షాబాద్(రంగారెడ్డి జిల్లా): షాబాద్ మండలాన్ని కొత్తగా ఏర్పడబోయే వికారాబాద్ జిల్లాలో కలపొద్దంటూ షాబాద్‌లో ముగ్గురు యువకులు ఎయిర్ టెల్ సెల్‌టవర్ ఎక్కారు. షాబాద్‌ను శంషాబాద్ జిల్లాలో ఉంచాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి మహేందర్ రెడ్డి వచ్చేంతవరకు సెల్‌టవర్ దిగమని భీష్మించుకు కూర్చున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి దింపే ప్రయత్నం చేస్తున్నారు.
సెల్‌టవరెక్కిన ముగ్గురు యువకులు
Published Sun, Sep 11 2016 4:43 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement