Mount Everest
-
బిపర్జోయ్ పంజా రాజస్తాన్‌పై
జైపూర్/భుజ్: గుజరాత్ తీరప్రాంత జిల్లాలను అతలాకుతలం చేసిన బిపర్జోయ్ తుపాను పక్కనే ఉన్న రాజస్తాన్‌పై ప్రతాపం చూపుతోంది. తుపాను దెబ్బకు గుజరాత్‌ను ఆనుకుని ఉన్న రాజస్తాన్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మౌంట్ అబూలో 210 మిల్లీమీటర్లు, సెడ్వాలో 136 మిల్లీమీటర్లు.. ఇలా తదితర ప్రాంతాల్లో తెరిపినివ్వకుండా వర్షం పడుతోంది. ఎడతెగని వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ బార్మెర్, జలోర్, సిరోహి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. పాలీ, జోధ్‌పూర్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రంలో తుపాను మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే సోమవారం దాకా వర్షాలు ఆగవని వారు వెల్లడించారు. ఓవైపు వర్షాలు పడుతున్నా మరోవైపు రాష్ట్రంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధోల్పూర్ ప్రాంతంలో 41.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తుపాను కారణంగా నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. జఖౌలో షా పర్యటన, పరామర్శ.. సొంత రాష్ట్రం గుజరాత్లో తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. ఏరియల్ సర్వే చేశారు. సహాయక కార్యక్రమాలు జరిగిన ప్రాంతాల్లో పనుల్లో నిమగ్నమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అభినందించారు. జఖౌ, మండ్వీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించారు. భుజ్‌లో సమీక్షా సమావేశంలో పాల్గొని తాజా పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెల్సుకున్నారు. తుపాను బీభత్సం నుంచి నెమ్మదిగా గుజరాత్‌లోని కఛ్ జిల్లా పట్టణాలు, గ్రామాలు కోలుకుంటున్నాయి. వరద నీరు నివాసాలు, రహదారులను వదలడంతో వ్యాపారాలు, దుకాణాలు తెరుచుకున్నాయి. గురువారం సాయంత్రం జఖౌ పోర్టులో తీరాన్ని తాకిన తుపాను భీకర రూపం దాల్చి కుండపోత వర్షాలతో ముంచెత్తడం తెల్సిందే. త్వరలో అది వాయుగుండం మారి బలహీనమవనుందని అధికారుల తెలిపారు. శనివారం సైతం బనస్కాంతా జిల్లా, పటాన్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పటాన్, మెహ్సానా, కఛ్ జిల్లాల్లోని కొన్ని చోట్ల ఆదివారం సైతం భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వెల్లడించారు. గాంధీనగర్, అహ్మదాబాద్, సురేంద్రనగర్, మోర్బీ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు. -
‘త్రీ’ చీర్స్.. చరిత్ర సృష్టించిన అక్కాచెల్లెళ్లు
కాఠ్మాండు: చాలా మంది పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల ఆస్తులను వారసత్వంగా పొందుతారు. కానీ తండ్రి ఇష్టాన్నే తమ ఇష్టంగా భావించారీ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. తండ్రికి ఇష్టమైన పర్వతారోహణను వారూ స్వీకరించి ముగ్గురికి ముగ్గురూ ఎవరెస్ట్‌ను అధిరోహించారు. తద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డునూ నెలకొల్పారు. ఇప్పటివరకూ ఇంతమంది అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఎవరెస్ట్ ఎక్కలేదట. ఆ రికార్డును వారు తమ తండ్రికి అంకితం కూడా చేశారు. ఇది తమ మొదటి అడుగేనని, త్వరలో రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహిస్తామని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలైన ‘సెవెన్ సమ్మిట్స్’ పూర్తి చేసి రికార్డ్ నెలకొల్పాలనే ప్లాన్‌లో ఉన్నారు నేపాల్‌కు చెందిన దావా ఫుతి షెర్పా, నిమా జంగ్మూ షెర్పా, సెరింగ్ నంగ్యా షెర్పా. వీళ్ల తాత కూడా పర్వతారోహకుడే. ఇక వాళ్ల నాన్న డోర్జీ షెర్పా పర్వతారోహణ శిక్షకుడిగా, గైడ్‌గానూ పనిచేశాడు. మొట్టమొదటి సారి ఆయన 1982లో జపనీస్ పర్వతారోహకులతో కలిసి చలికాలంలో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు ఆ చల్లదనానికి ఆయన ఎనిమిది వేళ్లు పాడైపోయాయి. అయినా ఆయన పర్వతారోహణను మానలేదు. 2007 వరకు కొనసాగించాడు. ఆ తండ్రి వారసత్వాన్ని పిల్లలూ తీసుకున్నారు. ఈ అక్కాచెల్లెళ్లకంటే ముందు వాళ్ల సోదరుడు మింగ్మా సైతం ఆరుసార్లు ఎవరెస్టును అధిరోహించాడు. అంటే.. ఫ్యామిలీ ఫ్యామిలీ పర్వతారోహకులన్నమాట. చదవండి: రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు.. ఎందుకు వెన్నుపోటు పొడిచారని అడిగిన టోరీ సభ్యులు -
ఎవరెస్ట్ మిన్నగా.. ప్రపంచం చిన్నగా.. నా కల నెరవేరింది: అన్వితా రెడ్డి
సాక్షి, యాదాద్రి: ‘ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరిన తర్వాత చూస్తే.. ప్రపంచం చాలా చిన్నగా కనిపించింది. ఎప్పటినుంచో ఉన్న ఆశ ఈ సంవత్సరం తీరింది. నా కల నెరవేరింది. వివిధ పర్వతాలు అధిరోహించిన అనుభవంతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఎవరెస్ట్ ఎక్కగలిగాను. మరో శిఖరాన్ని ఎక్కడానికి ఉత్సా హంగా ఉన్నాను’అంటూ సంతో షం వ్యక్తం చేశారు ఎవరెస్ట్ పర్వతం అధిరోహించిన పడమటి అన్వితారెడ్డి. ఈ నెల 16న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆమె బుధవారం ఉదయం 10.30కి నేపాల్‌లోని బేస్‌క్యాంపునకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఫోన్లో ‘సాక్షి’తో చెప్పిన అంశాలు ఆమె మాటల్లోనే.. అధైర్యపడలేదు... ‘‘మొదట ఎంత ఆత్మస్థైర్యం, నమ్మకంతో ప్రారంభమయ్యానో... చివరి వరకు అలాగే ఉన్నా. ఎక్కడా అధైర్యపడలేదు. అంతా సవ్యంగా జరిగింది. బేస్ క్యాంపు నుంచి సమ్మిట్ వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చేరుకోగలిగా. డిసెంబర్లో మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో రష్యాలోని ఎల్బ్రోస్ పర్వతం ఎక్కినప్పుడు చిన్న ఇబ్బందులు తలెత్తాయి. వాటన్నింటినీ అధిగమించి ఆ పర్వతం అధిరోహించాను. అప్పుడు నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు ఎవరెస్ట్ అధిరోహించడంలో తోడ్పడ్డాయి. వాతావరణం అనుకూలించనప్పుడు కొంత ఇబ్బంది పడ్డాను. కానీ, వాతావరణం అనుకూలించగానే ఎక్కడా ఆగకుండా సాగర్మాత (ఎవరెస్ట్ శిఖరాన్ని సాగర్మాత అంటారు) వరకు చేరుకున్నాను. సంతోషంతో కేరింతలు.. మే 16న ఉదయం 9.30 గంటలకు ఎవరెస్టును అధిరోహించాను. అక్కడినుంచి చూస్తే ప్రపంచమంతా చిన్నగా కనిపించింది. చుట్టు పక్కల దేశాలు చిన్నగా అనిపించాయి. నా లక్ష్యం నెరవేరిందన్న సంతోషంతో ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత కేరింతలు కొట్టాను. నా వద్ద ఉన్న కెమెరాతో వీడియో తీశాను. ఫొటోలు తీసుకున్నాను. 15 నుంచి 20 నిమిషాలపాటు శిఖరాగ్రంపై ఉన్నాను. ఆ సమయంలో నా వెంట తెచ్చిన పూజా జెండాలు కట్టడంతోనే సరిపోయింది. భూమి మీదికి వచ్చిన తర్వాత అన్ని పెద్దగా కనిపిస్తున్నాయి. మరెన్నో లక్ష్యాలు... నాకింకా ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని ఖండాల్లో ఉన్న పర్వతాలన్నింటినీ అధిరోహించాలి. ఒక్కొక్కటిగా నెరవేర్చకుంటా. నన్ను ప్రోత్సహిస్తున్న నా తల్లిదండ్రులు, కోచ్‌లు, స్పాన్సర్లకు కృతజ్ఞతలు’’ అంటూ అన్విత ఉద్వేగాన్ని పంచుకున్నారు. -
Priyanka Mohite: రికార్డులు బ్రేక్.. ఫస్ట్ ఇండియన్ ప్రియాంకనే..
భారత ఖ్యాతిని మరోసారి ఓ యువతి ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. తన పేరిటి సరికొత్త రికార్డును సృష్టించింది. మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే(30) ప్రపంచంలో మూడో ఎత్తైన శిఖరం కాంచనజంగను (8,586 మీటర్లు) గురువారం అధిరోహించారు. దీంతో ప్రపంచంలోని ఐదు.. 8,000 మీటర్ల కంటే ఎతైన శిఖరాలను అధిరోహించిన తొలి భారత మహిళగా ప్రియాంక ఘనత సాధించారు. ప్రియాంక గురువారం సాయంత్రం 4.52 గంటలకు మౌంట్ కాంచన్‌జంగా (8,586 మీ)పై తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది” అని ఆమె సోదరుడు ఆకాష్ మోహితే తెలిపారు. ఇక, ప్రియాంక.. తన చిన్నతనం నుంచే పర్వతారోహణపై మక్కువతో మహారాష్ట్రలోని సహ్యాద్రి శ్రేణిలోని పర్వతాలను అధిరోహించడం ప్రారంభించింది. 2012లో ఉత్తరాఖండ్‌లోని ఉన్న హిమాలయాల్లోని గర్వాల్ డివిజన్లో ఉన్న బందర్పంచ్ను అధిరోహించింది. 2020లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డ్‌ను ప్రియాంక మోహితే అందుకున్నారు. ప్రియాంక అధిరోహించిన శిఖరాలు ఇవే.. - ఏప్రిల్ 2021లో అన్నపూర్ణ పర్వతాన్ని (8,091 మీ), - 2013లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని (8,849 మీ), - 2018లో ల్హోట్సే (8,516 మీ), మౌంట్ మకాలు (8,485 మీ)ను, - 2016లో మౌంట్ కిలిమంజారో (5,895 మీ)ను అధిరోహించారు. -
ఫాస్టెస్ట్ ఉమన్: ఎవరెస్టును ఎక్కిన తొలి మహిళ
సరిగ్గా వారం క్రితం మే 23 వ తేదీ ఆదివారం ఈ ‘ఫీట్’ను సాధించారు హంగ్. బేస్ క్యాంప్ నుంచి ఆ ముందు రోజు మధ్యాహ్నం గం.1.20 లకు ఎవరెస్టును ఎక్కడం ప్రారంభించి, మర్నాడు మధ్యాహ్నం గం. 3.10 ని.లకు శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఆమె తన సంతృప్తి కోసం చకచకా ఎవరెస్టును ఎక్కారు తప్ప.. ‘ఫాస్టెస్ట్ ఉమన్’ అని అనిపించుకోడానికి ఎక్కలేదట! 25 గంటల 50 నిముషాల్లో ఎక్కడం పూర్తి చేశారు. అది రికార్డు అని అప్పుడు ఆమెకు తెలియదు. పక్కనే ఉన్న టీమ్ లీడర్ షేర్పాకు, ఆ టీమ్‌లోని తక్కిన పర్వతారోహకులకూ అంత కచ్చితంగా తెలీదు. వారంతా కిందికి దిగి వచ్చాక ఈ శుక్రవారం నేపాల్ ప్రభుత్వాధికారులు త్సాంగ్ ఇన్ హంగ్ 12 గంటల తేడాతో పాత రికార్డును బద్దలు కొట్టినట్లు ప్రకటించారు! ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి వేగంగా ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మహిళగా నేపాల్‌కు చెందిన ఫున్జో ఝంగ్ము లానా పేరుతో రికార్డు ఉంది. 2018 మే 17న ఆమె ఆ రికార్డును నెలకొల్పారు. 39 గంటల 6 నిముషాల్లో బేస్ క్యాంప్ నుంచి ఫున్జో ఆ రికార్డును నెలకొల్పారు. ఫున్జో రికార్డును ఇప్పుడీ హాంకాంగ్ మహిళ త్సాంగ్ ఇన్ హంగ్ తనకు తెలియకుండానే బ్రేక్ చేశారు. నిజానికి మే 12 నే శిఖరాన్ని చేరుకోవలసింది హంగ్. ఆ రోజు గాలులు ఉద్ధృతంగా ఉన్నాయి. కుమ్మరించినట్లుగా ఒకటే మంచు. 8,750 మీటర్ల ఎత్తుకు వెళ్లి కూడా అక్కడే ఆగిపోయారు. ఇక వంద మీటర్లే కదా, ఎక్కేద్దాం అనుకోలేదు. తొలిసారి ఆమె 2017 మే 21న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఇప్పుడు మళ్లీ ‘డ్రీమర్స్ డెస్టినేషన్ ట్రెక్స్ అండ్ ఎక్స్‌పెడిషన్’ కంపెనీ తరఫున మరొకసారి ఎవరెస్టును చేరుకున్నారు. అదీ అత్యంత వేగంగా. హంగ్ టీచర్. ఎవరెస్టు కంటే ముందు 2016లో ఆమె చైనాలోని ముజ్టాగ్ పర్వతాన్ని ఎక్కారు. ‘‘ఇదంతా నా స్టూడెంట్స్, నా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం’’ అంటారు హంగ్. కలను నిజం చేసుకోలేకపోతే జీవితంలో మనం తర్వాతి అడుగు వేయలేం అని హంగ్‌కు వాళ్ల అమ్మ చెబుతుండేవారట. 2011–2019 మధ్య కాలంలో హంగ్ ఐదు వేల నుంచి ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాలను ఇరవై సార్లు ఎక్కి దిగారు. పర్వతాలు సానుకూల ఆలోచనల్ని కలిగిస్తాయని, ఒదిగి ఉండటం నేర్పుతాయనీ హంగ్ అంటారు. -
కరోనా ఎఫెక్ట్: ఎవరెస్ట్‌పై చైనా విభజన రేఖ
బీజింగ్: కోవిడ్ కట్టడి కోసం ప్రపంచదేశాలన్ని విభిన్న మార్గాలు అనుసరిస్తుండగా.. తాజాగా చైనా ఎవరెస్ట్ పర్వతంపై విభజన రేఖ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకుంది. ఎందుకంటే నేపాల్ నుంచి ఎవరెస్ట్ అధిరోహిచండానికి వచ్చే పర్వతారోహకులు తమ దేశంలో ప్రవేశించడం వల్ల కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని చైనా భావిస్తోంది. దీన్ని కట్టడి చేయడం కోసం చైనా ఎవరెస్ట్ శిఖరంపై విభజన రేఖ ఏర్పాటు చేయనుందని డ్రాగన్ జాతీయ మీడియా తెలిపింది. నేపాల్ నుంచి ఎవరెస్ట్ అధిరోహించడానికి వస్తున్న వారిలో చాలా మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. విభజన రేఖ ఏర్పాటు వల్ల పర్వతారోహకులు చైనాలోని ఎవరెస్ట్ ఉత్తర దిశగా పర్వతాన్ని ఎక్కడాన్ని నిరోధిస్తుంది. అంతేకాక సరిహద్దును దాటడం.. నేపాల్ వైపు, ఎవరితోనైనా.. ఏ వస్తువులతోనైనా సంబంధాలు పెట్టుకోవడాన్ని కూడా నిషేధిస్తుంది. ప్రస్తుతం చైనాలో స్థానికంగా వ్యాప్తి అవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినప్పటికి.. వేరే దేశాల నుంచి వచ్చే వారి ద్వారా నమోదవుతున్న కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఇక తాజాగా నేపాల్‌లో కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది. అధిరోహకులు చైనా వైపు నుంచి శిఖరాన్ని చేరుకోవడానికి ప్రయత్నించే ముందే.. టిబెటన్ పర్వతారోహణ మార్గదర్శకుల బృందం శిఖరం వద్ద విభజన రేఖను ఏర్పాటు చేస్తుందని అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. అయితే విభజన రేఖను ఎలా గీస్తారు.. ఏ ప్రామాణికాల ప్రకారం ఏర్పాటు చేస్తారు అనే దాని గురించి నివేదిక స్పష్టం చేయలేదు. భారతదేశం, చైనా మధ్య హిమాలయపర్వత సానువుల్లో ఉన్న చాలా ప్రధాన నగరాలు, పట్టణాల్లో లాక్డౌన్ విధించారు. దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు. చదవండి: చైనా కుతంత్రం: జీవాయుధంగా కరోనా -
ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు పయనమైన యువకిరణం
-
చైనా దిగజారుడు రాజకీయాలు
ఖట్మాండు : చైనా భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలవాలన్న భారత్ ప్రయత్నానికి డ్రాగన్ కంట్రీ అడ్డుతగులుతోంది. నేపాల్‌తో కలసి సంయుక్తంగా ఎవరెస్ట్ శిఖర ఎత్తును కొలిచేందుకు భారత్ పంపిన ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. దీంతో ఈ వ్యవహారం వెనుక చైనా హస్తం ఉండి ఉంటుందని భారత్ భావిస్తోంది. ఎవరెస్ట్ ఎత్తును తామే కొలుస్తామని.. భారత్, చైనాలు కేవలం కీలకమైన గణాంకాలను అందిస్తే చాలని నేపాల్ సర్వే విభాగం డైరెక్టర్ జనరల్ గణేష్ భట్టా చెప్పారు. 2015లో 7.8 తీవ్రతతో ‘గోర్ఖా భూకంపం’ నేపాల్ ను కుదిపేసింది. ఈ విలయం తర్వాత ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ సర్వే డిపార్ట్ మెంట్ తో కలిసి ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు సర్వే ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు పంపింది. కానీ, నేపాల్ మాత్రం నిర్మోహమాటంగా భారత్ ప్రతిపాదనను తిరస్కరించింది. నేపాల్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చి చైనా ఈ పని చేయించి ఉంటుందని భారత అధికారులు అంటున్నారు. మరి చైనా కూడా అలాంటి ప్రతిపాదనలేమైనా పంపిందా? అంటే.. అలాంటిదేం లేదని నేపాల్ స్పష్టత ఇచ్చింది. చుట్టుపక్కల దేశాల నుంచి సమాచారం తీసుకోవటం కీలకం. అందుకే భారత్, చైనా నుంచి డేటాను మాత్రం స్వీకరిస్తాం అని నేపాల్ చెబుతోంది. 1975 నుంచి 2005 దాకా ఎవరెస్ట్ ఎత్తును చైనానే నిర్థారిస్తూ వచ్చింది. 1956లో భారత్ అలాంటి ప్రయత్నం చేసింది. స్వతంత్ర భారతావనిగా ఆవిర్భవించక ముందునాటి నుంచే ఎవరెస్ట్ శిఖర విషయంలో భారత్ జోక్యం ఉండేది. సర్ జార్జ్ నేతృత్వంలోని భారత్ బృందం 1855లో ఎవరెస్ట్‌ను అత్యంత ఎత్తైన పర్వత శిఖరంగా గుర్తించింది. -
కొండల కింగ్
ఆయన ఆశయం పర్వతాలను అధిరోహించడం. ఆర్థికంగా, ఆరోగ్యంగానూ అనుకూలించకపోయినా లక్ష్యసాధనలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ప్రపంచంలోనే గొప్ప పర్వతాలపైకి అడుగిడి భారత కీర్తిపతాకను ఎగురవేసే సన్నాహాల్లో ఉన్నారు. సాక్షి, బెంగళూరు: ఆస్తమాతో బాధపడుతున్నా లెక్కచేయకుండా పట్టుదలతో బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆరు పర్వతాలను అధిరోహించి త్వరలో ప్రపంచంలో ఏడవ ఎౖల్తైన పర్వతాన్ని ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన సత్యరూప్ చిన్న వయసులోనే ఆస్తమా బారిన పడడంతో పాఠశాలలో తరగతి గదుల మెట్లను ఎక్కడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. చిన్న వయసు నుంచి మెల్లిగా చిన్న గుట్టలు,కొండలు ఎక్కడం ప్రారంభించారు. సిక్కింలో ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో ఒక ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం సంపాదించారు. మౌంట్ విన్సన్‌పై గురి అయితే పర్వతారోహణ లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోయారు. 2008లో పర్వతారోహణకు నడుం బిగించారు. ఇప్పటివరకు ప్రపంచలోని అతిఎత్తైన ఆరు పర్వతాలను అధిరోహించిన సత్యరూప్ డిసెంబర్ 1 నుంచి ప్రపంచంలో ఏడవ ఎత్తైన అంటార్కిటికా (దక్షిణ ధృవం) ఖండంలోని దక్షిణ ధృవ పర్వతశ్రేణికి చెందిన మౌంట్ విన్సన్ మ్యాసిఫ్ పర్వతాన్ని అధిరోహించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇది విజయవంతమైతే ప్రపంచంలో ఏడు ఎత్తైన శిఖరాలు (సెవెన్ సమిట్స్) అధిరోహించిన అతికొద్ది మందిలో ఒకరిగా కీర్తి గడించనున్నారు. ఇది పూర్తయితే అర్జెంటీనా,చీలి దేశాల మధ్యనున్న ప్రపంచలోని ఎత్తైన, ప్రమాదాలతో కూడిన మౌంట్డెల్ సలాడూ అగ్నిపర్వతాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎవరెస్టుపై మృత్యు పోరాటం పర్వతారోహణలో ఎన్నో కష్టాలు ఆయనను చుట్టుముట్టినా వెనుతిరగలేదు. 2015లో ఎవరెస్ట్ అధిరోహణ సమయంలో నేపాల్‌లో సంభంవించిన భూకంపం అడ్డంకిగా నిలిచింది. దీంతో 2016లో ప్రయత్నించి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించసాగారు. ప్రమాదవశాత్తు తమ ముగ్గురు సహచరులను కోల్పోవాల్సి వచ్చింది. బాధను దిగమింగి ప్రయాణం కొనసాగించారు.ఎవరెస్ట్ తుదికి చేరుకునే సరికి ఆక్సిజన్ మాస్క్‌లో లోపం వల్ల అరగంట పాటు మృత్యువు అంచుల్లోకి వెళ్లారు. కాగా, డిసెంబర్ నుంచి చేపట్టే యాత్రకు ఆర్థిక సాయం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. -
చిన్నబోయిన ఎవరెస్టు!
ప్రపంచంలో ఎవరి ఉన్నత వ్యక్తిత్వాన్నయినా చెప్పడానికీ, ఏ సమస్య తీవ్రతనైనా అర్ధం చేయించడానికీ, ఎవరైనా సాధించిన అసమాన విజయాన్ని అభివర్ణించడానికీ ఎవరెస్టుకు మించిన కొలత లేదు. శతాబ్దాలుగా మనిషిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్న ఆ శిఖరాన్ని అధిరోహించడంద్వారా ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తులున్నారు. 2001లో ఆ శిఖరాగ్రానికి చేరుకున్న ఎరిక్ వీన్మేయర్ పుట్టు అంధుడు. 2008లో ఎక్కిన మిన్ బహదూర్ షెర్చాన్ 76ఏళ్ల వృద్ధుడైతే, 2012లో చేరుకున్న వాతన్బీ 73 ఏళ్ల వృద్ధురాలు. 2010లో అధిరోహించిన జోర్డాన్ రొమేరో 13 ఏళ్ల బాలుడు. ఇంకా...వాలీబాల్ క్రీడలో జాతీయస్థాయి క్రీడాకారిణిగా రాణించిన అరుణిమ రైల్లో దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి కాలు కోల్పోయినప్పుడు...ఆ ఘటన తన ఆత్మస్థైరాన్ని దెబ్బతీయలేదని ప్రకటించడానికి ఆమె ఎన్నుకున్న మార్గం ఎవరెస్టు శిఖరారోహణ. ఇలాంటివారి అడుగులో అడుగేస్తూ, ఆపద్బాంధవుల్లా నిలుస్తూ...ఆ క్రమంలో తమ ప్రాణాలు కోల్పోయేవారు షెర్పా తెగవారు. ఎవరెస్టు శిఖరారోహణే ఏకకాలంలో వారికి బతుకుతెరువు, మృత్యుమార్గం కూడా. ఆరోహకులకు దారి చూపడమేకాదు...వారికి అవసరమైన భారీ సరంజామాను మోసుకెళ్లే పనికూడా వారిదే. కూలడానికి సిద్ధంగా ఉండే అత్యంత ప్రమాదకరమైన మంచు ఖండాలను గుర్తించడం, వాటిని ఒడుపుగా దాటుకెళ్లడమెలాగో అంచనా వేసుకోవడం వారి నిత్యకృత్యం. చావుకు తెగిస్తేనే వారి బతుకు బండి నడుస్తుంది. మృత్యువును నిత్యం పరిహసిస్తేనే వారి జీవితం చివురుతొడుగుతుంటుంది. కాదనుకున్న మరుక్షణం అంతా తలకిందులవుతుంది. 29,029 అడుగులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరంగా నిలిచిన ఎవరెస్టును జయించడం అంత సులభం కాదు. అటువైపు అడుగులేయాలని నిర్ణయించుకున్నాక అందుకోసం వేలాది డాలర్లు వెచ్చించి శిక్షణ తీసుకుంటారు. శిక్షణంతా పూర్తయ్యాక మాత్రమే బేస్ క్యాంపులోకి ప్రవేశం. ఎవరెస్టు దిశగా కదలినప్పుడు ప్రతి అడుగుకూ ఆక్సిజన్ తగ్గిపోతూ వెళ్లేకొద్దీ ఊపిరాడని స్థితి ఏర్పడుతుంది. దానికితోడు మనిషిని నిలువునా గడ్డకట్టించే చలి. ఎటునుంచి హిమఖండం విరిగిపడుతుందో తెలియదు. ఇలాంటి ఘటనల్లో గాయపడినవారిని మోసుకురావడం కూడా ఒక్కోసారి అసాధ్యం. హెలికాప్టర్ అక్కడికి చేరడం అత్యంత దుర్లభం. మృతదేహంగా మిగిలిపోతే చాలా సందర్భాల్లో కిందకు తీసుకురావడం కూడా సాధ్యంకాదు. టన్నులకొద్దీ హిమ సమూహంకింద ఉండిపోయే మృతదేహాలను అసలు గాలించడమే కష్టం. ఎవరెస్టు శిఖరాగ్రానికి చేరడానికి 15 మార్గాలను గుర్తిస్తే అందులో రెండు మాత్రమే కొద్దో గొప్పో సురక్షితమైనవి. డెత్ జోన్‌గా పేరున్నా, మృత్యువు పొంచివుంటుందని అర్ధమైనా అక్కడికి చేరేందుకు తహతహలాడేవారి సంఖ్య తక్కువేమీ కాదు. ఏడాదికి 2,000మంది వరకూ ఎవరెస్టును పలకరించేందుకు ఉత్సాహపడతారు. గత ఏడాది దాదాపు 700మంది శిఖరారోహణ చేశారు. ఇలాంటివారందరికీ ప్రధానమైన ఆధారం షెర్పాలే. ఎన్నడూ ఏ రికార్డునూ బద్దలు కొట్టినట్టుగా గుర్తింపుపొందని షెర్పా తెగవారు ఇప్పుడు అలిగారు. అలిగి ఆ శిఖరం జోలికి ఇకపై వెళ్లబోమన్నారు. గతవారం మంచుఖండం విరిగిపడిన ఘటనలో 16మంది షెర్పా యువకులు ప్రాణాలు కోల్పోవడం ఈ అలకకు కారణం. ఎవరెస్టు శిఖరంపై మరణాలు వారికి కొత్త కాదు. అడపా దడపా అలాంటివి సంభవిస్తూనే ఉంటాయి. కానీ, ఇంతమంది ఒకే ఘటనలో మరణించడం ఇదే ప్రథమం. ఇంత జరిగినా వారి అలక ఎవరెస్టుపై కాదు...తమను గడ్డిపోచల్లా చూస్తున్న నేపాల్ ప్రభుత్వంపై. ఏడాదికి రెండు మూడు నెలలపాటుండే సీజన్లో ఆ షెర్పాలు సంపాదించే మొత్తం మన రూపాయిల్లో చూస్తే దాదాపు రెండు లక్షలు మాత్రమే. ఏడాదిపొడవునా ఇంటిల్లిపాదీ దానిపైనే ఆధారపడి బతకాలి. ప్రమాదంలో మరణించిన సందర్భాల్లో నేపాల్ ప్రభుత్వం వారి కుటుంబాలకు చెల్లించే మొత్తం రూ. 40,000. పదేళ్లక్రితం షెర్పాల సంక్షేమానికంటూ చట్టంచేశారు. అయినప్పటికీ వారి బతుకుల్లో మార్పేమీ లేదు. దేశానికి ప్రధాన ఆదాయ వనరైన టూరిజంలో ఎవరెస్టు శిఖరారోహణ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది. ఏటా లక్షల డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెడుతున్నది. అందులో షెర్పాలదే ముఖ్య భూమిక. అయినాసరే తమ సంక్షేమానికిగానీ, తమ కుటుంబాల భద్రతకుగానీ నేపాల్ సర్కారు వీసమెత్తు విలువీయడం లేదన్నది వారి అభియోగం. షెర్పాల అలక ముందు ఇప్పుడు ఎవరెస్టు చిన్నబోయింది. అక్కడంతా అనిశ్చితి అలుముకుంది. ఈ సీజన్లో ఇక అడుగు ముందుకేయబోమన్న షెర్పాల నిర్ణయం నేపాల్ ప్రభుత్వాన్ని గందరగోళంలోకి నెట్టింది. వారి ఆందోళనను చల్లార్చడమెలాగో తెలియక అది తలపట్టుకుంది. మూర్ఛవ్యాధితో బాధపడుతూ తన శిఖరారోహణద్వారా అందరికీ స్ఫూర్తిని కలిగిద్దామని చేరుకున్న యువకుడు... బ్యాంకు ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి, ఉన్న ఫ్లాటును కూడా అమ్మేసి, దాచుకున్న మరికొంచెం సొమ్మును కూడా జతచేసి ఎవరెస్టు కోసమని ఖర్చుచేసేందుకు వచ్చిన మరో మధ్యవయస్కుడు, తన సోదరుడి అస్థికలను ఎవరెస్టుపైకి చేర్చాలని వచ్చిన మరొకరు ఈ తాజా పరిణామాలతో ఖిన్నులయ్యారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న షెర్పాలను పట్టించుకోనందువల్లనే ఈ పరిస్థితి. ఉన్నతంగా నిలవడం ఎలాగో, ఆలోచించడమెలాగో తనను చూసి నేర్చుకోమని ఎవరెస్టు చెబుతోంది. నేపాల్ సర్కారు వింటుందా?!