స్కార్పియో-ఎన్‌ను అలా వాడేసిన కేటుగాళ్లు: వైరల్‌ వీడియో | Mahindra Scorpio N busted with Rs 98 lakh hidden in the wheel viral video | Sakshi
Sakshi News home page

Mahindra Scorpio N: అలా వాడేసిన కేటుగాళ్లు: వైరల్‌ వీడియో

Published Fri, Dec 9 2022 7:23 PM | Last Updated on Fri, Dec 9 2022 7:35 PM

Mahindra Scorpio N busted with Rs 98 lakh hidden in the wheel viral video - Sakshi

కోలకతా:  కొట్టేసిన సొమ్మును  అక్రమ రవాణాకోసం కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలతో పోలీసులను బురిడీ కొట్టించాలని చూసి భంగ పడుతూ ఉంటారు. తాజాగా  అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.  

మహీంద్రా స్కార్పియో-ఎన్‌లో  అక్రమ డబ్బును రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తులను పశ్చిమ బెంగాల్ పోలీసులు పట్టుకున్నారు. బ్లాక్ కలర్ మహీంద్రా స్కార్పియో-ఎన్‌ వాహనంలో 98 లక్షల రూపాయల విలువైన దోపిడీ డబ్బును అక్రమంగా తరలించాలని పోలీసులకు చిక్కారు.  నల్లటి పాలిథిన్ ప్యాకెట్లలో డబ్బును ప్యాక్ చేసి  స్టెఫినీ టైర్‌లో దాచిన వైనాన్ని పోలీసులు చేధించారు. చెక్‌పోస్టు  తనిఖీల్లో భాగంగా స్కార్పియో-ఎన్‌లో నగదు పట్టు బడింది. నమోదైన యూజర్‌తో పాటు ఎస్‌యూవీలో ఉన్న వారిపై నల్లధనం అక్రమ రవాణా, దోపిడీ కేసు నమోదు చేశారు. బ్లాక్‌ కలర్‌ స్కార్పియో-ఎన్‌ వాహనంలోని స్టెఫినీ టైర్‌లో దాచిన నగదు  అంటూ  ఒక  యూ ట్యూబ్‌ (Raftaar 7811) వైరల్‌  ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement