సాక్షి, హైదరాబాద్: థర్డ్‌ఫ్రంట్ కు నాయకత్వం వహించే శక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజకీయాలను కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. దేశంలో ఆర్థిక పరిస్థితులు మారలేదని.. ప్రత్యామ్నాయం ఉంటే ప్రజలు కూడా ఆలోచిస్తారన్నారు. కాంగ్రెస్ అధికారంలో అవినీతి విచ్చలవిడిగా జరిగందని.. ఇప్పుడు నరేంద్ర మోదీ హయాంలో బ్యాంకులు లూటీలవుతున్నాయని తెలిపారు.
ప్రజల సొమ్ముకు సంబంధించి మోదీ ఎందుకు పెదవి విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. బ్యాంకుల స్కాం వెనుక బీజేపీ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహ్యాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. వామపక్షాలు సిద్ధాంతాలు మార్చుకుని ఒక్కతాటికి రావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment