burnt car
-
మెదక్: కారులో వ్యక్తి సజీవదహనం కేసులో న్యూ ట్విస్ట్
-
ఓఆర్ఆర్పై ప్రమాదం.. కారులోని వ్యక్తి సజీవ దహనం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ రెండో లైనులో ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్దమైంది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ప్రమాదానికి గురైన కారు ప్రకాశం జిల్లాకు చెందినదిగా స్థానికులు గుర్తించారు. -
కారుని దగ్ధం చేసిన దుండగులు.. డిక్కీలో డెడ్‌బాడీ
-
కారుని దగ్ధం చేసిన దుండగులు.. డిక్కీలో డెడ్‌బాడీ
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో గుర్తు తెలియని దుండగులు మంగళవారం తెల్లవారు జామున కారుని తగలబెట్టేశారు. దగ్ధమైన కారుని పరిశీలించగా డిక్కీలో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. కారుతోపాటు గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం కాలిపోయి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహం ఎవరిదన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మంటల్లో కాలిబూడిదైన కాగా TS 05 EH 4005 అనే నెంబర్ ప్లేట్ కలిగి ఉంది. కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన ధర్మకారి శ్రీనివాస్‌రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ నిన్న స్వగ్రామం నుంచి హైద్రాబాద్ వచ్చాడు. అయితే శ్రీనివాస్ మొబైల్ రాత్రి నుంచి స్విచ్చాఫ్‌లో ఉందని అతని భార్య తెలిపింది. కారులోని మృతదేహం ఎవరిదనే విషయంపై ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. విచారణ కొనసాగుతోంది. -
వివాహంలో వివాదం
నక్కపల్లి(పాయకరావుపేట): వివాహ కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చినికిచినికి గాలివానలా మారింది. ఒక వర్గం బంధులు వచ్చిన రెండు ఇన్నోవా వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నక్కపల్లి రెల్లికాలనీలో బుధవారం రాత్రి ఒక ఇంటి వద్ద వివాహం జరిగింది. విజయవాడ నుంచి బంధువులు రెండు ఇన్నోవా వాహనాలతో వచ్చారు. వివాహ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పెద్దలు ఇరువర్గాలకు రాజీ కుదిర్చారు. అయితే తెల్లవారుజామున ఒక వర్గం బంధువులు వచ్చిన రెండు ఇన్నోవా వాహనాలు దగ్ధమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ వాహనాలపై పెట్రోలు పోసి తగుల పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు ఇంకా ఫిర్యాదు అందలేదు. క్లూస్ టీం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. వాహనాలను ఎవరు తగులబెట్టారనే వివరాలు తెలియడంలేదని, ఇంతవరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సింహాచలం తెలిపారు. దగ్ధమైన వాహనాల విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. -
కారులో కాలిన క్యాష్ - ఉత్తమ్ కి నోటీసు
కాలిన కారులో బూడిద క్యాష్ రాష్ట్రమంతా సంచలనం సృష్టించి 24 గంటలైన తరువాత పోలీసులు కాంగ్రెస్ నేత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఆయనకు చెందిన ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్స్ కి నోటీసులు జారీ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. బుధవారం పోలింగ్ జరుగుతూండగా నల్గొండ జిల్లా సూర్యాపేట వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టికర్ ఉన్న కారు తనంతట తానుగా తగలబడింది.కారు బోనెట్ లో అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు తగలబడిపోతూ కనిపించాయి. కాస్త బాగున్న నోట్లను తీసుకుని కారు లో ఉన్న వ్యక్తులు పరారీ అయ్యారు. నోటీసులు పంపించిన విషయాన్ని నల్గొండ ఎస్ పి టీ ప్రభాకర రావు ధ్రువీకరించారు. డ్రైవర్ ను పట్టుకునేందకు ప్రయత్నిస్తున్నామని, డ్రైవర్ దొరికితే ఇంకా సమాచారం దొరుకుతుందని ఆయన అన్నారు.