Friction
-
మహారాష్ట్ర మంత్రిగా మళ్లీ అతడు.. బీజేపీ మండిపాటు
ముంబై: చాలరోజుల సస్పెన్స్ తర్వాత ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవిస్‌ల మంత్రివర్గం మహారాష్ట్రలో కొలువు దీరింది. అయితే ఈ కేబినెట్ ప్రమాణ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్త కేబినెట్లోని సేన రెబల్ ఎమ్మెల్యే ఒకరి వల్ల బీజేపీ శ్రేణుల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తితో పాటు ఆగ్రహామూ వ్యక్తం అవుతోంది. సంజయ్ రాథోడ్.. యావత్మల్ జిల్లా దిగ్రాస్ నిజయోకవర్గపు ఎమ్మెల్యే. షిండే క్యాంప్‌లోని ఓ కీలక ఎమ్మెల్యే. ఇవాళ మంత్రిగా ప్రమాణం చేశాడు. అయితే ఆయన గతంలోనూ మంత్రిగా పని చేసి.. పదవి ఊడగొట్టుకున్నాడు. సంజయ్ రాథోడ్.. ఇంతకు ముందు ఉద్దవ్ థాక్రే కేబినెట్లో అటవీ శాఖ మంత్రి. ఓ మహిళతో సంబంధం నడిపి.. ఆమెను ఆత్మహత్యకు ఉసిగొల్పాడనే ఆరోపణలు బలంగా వచ్చాయి. పైగా అతనికి శిక్షపడాలని గట్టిగా పోరాటం చేసింది బీజేపీనే. ఈ క్రమంలో.. ఆనాడు ఉద్దవ్ థాక్రే, సంజయ్‌తో బలవంతంగా రాజీనామా చేయించాడు. కట్ చేస్తే.. ఇవాళ మంత్రివర్గ ప్రమాణంలో అతనూ పాల్గొన్నాడు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిత్ర కిషోర్ వాగ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ మహారాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిత్ర స్పందిస్తూ.. సంజయ్ రాథోడ్‌కు మళ్లీ మంత్రి పదవి దక్కడం దురదృష్టకరం. ఓ మహారాష్ట్ర బిడ్డను పొట్టనబెట్టుకున్నాడు అతను. అతనికి వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతుందని అని ఆమె ప్రకటించారు. पुजा चव्हाण च्या मृत्युला कारणीभूत असणार्या माजी मंत्री संजय राठोड ला पुन्हा मंत्रीपद दिलं जाणं हे अत्यंत दुदैवी आहे संजय राठोड जरी पुन्हा मंत्री झालेला असला तरीही त्याच्या विरुद्धचा माझा लढा मी सुरूचं ठेवलेला आहे माझा न्याय देवतेवर विश्वास लडेंगे….जितेंगे 👍 @CMOMaharashtra pic.twitter.com/epJCMpvHLB — Chitra Kishor Wagh (@ChitraKWagh) August 9, 2022 టిక్‌టాక్ స్టార్ పూజా చవాన్‌తో సంజయ్ రాథోడ్ రిలేషన్షిప్ నడిపించాడు. అయితే వాళ్ల సంబంధం బెడిసి కొట్టడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సైతం వైరల్ అయ్యాయి. ఈ కేసులో ఆమెకు అరెస్ట్‌చేయాలంటూ బీజేపీ నిరసనగళం గట్టిగా వినిపించింది. అందులో ఇవాళ రాథోడ్‌తో ప్రమాణం చేసిన కిరీట్ సోమయ్య సైతం ఉండడం కొసమెరుపు. ఇదిలా ఉంటే.. గతంలో సంజయ్ రాథోడ్‌ను గద్దె దించే పోరాటంలో ముందున్న దేవేంద్ర ఫడ్నవిస్.. సమక్షంలోనే సంజయ్ రాథోడ్ మంత్రిగా ప్రమాణం చేయడం మరో హైలైట్. మరోవైపు షిండే సైతం రాథోడ్‌ను గత కొంతకాలంగా వెనకేసుకొస్తున్నాడు. పోలీసులు ఆయనకు క్లీన్ చిట్ఇచ్చారనే విషయాన్ని పదేపదే మీడియా ముందు గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి బెర్త్ దక్కుతుందన్న ఊహాగానాలే నిజం అయ్యాయి. పూజా చవాన్ కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం.. కిందటి ఏడాది అగష్టులో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ, బీజేపీ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతూ వస్తూనే ఉంది. ఇదీ చదవండి: కర్ణాటకలో మళ్లీ ముఖ్యమంత్రి మార్పు? -
మీ ఇంటి స్త్రీని ధ్వంసం చేయకముందే..!
మామూలుగా అయితే అతడు భర్త అవుతాడు.కడుపున జన్మించినవాడు కొడుకు అవుతాడు.కానీ భర్త, కొడుకు ఒకరితో ఒకరు ఘర్షణ పడితే వారు ఆమెకు శత్రువులౌతారు. వారు పెట్టే ఒత్తిడి ఆమెను శిధిలం చేస్తుందని ఎప్పటికి గ్రహిస్తారు? సూపర్ మార్కెట్లో కొన్న సరుకులను డ్రైవర్ తీసుకుని కారులో పెడుతుంటే ఫ్రెండ్ కనిపించింది.‘హాయ్ రుక్కూ’ సంతోషంగా చేతులు పట్టుకుంది.‘ఊ... లగ్జరీ కారు... డ్రైవరు... బాగుందోయ్ నీ సంగతి’ అంది మెచ్చుకుంటూ.రుక్కు అనబడే రుక్మిణికి కూడా స్నేహితురాలు కనిపించడం బాగనిపించింది.‘ఇంటికి రారాదూ ఒకసారి’ అని పిలిచింది.‘వస్తాను.. వస్తాను.. నీ భవంతిని తప్పక సందర్శిస్తాను. ఎలా ఉన్నారు మీ ఆయన నీ పిల్లలు’ ఫ్రెండ్ అడిగింది.‘వాళ్లకేం. మా ఫ్యాక్టరీ మెల్లగా లాభాల్లో పడింది. పెద్దాడు ఎంబిఏ చేసి ఫ్యాక్టరీ పనులు చూసుకోవడం రెండు నెలలుగా మొదలెట్టాడు. చిన్నాడి చదువు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. లైఫ్ హ్యాపీగా ఉంది’....చెప్తున్న రుక్మిణి వైపు స్నేహితురాలు సాలోచనగా చూసింది.ఇద్దరిదీ దాదాపు ఇరవై ఏళ్ల స్నేహం. చిన్నప్పటి నుంచి కాలేజీ వరకూ కలిసి చదువుకున్నారు. అందుకే అంది–‘కాని నువ్వు సంతోషంగా లేవు రుక్కూ. ఎందుకో సంతోషంగా లేవు. చెక్ చేసుకో. మళ్లీ కాల్ చేస్తాను’ అంటూ సూపర్ మార్కెట్లోకి వెళ్లిపోయింది.రుక్మిణికి కలవరంగా అనిపించింది ఆ మాటలకు.‘ఎలా కనిపెట్టింది?’ అనుకుంది.ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం రెండు దాటింది. అన్నం తినాలనిపించలేదు. ఈ మధ్య ఇలాగే ఉంటోంది. ఏదో ఆందోళన.ఫ్యాక్టరీలోని రిసెప్షనిస్ట్‌కి ఫోన్ చేసింది.‘సార్ ఎక్కడున్నారు?’‘ఆయన కేబిన్‌లో ఉన్నారమ్మా’‘చిన్న సారు’‘చిన్నసారు తన కేబిన్‌లో ఉన్నారు’‘ఇద్దరూ కలిసి భోజనం చేశారా?’‘లేదు... ఎవరికి వారు చేసినట్టున్నారు’‘ఏం టెన్షన్ లేదు కదా’‘ఏం టెన్షన్ లేదమ్మా’ఆ అమ్మాయి అంటోంది కాని నమ్మకం కలగడం లేదు. టెన్షన్ ఉంది. ఫ్యాక్టరీలో ఉంది. ఇంట్లో కూడా ఉంది.వారం క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.తండ్రీ కొడుకులు ఇద్దరూ కోపంగా ఇంటికొచ్చారు. కొడుకు విసురుగా తన గదిలోకి వెళ్లిపోయాడు. తండ్రి బుసలు కొడుతూ డ్రాయింగ్ రూమ్‌లో కూలబడ్డాడు. వాళ్లను అలా చూడటం ఆమెకు అదే మొదలు.‘ఏమైందండీ’‘ఫ్యాక్టరీలో నా పరువు తీశాడు’‘అదేంటి?’‘మన దగ్గర ఇరవై ఏళ్లుగా పని చేస్తున్న సీనియర్ వర్కర్‌ను పనిలో నుంచి తీసేశాడు. వాడొచ్చి నా దగ్గర మొరపెట్టుకున్నాడు. అలా తీయడం కరెక్ట్ కాదని చెప్పాను. అందరి ముందు నా మాట లెక్క చేయకుండా తీసేయాల్సిందే అని అకౌంట్ సెటిల్ చేసి పంపించాడు. ఏంటిది?’కొడుకు లోపలి నుంచి వచ్చాడు.‘మీ నిర్ణయమే చెల్లుబాటయ్యేటట్టుంటే నాకెందుకు ఫ్యాక్టరీ అప్పజెప్పినట్టు. రెండు నెలలుగా చూస్తున్నాను. నా ప్రతి మాటను మీరు తీసిపడేస్తున్నారు. వర్కర్లు బాగా లెక్కలేనితనానికి అలవాటు పడి ఉన్నారు. ఒక్కరూ సరిగ్గా పని చేయడం లేదు. చాలా అవకతవకలు ఉన్నాయి. సరిచేద్దామంటే చేయనిస్తేగా’‘నోర్మూయ్. నీకేం తెలుసని. నిన్నగాక మొన్నొచ్చావ్. ఏ నిర్ణయానికైనా అనుభవం ఉండాలి’కొడుకు తల్లివైపు చూశాడు.‘ఇదమ్మా వరుస. ఇలాగైతే నాకు ఫ్యాక్టరీ వద్దూ ఇల్లూ వద్దు. వెళ్లిపోతాను’‘పోరా... పోతే పో. బెదిరిస్తున్నావా’ఆమెకు మెల్లగా తలనొప్పి మొదలైంది. గుండె దడ మొదలైంది. ఆ రాత్రి డిన్నర్ చేయడానికి అనువైన ఆకలీ చచ్చిపోయింది.పెద్దకొడుకును ఎం.బి.ఏ చదివించింది ఫ్యాక్టరీ కోసమే. చదువైపోయాక ఫ్యాక్టరీ అజమాయిషీని చూసుకోవాలన్నది కూడా కుటుంబ నిర్ణయమే. కొడుక్కి ఆ పని ఇంట్రెస్ట్ కూడా. కాని ఈ అధికార బదిలీ స్మూత్‌గా జరగడం లేదు. కొడుకు దూకుడుకి తండ్రి అడ్డం పడుతున్నాడు. అవరోధం అవుతున్నాడు. కంగారు పడుతున్నారు. దీనివల్ల ఒకరినొకరు అవమానించుకుంటున్నారు. శత్రువులుగా మారుతున్నారు.ఇందుకు వొత్తిడి వారికి ఉండాలి. కాని నలిగిపోతోంది తను. రాత్రి భర్తకు సర్దిచెప్పబోయింది.‘చూడు... రూపాయికి గతిలేని రోజుల నుంచి రక్తమాంసాలు కరిగించి ఫ్యాక్టరీని ఈ స్థాయికి తెచ్చాను. వీడిలాగే పిచ్చివేషాలేస్తే దానిని అమ్మిపారేస్తాను’ అన్నాడు భర్త.కొడుక్కు సర్ది చెప్పబోయింది.‘అమ్మా... ఆయన నన్ను ఉద్యోగిగా అనుకుంటున్నాడా యజమానిగా అనుకుంటున్నాడా అది తేల్చు ముందు’ అన్నాడు.అప్పటి నుంచి తనకు ఏమిటోగా ఉంటోంది. మనసులో ఏమిటోగా. మెదడులో ఏమిటోగా. తృప్తిగా భోం చేసి చాలా రోజులు. అసలు ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసి చాలా రోజులు. ఈ మధ్యాహ్నం కూడా తన పొట్ట ఖాళీయేనా?ఇంతలో రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.‘అమ్మా.. పెద్దసారు చిన్నసారు కేబిన్‌లోకి వెళ్లారు. ఇద్దరూ అరుచుకుంటున్నారు’అంతే. అప్రయత్నంగా ఆమె చేయి నుదురును తాకింది. తల కొట్టుకుంటూనే ఉంది. కొట్టుకుంటూనే ఉంది. కొట్టుకుంటూ కొట్టుకుంటూ అలానే పడిపోయింది.‘ఈమెను తెచ్చారేమిటి... రావాల్సింది మీ ఇద్దరు కదా’ అంది లేడీ సైకియాట్రిస్ట్ రుక్మిణి భర్తను, కొడుకును చూస్తూ.వాళ్లు అర్థం కానట్టు చూశారు.‘నేను ఆమెతో మాట్లాడాను. ఇక మాట్లడాల్సింది మీతోనే. మీ మగవాళ్లు ఎప్పటికి మారతారు? మీరు ఆడవాళ్లతో గొడవపడితే వొత్తిడికి లోనయ్యేది ఆడవాళ్లే. మీరూ మీరూ గొడవపడినా ఒత్తిడి చెందేది ఆడవాళ్లే. భర్త హోదాలో మీరూ కొడుకు హోదా ఇతనూ చెరోవైపు ఆమెను గట్టిగా లాగేసరికి రెక్కలు తెగి పడిందామె. రామ్మోహన్రావుగారూ... కొందరు ఉన్నతోద్యోగులు రిటైరైనా తాము ఇంకా అధికారంలో ఉన్నామనుకుంటారు. అలా ఉంది మీ మానసికస్థితి. మీరు ఫ్యాక్టరీ నుంచి తప్పుకునే సమయం వచ్చిందని మీరు అంగీకరించడం లేదు. మీ కొడుకును ఒక సమర్థుడుగా గుర్తించడం లేదు. అతడు కూడా తప్పులు ఒప్పులు చేసి మీలాగే నేర్చుకుంటాడన్న సంగతి మర్చిపోయి అవమానిస్తున్నారు. మీరు సలహాదారుగా ఉండగలరు తప్ప అజమాయిషీదారుగా ఉండకూడదని ఇప్పటికైనా గ్రహించి మీ కుమారుడికి విలువ ఇవ్వండి. అలాగే నువ్వుకూడా చూడు బాబు.. తండ్రితో ఫ్యాక్టరీలో గొడవపడి తండ్రి మర్యాద పోగొట్టడం పెద్ద హీరోయిజం అని ఫీలవుతున్నావు. ఆయన వల్లే నువ్వు. నీ వల్ల ఆయన కాదు. మీరిద్దరు కొట్లాడుకుంటున్నారన్న సంగతి బయటకు పొక్కితే కుటుంబగౌరవం పోతుంది. ఫ్యాక్టరీ ప్రమాదంలో పడుతుంది. అధికారం నువ్వు పొందలేదు. వారసత్వంగా దక్కించుకున్నావు. దానికి తగ్గ యోగ్యత ప్రదర్శించి నమ్మకాన్ని పొందేవరకు మీ నాన్నగారి సలహాలు పాటించు. ఏ అనుభవమూ వృథాపోదు. అన్నింటికంటే ముఖ్యం... కోపతాపాలు మిషన్లకు తెలియవు. నడుస్తాయి. కాని మనిషికి తెలుస్తాయి. మీ కోపతాపాలు మీ ఇంటి స్త్రీని ధ్వంసం చేయకముందే మేల్కొనండి’....తండ్రీ కొడుకులు ముఖాముఖాలు చూసుకున్నారు.నెల రోజులు గడిచాయి.సూపర్ మార్కెట్లో రుక్మిణికి మళ్లీ స్నేహితురాలు కనిపించింది.హుషారుగా కనిపిస్తున్న రుక్మిణిని చూసి ‘అమ్మయ్య... నా పాత రుక్కూలానే ఉన్నావ్’ అంది దగ్గరకు తీసుకుని కావలించుకుంటూ.ఆడవాళ్లు సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉన్నట్టే. – కథనం: సాక్షి ఫ్యామిలీ -
భట్టి సన్మాన సభలో రభస
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన రెండు వర్గాల నేతలు ఘర్షణకు దిగడంతో గందరగోళం నెలకొంది. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఓబీసీ సెల్ నగర అధ్యక్షుడు శ్రీకాంత్ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ చివరికి శ్రీకాంత్ సస్పెన్షన్‌కు దారితీసింది.శనివారం గాంధీభవన్‌లో ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు చిత్తరంజన్‌దాస్ ఆధ్వర్యంలో కొత్తగా ప్రతిపక్ష నేతగా ఎన్నికైన భట్టి విక్రమార్కకు సన్మానం ఏర్పాటు చేశారు. దీనికి మాజీ ఎంపీ వీహెచ్, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. సన్మాన సభ మొదలైన కొద్ది సేపటికే వేదికపై ఉన్న వీహెచ్‌కు వ్యతిరేకంగా నగర ఓబీసీ సెల్ అధ్యక్షుడు నూతి శ్రీకాంత్ వర్గీయులు ఆందోళనకు దిగారు. అంబర్‌పేట టికెట్ రాకుండా వీహెచ్ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో సహనం కోల్పోయిన వీహెచ్ వారిని దుర్భాషలాడారు. ఈ సమయంలో వీహెచ్ వర్గీయులు కొందరు నూతి శ్రీకాంత్ వర్గీయులపైకి దూసుకురావడంతో ఘర్షణ మొదలైంది. ఇరు వర్గాలు కుర్చీలతో, పిడిగుద్దులతో పరస్పరం దాడిచేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల వారిని సీనియర్ నేతలు శాంతింపజేసే ప్రయత్నం చేశారు.అయినా గొడవ సద్దుమణగక పోవడంతో హడావుడిగా కార్యక్రమాన్ని ముగించారు. నగర సెల్ పదవి నుంచి శ్రీకాంత్ తొలగింపు.. ఘర్షణకు కారణమైన శ్రీకాంత్‌ను నగర ఓబీసీ సెల్ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ సెల్ అధ్యక్షుడు చిత్తరంజన్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తనను సస్పెండ్ చేయడంపై నూతి శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. తనకు మద్దతుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కార్యకర్తలను వీహెచ్ దుర్భాషలాడినం దునే తాను ప్రతిఘటించానని తెలిపారు. మంద బలంతో గెలుద్దామంటే పప్పులుడకవ్: భట్టి తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, లక్షలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తల గొంతుక వినిపించాలని ప్రజలు తమను అసెంబ్లీకి పంపారని, ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తానని వాగ్దానం చేశారు. గెలుపోటములు రాజకీయాల్లో శాశ్వతం కాదని, కేసీఆర్ కంటే బలమైన నేతలు వచ్చారని, అనంతరం కాల గర్భంలో కలిశారన్నారు. కాంగ్రెస్ ఓడిపోయిందని, మంద బలంతో నియంత్రిద్దామనుకుంటే పప్పులుడకవని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలున్నా తనకు లేఖ రాయాలని కోరారు. కార్యక్రమం ముగిసిన అనంతరం నూతి శ్రీకాంత్, ఆయన వర్గీయులు భట్టి చాంబర్ వద్ద ధర్నాకు దిగారు. తనపై దుర్భాషలాడిన వీహెచ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తర్వాత వీహెచ్‌పై బేగంబజార్ పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. -
టీఆర్ఎస్, కాంగ్రెస్ బాహాబాహీ
రఘునాథపల్లి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు బాహబాíహీకి దిగాయి. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ వార్డు అభ్యర్థి సోదరుడు టీఆర్ఎస్ వార్డు అభ్యర్థితో వాగ్వివాదానికి దిగడంతో తోపులాట, ఘర్షణకు దారి తీసింది. పోలింగ్ జరుగుతోన్న సమయంలో టీఆర్ఎస్ బలపర్చిన 8వ వార్డు అభ్యర్థి ఇమ్మడిశెట్టి శివరాం పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నాడని అదే వార్డు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి రంగు రాజు సోదరుడు శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో వారిరువురి మధ్య మాటమాట పెరిగి పోలింగ్ కేంద్రంలోనే పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు వారిద్దరిని బయటకు పంపించారు. విషయం తెలియడంతో ఇరు పార్టీల శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. జాతీయ ర«హదారిపై ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. రాళ్లతో పరస్పరం దాడి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండడంతో ఆందోళనకారులను నిలువరించలేక పోయారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వాహనాన్ని కాంగ్రెస్ వర్గాలు అడ్డుకున్నాయి. వియ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే వాహనం డోరు లాగేందుకు ప్రయత్నించగా ఆయన అంగరక్షకులు వారిని అడ్డుకున్నారు. టీఆర్ఎస్ మండల ఇన్చార్జి మారుజోడు రాంబాబు, మాజీ ఎంపీపీ కుమార్‌గౌడ్‌లు ఆందోళనకారులకు సర్దిచెప్పారు. ఎమ్మెల్యే వాహనానికి అడ్డుగా ఉన్నవారిని పోలీసులు పక్కకు జరిపి రాజయ్యను జనగామ వైపు పంపించారు. బయటకు వచ్చాక తనపై శివరాంతోపాటు అతడి అన్నలు తనపై దాడి చేశారని శ్రీనివాస్ ఆరోపిస్తుండగా.. ప్రచారం చేయకున్నా ఉద్దేశ పూర్వకంగా వాగ్వివాదానికి దిగారని శివరాం పేర్కొన్నారు. -
ప్రాణం తీసిన పంచాయతీ పోరు
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన తొలిరోజే యాదాద్రి భువనగిరి జిల్లాలో అపశ్రుతి చోటు చేసుకుంది. వార్డుమెంబర్ల పోటీ విషయంలో దాయాదుల మధ్య తలెత్తిన వివాదం చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. దీంతో తుర్కపల్లి మండలం ధర్మారం పంచాయతీ పరిధి పెద్దతండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి (ఆలేరు) : మండల పరిధిలోని ధర్మా రం పంచాయతీ పరిధి పెద్దతండాకు చెందిన బిక్షా, చాల్యా దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో చిన్నకుమారుడైన అజ్మీరా రవినాయక్ (28) తనకున్న ఎకరంన్నర భూమిలో వ్యవసా యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవా డు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో ఇటీవల ఆరుగుంటల భూమిని విక్రయించుకున్నాడు. వా తావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వ్యవసాయం మానేసి ఊరూరా తిరుగుతూ అ ల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ విక్రయించుకుంటూ జీవ నం గడుపుతున్నాడు. తన సోదరుడి కుమారుడిని పోటీకి నిలబెట్టాలని.. పంచాయతీ పరిధి పెద్దతండాలో 7,8 వార్డులు ఉన్నాయి. అయితే 8వ వార్డు నుంచి సోదరుడి కుమారుడైన శ్రీకాంత్‌ను రంగంలోకి దించాలని రవినాయ క్ నిర్ణయించుకున్నా డు. అందుకు గ్రామ ఓటర్లతో సంప్రదింపులు జరుపుతున్నాడు. రాజకీయ కక్షలు భగ్గుమని.. దాయాదుల కుటుంబాల కన్ను ఒకే వార్డుపై పడడంతో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. కొద్ది రోజులుగా నివురుగప్పిన నిప్పులా సాగుతున్న పోరు తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి లక్ష్మణ్ నా యక్, అతడి భార్య రాములమ్మ, కూతురు పావ ని, శ్రీనివాస్ నాయ క్, అతడి భార్య శా రద, నరేశ్‌లు కలిసి రవినాయక్ ఇంటికి వెళ్లి గొడవకు దిగా రు. పూటకు గతిలేకున్నా ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటూ సూటిపోటి మాటలు అనడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో రవి నాయక్ తన పక్కన ఉన్న కర్రతో నరేశ్ తలపై కొట్టడంతో కిందపడిపోయాడు. కాసేపటికి నరేశ్ లేచి తన ఎదురుగా ఉన్న రవినాయక్ మర్మాంగంపై గట్టిగా తన్నడంతో కుప్పకూలిపోయాడు. పరిస్థితి విషమించడంతో.. ఘర్షణ వాతావరణం సద్దుమణిగాక రవినాయక్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు అతడిని మాధాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయినా అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడినుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో రస్తాపూర్ వద్ద 108 వాహన సిబ్బంది ఎదురై రవిని పరిశీలించారు. అప్పటికే అతడు మృతిచెందాడని ధ్రువీకరించడంతో కు టుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య సబిత, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీస్ పహారాలో ధర్మారం పెద్దతండా పంచాయతీ పోరులో ఒకరి ప్రాణం బలైపోయింద న్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ధర్మారం పెద్దతండాకు చేరుకున్న ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐ ఆంజనేయులు, ఎస్ఐ వెంకటయ్య ఆధ్వర్యంలో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. తండాలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని ఏసీపీ సిబ్బందిని ఆదేశించారు. పోస్టుమార్టం నిమిత్తం రవినాయక్ మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సబిత ఫి ర్యాదు మేరకు ఆజ్మీరాలక్ష్మణ్, రాములమ్మ, శ్రీని వాస్నా యక్, నరేశ్‌నాయక్, పావని, శారదలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవార్డుపై దాయాదుల కన్ను ఇదే వార్డుపై రవినా యక్ దాయాదులైన అజ్మీరా లక్ష్మణ్, రాములమ్మ దంపతుల కుమారులు శ్రీనివాస్‌నాయక్, నరేశ్‌ల కన్ను పడింది. దీంతో నరేశ్ వార్డుసభ్యుడిగా తన సోదరుడి కుమారుడు మాల్‌నాయక్‌తో పోటీ చేయిం చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. -
మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ
సాక్షి, నెల్లూరు : మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన శనివారం నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం బూధనంలో జరిగింది. పూటుగా మద్యం సేవించిన యువకులు చిన్న కారణంతో పరస్పర దాడి చేసుకున్నారు . యువకులు ఒక్కసారిగా మారాణాయుదాలతో దాడికి దిగడంతో అక్కడ ఉన్న ప్రజలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా పరిస్ధితి విషమంగా ఉండడంతో అమెను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. -
తాగిన మైకంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
సాక్షి, మహబూబ్‌నగర్ : తాగిన మైకంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మాట మాట పెరిగి చివరికి కొట్లాటకే దారి తీసింది ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నవాబుపేట మండలం కాకర్లపాడు ఫతేపుర్ మైసమ్మ మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులు తాగి మరో వర్గంపై దాడికి దిగారు. రెండు వర్గాలు పరస్పరం వర్గం రాళ్లు రువ్వుకున్నారు.ఈ ఘర్షణలో పది మంది గాయపడగా, మరో వ్యక్తి స్పృహ కోల్పోయాడు. సుమారు గంటపాటు నడిరోడ్డుపై యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఫేస్బుక్ కామెంట్‌తో ఇరువర్గాల ఘర్షణ
దోమ : ఫేస్బుక్లో పెట్టిన కామెంట్ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ సంఘటన మండల పరిధిలోని బడెంపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఏఎస్సై కమల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బడెంపల్లి గ్రామానికి చెందిన నీరటి శ్రీనివాస్ తన ఫేస్బుక్లో యాదవులు పులులని పోస్ట్ చేశాడు. దీంతో వేరే వర్గానికి చెందిన మక్త నరేష్ ‘బొంగు ఏమీ కాదు’ అని పోస్ట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో పెద్దలు సముదాయించారు. ఈ నెల 15(ఆదివారం) రాత్రి గ్రామంలో ఓ విందులో ఇరువర్గాల వారు పాల్గొన్నారు. ఫేస్బుక్లో పెట్టిన పోస్టు గురించి మరోసారి వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల వారు ఘర్షణ పడగా ఒక వర్గానికి చెందిన ముగ్గురికి తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రి సంఘటన స్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇరువురి ఫిర్యాదు బేరకు 21మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మీ పిల్లల మధ్య ఘర్షణను (సిబ్లింగ్ రైవలరీ) పరిష్కరించగలరా?
క్యావ్, క్యావ్ మంటూ అప్పుడే పుట్టిన చిన్న బాబు/పాప ఇంట్లో కేరింతలు కొడతారు. ఇంటిల్లిపాదీ సంతోషం, ఇంటి వారసుడొచ్చాడనో, మహాలక్ష్మి వచ్చిందనో... అయితే వీరందరికీ దూరంగా ముఖంపై దిండు పెట్టుకొని/మంచం కింద దూరి చిన్ని బుజ్జాయి కంటే ముందు పుట్టిన పాప/బాబు కంటి నిండా నీళ్లు నింపుకుంటారు. అమ్మ నన్ను పట్టించుకోవటం లేదనీ, మరెవరో వచ్చి అమ్మ ఒడిలో హాయిగా నిద్ర పోతున్నారనీ. క్రమంగా అమ్మ ఒడిలోని పాప/బాబు పెద్దవారవుతారు. వారి మధ్య తల్లిదండ్రుల ప్రేమకోసం పోరాటం మొదలవుతుంది. ఫలితం పిల్లల మధ్య ఘర్షణ. దీనినే ఇంగ్లీష్‌లో సిబ్లింగ్ రైవలరీ అంటారు. తమకు సరైన గుర్తింపు లభించటంలేదని, తమని బాగా చూడటంలేదనే నెగెటివ్ భావన పిల్లల్లో ఇలాంటి ప్రవర్తనకు కారణం అవుతుంది. దీన్ని ఎలా తగ్గించవచ్చో మీకు తెలుసా? మీ పిల్లల మధ్య ఘర్షణ వాతావరణాన్ని మీరు పరిష్కరించగలరా? 1. చంటి పిల్లలను గమనిస్తూనే, పెద్దపిల్లలపై దృష్టి సారిస్తారు. వారిని పట్టించుకోకుండా ఉండరు. ఎ. అవును బి. కాదు 2. పిల్లల అభిరుచులు, సామర్థ్యాలను గుర్తిస్తారు. దీనిద్వారా వారికి దగ్గరవ్వటానికి ప్రయత్నిస్తారు. వారు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. ఎ. అవును బి. కాదు 3. పిల్లలందరికోసం ప్రతిరోజూ మీ సమయాన్ని కేటాయిస్తారు. వారి సమస్యలను గుర్తించి, పరిష్కరిస్తారు. ఎ. అవును బి. కాదు 4. కుటుంబమంతా ఒకచోట చేరినప్పుడు పిల్లలు చేసిన మంచి పనులను అభినందిస్తారు. అయితే పొగడ్తలవల్ల వారిమధ్య అసూయ రాకుండా జాగ్రత్తపడతారు. ఎ. అవును బి. కాదు 5. వయసులో పెద్దపిల్లలు చిన్నవారిని బాగా చూసుకోవాలని చెప్తారు, వారిమధ్య సంబంధాన్ని వివరిస్తారు. పిల్లల ఆందోళనను అర్థం చేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. పిల్లలను దండించకుండా వారి సమస్యలను వారితో చర్చించటం వల్ల పిల్లల భావోద్వేగాలు అదుపులో ఉంటాయని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 7. పిల్లల పట్ల సానుభూతితో ఉంటారు. వారిపై చూపించే జాలి వారిలో ఉత్సాహాన్ని నింపుతుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 8. పిల్లలందరికీ ఒకే రకమైన ఇంపార్టెన్స్ ఇవ్వటానికి ప్రయత్నిస్తారు. వారిమధ్య పోలికలు చూపించి, ఆత్మన్యూనతకు గురయ్యేలా చేయరు. ఎ. అవును బి. కాదు 9. పిల్లల మధ్య ప్రేమ, దయ, జాలి లక్షణాలు పెంపొందించి వారిమధ్య మంచి రిలేషన్ ఏర్పడటానికి కృషి చేస్తారు. ఎ. అవును బి. కాదు 10. ఒక్కొక్కరినీ విడివిడిగా ప్రశ్నించి, వారి మధ్య గొడవలకు గల కారణాలు తెలుసుకుని పరిష్కరిస్తారు. ఈ విధంగా వారిమధ్య ఆరోగ్య కరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే పిల్లల మధ్య పోటీతత్వాన్ని, ఘర్షణలను ఎలా నివారించాలో మీకు తెలుసు. పిల్లల మధ్య ఏర్పడే మనస్పర్థలను చక్కగా పరిష్కరించగలరు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే పిల్లల మధ్య తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరించాలో మీకు తెలియదు. వారి మీద కోపగించుకోవటం, దండిం^è టం ద్వారా క్రమశిక్షణలో పెట్టవచ్చని భ్రమ పడుతుంటారు. ఇది చాలా తప్పు. సిబ్లింగ్ రైవలరీ పిల్లల్లో సర్వసాధారణం. దీన్ని పరిష్కరించాలంటే వారిని బాగా అర్థం చేసుకోవాలి. ‘ఎ’ సమాధానాలను సూచనలుగా తీసుకుని పిల్లల మధ్య సఖ్యత ఏర్పరచటానికి కృషి చేయండి. -
చైనాతో మరో తగవు
కిబితు(అరుణాచల్ ప్రదేశ్): భారత్, చైనాల మధ్య సరిహద్దుల్లో మరోసారి ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. గతేడాది డోక్లాం వివాదం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగగా.. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లోని అసఫిలా ప్రాంతంలో భారత బలగాల పహారాపై చైనా అభ్యంతరంతో విభేదాలు ఏర్పడ్డాయి. సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వద్ద వ్యూహాత్మకంగా సున్నిత ప్రాంతమైన అసఫిలా వెంట భారత్ ఆక్రమణలకు పాల్పడిందని ఆరోపిస్తూ గత నెల్లో చైనా తన అభ్యంతరాన్ని తెలియచేసింది. అయితే ఈ ఆరోపణల్ని భారత్ తోసిపుచ్చిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ‘మార్చి 15న జరిగిన ‘బోర్డర్ పర్సనల్ మీటింగ్’(బీపీఎం)లో ఈ అంశాన్ని చైనా లేవనెత్తగా.. భారత ఆర్మీ వాటిని తిరస్కరించింది. అరుణాచల్‌లోని ఎగువ సుబాన్సిరి ప్రాంతం భారత భూభాగమని, అక్కడ నిరంతరం పహారా కొనసాగుతుందని మన అధికారులు చైనాకు స్పష్టం చేశారు’ అని ఆ వర్గాలు వెల్లడించాయి. బలగాల పహారాను ఆక్రమణలుగా పేర్కొంటూ చైనా వాడిన పదజాలంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. డోక్లాం వివాదాం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఎల్ఏసీ వెంట భారత్ యుద్ధ సన్నాహక కసరత్తుల్ని పెంచిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. -
వివాహంలో వివాదం
నక్కపల్లి(పాయకరావుపేట): వివాహ కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చినికిచినికి గాలివానలా మారింది. ఒక వర్గం బంధులు వచ్చిన రెండు ఇన్నోవా వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నక్కపల్లి రెల్లికాలనీలో బుధవారం రాత్రి ఒక ఇంటి వద్ద వివాహం జరిగింది. విజయవాడ నుంచి బంధువులు రెండు ఇన్నోవా వాహనాలతో వచ్చారు. వివాహ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పెద్దలు ఇరువర్గాలకు రాజీ కుదిర్చారు. అయితే తెల్లవారుజామున ఒక వర్గం బంధువులు వచ్చిన రెండు ఇన్నోవా వాహనాలు దగ్ధమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ వాహనాలపై పెట్రోలు పోసి తగుల పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు ఇంకా ఫిర్యాదు అందలేదు. క్లూస్ టీం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. వాహనాలను ఎవరు తగులబెట్టారనే వివరాలు తెలియడంలేదని, ఇంతవరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సింహాచలం తెలిపారు. దగ్ధమైన వాహనాల విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. -
పోలీస్ వర్సెస్ సర్పంచ్
డోన్ టౌన్: అనంతపురం టూటౌన్ పోలీసులకు, డోన్ మండలం ఉంగరానిగుండ్ల గ్రామ సర్పంచ్ రాముడు కుటుంబ సభ్యులకు మధ్య బుధవారం ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలోని చిన్నపిల్లల కిడ్నాప్ కేసు విచారణ నిమిత్తం టౌటౌన్ ఎస్ఐలు శ్రీరామ్, క్రాంతికుమార్ బుధవారం డోన్‌కు వచ్చి చిగురుమాను పేట, వైఎస్సార్‌నగర్‌లోని అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పొరపాటున సర్పంచ్ రాముడు ఇంట్లోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు ప్రతిఘటించారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తమపై దాడికి దిగారని డోన్ స్టేషన్లో సర్పంచ్ రాముడిపై ఫిర్యాదు చేశారు. వారి వాహనంలో నుంచి రాముడిని దించి స్థానిక పోలీసులకు అప్పజెప్పేందుకు ప్రయత్నించగా.. అక్కడా ఇరువర్గాల మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. సీఐ రాజగోపాల్ నాయుడు, ఎస్ఐ శ్రీనివాసులు ఇరువర్గాలకు సర్దిచెప్పేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఎస్పీ గోపీనాథ్‌జట్టి ఆదేశాల మేరకు అక్కడకు చేరుకొన్న డీఎస్పీ బాబాఫకృద్దీన్ పరిస్థితిని చక్కదిద్దారు. కిడ్నాప్ ముఠాను తప్పించారు పసి పిల్లలను కిడ్నాప్‌చేసి తల్లిదండ్రులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్న ఎరుకల పిలకల రవి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకునే క్రమంలో సర్పంచ్ రాముడు, అతని కుమారులు అడ్డుపడి తప్పించారని ఎస్ఐ శ్రీరామ్ అన్నారు. ఇంకా ఇద్దరు చిన్నారులు కిడ్నాప్ ముఠా అధీనంలోనే ఉన్నారన్నారు. కాగా.. తమకు కిడ్నాప్ ముఠాతో ఎలాంటి సంబంధం లేదని, తమ ఇంట్లోకి ప్రవేశించి సోదాలు చేయడంతో పాటు తనపై, తన కుమారులపై చేయి చేసుకున్నారని సర్పంచ్ రాముడు ఆరోపించారు. చిన్నపొరపాటు మూలంగానే ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని, ఇరువర్గాల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రానందున కేసులు నమోదు చేయలేదని డీఎస్పీ చెప్పారు. -
అట్టుడికిన మహారాష్ట్ర
సాక్షి, ముంబై: భీమా–కోరేగావ్ ఘటనపై నిరసనలు పుణే నుంచి మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాలు మంగళవారం దళితుల ఆందోళనలతో అట్టుడికాయి. ముంబైలో రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. పుణే దగ్గర్లోని భీమా–కోరేగావ్ యుద్ధ స్మారకం వద్ద 200వ విజయోత్సవాల సందర్భంగా సోమవారం హిందూ, దళిత సంస్థల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్తా ముదిరి హింసాత్మకంగా మారింది. ఆందోళన కారులు పదుల సంఖ్యలో వాహనాలను తగులబెట్టి ధ్వంసం చేశారు. ఈ ఘర్షణల్లో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హింసకు ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ భరిపా బహుజన్ మహాసంఘ్(బీబీఎం) బుధవారం మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ పిలుపునకు మహారాష్ట్ర డెమోక్రటిక్ ఫ్రంట్, మహారాష్ట్ర లెఫ్ట్ ఫ్రంట్ తదితర 250 సంస్థలు మద్దతు తెలిపాయని బీబీఎం నేత ప్రకాశ్ అంబేడ్కర్ చెప్పారు. పుణే ఘర్షణలు మంగళవారం ముంబైకి పాకాయి. ప్రభుత్వమే ఘర్షణలకు కారణమంటూ దళితులు చేపట్టిన ఆందోళనలతో ముంబైలో రైళ్లు ఆగిపోయాయి. వందకుపైగా బస్సులు ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల దుకాణాలు మూతబడ్డాయి. ఆందోళనకారులు ముంబైలోని ముఖ్య ప్రాంతాల్లో వాణిజ్య, విద్యా సంస్థలు, దుకాణాలను మూసివేయించారు. హార్బర్ లైన్‌లోని గోవండీ, చెంబూర్ రైల్వే స్టేషన్లలో రైళ్లను అడ్డుకున్నారు. ఈ ఘటనలతో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఆందోళనకారులు 134 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని అధికారులు తెలిపారు. దాదాపు 100 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోరేగావ్ విజయోత్సవాలకు వెళ్లి వస్తున్న ఓ మహిళపై సోమవారం దాడికి పాల్పడ్డారనే ఫిర్యాదుపై హిందూ ఏక్తా అఘాదీ నేత మిలింద్ ఎక్బొటే, శివ్‌రాజ్ ప్రతిష్టాన్ నేత సంభాజీ భిండేలపై పోలీసులు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ రెండు సంస్థలు బ్రిటిష్ వాళ్ల గెలుపునకు విజయోత్సవాలేమిటంటూ మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నాయి. హైకోర్టు జడ్జితో విచారణ: ఫడ్నవిస్ ఈ హింసాత్మక ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని సీఎం ఫడ్నవిస్ చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని, యువకుడి మృతిపై సీఐడీ దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. ఆర్ఎస్ఎస్–బీజేపీ ఫాసిస్ట్ విధానాలపై భీమా–కోరేగావ్ ఉత్సవాలు గెలుపునకు ప్రతీకలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. కోరేగావ్ చరిత్ర ఇదీ... పుణే సమీపంలో భీమా నది ఒడ్డున భీమా–కోరేగావ్ యుద్ధ స్మారకం మహారాష్ట్రలో సంకుల సమరానికి కేంద్ర బిందువుగా మారింది. పీష్వా బాజీరావు–2 సైన్యంతో బ్రిటిష్ సైన్యానికి ఇక్కడే యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ముగిసి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఉత్సవాలు జరిగాయి. ఇక్కడ జరిగిన ఘర్షణలే పెద్దవయ్యాయి. 1857 తొలి స్వాతంత్య్ర సమరానికి ముందే బాంబే ఆర్మీ (బ్రిటీష్)లో 25 శాతం మహర్లు(దళితులు) ఉండేవారు. బ్రిటిష్ మెరైన్ బెటాలియన్‌లో కీలక సైనికులుగా ఉన్నారు. పీష్వాల పాలనలో అంటరానితనం తీవ్రస్థాయిలో అమలవుతున్న రోజులవి. ఆ సమయంలోనే 1818 జనవరి 1న∙పీష్వా బాజీరావు–2 పెద్ద సైన్యంతో పరిమిత సంఖ్యలో ఉన్న బ్రిటిష్ సైన్యం పోరాడింది. పుణేపై దాడికి వస్తున్న పీష్వా సైన్యాన్ని కెప్టెన్ స్టౌంట్సన్ నేతృత్వంలో 21వ రెజిమెంట్ ఆఫ్ ద బాంబే నేటివ్ ఇన్ఫాంట్రీ(మహర్ మెజారిటీ) నిలువరించింది. ఇరవై వేలకు పైబడిన అశ్వికదళం, 8 వేల మంది కాల్బలంతో కేవలం 800మంది సైనికులు (వారిలో 500–600 మంది మహర్లు) ఆహారం, నీరు, ఎలాంటి విశ్రాంతి లేకుండా ఏకధాటిగా 12 గంటల పాటు పోరాడారు. ఈ యుద్ధంలో 21 మంది మహర్ సైనికులు అసువులు బాశారు. మరింత పెద్ద సంఖ్యలో బ్రిటిష్ సైన్యం రావొచ్చునని భావించిన బాజీరావు–2 తన సైన్యాన్ని వెనక్కు రప్పించారు. వీరోచితమైన ఈ సంఘర్షణే మూడో బ్రిటిష్–మరాఠా యుద్ధంలో కీలక పరిణామంగా మారింది. భారత గడ్డపై ఆంగ్లేయులు తమ పట్టును బిగించేందుకు ఇది ఉపయోగపడింది. ఈ సంగ్రామంలో అమరులైన 21 మంది సైనికుల పేర్లు ఈ యుద్ధస్మారకంపై చెక్కి ఉన్నాయి. 1927 జనవరి 1న డాక్టర్ భీమ్రావు అంబేడ్కర్, పలువురు దళిత ప్రముఖులు, బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న వారితో కలిసి ఈ స్మారకాన్ని సందర్శించారు. అప్పటికి 109 ఏళ్ల క్రితం జరిగిన కోరేగావ్ యుద్ధంలో పీష్వాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ సైన్యంలో అత్యధికంగా ఉన్న మహర్ సైనికులు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ పర్యటన సాగింది. సైనికపరంగా దళితుల శక్తిసామర్థ్యాలకు కోరేగావ్ యుద్ధాన్ని గొప్ప ఉదాహరణగా పరిగణిస్తుంటారు. బ్రిటిష్ ఆర్మీలో అంబేడ్కర్ తండ్రి, ఆయన సోదరులు ఆరుగురు సుబేదార్ మేజర్లుగా పనిచేయటం గమనార్హం. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భగ్గుమన్న ఇస్లామాబాద్
-
భగ్గుమన్న ఇస్లామాబాద్
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు మరణించగా, 150 మంది గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పారా మిలటరీ దళాలు రంగం లోకి దిగడంతో ఈ హింస చెలరేగింది. ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణల్లో ఒక పోలీసు మరణించగా, 150 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్‌కు వచ్చే ప్రధాన రహదారుల్ని దిగ్బంధించిన వేలాది మందిని చెదరగొట్టేందుకు పోలీసులు, పారా మిలటరీ దళాలు రంగంలోకి దిగడంతో ఈ హింస చెలరేగింది. రోడ్లను ఖాళీ చేయించాలని ఇచ్చిన ఉత్తర్వుల అమలులో విఫలమయ్యారని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రికి ఇస్లామాబాద్ హైకోర్టు ధిక్కార నోటీసుల నేపథ్యంలో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆందోళనకారుల్ని మాత్రం ఖాళీ చేయించలేకపోయారు. పోలీసు చర్య నేపథ్యంలో అసాంఘిక శక్తులు చెలరేగకుండా.. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రైవేట్ చానళ్ల ప్రసారాలతో పాటు ఫేస్బుక్, ట్వీటర్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా సైట్లను నిలిపివేసింది. ఆందోళనలు కరాచీ నగరానికి కూడా వ్యాపించాయి. ఎన్నికల చట్టంలో మార్పులకు నిరసనగా పాక్‌న్యాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని దాదాపు 2 వేల మంది ఆందోళనకారులు రెండు వారాల క్రితం ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ వే, ముర్రీ రోడ్డును దిగ్బంధించారు. ఆత్మాహుతి దాడిలో నలుగురి మృతి కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో భద్రతా బలగాల కాన్వాయ్ లక్ష్యంగా దుండగులు శనివారం జరిపిన ఆత్మాహుతి దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఓ చిన్నారి సహా 19 మంది గాయపడ్డారు. -
పాతకక్షల నేపథ్యంలో హత్య
పాత మిత్రుల మధ్య ఘర్షణ దారుణానికి దారి తీసిన వాగ్వాదం స్నేహితుడి సోదరుడి చేతిలో హతం కామారెడ్డిలో కలకలం రేపిన కత్తిపోట్లు కామారెడ్డి అర్బన్ (కామారెడ్డి): వారిద్దరు మిత్రులు.. మనస్పర్థలతో బద్ధ శత్రువులుగా మారారు.. ఒకరిపై మరొకరు కేసులూ పెట్టుకున్నారు.. ఆ తర్వాత రాజీ కుదర్చుకొని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే, మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో జరిగిన దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్ కథనం ప్రకారం.. హనుమాన్‌నగర్ కాలీనికి చెందిన అన్వర్, మాజిద్ స్నేహితులు. మనస్పర్థలు రావడంతో తరచూ గొడవ పడ్డారు. 2014లో ఇద్దరి మధ్య ఘర్షణలు చోటు చేసుకొని పోలీసుస్టేషన్ వరకు చేరింది పంచాయతీ. కేసులు నమోదు కావడంతో ఇద్దరూ రాజీ కుదుర్చుకున్నారు. అయితే, మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో పట్టణంలోని రైల్వేస్టేషన్ వద్ద అన్వర్, మాజిద్‌లు వారి వారి స్నేహితులతో కలిసి ఒకే చోట కలుసుకున్నారు. ఈ క్రమంలో అన్వర్, మాజీద్ల మధ్య మాటమాటా పెరిగి వాగ్వాదం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఇది ఘర్షణగా మారింది. గొడవ గురించి సమాచారం అందుకున్న మాజీద్ సోదరుడు అక్బర్ అక్కడికి చేరుకొని అన్వర్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అన్వర్‌ను అతడి స్నేహితులు వెంటనే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడు. డీఎస్పీ ప్రసన్నరాణి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. అన్వర్ స్నేహితుడు అంజద్‌ఖాన్ ఫిర్యాదు మేరకు అక్బర్, మాజీద్, అజీమ్, మెహెరాజ్లపై కేసు నమోదు చేశామని ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్ తెలిపారు. మృతుడు అన్వర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య బుధవారం సాయంత్రం అన్వర్ అంత్యక్రియలు జరిగాయి. ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో జరిగిన హత్య కావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆ ఘర్షణ
ప్రేమ అనుకుని ఆకర్షణలో పడింది... ఆకర్షణ అని తెలిశాక ఘర్షణలో పడింది. ప్రేమకు ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఉంటాయని తెలుసుకోలేకపోయింది! వన్‌వేలు, టూవేలు ఉంటాయని కూడా తెలుసుకోలేకపోయింది. ప్రేమ ఒక్కోసారి సడన్‌గా పుడుతుంది... love ఎట్ ఫస్ట్ సైట్. ఒక్కోసారి మెల్లగా పుడుతుంది... పరిచయం పెరిగాక. తరచు ప్రేమ ఆకర్షణ నుంచి పుడుతుంది. ఇది చాలా కన్ఫ్యూజన్ను పుట్టిస్తుంది. ఘర్షణను పెంచుతుంది. ద్వేషాన్ని పోషిస్తుంది. ఆ ఘర్షణ నుంచి.. ఆఘర్షణ నుంచి బయటపడేసే కథనమే ఇది. ‘‘నేహా, నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్! నీ తెలివంతా నా దగ్గర చూపించకు..’ సౌరభ్ మాటలకు ఓ క్షణం బిత్తరపోయింది నేహ. ‘‘ఏంటీ, నీ దగ్గర తెలివి చూపించానా! అంత తెలివి ఉన్నదాన్నయితే ఇన్నాళ్లు నీ వెంట ఎందుకు తిరుగుతాను?’’ అంతే విసురుగా సమాధానమిచ్చింది నేహ. ‘‘ఇక డిస్కషన్స్ అనవసరం. ఎవరిదారి వాళ్లది. బై..’’ అని చెప్పేసి అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు సౌరభ్. ఆ మాటలతో నేహలో రోషం, ఆ వెంటనే దుఃఖం ఒకేసారి ముంచుకొచ్చేశాయి. ‘వీడ్ని ప్రేమించినందుకు తగినశాస్తి జరిగింది. బాధ్యత తెలిసినవాడనుకున్నాను. కానీ, వీడూ ఓ అవకాశవాది. ఆ అనూ ఉందిగా! అదొచ్చాకే నేను ‘వేస్ట్’ అయిపోయాను. చూస్తాను నన్ను కాదనుకొని ఎలా ఆనందంగా ఉంటారో.. ’ కోపంగా పళ్లునూరింది నేహ. ‘‘నేహ ఎంత అమాయకంగా ఉండేదిరా... ఎంత ఇష్టపడ్డాను తనను. ఇప్పుడు నన్నే అన్ని మాటలంటుందా? ఎంత హెల్ప్ చేశాను తనకి. కనీస కృతజ్ఞత కూడా లేదు .. ఛీ. చీ..’’ ఫ్రెండ్ దగ్గర వాపోయాడు సౌరభ్. దారి మళ్ళిన ఆకర్షణ ‘‘నేహ ఒంటరిగా గదిలోనే ఉంటోంది. కాలేజీకి వెళ్లమంటే వెళ్లనంటోంది. ఏమైనా అడిగితే ఏం లేదు అని తప్పించుకుంటోంది. మునుపటి సరదా లేదు తనలో... దాన్ని చూస్తుంటే మాకు భయమేస్తోందమ్మా. దాని బాగుకోరేదానివైతే ఏమైందో చెప్పు..?’’ బతిమాలుతూ వేదను ఫోన్లో అడిగింది నేహ తల్లి వనజ. నేహ స్నేహితురాలు వేద. ఇద్దరూ బి.టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు.‘‘ఏంలేదాంటీ.. ఇంటికి వచ్చి కలుస్తాను’’ అని, నేహ దగ్గరకు వచ్చింది వేద. ‘‘ఆ సౌరభ్ అంతు చూడనిదే నేనేపనీ చేయలేను వేదా, ఎవరి మొహం చూడలేను’’ అంది నేహ. ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. వాణ్ణి చంపనైనా చంపుతాను కానీ, సంతోషంగా ఉండనివ్వను’’ కోపంతో ఊగిపోతూ అంటున్న నేహను చూస్తే భయమేసింది వేదకు. అనుకున్నంతా అయ్యింది. ముందునుంచీ చెబుతూనే ఉంది. కానీ, నేహ వినలేదు. ఇప్పుడు సమస్య తన చేయి దాటిపోయింది. మెల్లగా అక్కణ్ణుంచి వచ్చిన వేద.. నేహ తల్లితో సౌరభ్–నేహల ప్రేమ విషయమంతా చెప్పింది. ‘‘భయపడి ఇన్నాళ్లూ మీకీ విషయం చెప్పలేకపోయానాంటీ. కానీ, నేహ ఏం చేసుకుంటుందో అని భయమేస్తోంది’’ అని భయం భయంగా చెప్పింది వేద. వనజ షాక్ అయ్యింది. వెలుతురువైపు పయనం ‘‘నేహా, ఇది మీ జీవిత సమస్య. ఏం జరిగిందో మీరు వివరించనక్కర్లేదు. అవగాహన కలిగేందుకు ఈ థెరపీ మీకు ఉపయోగపడుతుంది. ఇందుకు మీరు సిద్ధమైతేనే..’’ కౌన్సెలర్ మాటలకు సిద్దమేనన్నట్టుగా తలూపింది నేహ. భార్య ద్వారా కూతురి పరిస్థితి తెలిసిన ప్రభాకర్ ఆమె జీవితాన్ని చక్కదిద్దడానికి ఈ థెరపీ సాయపడుతుందనే ఆశతో కౌన్సెలర్ దగ్గరకు తీసుకొచ్చాడు. థెరపీ మొదలైంది. ఆ థెరపీలో నేహతో పాటు తల్లీ తండ్రీ పాల్గొన్నారు. కౌన్సెలర్ సూచనలు నేహకు అందుతున్నాయి. ఆ తర్వాత 5–10–15 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. ఆ మౌనాన్ని ఛేదిస్తూ ‘‘నేహా, మీ అంతర్నేత్రంలో మీ కాలేజీని దర్శించండి. మీకు ఎదురైన అనుభవాలను తెలియజేస్తూ ఉండండి..’ అన్నారు కౌన్సెలర్. నేహ చెప్పడం మొదలుపెట్టింది... ‘‘నేను బి.టెక్‌లో చేరిన మొదటిరోజు. చాలా ఆనందంగా ఉంది. అక్కడే వేద పరిచయం అయ్యింది. ఫ్రెండ్స్‌తో రోజులు చాలా సరదాగా గడిచిపోతున్నాయి. మేమొక పార్టీకి వెళ్లాం. అక్కడ ఒకతను చాలా డీసెంట్‌గా కనిపించాడు. అతని పేరు సౌరభ్ అని తెలిసింది. మా క్లాస్‌మేట్‌కి ఫ్రెండ్ అట. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ డిగ్రీ చదువుతున్నాడని తెలిసి ఆశ్చర్యమేసింది. ఫ్యామిలీ అంటే చాలా రెస్పాన్సిబిలిటీ. నాకతని బిõß వియర్ బాగా నచ్చింది. ఆ తర్వాత మేం మళ్లీ మళ్లీ కలుసుకున్నాం. సౌరభ్ నన్ను చాలా అపురూపంగా, చిన్నపిల్లలా చూసుకునేవాడు. నాకు సౌరభ్ అంటే చాలా ఇష్టం. నేనంటే సౌరభ్‌కు అంతే ఇష్టం’’ నేహ చెబుతూనే ఉంది. వనజ, ప్రభాకర్‌లు ఆశ్చర్యపోతూనే నేహ చెబుతున్నది వింటున్నారు. వెలుగు చూసిన నిజాలు ‘‘రెండేళ్లు మేం చాలా ఆనందంగా ఉన్నాం. ఎన్నో చోట్లకు తిరిగాం. ఎంత సంతోషంగా ఉన్నామో.. కానీ ఇప్పుడు ... ’’ అని చెబుతూనే నేహ ఏడ్వడం మొదలుపెట్టింది. వనజ, ప్రభాకర్ తల్లడిల్లిపోయారు. సైగలతోనే వారిని వారించిన కౌన్సెలర్ నేహ కన్నీళ్లు ఆగేంతవరకు ఎదురుచూశారు. ‘‘ఇప్పుడు ఏం జరిగింది నేహ... ఎందుకు మీరింత బాధ పడుతున్నారు’’ అడిగారు కౌన్సెలర్. ‘‘నేనంటే సౌరభ్‌కి నచ్చడం లేదు. నా మంచి చెడు పట్టించుకోవడం లేదు. పైగా నన్ను మునుపటిలా లేవు అంటున్నాడు..’’ అని చెప్పి మౌనంగా ఉండిపోయిన నేహ కాసేపటికి.. ‘‘మా జూనియర్ అనూ వల్లే సమస్య అనుకున్నాను. కానీ, ఆమె వల్ల కాదు. మా ఇద్దరి మధ్య ఉన్నది అసలు ప్రేమే కాదు. నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని ఇష్టపడ్డాను. అమ్మనాన్నలు వాళ్ల పనుల్లో వాళ్లు బిజీ నన్ను పట్టించుకోరు. సౌరభ్ అలా కాదు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒంటరితనం పోగొట్టుకోవడానికి సౌరభ్‌తో ఉన్నాను. ఇప్పుడు అతను దూరమైతే నన్ను పట్టించుకునేవారు ఎవరూ ఉండరు. అందుకే సౌరభ్ వెళ్లిపోతుంటే నాకు బాధగా ఉంది. అతను దూరమవడం నాకిష్టం లేదు..’’ చెబుతూ ఆగిపోయింది నేహ. కౌన్సెలర్ సూచనలతో థెరపీ పూర్తయింది. నేహకు తనేంటో అర్థమైంది. సౌరభ్‌పై ఉన్న కోపం, పగ, ప్రతీకారాలు అవి తన ఒంటరితనం మీద అని గుర్తించింది. ఆకర్షణకు ప్రేమకు గల వ్యత్యాసం తెలుసుకొని, అవగాహన చేసుకొని తన భవిష్యత్తును ఆనందంగా మలుచుకోవడంపై శ్రద్ధ పెట్టింది. తల్లీతండ్రి తమ తీరిక లేని పనులను సడలించుకొని, కూతురి భవిష్యత్తు కోసం తమ సమయాన్ని కేటాయించారు. కృష్ణుడి ప్రేమ తత్వం గురించి మహాభారతం విశదపరు స్తుంది. ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు ఆకర్షణలు– ప్రేమ తత్వం గురించి తెలియజేశారు. పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ ఫ్యూచర్, లైఫ్ ప్రోగ్రెషన్ మీద విస్తృతమైన పరిశోధనలు జరిపిన డాక్టర్ బ్రియాన్ వెయిజ్ అమెరికన్ సైకియాట్రిస్ట్, హిప్నోథెరపిస్ట్. ఇతను ‘ఓన్లీ లవ్ ఈజ్ రియల్’ అనే పుస్తకంలో ప్రేమ–ఆకర్షణల గురించి తెలియజేశారు. ‘లైఫ్ బిట్వీన్ లైఫ్’ అని ఆకర్షణల గురించి తన పరిశోధనా గ్రంధం ద్వారా వివరించారు బ్రాండ్ విడ్త్. ఆకర్ణణ సిద్ధాంతం గురించి తెలియజేసిన వారిలో డా.జాన్ అబ్రహం ప్రముఖులు. 7 చక్రాలు... ఆకర్షణలు... మానవ శరీరంలో కుండలిని చక్రం ఉంటుంది. మూలాధార చక్రంతో మన ఆలోచనలు ముడిపడి ఉంటే శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం అట్రాక్ట్ అవుతారు. ముఖ్యంగా లైంగిక వాంఛలు తీర్చుకోవడంపై దృష్టి నిలుపుతారు. దీంతో అలాంటివారినే ఆకర్షిస్తుంటారు. మూలాధార చక్రంపైన ఉండే స్వాధిష్టాన, మణిపుర చక్రాలతో కనెక్ట్ అయితే భావోద్వేగాల నడుము కొట్టుమిట్టాడుతారు. రకరకాల ఉద్వేగాలకు ఆకర్షితులు అవుతారు అనహత, విశుద్ధ చక్రాలతో ముడిపెట్టుకుంటే జ్ఞానులు ఆకర్షిస్తుంటారు. ఆధ్యాత్మిక విషయాలకు అట్రాక్ట్ అవుతారు. సహస్రార చక్రంతో కనెక్ట్ అయితే ఏది అవసరం? ఏది అనవసరం? అనే విషయాల పట్ల అవగాహన కలుగుతుంది. గొప్ప గురువులు, జ్ఞానులు ఆకర్షిస్తారు. అవసరం లేనిది త్వరితంగా విడిచిపెట్టగల శక్తి వస్తుంది. ఇదంతా ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. సాధన ద్వారా ధ్యానం తద్వారా జ్ఞానం అలవడతాయి. తమను తాము కోల్పోయి బాల్యంలో పరిస్థితుల వల్ల కొన్ని సుగుణాలను పోగొట్టుకుంటాం. నేహ, సౌరభ్లకు థెరపీ చేశాక ఇది స్పష్టమైంది. నేహ తల్లీతండ్రి ఉద్యోగస్తులు. ఆమె బాల్యమంతా అభద్రతల మధ్య భయం భయంగా గడిచింది. సౌరభ్ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. తల్లి నాలుగిళ్లలో పనిచేస్తేనే తమ పొట్ట గడిచేది. గడ్డు పరిస్థితులను దాటడానికి తల్లి బాధ్యతలనూ తను తీసుకున్నాడు. పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ కుటుంబ పోషణకు సాయపడేవాడు. ఈ క్రమంలో బాల్యపు అమాయకత్వం కోల్పోయాడు. బాల్యంలో తనలో మాయమైపోయిన అమాయకత్వం నేహలో చూసి ముచ్చటపడ్డాడు సౌరభ్. తనలో లేని సుగుణాలను సౌరభ్‌లో చూసి ఆకర్షితురాలైంది నేహ. ఈ కారణంగా ఇద్దరూ దగ్గరయ్యారు. రెండేళ్ల తర్వాత లోపాలు బయటపడటం మొదలుపెట్టాయి. దీంతో ఇద్దరూ దూరమయ్యారు. ఇది తెలియక ఇద్దరూ ఒకరినొకరిని తిట్టుకున్నారు. మనలో లేనిది తెలియజెప్పడానికి వ్యక్తులు వస్తూనే ఉంటారు. ఎందుకు వాళ్లు మనల్ని అట్రాక్ట్ చేస్తున్నారో గ్రహించి, సరి చేసుకుంటే మనలోని అవకతవకలు సరిదిద్దుకోవడం సులభం అవుతుంది. – డా.లక్ష్మీ న్యూటన్, పాస్ట్ లైఫ్ థెరపిస్ట్, లైఫ్ రీసెర్చ్ అకాడమీ, హైదరాబాద్ భవిష్యత్తు దర్శనం ఒంటరితనం, అభద్రతా భావాలకు సంబంధించిన బీజాలు శిశువు గర్భంలో ఉన్నప్పుడే పడిపోతాయి. ఆ శిశువుతో పాటు భయాలు కూడా పెరుగుతాయి. ఈ క్రమంలో తల్లిదండ్రులు ప్రేమను చూపకపోతే బయట వెతుక్కునే ప్రయత్నం చేస్తారు పిల్లలు. ఎవరైనా ప్రశంసించడం, ముద్దు చేయడం చేస్తే సులువుగా అటువైపు అట్రాక్ట్ అవుతారు. అది తమ ఈడు వారైతే ఆకర్షణ స్థాయి ఇంకా పెరుగుతుంది. ఇంకొందరు గతజన్మలో పరిపూర్ణంగా అనుభవించని ప్రేమలను ఈ జన్మకు మోసుకొస్తారు. ప్రతి ఒక్కరూ తమలోని అర్థనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా గడిచిపోతుంది. మన లోపాలను సవరించడానికి వచ్చేవారివైపే ఆకర్షితులమౌతామని గుర్తించాలి. ఏడేళ్లకొకసారి మన శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఆకర్షణలు ఎంతకాలం ఉంటాయి? నిజమైన ప్రేమ – స్నేహం అంటే ఏంటి అనేది గుర్తించాలి. భవిష్యత్తును దర్శిస్తే శాశ్వతమైన బంధం ఏది అనే అవగాహన కలుగుతుంది. దుస్తులు మార్చినట్టుగా ఆత్మ.. దేహాలను జన్మ జన్మలుగా మార్చుకుంటూ వెళుతుంది. శాశ్వత ప్రేమ బంధం దైవంతోనే అని గుర్తిస్తే తమ జీవితం పట్ల సందేహాలు తలెత్తువు. – డాక్టర్ హరికుమార్, ఫ్యూచర్ థెరపిస్ట్, హైదరాబాద్ – నిర్మల చిల్కమర్రి -
రాళ్లు రువ్వుకున్న పరిటాల వర్గీయులు
సీకేపల్లి : అనంతపురం జిల్లా సీకేపల్లి మండలం ఓబులాపురంలో జరిగిన జనచైతన్య యాత్రలో రభస చోటుచేసుకుంది. పౌరసర ఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలుగా చీలిపోయిన టీడీపీ కార్యకర్తలు వాళ్లలో వాళ్లే రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. -
పేకాటలో కొట్లాట.. ఒకరి మృతి
హైదరాబాద్: పేకాట సందర్భంగా తలెత్తిన తగాదా ఒకరి మరణానికి కారణమైంది. బొల్లారం బొమ్మనకుంటలో సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు పేకాట ఆడారు. ఈ సందర్భంగా ఏర్పడిన విభేదాలతో వారు కొట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన జగద్గిరిగుట్టకు చెందిన శ్రీనివాసాచారి(40) అక్కడికక్కడే చనిపోయాడు. ఇందుకు సంబంధించి ఒక వ్యక్తి మంగళవారం ఉదయం బొల్లారం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఎల్బీనగర్లో ఘర్షణ : కత్తులతో దాడులు
హైదరాబాద్ : ఎల్బీనగర్లో ముగ్గురు వ్యక్తుల మధ్య ఆదివారం మధ్యాహ్నం ఘర్షణ చోటుచేసుకుంది. మన్సూరాబాద్ ఎరుకల బస్తీలో సెప్టిక్ ట్యాంక్ విషయంలో గొడవ తలెత్తింది. ఈ గొడవలో ముగ్గురు వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో పొడుచుకున్నారు. దీంతో స్థానికంగా భయనక వాతావరణం నెలకొంది. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడిలో గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారి వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
సర్దిచెప్పినందుకు కత్తితో దాడి
మదనపల్లి రూరల్: భార్యాభర్తలు గొడవపడుతుండగా వారించిన వ్యక్తిని కత్తితో పొడిచిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో శనివారం ఉదయం జరిగింది. మదనపల్లి కదిరి రోడ్డులోని భాగ్యలక్ష్మి రైస్‌మిల్లు గోడౌన్ వద్ద సుబ్రమణ్యం(మణి), ఆయన భార్య సురేఖ గొడవపడుతుండగా అదే ప్రాంతానికి చెందిన మణికంఠ, రైజేష్ అనే అన్నదమ్ములు సర్దిజెప్పేందుకు ప్రయత్నించారు. దంపతుల మధ్య కీచులాటలు తగదని చెప్పడంతో ఆగ్రహించిన సుబ్రహ్మణ్యం కత్తితో ఇద్దరిపై దాడిచేశాడు. ఈ సంఘటనలో మణికంఠ అక్కడికక్కడే మృతి చెందగా, రాజేష్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మణికంఠ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు కేరళకు చెందినవాడు. అన్నదమ్ములిద్దరూ స్థానిక జైభారత్ టైర్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. నిందితుడు సుబ్రహ్మణ్యం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘మీరు దళితులు.. గుడిలోకి రావొద్దు’
జిన్నారం: మెదక్ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. పెద్దమ్మ తల్లి గుడిలోకి రాకుండా దళితులను అడ్డుకోవడంతో.. వారంతా కలిసి పోలీసులను ఆశ్రయించారు. జిల్లాలోని జిన్నారం మండలం మంబపూర్ గ్రామంలో రెండు రోజులుగా పెద్దమ్మ తల్లి విగ్రహావిష్కరణ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో డప్పు కొడుతున్న దళితులను ఆలయ ప్రాంగణంలోనికి రాకుండా నిషేధించారు. దీంతో కోపోద్రిక్తులైన దళితులు బలవంతంగా ఆలయ ప్రవేశం చేయడానికి ప్రయత్నించగా.. అగ్రకులాల వారు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంతకి గుడిలోపలికి దళితులను రానివ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారితో చర్చలు జరుపుతున్నారు. -
ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
పామిడి: భూ వివాదంలో చెలరేగిన ఘర్షణలో రెండు వర్గాలకు చెందిన వారు పరస్పరం రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన అనంతపురం జిల్లా పామిడి మండలం పాలెం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంకరయ్య, నాగేంద్ర వర్గీయుల మధ్య గత కొన్ని రోజులుగా భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇరువర్గాలకు చెందిన వారు రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక రభస
ఆధిపత్యపోరులో చోడవరం ఇసుక క్వారీ మేం ముందంటే..మేం ముందంటూ బోడే, నెహ్రూ వర్గాల ఘర్షణ చట్ట విరుద్ధంగా ర్యాంపుల నిర్మాణం అనుమతులు లేని ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చోద్యం చూస్తున్న అధికారులు ఇసుక కొనుగోలు చేయలేని పేదలకోసం ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రభుత్వ పెద్దల జేబులు నింపేందుకే ఆపథకం ప్రవేశపెట్టారని అనతికాలంలో సామాన్యులు సైతం గ్రహించారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి ట్రక్కులకొద్దీ విలువైన ఇసుకను రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తూ అధికారపార్టీ నేతలు అడ్డంగా దోచుకుంటున్న సంగతి విదితమే..అయితే తాజాగా పెనమలూరులో ఇసుక తరలింపు వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి... ఇసుకను ముందు మేం తరలించాలంటూ..కాదు మేమే తరలించాలంటూ ఇరుపక్షాల వారు వాగ్యుద్ధానికి దిగడం చూస్తున్న వారిని విస్మయపరిచింది...ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకోవడానికి కొట్లాడుకుంటున్న వీరు ప్రజాప్రతినిధులేనా అని సామాన్యులు చర్చించుకుంటున్నారు... పెనమలూరు : జిల్లాకు చెందిన ఇద్దరు నేతల మధ్య ఇసుక వ్యవహారంలో గతకొంతకాలంగా నడుస్తున్న ఆధిపత్య పోరు తో చోడవరం ఇసుక క్వారీ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అనుచరులను క్వారీలోకి వెళ్లకుండా అధికారులు అడ్డుకోవడంతో వెంటనే ఆయన క్వారీవద్దకు చేరుకుని హల్చల్ చేశారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులు తవ్వుకుంటుంటే అడ్డుచెప్పని పోలీసులు, అధికారులు మాకు ఎందుకు అడ్డుచెబుతున్నారని నిలదీశారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గి నిషేధిత ప్రాంతంలో ఇద్దరు నేతల అనుచరులను ఇసుక తవ్వుకోవడానికి అనుమతించి, ఉదాసీనంగా ఉండిపోయారు. వివాదం ఇలా మొదలైంది... చోడవరం ఇసుక క్వారీలో ఇసుక తవ్వకాలకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రసాద్ అనుచరులు ఓ రైతు భూమి నుంచి ప్రత్యేకంగా క్వారీలోకి దారి వేశారు. ఇది తెలుసుకున్న మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అనుచరులు దగ్గరలోనే మరో రైతు పొలంనుంచి దారి వేశారు. ప్రసాద్ అనుచరులు ఇప్పటికే ఇసుక తవ్వకాలు ప్రారంభించగా, ఆదివారం నెహ్రూ అనుచరు లు ఇసుక తవ్వకాలకు రంగం సిద్ధం చేశారు. రెవెన్యూ అధికారులు వచ్చి నెహ్రూ అనుచరులకు అనుమతులు లేవని అభ్యంతరం తెలిపారు. సమాచారం తెలుసుకున్న నెహ్రూ వెంటనే క్వారీ వద్దకు చేరుకుని ఇసుక తవ్వకాలు చేయరాదని ఉత్తర్వులు ఉంటే చూపాలని అధికారులను డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు ఇసుక తవ్వకాలు చేయగా లేనిది, ఇతరులు చేస్తే ఏమి తప్పేంటంటూ అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గి ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. చట్టవిరుద్ధంగా తవ్వకాలు... చోడవరం ఇసుక క్వారీకి పూర్తిగా అనుమతులు లేవని,నిషేధిత ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని అధికారుల పరిశీలనలో తేలింది. ఏసీపీ సత్యానంద్, సీఐ దామోదర్, ఆర్.ఐ ప్రవీణ్, వీఆర్వో లావణ్య మైనింగ్ సర్వేయర్ చల్లాలు జిల్లా కలెక్టర్ ఇచ్చిన అనుమతులు, సర్వే నివేదిక పరిశీలించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చోడవరం క్వారీలో ఇసుక 14.4 హెక్టార్లలో ఉన్న ట్లు గుర్తించారు. అయితే పర్యావరణ అనుమతులు పొందాలంటే కలెక్టర్‌కు 5 హెక్టార్లకు మించి అనుమతి ఇచ్చే అధికారం లేదు. దీంతో ఈ క్వారీని మూడు సెక్టార్లుగా విభజించి హద్దులు ఏర్పాటు చేశారు. కలెక్టర్ 1వ సెక్టార్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీనికి కారనేనివారిపాలెం ర్యాంపును ఉపయోగిం చాలి. అయితే టీడీపీ నేత ముందుగా చట్టవిరుద్దంగా ఒక రైతు పొలంలో నుంచి ర్యాం పు వేసి సెక్టార్ 2లో ఇసుక తవ్వకాలు ప్రారంభించాడు. ఇక నెహ్రూ అనుచరులు మరో ర్యాంపు అనుమతులు లేకుండా వేసి సెక్టార్ 3లో తవ్వకాలు మొదలు పెట్టారు. వీరిద్దరు చేస్తున్నవి చట్టవిరుద్ద తవ్వకాలేనని తేలింది. అధికారుల దాటవేత ధోరణి... దీనిపై సంబంధిత అధికారులను ‘సాక్షి’ ప్రశ్నించగా ఎవరికివారు సమస్య తమదికాదన్నట్లు బదులిచ్చారు. ఇసుక తవ్వకాలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఏసీపీ సత్యానంద్ మాట్లాడుతూ అధికారికంగా రెవెన్యూ శాఖ నుంచి తమకు ఫిర్యాదు అందితేనే చర్యలు ఉంటాయన్నారు. మైన్స్ అధికారులు తాము హద్దులు నిర్ణయించామని, అతిక్రమించితే రెవెన్యూ అధికారులు మాత్రమే చర్యలు తీసుకోవాలని తాపీగా సెలవిచ్చారు. -
ప్రాణం తీసిన స్వల్ప వివాదం
ఇద్దరి మధ్య ఘర్షణ చేపల వ్యాపారి మృతి మచిలీపట్నం (కోనేరుసెంటర్) : మచిలీపట్నంలో ఇరువురి మధ్య ఏర్పడిన స్వల్ప వివాదం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన ఆదివారం మచిలీపట్నంలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ బి. వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక వైఎస్సార్ కాలనీకి చెందిన లంకే నాగేశ్వరరావు చేపల మార్కెట్లో వ్యాపారం చేస్తుం టాడు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాగేశ్వరరావు కొన్ని రోజుల క్రితం తన స్నానాల గది నుంచి వాడుక నీరు బయటికి పోయేలా ఇంటికి ఆనుకుని ఉన్న పంటబోదెలోకి పైపును అమర్చాడు. అదే కాలనీకి చెందిన కాకర్ల చంద్రరావుకు నాగేశ్వరరావు ఇంటి లైనులో కొంత స్థలం ఉంది. పైపు గుండా నాగేశ్వరరావు ఇంట్లోని వాడుక నీరు పంట బోదెలోకి చేరి చంద్రరావు స్థలం వైపుగా పారుతోంది. దీంతో చంద్రరావు నాగేశ్వరరావు ఇంట్లోని మురుగునీరు అంతా పంటబోదె గుండా తన స్థలం వైపు పారుతోందని స్థానికంగా ఉన్న నీటి సంఘం అధ్యక్షునికి ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు నీటి సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావును పిలిచి పైపు కారణంగా స్థానికులు ఇబ్బంది పడుతున్నారని, పైపును అక్కడి నుంచి తీసేయాలని సూచించాడు. అందుకు నాగేశ్వరరావు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని పైపును తీసేస్తానని చెప్పాడు. అక్కడితో సమస్య సద్దుమణిగిపోయింది. కాగా చంద్రరావు తన స్థలంలో మెరక పనులు చేయించుకుంటూ పంటబోదె పనుల కోసం వచ్చిన జేసీబీ డ్రైవర్‌కు బోదెలోకి ఉన్న పైపును చూపించి తప్పించాలని సూచించాడు. ఇది గమనించిన నాగేశ్వరరావు చంద్రరావుతో వాగ్వివాదానికి దిగాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహానికి గురైన నాగేశ్వరరావు చంద్రరావుతో పెనుగులాటకు దిగాడు. చంద్రరావు చేతిలోని గొడుగు కర్రతో నాగేశ్వరరావు తలపై కొట్టి ముందుకు నెట్టాడు. జరిగిన పెనుగులాటలో నాగేశ్వరరావు తల సమీపంలోని గోడకు గుద్దుకుంది. నాగేశ్వరరావు స్పృహ కోల్పోయాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. టౌన్ సీఐ వరప్రసాద్, మచిలీపట్నం, ఆర్‌పేట ఎస్సైలు ఎండీ అష్ఫాక్, హబీబ్ బాషాలు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుని కుమారుడు నాగేంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
హోటల్ వర్కర్ల ఘర్షణ: ఒకరి మృతి
దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలకేంద్రంలోని ఓ హోటల్లో వర్కర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో హరినాయక్(38) అనే వ్యక్తి మృతి చెందాడు. వర్కర్ల మధ్య ఘర్షణకు కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలాన్ని మిర్యాలగూడ రూరల్ సీఐ రవీందర్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు..
ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని నాంపల్లి హౌసింగ్ బోర్డులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. వీరిద్దరి మధ్య ఈ విషయంలో పలుమార్లు వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తాజాగా నిన్న రాత్రి ఒకరిపై మరొకరు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. -
స్నేహితుడి చెల్లెలు అని మధ్యలో వెళ్లినందుకు..
యువకుల మధ్య ఘర్షణ స్నేహితుడి చెల్లెలు అని మధ్యలో వెళ్లినందుకు.. కత్తెరతో పొడిచి చంపారు.. సూర్యాపేటలో ఘటన సూర్యాపేట మున్సిపాలిటీ: స్నేహితుడి చెల్లెలిని కొందరు వేధిస్తుండడంతో.. ప్రశ్నించేందుకు వెళ్లిన ఓ యువకుడు దారుణహత్యకు గుర య్యాడు. స్నేహితుడికి సహాయం చేద్దామని వెళ్లి విగతజీవిగా మారాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆదివారం రాత్రి జరిగింది. పట్టణంలోని గౌండ్ల బజార్‌కు చెం దిన మాందాస్ లక్ష్మి-సాయిలు కుమారుడు ఉపేందర్(21) కిరాణం దుకాణంలో గుమస్తా. ఆదివారం దుకాణానికి సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉన్నాడు. కాగా, అదే వీధికి చెందిన తన స్నేహితుడు నాగరాజు చెల్లెల్ని పట్టణంలోని పీఎస్సార్ సెంటర్, రాజీవ్‌నగర్ (బర్లపెంట బజార్)కు చెందిన కొందరు యువకులు వేధిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంటి వద్ద ఉన్న ఉపేందర్‌కు చెప్పి అతడితోపాటు మరో నలుగురు స్నేహితులను తీసుకొని పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గల శివాలయం వద్దకు చేరుకున్నా రు. అప్పటికే శివాలయం వద్ద ఉన్న వేధింపులకు పాల్పడిన యువకులు వెంటనే వీరిపై దాడికి దిగారు. ఇరువర్గాల యువకుల మధ్య పెనుగులాట జరి గింది. దీని నుంచి తేరుకున్న నాగరాజు, స్నేహితులు అక్కడి నుంచి పారిపోగా ఉపేందర్‌పై అప్పటికే పిడిగుద్దుల వర్షం కురిపించడంతో కింద పడిపోయాడు. ఇదే క్రమంలో వేధింపులకు పాల్పడుతున్న యువకుల్లో ఒకరు శివాలయానికి సమీపంలో గల బార్బర్ దుకాణంలోని కత్తెరను తెచ్చి, సొమ్మసిల్లి కిందపడిపోయిన ఉపేందర్ గుండెల్లోకి పొడిచాడు. దీంతో అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. -
రాళ్లు రువ్వుకున్న పచ్చతమ్ముళ్లు
రాజుపాలెం: గణేశ్ నిమజ్జనం సందర్భంగా తలెత్తిన గొడవ టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో గురువారం రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉగ్గం బాలరాజును సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలీసులను మోహరించారు. -
ప్రాణాలు తీసిన కళ్లాపి
మైదుకూరు: తెల్లవారుజామున ఇంటి ముందు చల్లుతున్న కళ్లాపి పక్కింటి గుమ్మం ముందుకు పడటంతో..ఘర్షణ జరిగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం జన్నావరం గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున మండ్ల వెంకటమ్మ (55) తన ఇంటి ముందు కళ్లాపి చల్లుతోంది. అవి పక్కనే ఉన్న నాగసుబ్బమ్మ ఇంటి గుమ్మం ముందుకు వెళ్లడంతో వారు గొడవకు దిగారు. సుబ్బమ్మ కుటుంబ సభ్యులు కూడా వెంకటమ్మపై దాడి చేశారు. వారి దాడిలో గాయపడిన వెంకటమ్మను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే వెంకటమ్మ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చంద్రబాబు సభలో డిష్యుం డిష్యుం
మహబూబ్‌నగర్ క్రైం: చంద్రబాబు నాయుడు గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సభ రణరంగాన్ని తలపించింది. సభలో చంద్రబాబునాయుడు ప్రసంగిస్తుండగానే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. ఏమవుతుందో అని పోలీసులు తెలుసుకునేలోగానే గాల్లోకి కుర్చీలు లేచాయి. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ సభా వేదికపైకి కుర్చీలు విసిరారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభ ఒక్కసారిగా అట్టుడికిపోయింది. దీంతో తేరుకున్న టీడీపీ కార్యకర్తలు కూడా ఎమ్మార్పీఎస్ కార్యకర్తల పైకి కుర్చీలు విసిరారు. టీడీపీ కార్యకర్తలు లేచి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లారు. ఒకరిపైకి ఒకరు కుర్చీలు విసురుకోవడంతో కొద్దిసేపు సభా ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. చాలా సేపటి వరకు అక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు, నాయకులకు అర్థం కాలేదు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలకు, జర్నలిస్టులకు, పోలీసులకు గాయాలయ్యాయి. అదే సమయంలో మిడ్జిల్ మండలంలోని గుడిగండ్ల గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ కార్యకర్త రాజు, మరో యువకుడు సభా ప్రాంగణం కప్పుపైకి వెళ్లి ఎమ్మార్పీఎస్ జెండాలతో చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు నివ్వెరపోయారు. వెంటనే పోలీసులు పెకైక్కి వారిని దింపేందుకు ప్రయత్నించారు. అంతలో సభలో ఉన్న టీడీపీ కార్యకర్తలు చెప్పులు, నీళ్ల బాటిళ్లు, కుర్చీలను ఎమ్మార్పీఎస్ నాయకులపైకి విసిరారు. టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నిస్తుండంతో పోలీసులు వలయంగా ఏర్పడి లాఠీచార్జి చేసి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. తేనెటీగల దాడికి యత్నం చంద్రబాబు సభలో నిరసన తెలిపేందుకు వచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తేనెటీగల దాడికి యత్నించారు. ఓ ప్లాస్టిక్ కవర్లో తేనెతుట్టెను తీసుకొచ్చి సభాప్రాంగణంపైకి విసిరేందుకు యత్నించారు. గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది దానిని వెంటనే నివారించారు. ఎస్ఐని సస్పెండ్ చేయాలని నినాదాలు.. సభప్రాంగణంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి డీసీఎంలోకి తరలిస్తున్న క్రమంలో పోలీసులు వారిని కులం పేరుతో దూషించడమే కాకుండా తమ కార్యకర్తలపై విచక్షణ రహితంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి అన్నారు. కార్యకర్తలను అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఉంచడంతో అధ్యక్షుడితో పాటు మరో 50మంది కార్యకర్తలు పోలీసుస్టేషన్ ఎదుట బైటాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంధ్రా పాలకులకు వత్తాసు పలుకుతూ పోలీసులు కార్యకర్తలపై జులుం చేయడం సమంజసం కాదని చెప్పారు. ప్రశాంతంగా తమ నిరసనను తెలియజేస్తున్న క్రమంలో పోలీసులు అత్యుత్సాహంగా తమపై దాడులకు దిగారని ఆరోపించారు. ఈ దాడులలో గాయాల పాలైన బాధితులను పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘర్షణలో ఇద్దరు పోలీసులకు గాయాలు.. ఎమ్మార్పీఎస్ కార్యకర్తల నిరసన సందర్బంగా ఎమ్మార్పీఎస్, టీడీపీ కార్యకర్తలు ఒకరిపైకి ఒకరు రాళ్లు, చెప్పులు, కుర్చీలు విసురుకునే క్రమంలో పోలీసులకు, జర్నలిస్టులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ యాదయ్య, మరో ఎస్ఐ తలకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఓ పత్రిక ఫొటోగ్రాఫర్ తలకు తీవ్ర గాయమైంది. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై చంద్రబాబు విచారం వ్యక్తం చేయడంతో పాటు గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును పార్టీ భరిస్తుందని హామీ ఇచ్చారు. గాయపడిన పత్రిక ఫొటోగ్రాఫర్‌కు లక్ష రూపాయల సాయం ప్రకటించారు. వేదిక వద్ద షార్ట్‌సర్క్యూట్ చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలోనే వేదిక వద్ద షార్ట్‌సర్క్యూట్ జరిగి కార్పెట్‌కు మంటలు అంటుకున్నాయి. అక్కడే కూర్చున్న కళాకారుల బృందం ఒక్కసారిగా పరుగులు తీయడంతో కలకలం చెలరేగింది. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. -
టీఆర్ఎస్ శ్రేణుల బాహాబాహీ
హసన్‌పర్తి : టీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. మా వర్గాని కంటే.. మా వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి సమావేశపు ఆవరణలో వేసిన కుర్చీలతో దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ఘర్షణ పడ్డారు. ఈ ఘటన హసన్‌పర్తి మండలం అన్నాసాగరంలో మంగళవారం జరిగింది. అన్నాసాగరం టీఆర్ఎస్ గ్రామశాఖతోపాటు అనుబంధ సంఘాల కమిటీలు వేయడానికి హన్మకొండ మండలానికి చెందిన ఆ పార్టీ నాయకుడు చింత రమేష్ ఎన్నికల పరిశీలకుడిగా వచ్చారు. ఇప్పటికే గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు మూడు వర్గాలుగా ఏర్పడ్డారు. తాజా మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు గడ్డం సమ్మయ్య, సీనియర్ నాయకులు ఐలయ్యతోపాటు ఆరుగురు వార్డు సభ్యులు అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. సీనియర్ నాయకులు, పార్టీకి అంకితమై పనిచేస్తున్నవారు ఉన్నందున ఎన్నిక జరపడానికి పరిశీలకుడు మొగ్గుచూపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. చివరికి ఒకరినొక రు నెట్టుకుంటూ కుర్చీలు లేపారు. ఒక వర్గం వైపు మరో వర్గం దాడి చేయడానికి దూసుకొచ్చింది. ఈ ఘటనతో హతాశుడైన ఇన్చార్జి కమిటీల ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 2వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని పరిశీలకుడు చింత రమేష్ తెలిపారు. -
ముంబైలో ఆగిన రైళ్లు..రెచ్చిపోయిన ప్రయాణికులు
ముంబై: ముంబైలో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య కారణంగా సబర్బన్ రైలు సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది. వేలాదిమంది ప్రయాణికులు ఆగ్రహావేశాలతో విధ్వంసానికి దిగారు. పట్టాలపైకి దూసుకెళ్లి పోలీసులపై రాళ్లు రువ్వి, టికెట్ బుకింగ్ కౌంటర్లు తదితర రైల్వే ఆస్తులకు నష్టం కలిగించారు. కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. ఆరు గంటల పాటు వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ సాగింది. థానే జిల్లాలోని థాకుర్లీ, దోంబివిలీ మధ్య ఓ లోకల్ రైలు విద్యుత్ వైరు తెగిపోవడంతో పలు స్టేషన్లలో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. తొలుత దివా స్టేషన్లో ప్రయాణికులు రైల్వే సిబ్బందితో గొడవపడ్డారు. తర్వాత దక్షిణ ముంబైలోని స్టేషన్లలో నిరసనలు పెల్లుబికాయి. ప్రయాణికులు రాళ్లు విసరడంతో కల్యాణ్-సీఎస్టీ స్టేషన్లో రైలు డ్రైవర్ గాయపడ్డారు. దీంతో డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. అయితే వారికి పోలీసు రక్షణ కల్పిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. దీంతో రైళ్లు యథావిధిగా నడిచాయి. ఈ అంశంపై రైల్వే మంత్రి సురేశ్ ప్రభు అధికారులతో మాట్లాడారు. ప్రయాణికులను సంయమనం పాటించాలని కోరారు. -
పాత కక్షలతోనే
నూతనకల్ : చిన్నపాటి ఘర్షణ చినికి.. చినికి గాలివానలా మారి ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. నూతన్‌కల్ మండలం మద్దిరాల గ్రామంలో టీడీపీ వర్గీయులచే దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ కార్యకర్త బుధవారం మృతిచెందాడు. పాతకక్షలను మనసులో పెట్టుకునే ఉమేష్‌పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన భూతం శంభయ్య, ఉమేష్‌లు తమ స్నేహితుడైన భూతం లింగరాజు ఇంట్లో మంగళవారం రాత్రి టీవీ చూస్తున్నారు. ఈ క్రమంలో లింగరాజుకు అతడి తమ్ముడు ఫోన్ చేయగా బయటికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో ఇంటి ఎదురుగా ఉన్న టీడీపీ కార్యకర్త భూతం వెంకన్న అలియాస్ చలం నీ ఇంట్లో ఎవరూ ఉన్నారని లింగరాజును అడిగాడు. ఉమేష్(25), శంభయ్య టీవీ చూస్తున్నారని పేర్కొన్నాడు. వారిని బయటికి పంపించాలని, లేకుం టే గొడవలు జరుగుతాయని వెంకన్న హెచ్చరిస్తూ లింగరాజు వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కున్నాడు. దీంతో భయాందోళనకు గురైన లింగరాజు ఇంట్లోకి వెళ్లి టీవీ చూస్తున్న వారిని బయటకి పంపించాడు. ఇంటికి వెళ్తున్న శంభయ్యను భూతం లింగయ్య మరికొందరు పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు వదలాయిం చుకుని పారిపోయాడు. వెనుకే ఉన్న ఉమేష్‌ను టీడీపీకి చెందిన వడ్డెనం యతిరాజారావుతో పాటు మరికొంద రు కలిసి పట్టుకున్నారు. అతడిని చర్చి సమీపంలోకి తీసుకెళ్లి బండరాయితో తలపై మోది, మరణాయుధాలతో దాడి చేయగా తీవ్ర గాయాలపాలయ్యాడు. రక్తపు మడుగులో పడిఉన్న ఉమేష్‌ను స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందాడు. వైరానికి ఆనాడే బీజం టీఆర్ఎస్ ప్రభుత్వం వైభవంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో టీడీపీ, అధికారపార్టీ కార్యకర్తల మధ్య వైరానికి బీజం పడినట్టు తెలుస్తోంది. సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మలను నిమజ్జనం చేసే చోట టీఆర్ఎస్ కార్యకర్తలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు డీజే ఏర్పాటు చేయడంతో పాటు తమ పార్టీ నేతల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. వీరితో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రెండు పార్టీల కార్యకర్తలు ఫ్లెక్సీల విషయంలో గొడవపడి ఒకరి ఫ్లెక్సీని మరొకరు తొలగించుకున్నా రు. దీంతో గత అక్టోబర్ 10వ తేదీన టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీ మండల నాయకుడు యతిరాజారావుపై దాడి చేశారు. ఈ కేసులో ఉమేష్ ఏ3 నిందితుడుగా ఉన్నాడు. అప్పటి నుంచి గ్రామంలో రాజకీయ వైరం బలపడిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గియులు ఉమేష్‌పై దాడిచేసి ఉండవచ్చని భావిస్తున్నారు. జీవనోపాధికి వరంగల్‌కు.. మృతుడు ఉమేష్ జీవనోపాధి కోసం వరంగల్ జిల్లా చిన్ననాగారం గ్రామానికి దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం వలసవెళ్లాడు. మృతుడి మేనమామ, బావ ఆత్మకూర్ (ఎస్) మండల పాత సూర్యాపేట గ్రామం తన్నీరు ఉపేందర్ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఇదే క్రమంలో దసరా పండగకు వచ్చి టీడీపీ వర్గీయులతో ఘర్షణ పడి వెళ్లాడు. తిరిగి మంగళవారం ఉదయం మద్దిరాలకు చేరుకుని హత్యకు గురయ్యాడు. మృతుడికి భార్య,కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంత్రి పరామర్శ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మృతిచెందిన ఉమేష్ కుటుంబ సభ్యులను రాష్ట్ర విద్యాశా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పరామర్శించారు. ఉమేష్ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఘటన గురించి వివరాలు అడిగితెలుసుకున్నారు. మృ తుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో పోలీసుల బందోబస్తు ఉమేష్ మృతితో గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడి స్నేహితుడు భూతం శంభ య్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుంగతుర్తి సీఐ ఎం.రాజాగంగరాం పర్యవేక్షణలో ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేశారు. సూర్యాపేట డీఎస్పీ ఎస్కె.రషీద్ ఆధ్వర్యంలో హాలియా సీఐ పార్థసారథి, అర్వపల్లి, తిరుమలగిరి ఎస్సైలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
గ్యాస్ గోదాములో ఘర్షణ
ఓజిలి: స్వల్ప విషయమై రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. సిలిండర్‌కు సంబంధించిన చిల్లర విషయంలో గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది, వినియోగదారులు ఘర్షణ పడ్డారు. తర్వాత ఇరువర్గాల వారు పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ మరింత మంది తోడుకావడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఓజిలిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన మైలాం దశరథరామిరెడ్డి, ఆయన బంధువు చామంత్‌రెడ్డి గ్యాస్ సిలిండర్ కోసం స్థానిక ఆర్ఆర్ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లారు. సిలిండర్‌కు సంబంధించి చిల్లర విషయంలో ఏజెన్సీ సిబ్బంది, చామంత్‌రెడ్డి మధ్య వాదులాట జరిగింది. విషయం తెలుసుకున్న చామంత్‌రెడ్డి తండ్రి ప్రసాద్‌రెడ్డి గ్యాస్ గోదాము వద్దకు చేరుకుని సిబ్బందితో ఘర్షణపడ్డారు. అక్కడి సామగ్రి, ఆటో కమ్ములు ధ్వంసం చేయడంతో పాటు సిబ్బంది కృష్ణయ్య, హరిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ప్రసాద్‌రెడ్డి తలకు తీవ్రగాయమైంది. ఇంతలో విషయం తెలుసుకుని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, వారి బంధువులు సుమారు 100 మంది గోదాము వద్దకు చేరుకున్నారు. కాసేపటికి ఎస్సై శ్రీనివాసులురెడ్డి ఏజెన్సీ వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన వారి వివరాలు సేకరించి ఇరువర్గాల వారిని మందలించి పంపారు. ఏజెన్సీ నిర్వాహకుడి బంధువు హల్చల్ గొడవ సర్దుమణిగందనుకుంటున్న తరుణంలోనే ఏజెన్సీ నిర్వాహకుడు సోదరుడు జయరామయ్య గ్రామంలో గొడవ సృష్టించి హల్చల్ చేశారు. ఏజెన్సీలో జరిగిన ఘటనతో ఏ సంబంధం లేని మైలాం మధుసూదన్‌రెడ్డి, మైలాం సుధాకర్‌రెడ్డి ఇళ్ల వద్దకు వెళ్లి దుర్భాషలాడటంతో పాటు వారిపై దాడికి పాల్పడ్డారు. ఇదంతా హెడ్‌కానిస్టేబుల్ రమణయ్య, కానిస్టేబుల్ నాగేంద్ర సమక్షంలో జరగడం గమనార్హం. గొడవతో తమకు సంబంధం లేదని మధుసూదన్‌రెడ్డి మొత్తుకుంటున్నా వినకుండా వారిని పోలీసుస్టేషన్‌కు లాక్కొచ్చారు. మరోవైపు ప్రసాద్‌రెడ్డి, చామంత్‌రెడ్డి, దశరథరామిరెడ్డిని కూడా స్టేషన్‌కు తరలించారు. ఇంతలో ఏజెన్సీ నిర్వాహకుడు సుబ్బారావు, జయరామయ్య తమ సిబ్బంది, బంధువులతో స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఇరువర్గాలు మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం చేసుకోవడంతో పాటు ఘర్షణకు దిగారు. గొడవ తీవ్రమై స్టేషన్ చుట్టూ జనాభా గుంపులుగా చేరినా సిబ్బంది ప్రేక్షకపాత్ర వహించడంపై ఎస్సై ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే లాఠీలతో జనాభాను చెదరగొట్టారు. అనంతరం ఎస్సైకి అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు రావడంతో ఇరువర్గాలకు మధ్యస్తం చేసి పంపారు. అయితే ఘర్షణలో గాయపడిన ప్రసాద్‌రెడ్డికి కనీసం ప్రథమ చికిత్స కూడా చేయించకుండా, ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్టేషన్లోనే ఉంచడం విమర్శలకు తావిచ్చింది. -
రెండు వర్గాల మధ్య చిచ్చు
సాక్షి, చెన్నై:నగరంలో రెండు వర్గాల మధ్య ఆదివారం చిచ్చు రేగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. పాత చాకలి పేట పాండియన్ థియేటర్ వీధిలో ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అత్యధికంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ మరో సామాజిక వర్గం తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. దేశ సామరస్యాన్ని చాటే రీతిలో రిపబ్లిక్ డే వేడుకలు ఓ వైపు కోలాహలంగా జరుగుతున్న సమయంలో ఒక వర్గం కార్యాలయ ప్రారంభోత్సవానికి దిగడం వివాదానికి దారి తీసింది. వివాదం: అట్టహాసంగా తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆ ప్రాంతంలోని మరో వర్గం వారు అడ్డుకున్నారు. ఈ వివాదంలోనే తమ కార్యాలయాన్ని ప్రారంభించిన నాయకుడు అక్కడి నుంచి వెళ్లి పోయారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. బ్యానర్లను చించేయడంతో వివాదం చిలికి చిలికి గాలి వానంగా మారింది. ఇరు వర్గాలు కయ్యానికి కాలు దువ్వు కోవడంతో పాండియన్ థియేటర్‌రోడ్డు యుద్ధరంగాన్ని తలపించింది. ఎక్కడికక్కడ దుకాణాలు మూత బడ్డాయి. రంగంలోకి బలగాలు సమాచారం అందుకున్న పోలీసు బలగాలు హుటాహటిన రంగంలోకి దిగాయి. వివాదం తీవ్ర రూపం దాల్చకుండా పరిస్థితిని కట్టడి చేసేందుకు లాఠీలకు పనిచెప్పారు. కనిపించిన వాళ్లందరినీ చెదరగొట్టారు. మళ్లీ వివాదం తీవ్ర రూపం దాల్చకుండా అక్కడే బలగాలు తిష్ట వేశాయి. అదే సమయంలో ఇక్కడి వివాద దృశ్యాల్ని కవర్ చేయడం కోసం మీడియా ఉరకలు తీసింది. మీడియా రావడంతో ఓవర్గం యువకులు మరింతగా రెచ్చి పోయారు. మీడియా పదే పదే తమ మీద నిందల్ని వేస్తున్నదంటూ తిరగ బడ్డారు. ఓ టీవీ ఛానల్ కెమెరామన్‌పై దాడి చేశారు. కెమెరాను ధ్వంసం చేశారు. ఇద్దరు ఫోటోగ్రాఫర్లపై దాడికి దిగారు. ఈతంతు అక్కడ కళ్ల ముందు సాగుతున్నా, పోలీసులు చోద్యం చూడటం కొసమెరుపు.