భారత ఖ్యాతిని మరోసారి ఓ యువతి ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. తన పేరిటి సరికొత్త రికార్డును సృష్టించింది. మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే(30) ప్రపంచంలో మూడో ఎత్తైన శిఖరం కాంచనజంగను (8,586 మీటర్లు) గురువారం అధిరోహించారు. దీంతో ప్రపంచంలోని ఐదు.. 8,000 మీటర్ల కంటే ఎతైన శిఖరాలను అధిరోహించిన తొలి భారత మహిళగా ప్రియాంక ఘనత సాధించారు.
ప్రియాంక గురువారం సాయంత్రం 4.52 గంటలకు మౌంట్ కాంచన్‌జంగా (8,586 మీ)పై తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది” అని ఆమె సోదరుడు ఆకాష్ మోహితే తెలిపారు. ఇక, ప్రియాంక.. తన చిన్నతనం నుంచే పర్వతారోహణపై మక్కువతో మహారాష్ట్రలోని సహ్యాద్రి శ్రేణిలోని పర్వతాలను అధిరోహించడం ప్రారంభించింది. 2012లో ఉత్తరాఖండ్‌లోని ఉన్న హిమాలయాల్లోని గర్వాల్ డివిజన్‌లో ఉన్న బందర్‌పంచ్‌ను అధిరోహించింది. 2020లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డ్‌ను ప్రియాంక మోహితే అందుకున్నారు.
ప్రియాంక అధిరోహించిన శిఖరాలు ఇవే..
- ఏప్రిల్ 2021లో అన్నపూర్ణ పర్వతాన్ని (8,091 మీ),
- 2013లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని (8,849 మీ),
- 2018లో ల్హోట్సే (8,516 మీ), మౌంట్ మకాలు (8,485 మీ)ను,
- 2016లో మౌంట్ కిలిమంజారో (5,895 మీ)ను అధిరోహించారు.
Comments
Please login to add a commentAdd a comment