హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో ఆదివారం చిక్కిన హవాలా గ్యాంగ్ తీగ లాగితే... హైదరాబాద్‌లోని ఉత్తర మండల కేంద్రంగా దందా చేస్తున్న సూత్రధారులు చిక్కారు. నలుగురిని అదుపుతోకి తీసుకుని, వారి నుంచి రూ.2.09 కోట్ల నగదు స్వాదీనం చేసుకున్నట్లు టాస్‌్కఫోర్స్ ఓఎస్డీ పి.రాధా కిషన్ రావు సోమవారం వెల్లడించారు. గుజరాత్‌కు చెందిన దినేష్ కుమార్, సచిన్ కుమార్ నగరానికి వలసవచ్చారు. వీరు ఉత్తరాదికి చెందిన హవాలా ముఠాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. వారి ఆదేశాల మేరకు సిటీలోని వివిధ ప్రాంతాలతో పాటు రాష్ట్రం, ఇతర రాష్ట్రాలకు నగదు సరఫరా చేస్తున్నారు.
తమ వద్ద పని చేసే విపుల్‌కుమార్ భాయ్, అమర్ సిన్హా జాలలకు రూ.3.04 కోట్లు అప్పగించారు. తమ కారు కింది భాగంలో ప్రత్యేక అర ఏర్పాటు చేసుకున్న వీరు అందులో నగదు నింపారు. ఆ మొత్తాన్ని చెన్నై తరలిస్తుండగా.. ఆదివారం నల్లగొండ జిల్లా, దామరచర్ల మండలం, వాడపల్లి వద్ద పోలీసులకు చిక్కారు. విచారణలో సూత్రధారులు నగరంలో ఉన్నట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.సైదులు నేతృత్వంలో ఎస్సైలు బి.అశోక్‌రెడ్డి, పి.గగన్‌దీప్, జి.నవీన్‌తో కూడిన బృందం రంగంలోకి దిగింది.
లోతుగా ఆరా తీయగా దినేష్ కుమార్ పాటిల్, సచిన్‌కుమార్ విష్ణుభాయ్ పాటిల్, జితేందర్ పాటిల్, శివ్‌రాజ్ నవీన్ భాయ్ మోడీ, మీట్ రాకేష్ పాటిల్, తఖోర్ నాగ్జీ ఈ హవాలా దందాలో కీలకమని తేలింది. నల్లగొండ జిల్లాలో తమ నగదు చిక్కిన విషయం తెలుసుకున్న వీరు తమ వద్ద ఉన్న నగదును బ్యాగుల్లో పెట్టి మరోప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు.
ఈ విషయం గుర్తించిన టాస్‌్కఫోర్స్ టీమ్ గాం«దీనగర్ ప్రాంతంలో నిఘా వేసింది. అటుగా వెళ్తున్న కారు, ద్విచక్ర వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేయగా రూ.2.09 కోట్లు లభించాయి. నిందితులతో పాటు నగదును తదుపరి చర్యల నిమిత్తం గాం«దీనగర్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment