రాళ్లు రువ్వుకున్న పచ్చతమ్ముళ్లు | Friction in vinayaka visarjan | Sakshi
Sakshi News home page

రాళ్లు రువ్వుకున్న పచ్చతమ్ముళ్లు

Published Fri, Sep 25 2015 11:37 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Friction in vinayaka visarjan

రాజుపాలెం: గణేశ్ నిమజ్జనం సందర్భంగా తలెత్తిన గొడవ టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో గురువారం రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా  రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉగ్గం బాలరాజును సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలీసులను మోహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement