గుంటూరు: వేగంగా వెళ్తున్న ఇన్నోవా బైక్‌ను ఢీకొనడంతో పాటు మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో శనివారం జరిగింది.
పొన్నూరు నుంచి గుంటూరు వెళ్తున్న ఇన్నోవా డ్రైవర్కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో.. స్థానిక దారా ఇమాం పంజా మసీదు సమీపంలోని మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న షేక్ నబిపాషా, పర్విన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇన్నోవా డ్రైవర్కు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన ఇన్నోవా
Published Sat, Mar 26 2016 4:06 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement