మైదుకూరు: తెల్లవారుజామున ఇంటి ముందు చల్లుతున్న కళ్లాపి పక్కింటి గుమ్మం ముందుకు పడటంతో..ఘర్షణ జరిగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం జన్నావరం గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున మండ్ల వెంకటమ్మ (55) తన ఇంటి ముందు కళ్లాపి చల్లుతోంది.
అవి పక్కనే ఉన్న నాగసుబ్బమ్మ ఇంటి గుమ్మం ముందుకు వెళ్లడంతో వారు గొడవకు దిగారు. సుబ్బమ్మ కుటుంబ సభ్యులు కూడా వెంకటమ్మపై దాడి చేశారు. వారి దాడిలో గాయపడిన వెంకటమ్మను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే వెంకటమ్మ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.