Interceptor vehicles
-
రాజధానిలో ‘ఇంటర్ సెప్టర్’ నిఘా
సాక్షి, అమరావతి బ్యూరో : నగర పోలీసుల అంబుల పొదిలో ఓ కొత్త అస్త్రం వచ్చి చేరింది. శాంతి భద్రతల పరిరక్షణ, నిఘా వ్యవస్థ పటిష్టత దిశగా విజయవాడ పోలీసు కమిషరేట్ మరో ముందడుగు వేసింది. సత్వర, తక్షణ స్పందన కోసం ఇంటర్ సెప్టర్ వాహనాలు విజయవాడ పోలీసులకు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం 12 ఇంటర్ సెప్టర్ వాహనాలను విజయవాడ పోలీస్ కమిషరేట్‌కు సమకూర్చింది. డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఈ వాహనాలను గురువారం ప్రారంభించారు. వాటితోపాటు ప్రజలు తమ సమస్యలను తెలిపేందుకు మెసేజ్‌లు, ఫొటోలు, వీడియో రూపంలో పంపేందుకు ఏర్పాటు చేసిన వాట్సాప్ సదుపాయాన్ని కూడా ప్రారంభించారు. ఆ వాట్సాప్ నంబర్ 7328909090. నగరంలో 24 గంటలూ నిఘా.. 12 ఇంటర్ సెప్టర్ వాహనాలతో విజయవాడ పోలీసులకు ఆధునిక భద్రతా వ్యవస్థ అందుబా టులోకి వచ్చినట్లైంది. వాటిలో 4 స్కార్పియో, 8 బొలేరో వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల్లో వీహెచ్ఎఫ్ సెట్, ఎంపీడీ డివైజ్, డిజిటల్ కెమెరా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, జీపీఎస్ డివైజ్, బ్రీత్ అనలైజర్లు, బాడీ ప్రొటెక్టర్, అగ్నిమాపక పరికరాలు, వాటర్ క్యానన్, కార్టన్టేప్ బండిల్, ఫస్ట్ ఎయిడ్ కిట్ మొదలైనవి ఉండటం విశేషం. విజయవాడలోని ముఖ్యమైన కూడళ్లలో 24 గంటలూ ఈ వా హనాలను అందుబాటులో ఉంచుతారు. నగరంలో ఎక్కడ ఏమైనా జరిగినా, అత్యవసర పరిస్థితి తలెత్తినా పోలీసులు తక్షణం స్పందిస్తారు. ప్రజా భద్రతకే అధిక ప్రాధాన్యం.. రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ ఠాకూర్ చె ప్పారు. ఇంటర్ సెప్టర్ వాహనాలను ప్రారంభిం చిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయవాడలో 24 గంటలూ నిఘాను కట్టుదిట్టం చేస్తామన్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. పోలీస్ కమిషనర్ సీహెచ్. ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ శాంతిభద్రతల పరి రక్షణకు పోలీసు యంత్రాంగం పూర్తి సమన్వయంతో పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బి. లక్ష్మీకాంతం, ఇంటెలిజెన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శాంతిభద్రతల ఏడీజీ హరీష్‌కుమార్, సీఐడీ ఏడీజీ అమిత్ గార్గ్, నగర జాయింట్ సీపీ కాంతిరాణా, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
త్వరలో ‘ఇంటర్‌సెప్టర్’ వాహనాలు
పెలైట్ ప్రాజెక్టు కింద ట్రాఫిక్ విభాగంలో ఒక వాహనం ప్రవేశం ‘ఇన్నోవా’కు నాలుగు వైపుల సీసీకెమెరాల ఏర్పాటు వాహనంలో డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే ఉంటారు {పత్యక్ష ప్రసారం కూడా చేస్తుంది సిటీబ్యూరో: నగరం పోలీసు శాఖకు త్వరలో ఇంటర్‌సెప్టర్ వాహనాలు రాబోతున్నాయి. పెలైట్ ప్రాజెక్ట్ కింద బుధవారం ట్రాఫిక్ విభాగంలో ఒక వాహనాన్ని ప్రవేశపెట్టారు. వీటి పని తీరు పరీక్షించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ వాహనాలను రంగంలోకి దింపుతారు. ఇంటర్‌సెప్టర్ వాహనాలుగా ఇన్నోవాలను వినియోగిస్తున్నారు. ఈ కార్లకు నాలుగు వైపుల నాలుగు సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. ఈ వాహనంలో డ్రైవర్‌తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే ఉంటాడు. ఇటు శాంతి భద్రతలు, అటు ట్రాఫిక్ విభాగంలోను ఇంటర్‌సెప్టర్ వాహనాలు ప్రవేశపెట్టబోతున్నారు. వాహనానికి నాలుగు వైపుల రహదారిపై ఉన్న దృశ్యాలను వాహనంలో అమర్చిన కంప్యూటర్లో ఆపరేటర్ చూసుకునే సదుపాయం ఉంది. అలాగే కంప్యూటర్లో 3-జీ ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం కూడా ఉంది. రహదారిపై దృశ్యాలను బషీర్‌బాగ్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కు నేరుగా ప్రత్యక్ష ప్రసారాలను సైతం అధికారులు వీక్షించే అవకాశం కల్పించారు. ట్రాఫిక్ విభాగంలో ఇలా... ఈ వాహనం రోడ్డుపై వేగంగా తిరుగుతూ నో పార్కింగ్, రాంగ్ పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపిన వాహనాలను చిత్రీకరిస్తుంది. కాలనీలు, అపార్ట్మెంట్ల ముందు, షాపింగ్ సెంటర్లు, సినిమా థియేటర్ల వద్ద, కళాశాలలు, పాఠశాలల వద్ద అక్రమంగా పార్కింగ్ చేస్తే ఈ వాహనం ఫొటోలు తీసి ఫుటేజీని భద్రపరుస్తుంది. దాని ఆధారంగా వాహనదారుడికి పోలీసులు చలాన్ పంపిస్తారు. శాంతి భద్రతల్లో ఇలా... ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, మత ఘర్షణలు, దాడులు, అల్లర్లు జరిగిన సమయంలో నిందితులను గుర్తించేందుకు ఈ వాహనం చాలా ఉపయోగపడుతుంది. నిందితుల వివరాలు చెప్పేందుకు ప్రత్యక్ష సాక్షులు భయపడతారు. అలాంటి సమయంలో ఈ వాహనం ఘటనా స్థలానికి చేరుకొని చాలు నాలుగు వైపులా ఉన్న సీసీకెమెరాల ద్వారా దృశ్యాలన్నీ రికార్డు చేస్తుంది. ఈ చిత్రాలు కోర్టులో సాక్ష్యాలుగా పని చేస్తాయి. దీంతో నిందితులు శిక్షల నుంచి తప్పించుకోలేరు. సమావశాలు, సభల వద్ద నుంచి... సమావేశం, సభలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో అసాంఘిక శక్తుల కదలికలను కనిపెట్టేందుకు ఈ వాహనాన్ని అక్కడికి పంపిస్తారు. అక్కడి దృశ్యాలను సీసీకెమెరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.