innova cars
-
కొత్త కారు కొన్న ఆనందంతో చిందులేసిన యూట్యూబర్ - వీడియో వైరల్
Youtuber New Toyota Innova Hycross: సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరు తమకంటూ ఓ మంచి ఇల్లు, కారు ఉండాలని కలలు కంటూ ఉంటారు. కన్న కలలు నిజం చేసుకోవడం మాటల్లో అనుకునేంత సులభమైతే కాదు. దీనికోసం అహర్నిశలు కష్టపడాలి. ఈ మార్గంలో ఎవరి ఆలోచన వారిదే..! కొంతమంది జాబ్ చేస్తే మరికొందరు సొంతంగా ఏదైనా చేసి డబ్బు సంపాదించాలనుకుంటారు. ఈ మార్గంలో నేటి యువత ఎక్కువగా యూట్యూబ్ మీద పడి సంపాదించడం మొదలెట్టారు. గతంలో చాలా సందర్భాల్లో కొంత మంది యూట్యూబర్స్ ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మరో సంఘటన తాజాగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రైడర్ గర్ల్ విశాఖ అనే యూట్యూబర్ (ప్రముఖ ఉమెన్ మోటార్‌సైకిలిస్ట్) తాజాగా టయోటా కంపెనీకి చెందిన కొత్త ఇన్నోవా హైక్రాస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో తన ఛానల్లో అప్లోడ్ చేసింది. కారుని డెలివరీ చేసుకోవడానికి తన ఫ్యామిలీతో షోరూంకి రావడం డెలివరీ తీసుకునే సమయంలో చేసిన హంగామా మొత్తం ఈ వీడియో చూడవచ్చు. ఇప్పటికే ఈమె మహీంద్రా థార్ కూడా కొనుగోలు చేసింది. టయోటా ఇన్నోవా హైక్రాస్.. టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్ లేటెస్ట్ మోడల్. దీని ధర రూ. 18.82 లక్షల నుంచి రూ. 30.26 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ యూట్యూబర్ కొనుగోలు చేసిన కారు బ్రాండ్ హైఎండ్ మోడల్. కావున ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇందులో స్టాండర్డ్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ 172 బిహెచ్పి పవర్ అండ్ 205 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 184 బిహెచ్పి పవర్ డెలివరీ చేస్తుంది. ఈ కారులో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లేదు. -
వివాహంలో వివాదం
నక్కపల్లి(పాయకరావుపేట): వివాహ కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చినికిచినికి గాలివానలా మారింది. ఒక వర్గం బంధులు వచ్చిన రెండు ఇన్నోవా వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నక్కపల్లి రెల్లికాలనీలో బుధవారం రాత్రి ఒక ఇంటి వద్ద వివాహం జరిగింది. విజయవాడ నుంచి బంధువులు రెండు ఇన్నోవా వాహనాలతో వచ్చారు. వివాహ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పెద్దలు ఇరువర్గాలకు రాజీ కుదిర్చారు. అయితే తెల్లవారుజామున ఒక వర్గం బంధువులు వచ్చిన రెండు ఇన్నోవా వాహనాలు దగ్ధమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ వాహనాలపై పెట్రోలు పోసి తగుల పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు ఇంకా ఫిర్యాదు అందలేదు. క్లూస్ టీం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. వాహనాలను ఎవరు తగులబెట్టారనే వివరాలు తెలియడంలేదని, ఇంతవరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సింహాచలం తెలిపారు. దగ్ధమైన వాహనాల విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. -
రెండు ఇన్నోవా కార్లు ఢీ..ఇద్దరి పరిస్థితి విషమం
సాక్షి, నల్గొండ: జిల్లాలోని నకిరేకల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నకిరేకలు హైవేపై బుధవారం రాత్రి రెండు ఇన్నోవా కార్లు ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యినట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. క్షతగాత్రులను జిల్లాలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సొమ్మొకరిది.. సోకొకరిది
► కేంద్ర నిధులతో ఇచ్చిన ఇన్నోవా కార్లపై సీఎం చంద్రబాబు బొమ్మ ► ఆ బొమ్మను తొలగించిన లబ్ధిదారుల నుంచి కార్లు స్వాధీనం ► ఎస్సీ కార్పొరేషన్లో వింతపోకడ సాక్షి, అమరావతి బ్యూరో: సొమ్మొకరిది, సోకొకరిది అన్న చందంగా టీడీపీ ప్రభుత్వ వ్యవహారం ఉందనే విషయం మరోసారి వెల్లడైంది. దళిత సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కొన్న వాహనాలపై సీఎం చంద్రబాబు బొమ్మ వేసి పంపిణీ చేస్తున్నారు. దళిత యువకులకు ఉపాధి చూపేందుకు కేంద్ర నిధులతో కార్లు పంపిణీ చేస్తుండగా ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంఇచ్చిన నిధులపై వీరి రుబాబు ఏమిటో అర్థం కావడం లేదంటూ పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. చంద్రబాబుపై స్వామి భక్తిని చాటుకునేందుకే జూపూడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని దళిత యువత మండిపడుతోంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం ద్వారా ఏటా దళిత సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తుంది. ఆ పథకం ద్వారా గత ఏడాది రూ.120 కోట్లు కేటాయించగా... అందులో కొంత వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా దళిత యువతకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కార్లను పంపిణీ చేశారు. వాటిపై సీఎం చంద్రబాబు బొమ్మను అంటించడంతో బాడుగకు తీసుకునేందుకు కొందరు ఇష్టపడక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వారు సీఎం బొమ్మను తొలగించారు. దీనిని పెద్ద నేరంగా జూపూడి భావిస్తున్నారు. ఇటీవల నెల్లూరులో లబ్ధిదారులతో సమావేశమైన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు ఇన్నోవా కార్లపై ఉన్న చంద్రబాబు ఫొటోను తొలగించిన 8 మంది లబ్ధిదారులపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు బొమ్మ ఉంచుకోవాలని, అది గర్వకారణమని పేర్కొన్నారు. ఆ బొమ్మలేకుండా తిరిగే వాహనాలను స్వాధీనం చేసుకుని వేరొకరికి పంపిణీ చేయాలని నెల్లూరు ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. స్వామి భక్తిని చాటుకునేందుకు జూపూడి ఇలా వ్యవహరించారని దళిత యువత తప్పుపడుతోంది. కేంద్ర ని«ధులతో పంపిణీ చేసిన వాహనాలపై సీఎం బొమ్మ ఎలా అతికిస్తారని దళితులు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీ తనయుడికి ఇన్నోవా .. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తనయుడు రాజేష్‌కు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా వాహనం పంపిణీ చేశారు. దళితుల్లో పేదలకు కేటాయించాల్సిన వాహనాలను అడ్డదారుల్లో నేతలే దక్కించుకుంటున్నారనేందుకు ఇది నిదర్శనం. పేద దళిత యువకుతకు సవాలక్ష నిబంధనలు వినిపించే అధికారులు మాజీ ఎంపీ తనయుడికి కారు పంపిణీ చేయడం విమర్శలకు తావిస్తోంది. వాహనాలకు ఇచ్చే సబ్సిడీలో కూడా టీడీపీ నేతలు వాటాలు పుచ్చుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. -
125 ఇన్నోవా కార్లు పంపిణీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం లబ్ధిదారులకు 125 ఇన్నోవా కారులను పంపిణీ చేశారు. వెలగపూడిలోని ఏపీ సచివాలయం వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో కార్ల పంపిణీ జరిగింది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన యువతకు అవకాశం కల్పించేందుకు ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో కార్లను నిరుద్యోగ యువతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రావెల కిషోర్ బాబు, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావులు పాల్గొన్నారు.