూరునాగారం సీహెచ్‌సీల్లో ప్రత్యేక నవజాత శశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం.

 
ఆర్థిక చేయూత

జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.77కోట్లతో 7447మందికి, బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.18కోట్లతో 2233 మందికి, ఐటీడీఏ ద్వారా 7.48కోట్లతో 1138మందికి, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 3.35కోట్లతో 407 మందికి ఉపాధి కల్పన కోసం రుణాలు మంజూరు చేశాం. మహిళా సాధికారత కోసం 3,35,947మంది మహిళలకు రూ.646.46కోట్లు బ్యాంకులింకేజీ, స్త్రీనిధి బ్యాంకు నుంచి ఇప్పించాం. జెడ్పీ సాధారణ నిధుల కింద రూ.3కోట్లతో 169పనులు మంజూరు కాగా 83 పనులు పూర్తిచేశాం. ఎస్‌ఎఫ్‌సీ నుంచి రూ.24.25 కోట్ల నిధులతో 2234పనులు మంజూరి కాగా1681 పనులు పూర్తయ్యాయి. మిగతావి ప్రగతిలో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement