Mahindra Scorpio N: దేశీయ మార్కెట్లో ఎస్‌యువిలకు డిమాండ్ విపరీతంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగానే ఎక్కువ మంది ప్రజలు మహీంద్రా, టాటా కంపెనీ మొదలైన కంపెనీ ఎస్‌యువిలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇవి కేవలం రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటాయి. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తాయి. ఇటీవల మహీంద్రా కంపెనీకి చెందిన 'స్కార్పియో ఎన్' మెట్లెక్కే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
యూట్యూబ్‌లో విడుదలైన వీడియోలో లేటెస్ట్ మహీంద్రా స్కార్పియో ఎన్ సులభంగా మెట్లు ఎక్కడం చూడవచ్చు. అంతే కాకూండా ఈ వైట్ కలర్ స్కార్పియో సులభంగా మెట్లు దిగటం కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మహీంద్రా స్కార్పియో ఎన్ కెపాసిటీ తప్పకుండా అర్థమవుతుంది. కార్లతో ఇలాంటి ప్రయోగాలు చేయడం ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కానీ ఈ వీడియోలో గమనించినట్లయితే ఆ ప్రాంతం మొత్తమ్ నిర్మానుష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మహీంద్రా కంపెనీ విడుదల చేసిన ఆధునిక కార్లలో స్కార్పియో ఎన్ ఒకటి. ఇది మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందింది. దీన్ని బట్టి చూస్తే ఇది కొనుగోలుదారులను ఎంతగా ఆకర్షించిందనే విషయం ఇట్టే అర్థమవుతుంది. చూడగానే ఆకర్షించే డిజైన్ కలిగిన ఈ కారు అత్యాధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది.
(ఇదీ చదవండి: కస్టమర్లకు షాకిచ్చిన ఓలా.. పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు)
మహీంద్రా స్కార్పియో ఎన్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ & 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ 198 bhp పవర్ 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. డీజిల్ ఇంజిన్ 173 bhp పవర్ 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.
(ఇదీ చదవండి: ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఇతడే..)
భారతదేశంలో మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రారంభ ధరలు ఇప్పుడు రూ. 13.06 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 24.51 లక్షల వరకు ఉంటాయి. ఈ SUV దేశీయ మార్కెట్లో మల్టిపుల్ వేరియంట్లలో & మల్టిపుల్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment