పేకాటలో కొట్లాట.. ఒకరి మృతి
Published Tue, Oct 25 2016 11:09 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
హైదరాబాద్: పేకాట సందర్భంగా తలెత్తిన తగాదా ఒకరి మరణానికి కారణమైంది. బొల్లారం బొమ్మనకుంటలో సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు పేకాట ఆడారు. ఈ సందర్భంగా ఏర్పడిన విభేదాలతో వారు కొట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన జగద్గిరిగుట్టకు చెందిన శ్రీనివాసాచారి(40) అక్కడికక్కడే చనిపోయాడు. ఇందుకు సంబంధించి ఒక వ్యక్తి మంగళవారం ఉదయం బొల్లారం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement