
19న జిల్లాకు ముఖ్యమంత్రి రాక
తిరుపతి సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 19న జిల్లాకు రానున్నారు. ఆయన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలుగుగంగ సీఈ సుధాకర్ సోమవారం తెలిపారు.
తంబళ్ళపల్లె నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న పెలైట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా జిల్లాలోని ఏ ప్రాతంలోనైనా జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను ఇంటర్‌నెట్ సాయంతో పరిశీలించుకునే అవకాశం ఉంటుంది