ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
Published Mon, Jul 18 2016 2:29 PM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM
పామిడి: భూ వివాదంలో చెలరేగిన ఘర్షణలో రెండు వర్గాలకు చెందిన వారు పరస్పరం రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన అనంతపురం జిల్లా పామిడి మండలం పాలెం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంకరయ్య, నాగేంద్ర వర్గీయుల మధ్య గత కొన్ని రోజులుగా భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇరువర్గాలకు చెందిన వారు రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement