climbed
-
పూరీ జగన్నాథ ఆలయంలో కలకలం
పూరీ: ఒడిశాలోని పూరిలో గల జగన్నాథ ఆలయంలో కలకలం చెలరేగింది. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపధ్యంలో ఆలయంలో నిత్యం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయితే తాజాగా జరిగిన ఒక ఉదంతం ఆలయ భద్రతపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆలయ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయ శిఖరంపైకి చేరుకున్నాడు. దీనిని చూసినవారంతా షాకయ్యారు. సాయంత్రం వేళ ఆలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేచి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆలయ గోపురంపైకి ఎక్కిన వ్యక్తిని చూసిన ఆలయ సిబ్బందితో పాటు అక్కడున్న భక్తులంతా ఆశ్చర్యపోయారు.పూరీలోని శ్రీ మందిరం చుట్టూ గట్టి భద్రతా వలయం ఉంది. దీనిని తప్పించుకుని ఆ వ్యక్తి ఆలయంపైకి ఎలా ఎక్కగలిగాడనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. కాగా శిఖరాన్ని అధిరోహించిన ఆ వ్యక్తి పైననే కొద్దిసేపు ఉన్నాడు. ఆలయ అధికారులు అతనిని కిందకు తీసుకువచ్చారు. తరువాత పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి తాను ఒడిశాలోని ఛత్రపూర్నకు చెందినవాడినని తెలిపాడు. 1988 నుంచి తాను ఆలయానికి వస్తున్నానని, తన కోరిక ఒకటి నెరవేరాక, ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రాన్ని తాకి, అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: Karnataka: గణపతి నిమజ్జనంలో ఉద్రిక్తత -
Jahnvi Kapoor: ఓరీతో కలిసి తిరుమలను దర్శించిన హీరోయిన్ (ఫోటోలు)
-
శిఖరాలూ.. సలాం కొట్టాయ్!
బోణం గణేష్, సాక్షి ప్రతినిధి: సముద్రమట్టానికి వేల మీటర్ల ఎత్తు.. సహకరించని వాతావరణం.. అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదాలు.. గజగజలాడించే మంచు.. కానీ అతని సంకల్పానికి ఆ మహామహా శిఖరాలే తలవంచాయి. మార్షల్ ఆర్ట్స్‌లో అతని పట్టుదలకు అంతర్జాతీయ పతకాలు వరించాయి. ప్రపంచంలోని ఏడు అతిపెద్ద శిఖరాలను అధిరోహించిన అతని పేరు.. భూపతిరాజు అన్మీష్ వర్మ. విశాఖపట్నానికి చెందిన అన్మీష్ వర్మ తాను అధిరోహించిన ప్రతి పర్వతంపైనా జాతీయ జెండాతో పాటు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాల జెండాను ఎగురవేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అన్మీష్ గురించి విశేషాలు ఆయన మాటల్లోనే.. సరదాగా మొదలై.. శిఖరాల అంచులకు ఎగసి చిన్నప్పుడు విశాఖపట్నంలోని కొండలను సరదాగా ఎక్కేవాడిని. ఆ ఆసక్తే ఎవరెస్ట్ గురించి తెలుసుకునేలా చేసింది. దానిపైకి ఎక్కడం కష్టమని.. అధిరోహించడానికి వెళ్లిన వారు చనిపోతే శవాన్ని తేవడం కూడా కష్టమేనని తెలుసుకున్నాక దానిపైకి ఎలాగైనా ఎక్కాలని నిర్ణయించుకున్నాను. ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు విజయవాడలో ప్రభుత్వం సెలక్షన్స్ నిర్వహిస్తోందని తెలుసుకుని.. నేనూ వెళ్లాను. అప్పుడు వందల మంది వచ్చారు. కానీ నాతో పాటు ఐదుగురే ఎంపికయ్యారు. లేహ్, లడఖ్‌లో ప్రాక్టికల్ టెస్ట్ పూర్తి చేసి.. ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి అర్హత సాధించాను. మన దేశంలోనే అత్యంత వేగవంతమైన పర్వతారోహకుడిగా గుర్తింపు సంపాదించాను. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించిన ఏకైన వ్యక్తిగా గుర్తింపు లభించింది. నవరత్నాలతో పేదలకెంతో లబ్ధి.. అలాగే తొమ్మిదేళ్లకే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో మెడల్స్ సాధించాను. వరుసగా మూడు మెడల్స్ సాధించి రికార్డ్ సృష్టించాను. మా నాన్న వేణుగోపాలరాజు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కొన్నాళ్లు విధులు నిర్వర్తించి.. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా పనిచేశారు. 2014లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. నాన్న పోయిన 18 రోజులకు ఇంగ్లండ్‌లో కరాటే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు వెళ్లి పతకం సాధించాను. ఇప్పుడు నేనే మన దేశ కరాటే టీమ్‌కు కోచ్‌గా ఉన్నాను. రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలు నాకెంతో నచ్చాయి. ఎంతోమంది పేదలకు వాటి ద్వారా లబ్ధి చేకూరుతోంది. అందుకే ఆ పథకాల లోగో ఉన్న జెండాను మన దేశ జెండాతో పాటు ప్రపంచ శిఖరాలపై ఎగురవేస్తుంటాను. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో గ్రామీణ యువత, విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం. బతికిరావడమూ కష్టమే.. అడ్వెంచర్ గ్రాండ్ స్లామ్.. అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన వారికి ఆ గ్రాండ్ స్లామ్ టైటిల్ లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ టైటిల్ దక్కించుకున్న వారి సంఖ్య 30లోపే ఉంటుంది. అంత గొప్ప టైటిల్ నాకు లభించింది. ఎవరెస్టు, ఎల్బ్రస్, కిలీమంజారో, దెనాలి, అకాంగువా, మౌంట్ విన్సన్, కోస్కియోస్కోను అధిరోహించాను. అలాగే మైనస్ డిగ్రీల సెల్సియస్‌లలో.. భూమి నార్త్, సౌత్ పోల్ 90 డిగ్రీల అక్షాంశానికి చేరుకున్నాను. అదో పెద్ద సాహసం. తేడా వస్తే బతికిరావడం కష్టం. ఆ చలికి రక్తం గడ్డకడుతుంది. ఒకసారి ఎవరెస్ట్‌ను అధిరోహిస్తున్నప్పుడు నా సహ పర్వతారోహకుడికి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టింది. ఆ పరిస్థితిలో అతన్ని వదిలేసి వెళ్లలేకపోయాను. అతన్ని కాపాడటం కోసం వెనక్కి తిరిగొచ్చేశాను. ఆ తర్వాత ఏడాది మళ్లీ ప్రయత్నించాను. ప్రాణాలకు తెగించి లక్ష్యాన్ని చేరుకున్నాను. -
మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో
Mahindra Scorpio N: దేశీయ మార్కెట్లో ఎస్‌యువిలకు డిమాండ్ విపరీతంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగానే ఎక్కువ మంది ప్రజలు మహీంద్రా, టాటా కంపెనీ మొదలైన కంపెనీ ఎస్‌యువిలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇవి కేవలం రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటాయి. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తాయి. ఇటీవల మహీంద్రా కంపెనీకి చెందిన 'స్కార్పియో ఎన్' మెట్లెక్కే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యూట్యూబ్‌లో విడుదలైన వీడియోలో లేటెస్ట్ మహీంద్రా స్కార్పియో ఎన్ సులభంగా మెట్లు ఎక్కడం చూడవచ్చు. అంతే కాకూండా ఈ వైట్ కలర్ స్కార్పియో సులభంగా మెట్లు దిగటం కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మహీంద్రా స్కార్పియో ఎన్ కెపాసిటీ తప్పకుండా అర్థమవుతుంది. కార్లతో ఇలాంటి ప్రయోగాలు చేయడం ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కానీ ఈ వీడియోలో గమనించినట్లయితే ఆ ప్రాంతం మొత్తమ్ నిర్మానుష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహీంద్రా కంపెనీ విడుదల చేసిన ఆధునిక కార్లలో స్కార్పియో ఎన్ ఒకటి. ఇది మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందింది. దీన్ని బట్టి చూస్తే ఇది కొనుగోలుదారులను ఎంతగా ఆకర్షించిందనే విషయం ఇట్టే అర్థమవుతుంది. చూడగానే ఆకర్షించే డిజైన్ కలిగిన ఈ కారు అత్యాధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది. (ఇదీ చదవండి: కస్టమర్లకు షాకిచ్చిన ఓలా.. పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు) మహీంద్రా స్కార్పియో ఎన్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ & 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ 198 bhp పవర్ 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. డీజిల్ ఇంజిన్ 173 bhp పవర్ 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. (ఇదీ చదవండి: ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఇతడే..) భారతదేశంలో మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రారంభ ధరలు ఇప్పుడు రూ. 13.06 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 24.51 లక్షల వరకు ఉంటాయి. ఈ SUV దేశీయ మార్కెట్లో మల్టిపుల్ వేరియంట్లలో & మల్టిపుల్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
Priyanka Mohite: రికార్డులు బ్రేక్.. ఫస్ట్ ఇండియన్ ప్రియాంకనే..
భారత ఖ్యాతిని మరోసారి ఓ యువతి ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. తన పేరిటి సరికొత్త రికార్డును సృష్టించింది. మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే(30) ప్రపంచంలో మూడో ఎత్తైన శిఖరం కాంచనజంగను (8,586 మీటర్లు) గురువారం అధిరోహించారు. దీంతో ప్రపంచంలోని ఐదు.. 8,000 మీటర్ల కంటే ఎతైన శిఖరాలను అధిరోహించిన తొలి భారత మహిళగా ప్రియాంక ఘనత సాధించారు. ప్రియాంక గురువారం సాయంత్రం 4.52 గంటలకు మౌంట్ కాంచన్‌జంగా (8,586 మీ)పై తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది” అని ఆమె సోదరుడు ఆకాష్ మోహితే తెలిపారు. ఇక, ప్రియాంక.. తన చిన్నతనం నుంచే పర్వతారోహణపై మక్కువతో మహారాష్ట్రలోని సహ్యాద్రి శ్రేణిలోని పర్వతాలను అధిరోహించడం ప్రారంభించింది. 2012లో ఉత్తరాఖండ్‌లోని ఉన్న హిమాలయాల్లోని గర్వాల్ డివిజన్లో ఉన్న బందర్పంచ్ను అధిరోహించింది. 2020లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డ్‌ను ప్రియాంక మోహితే అందుకున్నారు. ప్రియాంక అధిరోహించిన శిఖరాలు ఇవే.. - ఏప్రిల్ 2021లో అన్నపూర్ణ పర్వతాన్ని (8,091 మీ), - 2013లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని (8,849 మీ), - 2018లో ల్హోట్సే (8,516 మీ), మౌంట్ మకాలు (8,485 మీ)ను, - 2016లో మౌంట్ కిలిమంజారో (5,895 మీ)ను అధిరోహించారు. -
ఎల్బ్రస్ శిఖరం అధిరోహించిన తెలుగు యువతి
భానుగుడి (కాకినాడ సిటీ): యూరప్ దేశాల్లోనే అత్యంత ఎత్తయిన ఎల్బ్రస్ శిఖరంపై.. మన స్వాత్రంత్య్ర దినోత్సవం నాడే మువ్వన్నెల జెండా రెపరెపలాడించి సంచలన రికార్డు నమోదు చేసిందో యువ ట్రెక్కర్. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన సుతాపల్లి దేవి(23)కి ట్రెక్కింగ్ అంటే అమితాసక్తి. ఆ ఆసక్తితోనే యూరప్ దేశాల్లోనే అత్యంత ఎత్తయిన ఎల్బ్రస్ శిఖరాన్ని (5,672 మీటర్లు) కేవలం నాలుగు రోజుల్లో అధిరోహించి.. అక్కడ మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఔరా! అనిపించింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజునే ఎల్బ్రస్ శిఖరంపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించడం తన జీవితంలో మరచిపోలేని ఆనందక్షణాలని సంతోషం వ్యక్తం చేసింది. -
అప్పుడు కిలిమంజారో... ఇప్పుడు ఎల్బ్రూస్
సాక్షి, పశ్చిమగోదావరి(నిడదవోలు) : రష్యాలోని అతిపెద్ద ఎల్బ్రూస్ పర్వతాన్ని నిడదవోలుకు చెందిన పర్వతారోహకుడు కంచడపు లక్ష్మణ్ బుధవారం అధిరోహించాడు. రష్యాలో ఈనెల 6న 5,642 మీటర్లు ఎత్తు ఉన్న ఎల్బ్రూస్ పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించగా బుధవారం నాటికి అధిరోహించి అరుదైన ఘనతను సాధించాడు. 2018 సెప్టెంబర్‌లో ఆఫ్రికా ఖండంలోనే 5,886 మీటర్లు ఉన్న అతి పెద్దదైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన లక్ష్మణ్ ఇప్పుడు ఎల్బ్రూస్ పర్వతం అధిరోహించి.. అక్కడ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటాన్ని ప్రదర్శించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. చిన్నప్పటి నుంచి లక్ష్మణ్‌కు వైఎస్సార్ కుటుంబం అంటే ఎనలేని అభిమానం. వైసీపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు పర్వతారోహణకు అవసరమైన ఆర్థిక సహకారం అందించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు రూ.లక్ష, నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో నిడదవోలు రోటరీక్లబ్ అధ్యక్షుడు అయినీడి పల్లారావు రూ. 50 వేల సాయం అందించారు. మాజీ రోటరీక్లబ్ అధ్యక్షులు కారింకి సాయిబాబు రూ.10 వేలు అందించారు. -
ఎవరెస్టుపై మెరిసిన మరో మన్యం వీరుడు
కుంజవారి గూడెం ఖ్యాతిని పెంచిన దుర్గారావు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండో గిరిజనుడు చింతూరు (రంపచోడవరం): ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి భారత పతాకాన్ని రెపరెపలాడించడంతో పాటు రాష్ట్రం, జిల్లా పేరును ఇనుమడింపజేశాడు కుంజా దుర్గారావు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రెండో పర్వతారోహకుడిగా పేరుగడించాడు. వీఆర్‌పురం మండలం కుంజవారిగూడెం గ్రామానికి చెందిన 18 ఏళ్ల కుంజా దుర్గారావు . శనివారం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. గిరిజన కుటుంబానికి చెందిన దుర్గారావు తండ్రి పిచ్చిరెడ్డి, తల్లి లచ్చమ్మ గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ, పూరిపాకలో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. దుర్గారావుకు అన్న కల్యాణ్, ఇద్దరు సోదరిలు ఉన్నారు. తాము నిరక్షరాస్యులమైనా తమ బిడ్డల్ని పెద్ద చదువులు చదివించాలనే కుమారులిద్దర్నీ చదివిస్తున్నట్టు తండ్రి పిచ్చిరెడ్డి తెలిపాడు. కల్యాణ్ డిగ్రీ చదువుతుండగా దుర్గారావు మారేడుమిల్లి గురుకుల కళాశాలలో ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ పాసయ్యాడు. క్రీడలంటే ప్రాణం మా ఇద్దరికీ క్రీడలంటే ఎంతో ప్రాణమని, ప్రధానంగా వాలీబాల్ ఆడేవారమని దుర్గారావు సోదరుడు కల్యాణ్ తెలిపాడు. క్రీడల పట్ల ఉన్న ఆసక్తే తన తమ్ముడిని పర్వతారోహణ వైపు ఆకర్షితుడిని చేసిందన్నాడు. ఎవరెస్టు అధిరోహించిన దూబి భద్రయ్యను ఆదర్శంగా తీసుకుని తాను కూడా ఎవరెస్టు అధిరోహించాలని ఆకాంక్షించాడని అతను తెలిపాడు. రంపచోడవరం ఐటీడీఏ సహకారంతో దూబి భద్రయ్య శిక్షణలో గతేడాది డిసెంబర్లో దుర్గారావు రెనాక్ పర్వతం అధిరోహించాడని అదేనెలలో చింతూరులో శిక్షణా కార్యక్రమం జరిగిందని తెలిపాడు. అనంతరం జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ పర్వతాన్ని అధిరోహించాడని కల్యాణ్ తెలిపాడు. అందులో ప్రతిభ కనబరచిన దుర్గారావుతో సహా ఆరుగురు శనివారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారని వివరించాడు. 45 రోజుల్లో అధిరోహించాల్సిన శిఖరాన్ని కేవలం 30 రోజుల్లోనే అధిరోహించి వారు రికార్డు సృష్టించారని కళ్యాణ్ తెలిపాడు. చిన్నకొడుకు దుర్గారావు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాడనే ఆనందం ఒకవైపు పెద్దకొడుకు కళ్యాణ్ శుక్రవారం విడుదలైన కానిస్టేబుల్ సెలక్షన్లో ఎంపికయ్యాడనే ఆనందం వారి తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తమ వాడు ఎవరెస్ట్ అధిరోహించాడనే విషయం ఆదివారం ఉదయం తమకు తెలిసిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంటిల్లిపాదీ ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిల్లా నుంచి రెండోవాడు గతంలో చింతూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దూబి భద్రయ్య మనజిల్లా నుంచి ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి గిరిజనుడిగా పేరు గడించాడు. దీంతో ఐటీడీఏ అతనిని రాష్ట్రంలోని గురుకుల కళాశాలల్లో చదువుతున్న యువతకు పర్వతారోహణలో శిక్షణ ఇచ్చే శిక్షకుడిగా నియమించింది. అతని శిక్షణలోనే కుంజా దుర్గారావు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండో యువకుడిగా గురువు పేరు నిలబెట్టాడు. పలువురి అభినందన దుర్గారావు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం పట్ల రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, చింతూరు ఐటీడీఏ పీఓ గుగ్గిలి చినబాబు అభినందనలు తెలియజేశారు. పంచాయతీ సర్పంచ్ రవ్వ సుజాత, గ్రామస్తులు కూడా దుర్గారావును అభినందించారు. ఎంతో ఆనందంగా వుంది నాబిడ్డ ఏదో కొండ ఎక్కాడని నా పెద్దకొడుకు చెప్పాడు. ఎవరెవరో వచ్చి అభినందనలు చెబుతున్నారు. ఎంతో ఆనందంగా వుంది. వాడిని ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను. -కుంజా లచ్చమ్మ, దుర్గారావు తల్లి -
సెల్‌టవరెక్కిన ముగ్గురు యువకులు
షాబాద్(రంగారెడ్డి జిల్లా): షాబాద్ మండలాన్ని కొత్తగా ఏర్పడబోయే వికారాబాద్ జిల్లాలో కలపొద్దంటూ షాబాద్‌లో ముగ్గురు యువకులు ఎయిర్ టెల్ సెల్‌టవర్ ఎక్కారు. షాబాద్‌ను శంషాబాద్ జిల్లాలో ఉంచాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి మహేందర్ రెడ్డి వచ్చేంతవరకు సెల్‌టవర్ దిగమని భీష్మించుకు కూర్చున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి దింపే ప్రయత్నం చేస్తున్నారు. -
భారత్ లో పారిశుద్ధ్యం కోసం కిలిమంజారో ఎక్కాడు!
భారతదేశంలోని పాఠశాలల్లో పారిశుధ్య సౌకర్యాలే లక్ష్యంగా అతడు నడుం బిగించాడు. విద్యార్థుల అవస్థలు తీర్చేందుకు సిద్ధపడ్డాడు. అందుకు సొమ్ము సమకూర్చుకోడానికి పర్వతారోహణ ప్రారంభించాడు. ఇండో కెనడియన్ వ్యాపారవేత్త గిరీష్ అగర్వాల్ ఫిబ్రవరి 29న ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారో ఎక్కి రూ. 40 లక్షల నిధులు సేకరించాడు. 'సమిట్ ఫర్ డిగ్నిటీ పేరున' ప్రచారం చేపట్టి ఇండియాలోని పాఠశాల విద్యార్థులకు మౌలిక సౌకర్యాల కల్పనకు పూనుకున్నాడు. పాఠశాల వయసు నుంచే పిల్లల్లో పరిశుభ్రతపై అవగాహనతో పాటు, మంచి అలవాట్లను పెంపొందించాలన్న ఉద్దేశంతో గిరీష్ అగర్వాల్ తన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలోని 60 కోట్ల మంది ప్రజలు పారిశుధ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అందులోనూ పాఠశాలల్లో ఈ సమస్య మరింతగా ఉంది. సుమారు 45 శాతం స్కూళ్లలో మౌలిక సమదుపాయాలు లేవు. ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినా పాఠశాలల్లో 40 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ చొప్పున ఉన్నాయి. ఒక్కో స్కూల్లో సుమారు 250 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు అనేక ఇన్ఫెక్షన్లకు గురౌతున్నారు. డ్రాపవుట్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క జంషెడ్ పూర్ లోనే 200 మంది విద్యార్థినులు మౌలిక సదుపాయాల లేమి కారణంగా డ్రాపవుట్స్ గా మారారు. ఈ విషయంపై దృష్టి సారించిన అగర్వాల్ నిధుల సేకరణ కోసం పర్వతారోహణ ప్రారంభించాడు. అత్యంత ప్రమాదకరమైన ప్రయత్నమే అయినా.. ఛాలెంజింగ్ గా తీసుకున్న అగర్వాల్ 5900 మీటర్ల ఎత్తైన పర్వతం కిలిమంజారో అధిరోహించాడు. పర్వతారోహణకు కావలసిన ఆరోగ్యం కోసం అగర్వాల్ కఠిన నియమాలు పాటించాడు. అందుకు తనకు భార్య శృతి, స్నేహుతులు ఎంతో సహకరించారని చెప్తున్నాడు. ముంబైలో పుట్టి, ఢిల్లీలో పెరిగిన అగర్వాల్ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నాడు. అక్కడి వ్యాపారవేత్తల్లో టాప్ 25 గా నిలవడమే కాక, కెనడా వలస పెట్టుబడిదారుల గ్రూప్ గోల్డ్ మెడలిస్ట్ అవార్డును కూడా అందుకున్నాడు. తాను పేదరికంలో పుట్టినా, అయితే తన తల్లిదండ్రులకు ఇరుగు పొరుగులు, బంధువులు సహకరిచండంతో చదువుకోగాలిగానని, అందుకు కృతజ్ఞుడినని అగర్వాల్ చెబుతున్నాడు. వివిధ దేశాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి వీలుగా అగాఖాన్ డెవలప్మెంట్ నెట్‌వర్క్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్న అగర్వాల్... ఇళ్ళల్లో లక్ష మరుగుదొడ్లు, సూళ్ళలో 528 టాయిలెట్ బ్లాకులు, అలాగే 26 కమ్యూనిటీ టాయిలెట్ కాంప్లెక్సుల నిర్మాణం కోసం రూ. 1.67 కోట్ల నిధుల సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తన ఫండ్ రైజర్ పేజిలో రాశాడు. అందుకోసం ఒక్కో పర్వతం ఒక్కోసారి ఎక్కి తన కల నెలవేర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు.