
కృష్ణా (విజయవాడ): కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలో.. కృష్ణాకరకట్టపై ఇన్నోవా వాహనం అదుపుతప్పి కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనం కొంతదూరం కొట్టుకుపోయింది. ఇన్నోవాలో ప్రయాణిస్తున్నవారంతా మోపిదేవి మండలం చిరువోలు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ఈ ఘటనలో చిరువోలు గ్రామానికి చెందిన కైలా ప్రశాంత్(25) మృతి చెందాగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. క్షత గాత్రులను స్థానికుల సహయంతో, అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment