దగ్ధమైన ఇన్నోవా కార్లు (ఇన్‌సెట్) పరిశీలిస్తున్న క్లూస్‌టీం
నక్కపల్లి(పాయకరావుపేట): వివాహ కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చినికిచినికి గాలివానలా మారింది. ఒక వర్గం బంధులు వచ్చిన రెండు ఇన్నోవా వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నక్కపల్లి రెల్లికాలనీలో బుధవారం రాత్రి ఒక ఇంటి వద్ద వివాహం జరిగింది. విజయవాడ నుంచి బంధువులు రెండు ఇన్నోవా వాహనాలతో వచ్చారు. వివాహ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పెద్దలు ఇరువర్గాలకు రాజీ కుదిర్చారు. అయితే తెల్లవారుజామున ఒక వర్గం బంధువులు వచ్చిన రెండు ఇన్నోవా వాహనాలు దగ్ధమయ్యాయి.
గుర్తు తెలియని వ్యక్తులు ఈ వాహనాలపై పెట్రోలు పోసి తగుల పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు ఇంకా ఫిర్యాదు అందలేదు. క్లూస్ టీం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. వాహనాలను ఎవరు తగులబెట్టారనే వివరాలు తెలియడంలేదని, ఇంతవరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సింహాచలం తెలిపారు. దగ్ధమైన వాహనాల విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment