‘పల్లె సేవాకేంద్రాల’ ప్రక్రియ ప్రారంభం | 'Rural Service Centres' Process Start | Sakshi
Sakshi News home page

‘పల్లె సేవాకేంద్రాల’ ప్రక్రియ ప్రారంభం

Published Sat, Sep 26 2015 1:37 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

'Rural Service Centres' Process Start

* పెలైట్ ప్రాజెక్ట్ కింద 125 గ్రామాలు ఎంపిక  
* అక్టోబర్ 2న ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వివిధ రకాల పౌర సేవలన్నీ ఒకేచోట లభ్యమయ్యేలా ‘పల్లె సమగ్ర సేవాకేంద్రాల (వన్‌స్టాప్‌షాప్)’ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 8,695 గ్రామాల్లో దశల వారీగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్కారు సంకల్పించింది. సాధారణ పౌర సేవలతో పాటు రెవెన్యూ, ఆర్థిక సేవలను కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తున్నందున తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో ఈ వన్‌స్టాప్‌షాప్‌లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

పెలైట్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్రంలోని తొమ్మిది (హైదరాబాద్ మినహా)జిల్లాల్లో 125 గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో అక్టోబర్ 2న  ఈ కేంద్రాలను ప్రారంభించనున్నారు. జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు మండల రెవెన్యూ కార్యాల యం నుంచి లభించే వివిధ రకాల పౌరసేవలు, ఉపాధిహామీ కూలీలకు వేతన చెల్లింపు లు, ఆసరా లబ్ధిదారులకు పింఛను చెల్లింపు లు కూడా ఈ కేంద్రాల నుంచే నిర్వహిస్తారు.
 
నేటి నుంచి శిక్షణ
పల్లె సమగ్ర సేవాకేంద్రాల నిర్వహణ బాధ్యతలను ఆయా గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు మాత్రమే అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్‌గా ఉండాలని నిర్దేశించారు. ఈ మేరకు 125 గ్రామాల నుంచి తగిన విద్యార్హతలున్న మహిళల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. ఆన్‌లైన్ సేవాకేంద్రం నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు.

రాజేంద్రనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థలో శనివారం నుంచి రెండురోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. పల్లె సమగ్ర సేవాకేంద్రాలను గ్రామ పంచాయతీ భవనంలోనే ఏర్పాటు చేస్తారు. నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మహిళకు వివిధ రకాల సేవలకు గాను లబ్ధిదారులు చెల్లించిన మొత్తం నుంచి కమీషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కేంద్రం నిర్వాహకురాలికి నెలకు కనీసం రూ.7వేలు ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement