కొత్త వెలుగు!
* ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు..
* సిద్దిపేట, గజ్వేల్ ఎంపిక
* పెలైట్ ప్రాజెక్టుగా భారత్‌నగర్‌లో అమలు
* విద్యుత్ వినియోగంలో ఆదాకు ప్రయోగం
* నేడు రాజధానిలో త్రిసభ్య సమావేశం
సిద్దిపేట జోన్: జిల్లాలోని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేట, నగర పంచాయితీ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఇకపై ఎల్‌ఈడీ వెలుగులు విరజిమ్మనున్నాయి.
రెండు ప్రాంతాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల వ్యవస్థను అమలు చేసే నిమిత్తం నేడు కీలక ఒప్పందం కుదరనుంది. విధానం అమలులో భాగంగా సిద్దిపేటలోని భారత్‌నగర్ పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. సాధారణ విద్యుత్ వినియోగం భారంగా మారిన క్రమంలో దీనికి ఎల్‌ఈడీ ద్వారా చెక్ పెట్టాలని భావిస్తున్నారు.
స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తింపు పొందిన సిద్దిపేటలో ఏటా మున్సిపల్‌కు విద్యుత్ చార్జీల చెల్లింపు భారంగా మారుతోంది. పట్టణంలోని 6352 వీధి దీపాల ద్వారా ప్రతి నెలా సగటున రూ. 19 లక్షల మేర విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రాష్ట్రంలోని 12 పట్టణాల్లో ఎల్‌ఈడీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంకల్పించి..
కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, రామగుండం కార్పొరేషన్లతో పాటు సిరిసిల్ల, మహబూబ్‌నగ ర్, మంచిర్యాల, నల్లగొండ, తాండూర్, సిద్దిపే ట మున్సిపాలిటీలు, గజ్వేల్ నగర పంచాయితీ ని గుర్తించింది. సిద్దిపేట పట్టణంలోని భారత్‌నగర్ ప్రాంతంలో పెలైట్ ప్రాజెక్ట్‌గా ఎల్‌ఈడీ వి ధానం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈ ఎస్‌ఎల్‌తో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్వహించేం దుకు సూత్రప్రాయంగా అంగీకరించింది.
నేడే అధికారిక ఒప్పందం..
ఎల్‌ఈడీ విధానం అమలులో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సమక్షంలో జరిగే త్రిసభ్య సమావేశానికి సిద్దిపేట, గజ్వేల మున్సిపల్ కమిషనర్లకు ఆహ్వానం అందింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈఎస్‌ఎల్ (ఎన ర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్), మున్సిపల్ కమిషనర్ల నేతృత్వంలో అధికారిక ఒప్పందం కుదరనుంది.
సిద్దిపేట పట్టణ సమగ్ర నివేదిక తో మున్సిపల్ కమిషనర్ రమణాచారి హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి వెళ్లనున్నారు. ఒ ప్పందం అనంతరం కేంద్ర ప్రభుత్వ రంగ సం స్థ ఈఈఎస్‌ఎల్ సిద్దిపేటలో ఎదురయ్యే సత్ఫలితాలకు అనుగుణంగా పట్టణమంతా ఎల్‌ఈడీ వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
సిద్దిపేటలో ఒకే ప్రాంతం..
సుమారు లక్షన్నర జనభా గల సిద్దిపేట పట్టణంలో 6352 వీధి దీపాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్న క్రమంలో భారాన్ని తగ్గించుకునేందుకు పట్టణాన్ని 5 ప్రాంతాలుగా మున్సిపల్ అధికారులు విభజించారు. ఈ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ప్రయోగాత్మకంగా భారత్‌నగర్‌లోని 16,17,18,21 వార్డుల పరిధిలో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు రూపకల్పన చేశారు.
204 ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో 150, 69, 40 ఓల్ట్‌లతో కూడిన 135 వీధి దీపాలపై ప్రభుత్వం సగటున రూ.1.40 లక్షలను విద్యుత్ బిల్లుల రూపంలో చెల్లిస్తోంది. ఎల్‌ఈడీ లైట్ల బిగింపు వల్ల 60 శాతం విద్యుత్ ఆదాతో పాటు బిల్లుల భారం తగ్గే అవకాశముంది.