
దోమ : ఫేస్‌బుక్‌లో పెట్టిన కామెంట్ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ సంఘటన మండల పరిధిలోని బడెంపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఏఎస్సై కమల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బడెంపల్లి గ్రామానికి చెందిన నీరటి శ్రీనివాస్ తన ఫేస్‌బుక్‌లో యాదవులు పులులని పోస్ట్ చేశాడు. దీంతో వేరే వర్గానికి చెందిన మక్త నరేష్ ‘బొంగు ఏమీ కాదు’ అని పోస్ట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో పెద్దలు సముదాయించారు. ఈ నెల 15(ఆదివారం) రాత్రి గ్రామంలో ఓ విందులో ఇరువర్గాల వారు పాల్గొన్నారు.
ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు గురించి మరోసారి వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల వారు ఘర్షణ పడగా ఒక వర్గానికి చెందిన ముగ్గురికి తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రి సంఘటన స్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇరువురి ఫిర్యాదు బేరకు 21మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment