మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ అమ్మకాలలో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేశాయి. 2003 నుంచి 2024 వరకు ఈ రెండు కార్లు ఏకంగా 10,42,403 యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకున్నాయి. అత్యధికంగా FY2024లో నమోదయ్యాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ 1,41,462 యూనిట్ల స్కార్పియో కార్లను విక్రయించింది.
2013 ఆర్థిక సంవత్సరంలో 50168 యూనిట్లు, 2014వ ఆర్థిక సంవత్సరంలో 50,949 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇలా ప్రతి ఏటా మహీంద్రా స్కార్పియో అమ్మకాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ప్రారంభం నుంచి గత నెల వరకు కంపెనీ 10 లక్షల కంటే ఎక్కువ కార్లను విక్రయించి.. విక్రయాల్లో సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. ప్రారంభంలో కంపెనీ స్కార్పియో కార్లను మాత్రమే విక్రయించింది. 2022లో కంపెనీ స్కార్పియో ఎన్ లాంచ్ చేసింది. ఈ మోడల్ కూడా అమ్మకాల పెరుగుదలకు దోహదపడింది.
మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ కూడా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇవి మల్టిపుల్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పనితీరుపరంగా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ అందించాయి. ఇవన్నీ ఎక్కువమంది కస్టమర్లను ఆకర్శించడంలో సహాయపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment