three young men
-
విహారయాత్రకు వెళ్లి ముగ్గురు యువకుల మృతి
-
సెల్‌టవరెక్కిన ముగ్గురు యువకులు
షాబాద్(రంగారెడ్డి జిల్లా): షాబాద్ మండలాన్ని కొత్తగా ఏర్పడబోయే వికారాబాద్ జిల్లాలో కలపొద్దంటూ షాబాద్‌లో ముగ్గురు యువకులు ఎయిర్ టెల్ సెల్‌టవర్ ఎక్కారు. షాబాద్‌ను శంషాబాద్ జిల్లాలో ఉంచాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి మహేందర్ రెడ్డి వచ్చేంతవరకు సెల్‌టవర్ దిగమని భీష్మించుకు కూర్చున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి దింపే ప్రయత్నం చేస్తున్నారు. -
కీచకులకు మరణశిక్ష
అత్యాచారం, హత్య కేసులో ముగ్గురినీ ఉరితీయాలంటూ ఢిల్లీ కోర్టు తీర్పు న్యూఢిల్లీ: ప్రేమను తిరస్కరించడమే ఆ యువతి చేసిన తప్పిదం. దీంతో రగిలిపోయిన ఆ కిరాతకుడు మరో ఇద్దరితో కలసి ఆమెను కిడ్నాప్ చేశాడు. ముగ్గురూ కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో వదలకుండా దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. తట్టుకోలేని ఆ యువతి మరణించడంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టి తమదారిన తాము వెళ్లిపోయారు. 2012, ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు కిరాతకులు చట్టం ముందు దోషులుగా నిలిచారు. ఆ ముగ్గురికీ మరణశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు బుధవారం తీర్పుచెప్పింది. దీనిని అరుదైన కేసుల్లోకెల్లా అరుదైనదిగా పేర్కొన్న జడ్జి... వారు చనిపోయేవరకూ ఉరితీయాలని తీర్పుచెప్పారు. కేసు పూర్వాపరాలివీ: గుర్గావ్లోని సైబర్సిటీలో ఉద్యోగం చేస్తున్న 19 ఏళ్ల ఓ యువతి ఇంటికి సమీపంలో రవి(23), రాహుల్ (27) అద్దెకుంటున్నారు. ఇద్దరూ సోదరులు. రవి తన ప్రేమను వ్యక్తీకరించగా.. ఆ యువతి తిరస్కరించింది. దీంతో రవి.. సోదరుడు రాహుల్, స్నేహితుడు వినోద్(23)తో కలసి 2012, ఫిబ్రవరి 9న ఆమె ఆఫీసు నుంచి ఇంటికొస్తుండగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కళ్లల్లో యాసిడ్ పోసి.. మర్మాంగంలో గాజుముక్కలు ఉంచి చిత్రహింసలు పెట్టారు. బాధితురాలు మరణించడంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. -
వివాహానికి వెళ్తూ అనంతలోకాలకు..
వైరా, న్యూస్‌లైన్: వివాహ కార్యక్రమానికి వెళ్తూ ముగ్గురు యువకులు విగతజీవులయ్యారు. అతివేగమే వారిని బలిగొంది. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు...సికింద్రాబాద్‌కు చెంది న కొణతం వరుణ్‌కృష్ణ సోదరుడి వివాహం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం తెల్లవారుజామున జరగనుంది. ఈ వివాహానికి హాజరయ్యేందుకు వరుణ్‌కృష్ణ, తన స్నేహితులతో కలిసి బయలుదేరారు. ఖమ్మంలోని పెళ్లి కుమారుడి అమ్మమ్మ ఇంట్లో శుక్రవారం ఒడుగుకు హాజరయ్యారు. ఇది ముగిసిన తర్వాత ఖమ్మం నుంచి పెళ్లికొడుకు కారు బయలుదేరాకా, వెనుక స్నేహితులందరూ మరో కారులో సత్తుపల్లికి పయనమయ్యారు. అతివేగంగా వెళ్తున్న వీరి కారు వైరా మండలం స్టేజీ పినపాక వద్ద రోడ్డు ఎడమ వైపు నుంచి ఒక్కసారిగా కుడివైపునకు దూసుకువచ్చి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కడపకు చెందిన యూటీఎఫ్ జిల్లా నాయకుడి కుమారుడు, సాఫ్ట్వేర్ ఉద్యోగి బీరం శ్రీధర్‌రెడ్డి(30), ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన బాలా ప్రదీప్(31) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు 108 వాహనంలో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బెల్లంపల్లికి చెందిన కిరణ్(30) చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరుణ్‌కృష్ణ, వరంగల్‌కు చెందిన హరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారు నడుపుతున్న కిరణేశ్వర్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సిరిపురం గ్రామ రెవెన్యూ అధికారి సాంబశివరావు ఫిర్యాదు మేరకు వైరా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.