ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని నాంపల్లి హౌసింగ్ బోర్డులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు.
వీరిద్దరి మధ్య ఈ విషయంలో పలుమార్లు వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తాజాగా నిన్న రాత్రి ఒకరిపై మరొకరు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.