ఇన్నోవా-జీపు ఢీ: ఆరుగురికి గాయాలు | Six injured in road accident, Innova hits Jeep | Sakshi
Sakshi News home page

ఇన్నోవా-జీపు ఢీ: ఆరుగురికి గాయాలు

Published Wed, Apr 13 2016 7:19 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

Six injured in road accident, Innova hits Jeep

గుంటూరు: గుంటూరు జిల్లాలోని గురజాల మండలం అంబాపురం వద్ద బుధవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఎదురెదురుగా వస్తున్న ఇన్నోవా, జీపు ఒక్కసారిగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement