అత్యాచారం, హత్య కేసులో ముగ్గురినీ ఉరితీయాలంటూ ఢిల్లీ కోర్టు తీర్పు
న్యూఢిల్లీ: ప్రేమను తిరస్కరించడమే ఆ యువతి చేసిన తప్పిదం. దీంతో రగిలిపోయిన ఆ కిరాతకుడు మరో ఇద్దరితో కలసి ఆమెను కిడ్నాప్ చేశాడు. ముగ్గురూ కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో వదలకుండా దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. తట్టుకోలేని ఆ యువతి మరణించడంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టి తమదారిన తాము వెళ్లిపోయారు. 2012, ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు కిరాతకులు చట్టం ముందు దోషులుగా నిలిచారు. ఆ ముగ్గురికీ మరణశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు బుధవారం తీర్పుచెప్పింది. దీనిని అరుదైన కేసుల్లోకెల్లా అరుదైనదిగా పేర్కొన్న జడ్జి... వారు చనిపోయేవరకూ ఉరితీయాలని తీర్పుచెప్పారు.
కేసు పూర్వాపరాలివీ: గుర్గావ్‌లోని సైబర్‌సిటీలో ఉద్యోగం చేస్తున్న 19 ఏళ్ల ఓ యువతి ఇంటికి సమీపంలో రవి(23), రాహుల్ (27) అద్దెకుంటున్నారు. ఇద్దరూ సోదరులు. రవి తన ప్రేమను వ్యక్తీకరించగా.. ఆ యువతి తిరస్కరించింది. దీంతో రవి.. సోదరుడు రాహుల్, స్నేహితుడు వినోద్(23)తో కలసి 2012, ఫిబ్రవరి 9న ఆమె ఆఫీసు నుంచి ఇంటికొస్తుండగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కళ్లల్లో యాసిడ్ పోసి.. మర్మాంగంలో గాజుముక్కలు ఉంచి చిత్రహింసలు పెట్టారు. బాధితురాలు మరణించడంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
కీచకులకు మరణశిక్ష
Published Thu, Feb 20 2014 2:16 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement