Clarity About Mahindra Scorpio N Sunroof Leak: భారతీయ మార్కెట్లో అమ్ముడవుతున్న అత్యంత సురక్షితమైన కార్లలో మహీంద్రా స్కార్పియో ఎన్ ఒకటి. గత కొంతకాలం కింద ఒక వ్యక్తి తన కారు సన్‌రూఫ్ నుంచి వాటర్ లీక్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేసి హల్ చల్ చేసాడు. అయితే ఈ సమస్యకు కంపెనీ పరిస్కారం అందించింది. కాగా తాజాగా మరో సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం యష్9డబ్ల్యు (Yash9w) అనే యూట్యూబర్, మహీంద్రా స్కార్పియో ఎన్ కారుని జలపాతం కిందికి తీసుకెళ్లి సన్‌రూఫ్ లీక్‌పై ఉన్న సందేహాలకు సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఇందులో భాగంగానే కారుని జలపాతం కిందికి తీసుకెళ్లాడు. జలపాతం నీరు కారుపై పడినా లోపలికి ఏ మాత్రమే రాలేదని స్పష్టం చేసాడు. అయితే మరో సారి కూడా కారుని జలపాతం కింది తీసుకెళతాడు. అప్పుడు చిన్న నీటి బిందువులను గమనించినట్లు వెల్లడించాడు.
చిన్న నీటి బిందువులే కానీ అది అసలు చెప్పుకోదగ్గ సమస్య కాదని కూడా వీడియో ద్వారా వ్యక్తం చేసాడు. కారుని జలపాతం కిందికి తీసుకెళ్లాడనికి ముందు సన్‌రూఫ్ పూర్తిగా క్లోజ్ చేస్తాడు. సన్‌రూఫ్ మూసివేయడంతో ఏ చిన్న తప్పు జరిగినా వేగంగా వచ్చే నీరు లోపలి వస్తుంది. అయితే యూట్యూబర్ స్కార్పియో ఎన్ కారు చాలా పటిష్టమైందని, ఎలాంటి లీక్ లేదని స్పష్టంగా వెల్లడించాడు.
(ఇదీ చదవండి: కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే ఇవన్నీ!)
సాధారణంగా వాహన తయారీ సంస్థలు కార్లను చాలా పటిష్టంగా తయారు చేస్తాయి. అయితే వాహన వినియోగదారుడు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల సమస్యలు పుట్టుకొస్తాయి. అయితే కారులో ఏదైనా సమస్య ఉందని గమనిస్తే.. కంపెనీ తప్పకుండా దానికి తగిన పరిష్కారం అందిస్తుంది. అంతే కాకుండా సన్‌రూఫ్ అనేది వర్షపు నీటి బిందువులు లోపలికి రాకుండా కాపాడటానికి, కారులోకి కావలసినంత వెలుతురు రావడానికి ఉపయోగపడుతుంది.
(ఇదీ చదవండి: బన్నీ మంచి బిజినెస్‌మెన్ కూడా! ఈ కంపెనీలన్నీ తనవే..)
జలపాతాల కిందికి కారుని తీసుకెళ్లి సన్‌రూఫ్ టెస్ట్ చేయడమనేది సమంజసం కాదు. జలపాతం నుంచి కిందికి పడే నీరు చాలా వేగంతి పడుతుంది. అలాంటి సమయంలో ఏదైనా ఊహించని ప్రమాదం జరగవచ్చు. కావున ఇలాంటి సాహసాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచింది. మొత్తం మీద మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ పటిష్టంగా ఉందని మరోసారి ఋజువైంది. ఇది మహీంద్రా ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment