Special Grade municipality
-
సిద్దిపేట.. ఇక క్లీన్ సిటీ!
♦ మున్సిపాలిటీని ఎంపిక చేసిన కేంద్రం ♦ సమగ్రాభివృద్ధికి కొత్త ప్రణాళిక ♦ అన్ని వర్గాలచే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ♦ రూ. 144 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు ♦ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం నివేదిక సిద్దిపేట జోన్: వినూత్న పథకాలు, ప్రయోగాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి కేంద్రం మరో అవకాశాన్ని కల్పించింది. శానిటేషన్‌ను ఆధారంగా పట్టణాన్ని సమగ్రాభివృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ఐదు కార్పొరేషన్లను, ఐదు మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. జిల్లా నుంచి సిద్దిపేటకు అవకాశం దక్కడం విశేషం. శానిటేషన్ టాస్క్‌ఫోర్స్ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు సిద్దిపేట మున్సిపల్ అధికారులు శుక్రవారం కొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ ముఖ్యులుగా పట్టణంలోని విభిన్న వర్గాలకు చెందిన 30 మందితో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి తొలిసమావేశం నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి కోసం రూ. 144 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు అందజేసేందుకు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించారు. ఇటీవల కేంద్రం తెలంగాణలోని 64 మున్సిపాలిటీల్లో లక్ష జనాబా ప్రతిపాదికను ప్రమాణికంగా తీసుకుని ఐదు మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. వాటిలో సిద్దిపేటకు అవకాశం దక్కింది. ఇప్పటికే పట్టణంలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియలో ముందుకు సాగుతున్న సిద్దిపేట.. ఇంటింటికి తడి, పొడి చెత్తసేకరణతో పారిశుద్ద్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే పట్టణంలో కంపోస్ట్ యార్డు, డంప్‌యార్డుతో పాటు తడిపొడి చెత్త సేకరణ ఐటీసీ హబ్‌లాంటి వినూత్న ప్రయోగాలను కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలోనే శానిటేషన్‌ను వందశాతం సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రం, రాష్ట్రం నుంచి వివిధ పథకాల ద్వారా విడుదలవుతున్న నిధుల వివరాలను, వాటి వినియోగాన్ని నివేదిక రూపంలో అందించాలని ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తు ప్రణాళికపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం అడుగు ముందుకేసింది. చైర్మన్, కమిషనర్ నేతృత్వంలో పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, మహిళ సంఘాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు శాఖకు చెందిన అధికారులచే టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆయా వార్డుల్లో ప్రజల ఆవసరాలను, మున్సిపల్ పరంగా చేపట్టాల్సిన గురుతర భాద్యతను సలహసూచనల రూపంలో టాస్క్ఫోర్సు నివేదిక రూపొందించాల్సి ఉంది. ముఖ్యంగా శానిటేషన్, నీటి సరఫరాపై ఇప్పటికే సఫలీకృత బాటలో ఉన్న మున్సిపల్‌కు కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద సీవరేజి ప్లాంట్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటుకు నిధులను కూడా కేటాయించారు. ఈ ప్రక్రియ విజయవంతం అయితే సిద్దిపేట పట్టణం స్మార్ట్సీటితో పాటు క్లిన్సిటీగా మారడం ఖాయం ఆ దిశగా భవిష్యత్తు ప్రణాళిక కోసం మున్సిపల్ అధికారులు రూ. 144 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదన నివేదికను అందించనున్నారు. -
కొత్త వెలుగు!
* ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు.. * సిద్దిపేట, గజ్వేల్ ఎంపిక * పెలైట్ ప్రాజెక్టుగా భారత్‌నగర్‌లో అమలు * విద్యుత్ వినియోగంలో ఆదాకు ప్రయోగం * నేడు రాజధానిలో త్రిసభ్య సమావేశం సిద్దిపేట జోన్: జిల్లాలోని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేట, నగర పంచాయితీ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఇకపై ఎల్ఈడీ వెలుగులు విరజిమ్మనున్నాయి. రెండు ప్రాంతాల్లో ఎల్ఈడీ వీధి దీపాల వ్యవస్థను అమలు చేసే నిమిత్తం నేడు కీలక ఒప్పందం కుదరనుంది. విధానం అమలులో భాగంగా సిద్దిపేటలోని భారత్‌నగర్ పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. సాధారణ విద్యుత్ వినియోగం భారంగా మారిన క్రమంలో దీనికి ఎల్ఈడీ ద్వారా చెక్ పెట్టాలని భావిస్తున్నారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తింపు పొందిన సిద్దిపేటలో ఏటా మున్సిపల్‌కు విద్యుత్ చార్జీల చెల్లింపు భారంగా మారుతోంది. పట్టణంలోని 6352 వీధి దీపాల ద్వారా ప్రతి నెలా సగటున రూ. 19 లక్షల మేర విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రాష్ట్రంలోని 12 పట్టణాల్లో ఎల్ఈడీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంకల్పించి.. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, రామగుండం కార్పొరేషన్లతో పాటు సిరిసిల్ల, మహబూబ్‌నగ ర్, మంచిర్యాల, నల్లగొండ, తాండూర్, సిద్దిపే ట మున్సిపాలిటీలు, గజ్వేల్ నగర పంచాయితీ ని గుర్తించింది. సిద్దిపేట పట్టణంలోని భారత్‌నగర్ ప్రాంతంలో పెలైట్ ప్రాజెక్ట్‌గా ఎల్ఈడీ వి ధానం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈ ఎస్ఎల్తో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్వహించేం దుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. నేడే అధికారిక ఒప్పందం.. ఎల్ఈడీ విధానం అమలులో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సమక్షంలో జరిగే త్రిసభ్య సమావేశానికి సిద్దిపేట, గజ్వేల మున్సిపల్ కమిషనర్లకు ఆహ్వానం అందింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈఎస్ఎల్ (ఎన ర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్), మున్సిపల్ కమిషనర్ల నేతృత్వంలో అధికారిక ఒప్పందం కుదరనుంది. సిద్దిపేట పట్టణ సమగ్ర నివేదిక తో మున్సిపల్ కమిషనర్ రమణాచారి హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి వెళ్లనున్నారు. ఒ ప్పందం అనంతరం కేంద్ర ప్రభుత్వ రంగ సం స్థ ఈఈఎస్ఎల్ సిద్దిపేటలో ఎదురయ్యే సత్ఫలితాలకు అనుగుణంగా పట్టణమంతా ఎల్ఈడీ వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. సిద్దిపేటలో ఒకే ప్రాంతం.. సుమారు లక్షన్నర జనభా గల సిద్దిపేట పట్టణంలో 6352 వీధి దీపాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్న క్రమంలో భారాన్ని తగ్గించుకునేందుకు పట్టణాన్ని 5 ప్రాంతాలుగా మున్సిపల్ అధికారులు విభజించారు. ఈ ప్రాంతాల్లో ఎల్ఈడీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ప్రయోగాత్మకంగా భారత్‌నగర్‌లోని 16,17,18,21 వార్డుల పరిధిలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు రూపకల్పన చేశారు. 204 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో 150, 69, 40 ఓల్ట్లతో కూడిన 135 వీధి దీపాలపై ప్రభుత్వం సగటున రూ.1.40 లక్షలను విద్యుత్ బిల్లుల రూపంలో చెల్లిస్తోంది. ఎల్ఈడీ లైట్ల బిగింపు వల్ల 60 శాతం విద్యుత్ ఆదాతో పాటు బిల్లుల భారం తగ్గే అవకాశముంది. -
రైతు బజార్లకు కొత్త హంగులు
సిద్దిపేట జోన్: జిల్లాలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేటతో పాటు మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, నగర పంచాయతీలుగా గజ్వేల్, జోగిపేట, అందోల్ ఉన్నాయి. పట్టణ ప్రజల సౌకర్యార్థం గత ప్రభుత్వాలు ఆయా మున్సిపాలిటీల్లో రైతు బజార్లను ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో నామమాత్ర వసతులతో ప్రస్తుతం రైతుబజార్లు కొనసాగుతున్నాయి. ఇటీవల రైతుబజార్ల స్థితిగతులు, మార్కెట్ యార్డుల పని తీరుపై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం.. వృధా కూరగాయలతో పారిశుద్ధ్యం కొరవడుతుందన్న వాస్తవాన్ని గ్రహించింది. అందుకనుగుణంగానే రైతుబజార్లను ఆధునికీకరించడమే కాకుండా శాఖహార, మాంసహార మార్కెట్లను విస్తృతంగా ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో సంబంధిత కూరగాయల మార్కెట్ల స్థితి గతులు, ఆధునికీకరణ కోసం ఆయా మున్సిపాల్టీలలో చేపట్టాల్సిన అంశాలను సమగ్రంగా నివేదిక రూపంలో కలెక్టర్‌కు ప్రతిపాదించాలని ఈ నెల 16న రాష్ట్ర డెరైక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేటలో రెండు రోజులుగా మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో సంబంధిత జీఓపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సిద్దిపేటలోని సుమారు రెండు లక్షల జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రైతు బజార్‌ను తీర్చిదిద్దడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఆరు బయట విక్రయిస్తున్న మాంస, శాఖహార వ్యవస్థను నియంత్రించేందుకు ప్రణాళిక రూపొందించింది. సిద్దిపేటలో 1,736 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూరగాయల మార్కెట్, 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాంసహార మార్కెట్లను ఏర్పాటు చేయాలని దీనికి తోడు ప్రస్తుతం సిద్దిపేట పట్టణ నడిబొడ్డున ఉన్న రైతు బజార్‌ను మరింత విస్తరించాలని మున్సిపల్ అధికారులు సంకల్పించారు. వీటికి తోడు ఆయా మార్కెట్లను ఎయిర్కండీషనర్తో కొత్త అందాలతో తీర్చిదిద్దేందుకు, ప్రభుత్వ ఆదేశాలనుగుణంగా ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వీటిలో ప్రస్తుతం మాంస విక్రయ మార్కెట్‌కు పట్టణంలో స్థల సేకరణ కోసం రెవెన్యూ విభాగానికి మున్సిపల్ పక్షాన ప్రతిపాదనలు అందజేశారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీ అయిన సిద్దిపేట నుంచే ఈ ప్రక్రియకు జిల్లా అధికారులు శ్రీకారం చుట్టడం, మరోవైపు మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి సారించడంతో భవిష్యత్తులో మార్కెట్లు కొత్త కళను సంతరించుకోనున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలోని ఐదు మున్సిపాల్టీలలో ఇదే తరహాలో మార్కెట్ యార్డులను ఆధునికీకరించేందుకు ఆయా మున్సిపాల్టీలు ప్రతిపాదనల రూపకల్పనలో నిమగ్నమై ఉన్నాయి. ఇదే విషయంపై ‘సాక్షి’ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి వద్ద ప్రస్తావించగా.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. మార్కెట్ కోసం స్థల సేకరణ చేస్తున్నామని, ఆధునీక సౌకర్యాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. -
ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ!
మున్సిపాల్టీలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ సిద్దిపేట జోన్: జిల్లాలోని మున్సిపాల్టీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొండి బకాయిల వసూళ్లు తలకు మించిన భారంగా పరిగణించే మున్సిపల్ యంత్రాంగానికి సర్కార్ కల్పించిన అవకాశం సత్ఫలితాలను ఇస్తుందనే చెప్పవచ్చు. గత ప్రభుత్వాలు ప్రతి యేటా మార్చి నెలాఖరులో కేవలం పది హేను రోజుల గడువును వడ్డీ మాఫీ కోసం విధిస్తూ బకాయిదారులకు కొంత మేర వెసులు బాటు కల్పించేవి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల చివరి వారంలో మాసం రోజుల పాటు ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని ఏడు మున్సిపాల్టీలో సుమారు రూ. 3 కోట్ల వడ్డీ మాఫీ కానుందని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా పేరొందిన సిద్దిపేటలో సుమారు 50 లక్షలు మాఫీ కానున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే... జిల్లాలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, సదాశివపేట పురపాలక సంఘాలతో పాటు గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జోగిపేట నగర పంచాయతీలు ఉన్నాయి. ప్రతి యేటా మున్సిపల్ పరిధిలో అర్థవార్షిక, నగర పంచాయతీల్లో వార్షిక ఆస్తి పన్ను డిమాండ్‌ను అధికారులు అమలు చేస్తుంటారు. అనధికారిక లెక్కల ప్రకారం జిల్లాలోని ఐదు మున్సిపాల్టీలో, రెండు నగర పంచాయతీల్లో సుమారు పది కోట్ల వరకు ప్రతి యేటా ఆస్తి పన్ను రూపంలో వసూలవుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన సిద్దిపేట మున్సిపాల్టీ పరిధిలోనే 19, 310 నివాస, నివాసేతర గృహాల నుంచి ప్రతి అర్థవార్షికంలో రూ. 2.67 కోట్ల ఆస్తి పన్ను వసూలు నిర్దేశిత లక్ష్యంగా ప్రణాళికను రూపొందించారు. గత ఐదేండ్లుగా సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఆస్తి పన్ను బకాయిలు మున్సిపల్‌కు గుదిబండగా మారాయి. ఈ క్రమంలో మొండి బకాయిలను వసూలు చేసేందుకు ప్రభుత్వం వడ్డీ మాఫీ పేరిట వినూత్న ప్రక్రియకు తెరలేపింది. అందులో భాగంగానే గత మూడేళ్ల క్రితం మార్చి నెలలో బకాయి దారుల డిమాండ్‌పై ఉన్న ఆస్తి పన్ను బకాయిలను నిర్ణీత సమయంలో చెల్లిస్తే వాటిపై ఉన్న వడ్డీని పూర్తి స్థాయిలో మాఫీ చేయనున్నట్లు జీఓ వెలువరిచింది. దీంతో అప్పట్లో అనూహ్య స్పందన వచ్చింది. మరోవైపు ప్రతి యేటా మున్సిపల్ పరిధిలోని మొండి బకాయిలపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్‌ల పేరిట విస్తృతంగా క్యాంప్‌లను నిర్వహించి మొండి బకాయిల గుట్టను సాధ్యమైనంత వరకు తగ్గించిందనే చెప్పాలి. అయినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు దుకాణ సముదాయాలు, నివాస గృహాలకు సంబంధించి మొండి బకాయిలు పెరిగిపోతునే ఉన్నాయి. ప్రతి యేటా సిబ్బందికి బకాయిల వసూళ్లు ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం పేరుకు పోయిన బకాయిలను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.