Tyres
-
రయ్.. రయ్..
సాక్షి, అమరావతి: ఎటువంటి ప్రచార ఆర్భాటం, ఒప్పందాలు, శంకుస్థాపనలు వంటి భారీ కార్యక్రమాలు లేకుండా కోవిడ్ సమయంలో నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించిన జపాన్‌కు చెందిన ఒక భారీ మల్టీ నేషనల్ కంపెనీ విస్తరణ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపు.. అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) పేరుతో రూ.3,079 కోట్ల భారీ పెట్టుబడితో టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో రూ.1,750 కోట్ల వ్యయంతో హాఫ్ హైవే టైర్లు (భారీ యంత్ర పరికరాలకు వినియోగించే టైర్లు) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం 2019 నవంబర్‌లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) 2020 నవంబర్‌లో ఆమోదం తెలిపారు. వెనువెంటనే అనకాపల్లి పరిధిలోని అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ భూమి కేటాయించడంతో నిర్మాణ పనులు ప్రారంభించింది. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించిన వెంటనే కరోనా సంక్షోభం తలెత్తినా, రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంతో తొలి దశ పనులను రికార్డు సమయంలో పూర్తి చేసింది. 2022 జూలైలో తొలి టైరును ఉత్పత్తి చేసింది. ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 ఆగస్టు 16న వాణిజ్యపరంగా ప్రారంభించారు. రోజుకు 132 టన్నుల రబ్బరును వినియోగించడం ద్వారా ఉత్పత్తి చేసిన టైర్లను 120కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఫ్లాంట్‌లో చిన్న టైర్లు (ఏఎఫ్సీ సెగ్మెంట్), పెద్ద బయాస్ టైర్లు (అగ్రి మరియు కాన్స్), రేడియల్ టైర్లు (అగ్రి), రేడియల్ (ఓటీఆర్), బయాస్ టైర్, ఓటీఆర్ టైర్లు, ఫారెస్ట్రీ టైర్లు, సాలిడ్ టైర్లు వంటివి తయారవుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో విస్తరణ ప్రభుత్వ ప్రోత్సాహం బాగుండటంతో యకహోమా గ్రూపు ప్యాసింజర్ వాహనాల టైర్లను తయారు చేసే యూనిట్ నిర్మాణ పనులను ప్రారంభించింది. సుమారు రూ.680 కోట్ల పెట్టుబడితో ప్యాసింజర్ కారు టైర్ల తయారీ లైన్‌ను ఏర్పాటు చేస్తోంది. దేశీయ ప్యాసింజర్ కార్లకు డిమాండ్ భారీగా పెరగడంతో దానికి తగ్గట్టుగా ఏటా 17 లక్షల టైర్ల తయారీ సామర్థ్యంతో విస్తరణ పనులు మొదలు పెట్టింది. ఈ యూనిట్‌ను 2024 చివరి త్రైమాసికానికి అందుబాటులోకి తీసుకు రావాలని యకహోమా గ్రూపు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం 28 లక్షల టైర్లుగా ఉన్న ఏటీసీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా 45 లక్షల టైర్లకు చేరుకోనుంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న యూనిట్లో 22 అంగుళాల వరకు ఉండే టైర్లను ఉత్పత్తి చేస్తారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోందని, 2022లో జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిందని, ఇదే రకమైన వృద్ధి భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని యకహోమా అంచనా వేస్తోంది. 2007లో 7 లక్షల టైర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇండియాలో అడుగుపెట్టిన ఈ గ్రూపు వేగంగా విస్తరిస్తోంది. ఇండియాలో ఇప్పటికే రెండు యూనిట్లు.. తిరువన్వేలి, దహేజ్ల్లో ఉండగా, మూడవ యూనిట్‌ను అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ పూర్తి స్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే 2,300 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో 75 శాతం మంది స్థానికులకే ఉపాధి కల్పించనున్నారు. ఇందుకోసం స్థానిక ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసుకొని శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే 1000 మందికిపైగా పని చేస్తుండగా, విస్తరణకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ మద్దతు ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు అందించింది. ఏపీఐఐసీ, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు పూర్తిగా సహకరించారు. నిర్దేశించుకున్న గడువులోగానే ప్రాజెక్టును పూర్తి చేయగలిగాం. – ప్రహ్లాదరెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఏటీసీ టైర్స్ యకహోమా ఉద్యోగి కావడం ఆనందంగా ఉంది జపాన్‌కు చెందిన యకహోమా ఆఫ్ హైవే టైర్ల తయారీ యూనిట్లో ఉద్యోగిగా ఉండటం పట్ల చాలా ఆనందంగా ఉంది. క్యాంపస్ సెలక్షన్లో నేను ఏటీసీ టైర్స్‌లో ఉద్యోగం పొందాను. యకహోమా కుటుంబ సభ్యుడిగా సొంత రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తాను. – లాబాల పవన్ కళ్యాణ్, టైర్ బిల్డింగ్–ప్రొడక్షన్, ఏటీసీ టైర్స్ -
బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోవడంతో..
మహబూబాబాద్: హుజూరాబాద్ నుంచి హనుమకొండ వైపునకు వెళ్తున్న హుజూరాబాద్ డిపోనకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఓవర్ లోడ్‌తో వెళ్తుండగా ఎల్కతుర్తి సమీపంలో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఓవర్ లోడ్ కారణంగా ఘటన జరగలేదని, దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇవి కూడా చదవండి: అందమైన విద్యార్థినులు కనిపించారంటే.. అతడు కీచకుడే! అర్ధరాత్రి.. -
డోర్లు, టైర్లు లేని కారు, షాకవుతున్న నెటిజన్లు: వీడియో చూడండి!
సాధారణంగా కారు కొనాలనుకున్న వారు సేఫ్టీ ఫీచర్లు, మైలేజీ, ధర లాంటి వివరాలను పరిశీలించి తమకిష్టమైనకారును సొంతం చేసుకుంటారు. కానీ డోర్లు, టైర్లు లేని కారును ఎక్కడైనా చూశారా? ప్రపంచంలోనే అతి చిన్నకారుగా పిలుస్తున్న ఈ కారుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, దానుకనుగుణంగా కొత్త ఫీచర్లు, డిజైన్లతో స్టైలిష్ కార్లతోపాటు, బడ్జెట్ కార్లపై కార్మేకర్లు దృష్టిపెడుతున్న క్రమంలో ఈ బుల్లి కారు సోషల్ మీడియా యూజర్లను భలే ఆకట్టుకుంటోంది. 37 మిలియన్ల వ్యూస్‌తో, లైక్స్, రీట్వీట్స్తో దూసుకుపోతోంది. బహుశా ఇది మిస్టర్ బీన్ కోసం మిస్టర్ బీన్ కనిపెట్టాడేమో అంటూ ఒకరు కమెంట్ చేశారు. అలాగే నమ్మశక్యం కాని డిజైన్ వెనుక ఉన్న సృజనాత్మకతను అభినందిస్తున్నారు. "మాస్సిమో" ట్విటర్ ఖాతాలో గత నెల 26న ఈ వీడియోను షేర్ చేసింది. వైరల్ వీడియోలో, సియాన్ కలర్కారును చూస్తే, టైర్లు లేదా తలుపులు లేవు. దీంతో నిజంగా ఇదే కారేనా అన్న అనుమానం కూడా కలుగకమానదు.వాస్తవానికి, ఈ వీడియోను యూట్యూబ్ ఛానెల్ కారమాఘెడన్ పోస్ట్ చేసింది. The lowest car in the world [📹 carmagheddon (IT): https://t.co/9z0IrZySua]pic.twitter.com/AvExqIFJnA — Massimo (@Rainmaker1973) June 25, 2023 -
రెండేళ్లలో 3.5 కోట్లకు ఉత్పత్తి సామర్థ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు రూ. 800 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులు పూర్తయితే 2025 నాటికి తమ వార్షిక టైర్ల ఉత్పత్తి సామర్థ్యం 3.5 కోట్లకు చేరుతుందని జేకే టైర్స్ ఎండీ అన్షుమన్ సింఘానియా వెల్లడించారు. ఇప్పుడు ఇది 3.2 కోట్లుగా ఉన్నట్లు మంగళవారమిక్కడ కొత్త లెవిటాస్ అల్ట్రా టైర్ల ఆవిష్కరణ సందర్భంగా విలేకరుల సమావేశంలో తెలిపారు. తమకు భారత్‌లో 9 ప్లాంట్లు, మెక్సికోలో మూడు ప్లాంట్లు ఉన్నాయన్నారు. అలాగే, 650 పైగా బ్రాండ్ అవుట్‌లెట్స్ ఉన్నాయని, ఏడాది వ్యవధిలో మరో 200 పెంచుకోనున్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా టైర్ల పరిశ్రమ ప్రస్తుతం రూ. 70,000 కోట్ల స్థాయిలో ఉందని, 2025 నాటికి ఇది రూ. 1 లక్ష కోట్ల స్థాయికి చేరగలదని అంచనా వేస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ (ఇండియా) అనుజ్ కథూరియా తెలిపారు. మరోవైపు, లగ్జరీ కార్ల కోసం అధునాతనమైన లెవిటాస్ అల్ట్రా టైర్లను రూపొందించినట్లు వివరించారు. యూరప్ ప్రమాణాలతో దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసిన ఈ టైర్లు ఏడు సైజుల్లో లభ్యమవుతాయని చెప్పారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో సింహభాగం వాటా రూ. 40 లక్షలు–రూ. 80 లక్షల కార్లది ఉంటోందని కథూరియా వివరించారు. -
పాతటైర్లకు కొత్త రూపం.. ఐఐటీ విద్యార్థిని ఘనత
రోడ్ల మీద నడిచే ఎలాంటి వాహనాలకైనా టైర్లే ఆధారం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 60.80 లక్షల టైర్లు తయారవుతుంటే, ప్రతిరోజూ వాటిలో 42 లక్షలకు పైగా టైర్లు రిటైరవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా తయారవుతున్న చెత్త పరిమాణం 212 కోట్ల టన్నులైతే, అందులో టైర్ల వాటా 3 కోట్ల టన్నులకు పైమాటే! టైర్లను రీసైకిల్ చేసే కర్మాగారాలు అక్కడక్కడా పనిచేస్తున్నాయి. కొందరు సృజనాత్మకమైన ఆలోచనలతో పాతబడిన టైర్లను పునర్వినియోగంలోకి తీసుకొస్తున్నారు. టైర్ల రీసైక్లింగ్, రీయూజ్ వల్ల కొంతమేరకు కాలుష్యాన్ని నివారించగలుగుతున్నారు. పాతటైర్ల రీయూజ్‌కు పూజా రాయ్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థినిగా ఉన్నప్పుడు ఒకరోజు ఒక మురికివాడ మీదుగా వెళుతుంటే కనిపించిన దృశ్యం ఆమెలోని సృజనను తట్టిలేపింది. మురికివాడలోని పిల్లలు పాత సైకిల్ టైర్లు, డ్రైనేజీ పైపులతో ఆడుకోవడం చూసిందామె. సమీపంలోని పార్కుల్లో ఖరీదైన క్రీడాసామగ్రి ఉన్నా, మురికివాడల పిల్లలకు అక్కడ ప్రవేశం లేకపోవడం గమనించి, వారికోసం తక్కువ ఖర్చుతో క్రీడాసామగ్రి తయారు చేయాలనుకుంది. అందుకోసం వాడిపడేసిన టైర్లను సేకరించి, వాటిని శుభ్రంచేసి, ఆకర్షణీయమైన రంగులతో అలంకరించి తమ కళాశాల ఆవరణలోనే క్రీడామైదానాన్ని సిద్ధం చేసింది. ఐఐటీ అధ్యాపకులు ఆమె ఆలోచనను ప్రశంసించారు. ఆ ఉత్సాహంతోనే పూజా 2017లో ‘యాంట్‌హిల్ క్రియేషన్స్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని పలునగరాల్లో ఇప్పటివరకు 350 క్రీడా మైదానాలు తయారయ్యాయి. వీటిలోని ఆటవస్తువులన్నీ వాడేసిన టైర్లు, పైపులు, ఇనుపకడ్డీలతో తయారైనవే! పూజా రాయ్ కృషి ఫలితంగా వెలసిన ఈ క్రీడామైదానాలు పేదపిల్లలకు ఆటవిడుపు కేంద్రాలుగా ఉంటున్నాయి. -
స్కార్పియో-ఎన్ను అలా వాడేసిన కేటుగాళ్లు: వైరల్ వీడియో
కోలకతా: కొట్టేసిన సొమ్మును అక్రమ రవాణాకోసం కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలతో పోలీసులను బురిడీ కొట్టించాలని చూసి భంగ పడుతూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మహీంద్రా స్కార్పియో-ఎన్లో అక్రమ డబ్బును రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తులను పశ్చిమ బెంగాల్ పోలీసులు పట్టుకున్నారు. బ్లాక్ కలర్ మహీంద్రా స్కార్పియో-ఎన్ వాహనంలో 98 లక్షల రూపాయల విలువైన దోపిడీ డబ్బును అక్రమంగా తరలించాలని పోలీసులకు చిక్కారు. నల్లటి పాలిథిన్ ప్యాకెట్లలో డబ్బును ప్యాక్ చేసి స్టెఫినీ టైర్లో దాచిన వైనాన్ని పోలీసులు చేధించారు. చెక్‌పోస్టు తనిఖీల్లో భాగంగా స్కార్పియో-ఎన్లో నగదు పట్టు బడింది. నమోదైన యూజర్‌తో పాటు ఎస్‌యూవీలో ఉన్న వారిపై నల్లధనం అక్రమ రవాణా, దోపిడీ కేసు నమోదు చేశారు. బ్లాక్ కలర్ స్కార్పియో-ఎన్ వాహనంలోని స్టెఫినీ టైర్లో దాచిన నగదు అంటూ ఒక యూ ట్యూబ్ (Raftaar 7811) వైరల్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ టైర్ల కంపెనీ సేల్స్ టెక్నిక్ మైండ్‌బ్లోయింగ్!
వీధి చివర కిరాణా దుకాణంలో వాహన టైర్లు అందుబాటులో ఉంటే..? వినడానికే కొత్తగా ఉంది కదూ..! ఆర్పీజీ గ్రూపు కంపెనీ సియట్ ఇదే ఆలోచనను అమలు చేస్తోంది. కస్టమర్లకు చేరువ అయ్యేందుకు కిరాణా దుకాణాలను సైతం వినియోగించుకోవాలన్నది ఈ సంస్థ ప్రణాళికగా ఉంది. పాలు, కూరగాయలు, పప్పులు, ఉప్పులు కొనుగోలు చేసే షాపులో టైర్లు అమ్మడమే ఇప్పుడు కొత్త ట్రెండ్. నిత్యావసరాలు, ఆహారం, ఔషధాల మాదిరిగా కాకుండా.. టైర్ల పరిశ్రమ పరిమిత వృద్ధితో కూడినది. ఈ పరిమిత మార్కెట్లోనూ మెరుగైన విక్రయాలు నమోదు చేయాలన్నది సియట్ అభిమతంగా ఉంది. అందుకే ఇప్పటి వరకు అసలు టైర్లను విక్రయించని దుకాణాలతో ఓ నెట్‌వర్క్‌ను సియట్ ఏర్పాటు చేసింది. ఈ దుకాణాల వద్ద కూడా కస్టమర్ల కోసం టైర్లను అందుబాటులో ఉంచుతుంది. దీంతో దాదాపు దేశ ప్రజల్లో అధిక శాతాన్ని చేరుకోవచ్చన్నది కంపెనీ యోచన. దాదాపు ప్రతిరోజు ఏదో ఒక అవసరం కోసం వెళ్లే వీధి దుకాణం వద్ద.. ‘సియట్’ టైర్లు కస్టమర్ల కళ్లలో పడుతుంటాయి. దీంతో బ్రాండ్‌కు ఉచిత ప్రచారం కూడా లభించినట్టు అవుతుంది. నూతన నమూనా.. ‘‘కిరాణా స్టోర్లు, పంక్చర్ రిపేర్ దుకాణాలు, ఓఈఎం మినీ అధీకృత సేవా కేంద్రాలు, వాహన విడిభాగాలు విక్రయించే స్టోర్ల యజమానులను సంప్రదించి, సియట్ టైర్లను విక్రయించాలని కోరాం’’అని సియట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్ణబ్ బెనర్జీ తెలిపారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా ఉంది. 2021–22లో 1.34 కోట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయాయి. ఇందులో సగానికి పైన గ్రామీణ, చిన్న పట్టణాల నుంచే ఉండడం గమనార్హం. ఒక విధంగా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల మార్కెటింగ్ నమూనాను సియట్ అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. సియట్ కంపెనీ విక్రయించే ద్విచక్ర వాహన టైర్లలో 70 శాతం సంప్రదాయేతర స్టోర్ల నుంచే ఉంటున్నాయి. గత కొన్నేళ్లుగా ద్విచక్ర వాహన టైర్ల మార్కెట్లో సియట్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. 2011 నాటికి 11 శాతంగా ఉన్న మార్కెట్ వాటాను 30 శాతానికి పెంచుకుని మార్కెట్ లీడర్‌గా ఎదిగింది. మార్కెట్ అగ్రగామిగా ఉన్న ఎంఆర్‌ఎఫ్‌ను సైతం టూవీలర్ విభాగంలో వెనక్కి నెట్టేసింది. కొన్నేళ్ల క్రితం 20,000 విక్రయ కేంద్రాలు ఉంటే, వాటిని 50,000కు పెంచుకున్నట్టు ఆర్ణబ్ బెనర్జీ వెల్లడించారు. కస్టమర్లకు మరింత చేరువ అయ్యే చర్యలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. ఇతర టైర్ల కంపెనీలతో పోలిస్తే డీలర్లు, సబ్ డీలర్లకు సియట్ విక్రయించే ధర అధికంగానే ఉన్నప్పటికీ.. తన వాటాను మాత్రం పెంచుకోగలుగుతోంది. చదవండి: Elon Musk: ట్విటర్‌పై మరో బాంబు వేసిన ఎలాన్ మస్క్ -
పంక్చర్లకీ చెక్..!ఈ టైర్లు వాటంతంటా అవే సెల్ఫ్ హీల్..!
ప్రముఖ టైర్స్ అండ్ ట్యూబ్స్ తయారీ సంస్థ జేకే టైర్స్ అండ్ ఇండస్ట్రీస్ భారత మార్కెట్లలోకి సరికొత్త టైర్లను లాంచ్ చేసింది. తొలిసారిగా టైర్లలో పంక్చర్ గార్డ్ టెక్నాలజీని తీసుకువస్తోనట్లు జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ తెలియజేసింది. వాటంతటా అవే సెల్ఫ్ హీల్..! ఫోర్ వీలర్ల కోసం పంక్చర్ గార్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుందని జేకే టైర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ టెక్నాలజీ సహాయంతో టైర్లు పంక్చర్ అయినప్పుడు గాలి బయటకు పోకుండా సెల్ఫ్ హీల్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఆటోమెటిక్ ప్రాసెస్ ద్వారా టైర్ లోపల సెల్ఫ్-హీలింగ్ ఎలాస్టమర్ ఇన్నర్ కోట్ సహాయంతో ఇది సాధ్యమవుతోందని జేకే టైర్స్ తెలియజేసింది. 6 ఎంఎం వరకూ మందంతో ఉండే మేకులు, ఇతరత్రా వస్తువులు టైర్‌కు దిగితే...ఇబ్బంది లేకుండా వాహనదారులు తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చునని పేర్కొంది. ఇక టైర్ అరిగిపోయేంత వరకు పంక్చర్ల బాధే ఉండదని కంపెనీ అభిప్రాయపడింది. వాహనదారుల కోసం 2020లో స్మార్ట్ టైర్ టెక్నాలజీని పరిచయం చేశామని , ఇప్పుడు పంక్చర్ గార్డ్ టెక్నాలజీని అందిస్తున్నామని జేకే టైర్ సీఎండీ రఘుపతి సింఘానియా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వాహనదారుల కోసం అదిరిపోయే టెక్నాలజీతో టైర్లను తెచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. చదవండి: కలిసొచ్చిన రష్యా-ఉక్రెయిన్ వార్..! తొలిసారి టాప్-5 క్లబ్‌లోకి భారత్..! -
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా.. ఇక డెంగీ దోమలు మీ దగ్గరే!
సాక్షి, హైదరాబాద్: ఆ మొక్క పేరు మనీ ప్లాంట్. ఇంటి ఆవరణలో ఇది పెంచితే సంపద సంప్రాప్తిస్తుందని కొందరి నమ్మకం. డబ్బు మాటేమోగానీ ఈ ప్లాంట్‌తో డెంగీ దోమలు కచ్చితంగా వచ్చి తీరుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందం, ఆహ్లాదం కోసం సిటీజనులు పెంచుతున్న పూలు, తీగజాతి మొక్కలు.. వాటి కోసం ఏర్పాటు చేసిన పూల కుండీలు ప్రస్తుతం డెంగీ దోమలకు నిలయంగా మారుతున్నాయడంలో అతిశయోక్తి లేదేమో. హైదరాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు దేశంలోనే అత్యధికంగా 537 డెంగీ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా లు ఉన్నాయి. సాధారణంగా పారిశుద్ధ్య లోపం ఎ క్కువగా ఉన్న మూసీ పరీవాహక ప్రాంతాల్లో డెంగీ జ్వరాలు రావాలి కాని.. సంపన్నులు ఎక్కువగా నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో నమోదవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి: మీ ఇష్టం.. గణేష్ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్ 30 శాతం కేసులు అక్కడే.. ► ప్రస్తుతం హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో నమోదైన కేసుల్లో 30 శాతం సంపన్నులు అధికంగా నివాసం ఉండే ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, యూసఫ్‌గూడ, సికింద్రాబాద్‌లలో నమోదైనట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ►పేద, మధ్య తరగతి ప్రజలతో పోలిస్తే సంపన్నుల నివాసాలు విశాలంగా ఉంటాయి. వీరు ఇంటి ఆవరణలో అందం, ఆహ్లాదకర వాతావరణం కోసం మనీప్లాంట్లు, రకరకాల పూల మొక్కలు పెంచుకుంటారు. వీటికోసం భారీ కుండీలను ఏర్పాటు చేస్తుంటారు. వర్షపు నీరు వీటిలో చేరి రోజుల తరబడి నిల్వ ఉంటుంది. ► వీటిలో డెంగీ దోమలు గుండ్లు పెట్టి వాటి వృద్ధికి కారణమవుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త కాలనీలు, నిర్మాణాలు, సెల్లార్లు ఎక్కువగా ఉన్న శివారు ప్రాంత మున్సిపాలిటీల్లోనూ డెంగీ కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: World Mosquito Day: ఫీవర్ సర్వేలో.. డెంగీ కలకలం.. గుర్తించినట్టు.. పెన్సిల్‌తో రాసి.. ► దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని సిటీజన్లు ఆరోపిస్తున్నారు. ► వారానికోరోజు కూడా ఫాగింగ్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి యాంటిలార్వా మందును పిచికారీ చేయాల్సిన జీహెచ్ఎంసీ సిబ్బంది.. మంచినీటి ట్యాంకుల్లో మందు చల్లకుండానే చల్లినట్లు ఇంటిగోడలపై పెన్సిల్‌తో రాసి చేతులు దులుపుకొంటున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ►రెండు వారాల్లోనే గాంధీ ఆస్పత్రిలో డెంగీతో 54 మంది చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. వీరిలో ఇద్దరు డెంగీ షాకింగ్ సిండ్రోమ్‌తో (బాలిక, బాలుడు) మృతి చెందారు.నిలోఫర్ ఆస్పత్రిలో రోజుకు కనీసం 20 నుంచి 30 డెంగీ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. దోమలకు నిలయాలివే.. ► ఇంటి ఆవరణలోని పూల కుండీలు ► మనీప్లాంట్స్, ఇతర చెట్ల పొదలు ► టైర్లు, ఖాళీ సీసాలు, కొబ్బరి బోండాలు ► ఇంటిపై మూతల్లేని నీటి ట్యాంకులు ► కొత్త నిర్మాణాలు, సెల్లార్లు ► తాళం వేసిన నివాసాలు ► విద్యా సంస్థలు, ఫంక్షన్ హాళ్లు ► ముంపు ప్రాంతాల్లో నిల్వ నీరు గాందీలో 40 మంది డెంగీ బాధితులకు చికిత్స గాంధీ ఆస్పత్రి: మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మహమ్మారి కరోనాకు తోడుగా డెంగీ వ్యాధి పంజా విసురుతోంది. డెంగీ లక్షణాలతో సికింద్రాబాద్ గాం«దీ ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం గాంధీలో 40 మంది డెంగీ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. వీరిలో సింహభాగం చిన్నారులే కావడం గమనార్హం. గత నాలుగు రోజులుగా డెంగీ లక్షణాలతో వచ్చిన మరో 16 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. చిన్నారుల్లో ముగ్గురుకి డెంగీతోపాటు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. గాంధీ పిడియాట్రిక్ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారి మూడు రోజుల క్రితం డెంగీ షాక్ సిండ్రోమ్‌తో మృతి చెందింది. అందుబాటులో ప్లేట్లెట్లు, మందులు గాంధీ ఆస్పత్రిలో డెంగీ వ్యాధి నివారణకు అన్నిరకాల మందులు, ప్లేట్లెట్లు అందుబాటులో ఉన్నాయని సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. సుమారు 40 మంది డెంగీ బాధితులకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నామని, వారం రోజులుగా డెంగీ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు డెంగీ కేసులు హైదరాబాద్ 537 రంగారెడ్డి 140 మేడ్చల్ 120 వికారాబాద్ 45 -
పెట్రోల్, టైర్లతో దహనం.. ఐదుగురు పోలీసులపై వేటు
లక్నో: కరోనా మన జీవిన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. సంబరాలు సంతోషాలు లేవు.. కనీసం నలుగురు మనుషుల కూడి దహన సంస్కారాలు చేయడానికి కూడా వీలు లేని పరిస్థితులు. మహమ్మారి భయంతో కోవిడ్‌తో మరణించిన వారి శవాలను అలాగే వదిలేసి వెళ్తున్నారు. కొద్ది రోజల క్రితం గంగా నదిలో పదుల కొద్ది శవాలు కొట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీన్ని మరువక ముందే మరో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కోవిడ్ మృతదేహాలను పోలీసులు రోడ్డు మీద అత్యంత అమానవీయ రీతిలో దహనం చేశారు. టైర్లు, పెట్రోల్ పోసి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు ఇందుకు బాధ్యులైన ఐదుగురు పోలీసులును సస్పెండ్ చేశారు. ఈ సంఘటన బల్లియాలో మాల్దేపూర్ ఘాట్ వద్ద చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం నదిలో రెండు శవాలు కొట్టుకువచ్చాయి. పోలీసులకు సమాచారం అందిచడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని శవాలను బయటకు తీశారు. ఆ తర్వాత వాటిని దహనం చేయడానికి ఇంధనం లేకపోవడంతో టైర్లు వేసి.. పెట్రోల్ పోసి దహనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలయ్యింది. పోలీసు అధికారి సమక్షంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. చదవండి: ఎవరూ లేకున్నా.. కడసారి వీడ్కోలుకు ఆ నలుగురు -
ఆన్లైన్లో అపోలో టైర్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ అపోలోటైర్స్ ఈ-కామర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత మార్కెట్లో ఆన్లైన్ టైర్ల అమ్మకాల కోసం ఇ-కామర్స్ పోర్టల్‌ను ప్రారంభించింది. దీంతో దేశీయ కస్టమర్లు ఇక నుంచి కార్లు, ద్విచక్ర వాహన టైర్లను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. ‘బై ఆన్లైన్.. ఫిట్ ఆఫ్‌లైన్’ మోడల్లో ఈ విధానం పనిచేస్తుంది. అంటే ఆన్లైన్లో టైర్లు కొనుగోలు చేసి వాటిని బిగించేందుకు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. దగ్గర్లోని అపోలో టైర్స్ డీలర్ లొకేషన్‌కు చేరుకొని టైర్లను వాహనానికి బిగిస్తాడని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తొలుత ఢిల్లీ, ఎన్‌సిఆర్, బెంగళూరు, ముంబై, కొచ్చిలలో ప్రారంభించిన ఈ సేవలను త్వరలో దేశంలోని ఇతర నగరాలకు విస్తరించనుంది. -
టైర్ల తయారీ కంపెనీల షేర్లు జూమ్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ జోరులో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 560 పాయింట్లు జంప్‌చేసి 37,948 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 171 పాయింట్లు ఎగసి 11,221 వద్ద కదులుతోంది. ఈ నేపథ్యంలో టైర్ల తయారీ కంపెనీ కౌంటర్లకు ఉన్నట్టుండి డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో పలు కౌంటర్లు 8-3 శాతం మధ్య ఎగశాయి. ఆఫ్‌రోడ్ టైర్ల తయారీ దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేరు చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఇతర వివరాలు ఇలా.. కారణాలున్నాయ్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేరు 7.6 శాతం జంప్‌చేసి రూ. 1,459 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 9 శాతంపైగా దూసుకెళ్లి రూ. 1,484కు చేరువైంది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. బాలకృష్ణ ఇండస్ట్రీస్ వ్యవసాయం, నిర్మాణ రంగం, మైనింగ్, అటవీ పరిరక్షణ తదితర రంగాలలో వినియోగించే వాహనాలకు టైర్లను తయారు చేసే విషయం విదితమే. వెరసి ఆర్థిక రికవరీ నేపథ్యంలో కంపెనీ టైర్లకు డిమాండ్ పెరగనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న పండుగల సీజన్ నుంచీ వాహనాలకు తిరిగి డిమాండ్ పుట్టవచ్చన్న ఆశలతో టైర్ల తయారీ కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్లు తాజాగా దృష్టి సారించినట్లు నిపుణులు చెబుతున్నారు. జోరు తీరిలా ఎన్ఎస్ఈలో టైర్ల తయారీ కంపెనీల కౌంటర్లలో ప్రస్తుతం అపోలో టైర్స్ 6.3 శాతం పెరిగి రూ. 128 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో సియట్ లిమిటెడ్ 4.2 శాతం లాభపడి రూ. 943 వద్ద కదులుతోంది. తొలుత రూ. 952 వరకూ ఎగసింది. ఇతర కౌంటర్లలో జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ 4.2 శాతం బలపడి రూ. 60 వద్ద, ఎంఆర్ఎఫ్ 3 శాతం పుంజుకుని రూ. 59,096 వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో ఎంఆర్ఎఫ్ రూ. 59,250 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక బీఎస్ఈలో గుడ్ఇయర్ ఇండియా షేరు సైతం దాదాపు 4 శాతం పురోగమించి రూ. 875 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 880 వరకూ పెరిగింది. -
విశాఖలో యోకొహామా టైర్ల ప్లాంట్
ముంబై: జపాన్ దిగ్గజం యోకొహామా గ్రూప్‌లో భాగమైన అలయన్స్ టైర్ గ్రూప్ (ఏటీజీ) విశాఖలో తమ టైర్ల ప్లాంటు ఏర్పాటు చేయనుంది. దీనిపై 165 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,240 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. 2023 తొలి త్రైమాసికంలో ఇది అందుబాటులోకి రాగలదని యోకొహామా ఇండియా చైర్మన్, ఏటీజీ డైరెక్టర్ నితిన్ మంత్రి వెల్లడించారు. దీనితో కొత్తగా 600 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆఫ్–హైవే టైర్ల తయారీ సంస్థ అయిన ఏటీజీకి ప్రస్తుతం 5,500 మంది సిబ్బంది ఉన్నారు. దేశీయంగా గుజరాత్‌లోని దహేజ్, తమిళనాడులోని తిరునల్వేలిలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. విశాఖలో ఏర్పాటు చేసేది మూడోది అవుతుంది. తాము గత మూడేళ్లుగా ఫ్యాక్టరీకి అనువైన ప్రాంతాన్ని అన్వేషిస్తున్నామని, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి ముందే వైజాగ్‌ను ఎంపిక చేసుకున్నామని తెలి పారు. ఏటీజీకి ఇజ్రాయెల్‌లో 45,000 టన్నుల ప్లాంటుతో పాటు ప్రధాన అభివృద్ధి, పరిశోధన (ఆర్అండ్డీ) కేంద్రమూ ఉంది. దేశీయంగా తమిళనాడు ప్లాంటులోనూ ఆర్అండ్డీ సెంటర్ ఉంది. పెరగనున్న ఉత్పత్తి సామర్థ్యం.. అచ్యుతాపురం పారిశ్రామిక పార్కులోని స్పెషల్ ప్రాజెక్టుల జోన్లో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్‌లో ఆఫ్–హైవే టైర్లను తయారు చేయనున్నారు. దీని రోజువారీ సామర్థ్యం 55 టన్నులు (రబ్బరు బరువు)గా ఉండనుంది. ప్రస్తుతం రెండు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.3 లక్షల టన్నులుగా ఉండగా, ఈ ఫ్యాక్టరీతో మరో 20,000 టన్నులు పెరగనుంది. దహేజ్, తిరునల్వేలి ఫ్యాక్టరీలు ప్రధానంగా మూడు ఆఫ్–హైవే టైర్ల బ్రాండ్లు తయారు చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల కోసం అలయన్స్ పేరిట, నిర్మాణ.. పారిశ్రామిక ఉత్పత్తుల కోసం గెలాక్సీ పేరిట, అటవీ ప్రాంతాల్లో వినియోగించే వాహనాల కోసం ప్రైమెక్స్ పేరిట టైర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. 90 శాతం ఉత్పత్తిని 120 పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. యోకొహామా గ్రూప్‌నకు జపాన్, ఇండియా, ఇజ్రాయెల్, వియత్నాంలలో ఎనిమిది ఆఫ్–హైవే ప్లాంట్లు ఉన్నాయి. 2016లో ఏటీజీని కొనుగోలు చేసింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 3,000 రకాల టైర్లను విక్రయిస్తోంది. -
కస్టమర్ ఈజ్ కింగ్ : విజయరాఘవన్ ఇక లేరు
సాక్షి, చెన్నై: టీవీఎస్ శ్రీచక్రా లిమిటెడ్ (టీవీఎస్ టైర్స్) డైరెక్టర్ పీ విజయరాఘవన్ (72) గుండెపోటుతో నిన్న(బుధవారం) తెల్లవారుజామున కన్నుమూశారు. ఐదు దశాబ్దాలుగా టీవీఎస్ గ్రూప్ కంపెనీలకు విశేష సేవలందించారు. టీవీఎస్ శ్రీచక్రా కంపెనీ స్థాపించినప్పటి నుంచీ కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, తుది శ్వాసవరకు బోర్డులో డైరెక్టర్‌గా చురుకుగా ఉన్నారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 21 సంవత్సరాల వయస్సులో 1969లో సుందరం ఇండస్ట్రీస్‌లో చేరిన విజయరాఘవన్ ఐదు దశాబ్దాలకు పైగా టీవీఎస్ గ్రూపునకు సేవలందించారు. ఖరగ్‌పూర్ ఐఐటి నుంచి కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్, రబ్బరు టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన విజయరాఘవన్ రబ్బరు పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని గడించారు. అనేక పరిశ్రమ సంస్థలలో చురుకైన సభ్యుడిగా, ఈ రంగ వృద్ధికి కీలక భూమికను నిర్వహించారు. విజయరాఘవన్ కు భార్య, కుమారుడు ఉన్నారు. ‘కస్టమర్ ఈజ్ కింగ్ ’ అనే నినాదంతో భారీ మార్కెట్ ను క్రియేట్ చేశారనీ. 1980, 1990ల నాటి కస్టమర్లు ఇప్పటికీ తమతోనే ఉన్నారని కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు. కాగా టీవీఎస్ గ్రూపులో భాగమైన టీవీఎస్ శ్రీచక్రా లిమిటెడ్ టూ, త్రీవీలర్ల టైర్లు, ఆఫ్-హైవే టైర్ల తయారీలో ప్రముఖమైనది. మదురై, ఉత్తరాఖండ్‌లో ఉన్న రెండు ఉత్పాదక ప్లాంట్ల ద్వారా ప్రతి నెలా మూడు మిలియన్ల టైర్లను ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు టైర్లను ఎగుమతి చేస్తుంది. -
గ్వాలియర్ టు.. సిద్దిపేట
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న జిల్లా పోలీసులు అంతర్ జిల్లానే కాదు.. అంతర్ రాష్ట్ర దొంగల గుట్టురట్టు చేశారు. సిద్దిపేటలో నేరం చేసిన వారిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన టైర్ల దొంగలుగా గుర్తించారు. వీరిని సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకున్నారు. ప్రస్తుతం వేలిముద్రలు, సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్) తదితర సాధనాలే నేరస్తులను పట్టుకునేందుకు కీలకంగా మారాయి. సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన తాటిపాముల రమేశ్ సెప్టెంబర్ 21న ఆ గ్రామ శివారులో లారీని ఉంచి ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. ఉదయం లేచి చూసేసరికి లారీ కనిపించలేదు. ఈ విషయాన్ని కోహెడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బస్వాపూర్ నుంచి లారీని చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి ఆ లారీకి ఉన్న 14 టైర్లు, డెక్స్, బ్యాటరీ, ఇతర సామగ్రిని తేసుకెళ్లారు. మొత్తం రూ.10 లక్షల విలువగల వస్తువులను దొంగిలించారు. సిగ్నల్ ఆధారంగా గుర్తింపు లారీ అపహరణపై ఫిర్యాదు అందుకున్న సిద్దిపేట స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ముందుగా లారీ నిలిపిన స్థాలాన్ని పరిశీలించారు. ముందుగా డ్రైవర్, క్లీనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించారు. కానీ ఆధారాలు లభించలేదు. ఆ రాత్రి బస్వాపూర్ నుంచి సిద్దిపేట వరకు ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. దీంతో ఆ లారీ సిద్దిపేట నుంచి కరీంనగర్ వైపు రాజీవ్ రహదారి వెంబడి వెళ్లినట్లు గుర్తించారు. అలాగే ముందుకు వెళ్లిన పోలీసులకు టైర్లు, బ్యాటరీ, ఇతర వస్తువులు లేకుండా రాళ్లపై ఉంచిన లారీ గుర్తించారు. లారీ ఆపిన బస్వాపూర్, లారీ టైర్లు తీసిన ఇబ్రహీంనగర్ పాయింట్లను ప్రామాణికంగా తీసుకొని అక్కడి నుంచి ఎవరెవరు, ఎక్కడికి మాట్లాడిన డైటా సేకరించారు. సీసీ ఫుటేజీలో లారీ దొంగలను చూసిన పోలీసులు దొంగలు మన రాష్ట్రానికి చెందిన వారు కాదని గుర్తించారు. దీంతో ఫోన్‌కాల్స్‌పై దృష్టి సారించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఫోన్ కాల్స్ ముందుగా గుర్తించారు. వారిలో పాత నేరస్తుల ఫోన్ నంబర్‌తో సరిచూశారు. నంబర్లు సరిపోలడంతో దొంగతనానికి పాల్పడిన వారిని గుర్తించారు. వారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌కు చెందిన వారిగా గుర్తించారు. దీంతో జిల్లా నుంచి నలుగురు పోలీసుల బృందం గ్వాలియర్‌కు వెళ్లి నేరస్తుల ఆచూకీ తెలుసుకున్నారు. అక్కడి పోలీసుల సహకారంతో లారీ దొంగతనంతో సంబంధం ఉన్న ఆరుగురిని పట్టుకొని విచారణ చేశారు. నేరం రుజువు కావడంతో ఆరుగురు నేరస్తులను రిమాండ్‌కు పంపించారు. నూతన పరిజ్ఞానంతో సులభం నూతన సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగుల సహకారంతో నేరస్తులను పట్టుకోవడం సులభతరం అవుతోంది. జిల్లాలోని 420 గ్రామాలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. టెలికమ్యూనికేషన్ రంగం ద్వారా పలు విషయాలను సేకరించాం. వేలి ముద్రల సేకరణ ఇతర అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకొంటున్నాం. దీంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. –జోయల్ డేవిస్, పోలీస్ కమిషనర్ సాంకేతిక పరిజ్ఞానం కేసులు రికవరీ సీసీ కెమెరాల ద్వారా 85 కేసులు రూ. 65లక్షలు వేలి ముద్రల ద్వారా 33 కేసులు రూ. 40లక్షలు ఎఫ్ఆర్ఎస్ సిస్టం 10 కేసులు రూ. 3.70లక్షలు ఛేదించిన కేసుల వివరాలు సీసీ కెమెరాల ద్వారా 85 కేసులు వేలి ముద్రల ద్వారా 33 కేసులు ఎఫ్ఆర్ఎస్ సిస్టం 10 కేసులు -
ఏఆర్ఎల్ టైర్స్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏఆర్ఎల్ బ్రాండ్ పేరుతో టైర్లు, ట్యూబుల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ అగర్వాల్ రబ్బర్ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ సమీపంలోని సదాశివపేట వద్ద 40 ఎకరాల్లో రూ.225 కోట్లతో దీనిని నెలకొల్పుతోంది. 2020 ఏప్రిల్ నాటికి ఈ ప్లాంటు సిద్ధమవుతుందని అగర్వాల్ రబ్బర్ సీఎండీ అమిత్ కుమార్ అగర్వాల్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. తొలుత 80 టన్నుల రోజువారీ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభించి, 300 టన్నుల స్థాయికి తీసుకు వెళతామన్నారు. అంతర్గత వనరుల ద్వారా రూ.100 కోట్ల పెట్టుబడిని సమకూరుస్తున్నామని, కొత్త యూనిట్ ద్వారా 500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారాయన. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య 1,700. మూడేళ్లలో రూ.1,000 కోట్లు..: కంపెనీకి పటాన్చెరు, బొలారం, సదాశివపేట వద్ద ప్లాంట్లున్నాయి. 1986లో ప్రారంభమైన ఈ సంస్థ టూవీలర్లు, త్రీవీలర్లు, తేలికపాటి ట్రక్కులు, వ్యవసాయ యంత్రాల టైర్లు, ట్యూబులను ఉత్పత్తి చేస్తోంది. 2000 ఏడాది నుంచి ఏఆర్ఎల్ బ్రాండ్‌తో మార్కెట్లోకి వచ్చింది. భారత్‌లో మిలిటరీ విమానాలు, హెలికాప్టర్లకు ట్యూబులను సరఫరా చేస్తున్న ఏకైక కంపెనీ ఇదే. రోజువారీ తయారీ సామర్థ్యం 70 టన్నులు. టర్నోవర్ రూ.300 కోట్లు. ఇది మూడేళ్లలో రూ.1,000 కోట్లకు చేరుతుందని అమిత్ ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం 50 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కొత్త ప్లాంటుతో నూతన మార్కెట్లకు విస్తరిస్తాం. విదేశాల నుంచి 50% ఆదాయం వస్తోంది’ అని వివరించారు. -
3 టైర్లు పంక్చరైన కారు.. మన ఆర్థికవ్యవస్థ
థానే : వినియోగదారులకు వాత పెడుతున్న పెట్రోల్ ధరలు, ఇతర సమస్యలపై మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ మూడు టైర్లు పంక్చరైన కారు లాగా ఉందన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ థానేలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చిదంబరం పాల్గొన్నారు. ‘ప్రైవేటు పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం, ఎగుమతులు, ప్రభుత్వ ఖర్చులు భారత ఆర్ధిక వ్యవస్థకు నాలుగు ఇంజిన్ల లాంటివి. ఇవి ఓ కారుకు నాలుగు టైర్లు లాంటివి. ఒకవేళ ఒకటి, రెండు టైర్లు పంక్చర్ అయితేనే వేగం తగ్గిపోతుంది. కానీ మన ఆర్ధిక వ్యవస్థ విషయంలో మూడు టైర్లకు పంక్చర్ అయింది’ అని సీనియర్ కాంగ్రెస్ నేత అన్నారు. ప్రభుత్వం ఖర్చులు కేవలం ఆరోగ్య సంరక్షణ, కొన్ని ఇతర సదుపాయాల్లో మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఈ ఖర్చులు కొనసాగించేందుకు కేంద్రం పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్పీజీ గ్యాస్ పైనా పన్నుల భారం వేసిందన్నారు. ప్రజల నుంచి భారీ మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం, ప్రజా సౌకర్యాల కోసం కొద్ది మొత్తంలోనే ఖర్చుపెడుతుందన్నారు. ఇటీవల కాలంలో విద్యుత్ రంగంలో ఏమైనా కేంద్రం ఖర్చు చేయడం చూశారా? అంటూ చిదంబంర ప్రశ్నించారు. 10 దిగ్గజ కంపెనీలు దివాలా తీస్తే, వాటిలో ఐదు స్టీల్ కంపెనీలే ఉన్నాయని, దీంతో ఆ రంగాల్లో పెట్టుబడులు ఎలా ఆశిస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేసిన ఐదు శ్లాబుల జీఎస్టీ పాలనను కూడా చిదంబరం విమర్శించారు. ఈ ఐదు శ్లాబులకు తోడు సెస్ వసూలు చేయడం పైనా చిదంబరం విమర్శలు సంధించారు. మిగతా దేశాల్లో జీఎస్టీ కింద ఒకే పన్ను వ్యవస్థ ఉంటుందనీ.. కానీ భారత్‌లో మాత్రం రెండు రకాల పన్నుల వ్యవస్థ అమలు చేస్తున్నారన్నారు. ఆర్థిక సమస్యలను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమవుతూ ఉందని చెప్పారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద మోదీ ప్రభుత్వం నాన్ కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు రూ.10 లక్షల రుణం ఇస్తుందని, సరాసరిన ఓ వ్యక్తికి ముద్ర రుణం కింద దక్కేది రూ.43 వేలు మాత్రమే. ఈ తక్కువ మొత్తంతో పకోడా స్టాల్ పెట్టుకోవడం తప్ప.. ఏ పెట్టుబడి పనికి రాదు’ అని చిదంబరం అన్నారు. -
టైర్ల పరుగు.. మొదలైందిప్పుడు!!
డిమాండ్– సప్లై గురించి మనకు తెలియనిదేమీ కాదు. డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలంటే సరఫరా పెరగాలి. సరఫరా పెరగాలంటే తయారీ సామర్థ్యం పెంచుకోవాలి. ఇప్పుడు టైర్ల కంపెనీలూ అదే దార్లో పడ్డాయి. ఆటోమొబైల్ సంస్థలు, రిప్లేస్మెంట్ మార్కెట్ నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టైర్ల కంపెనీలు వాటి తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కార్యకలాపాలను విస్తరించడానికి టైర్ల కంపెనీలు వచ్చే 7–10 ఏళ్ల కాలంలో మొత్తంగా రూ.13,600 కోట్లు వెచ్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎక్కువ భాగం కొత్త యూనిట్ల ఏర్పాటుకే ఖర్చు చేయనున్నాయి. ఉత్పత్తిని 40 శాతం పెంచుకుంటాం: సియట్ ఆర్పీజీ గ్రూప్‌నకు చెందిన సియట్ టైర్స్ తన తయారీని మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ‘ప్రస్తుత ఉత్పత్తిని 35– 40 శాతం మేర పెంచుకోవాలని భావిస్తున్నాం. గుజరాత్‌లోని హలోల్ ప్లాంటులో బస్సు, ట్రక్ రేడియల్స్ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నాం. అలాగే ప్యాసింజర్ కార్ రేడియల్స్ కోసం ఒక గ్రీన్‌ఫీల్డ్ యూనిట్(కొత్త ప్లాంట్) ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ అని సియట్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా తెలిపారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం తగ్గిపోయిందని, అందువల్ల రిప్లేస్మెంట్ విభాగం, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఓఈఎం) నుంచి డిమాండ్ అధికంగా ఉందని పేర్కొన్నారు. అందుకే సామర్థ్యం పెంపునకు రూ.1,200–రూ.1,300 కోట్ల ఇన్వెస్ట్మెంట్లను కేటాయించామన్నారు. వాహన విక్రయాలతో జోరు.. క్రూడ్ ధరలతో బేజారు.. భారత్‌లో ఇటీవల కాలంలో వాహన విక్రయాలు జోరుగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా టూవీలర్లు, ట్రక్ విక్రయాల్లో మంచి వృద్ధి నమోదవుతోంది. సియామ్ గణాంకాల ప్రకారం.. 2018 ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ పరిశ్రమ మొత్తంగా 2.9 కోట్ల యూనిట్ల వాహనాలను తయారు చేసింది. 2017 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 15% వృద్ధి నమోదయింది. అలాగే ఎగుమతులు సహా దేశీ మార్కెట్ల నుంచి ఆర్డర్ బుక్ బలంగా ఉండటం, రబ్బరు ధరలు స్థిరంగా ఉండటం, యాంటీ డంపింగ్ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి వంటివి టైర్ల కంపెనీలకు కలిసొస్తున్నాయి. అయితే ఇక్కడ క్రూడ్ ధరలు పెరుగుతుండటం ప్రతికూల అంశం. ముడిచమురు ధరల పెరుగుదల వల్ల ప్రస్తుత త్రైమాసికం నుంచే చాలా టైర్ల కంపెనీల లాభదాయకతపై ఒత్తిడి పెరిగే అవకాశముంది. క్రూడ్ ఆధారిత ముడిపదార్థమైన కార్బన్బ్లాక్.. టైర్ల తయారీ కంపెనీల వ్యయాల్లో దాదాపు 45 శాతం వాటాను ఆక్రమించింది. ముడి చమురు ధరలు సగటున 62 డాలర్ల నుంచి 75 డాలర్లకు పెరగటం తెలిసిందే. విస్తరణ బాటలో ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్ సియట్ ప్రత్యర్థులైన ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్ కూడా విస్తరణపై దృష్టి కేంద్రీకరించాయి. బస్సు/ ట్రక్ రేడియల్స్, టూవీలర్ టైర్స్ విభాగంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఎంఆర్ఎఫ్.. వచ్చే దశాబ్ద కాలంలో గుజరాత్లో రూ.4,500 కోట్లమేర ఇన్వెస్ట్ చేయనుంది. తమిళనాడు వెలుపల కంపెనీకి ఇదే అతిపెద్ద విస్తరణ. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఏర్పాటవుతున్న కొత్త ప్లాంటులో రూ.1,800 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని అపోలో టైర్స్ జనవరిలోనే ప్రకటించింది. వచ్చే రెండేళ్ల కాలంలో ఈ ప్లాంటు సేవలు అందుబాటులోకి రానున్నవి. ఏడాదికి 55 లక్షల టైర్ల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంటు నిర్మితమౌతోంది. 2017–18, 2018–19 కాలంలో రూ.4,500 కోట్లు ఇన్వెస్ట్ చేయాలనుకున్నామని, అందులో భాగమే ఏపీ ప్లాంటులోని ఇన్వెస్ట్మెంట్లని కంపెనీ తెలిపింది. ‘చెన్నైలో విస్తరణ దాదాపు పూర్తయింది. ఇప్పుడు చెన్నై యూనిట్లో 12,000 రేడియల్స్ను తయారు చేయగలం’ అని అపోలో టైర్స్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. టైర్ల కంపెనీలు వాటి తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని ఆటోమోటివ్ టైర్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బుధ్రాజా తెలిపారు. 5–6 ఏళ్లనాటి పాత ఫెసిలిటీలు పూర్తి సామర్థ్యంతో నడుస్తుండటం ఒక కారణమైతే.. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వల్ల గత రెండేళ్లుగా రిప్లేస్మెంట్ మార్కెట్, వాహన కంపెనీల నుంచి డిమాండ్ పెరగడం రెండోదని పేర్కొన్నారు. టైర్ల ధరలు పెరగొచ్చు!! భవిష్యత్‌లో టైర్ల ధరలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్ని విభాగాల నుంచి ఉన్న బలమైన డిమాండ్ నేపథ్యంలో టైర్ల కంపెనీలు ఉత్పత్తి వ్యయాలను ధరల పెంపు ద్వారా బదిలీ చేసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. ‘వచ్చే రెండు త్రైమాసికాల కాలంలో ముడిపదార్థాల ధరలు 3–4 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. క్రూడ్ ధరల పెరగుదల దీనికి కారణం. దీనివల్ల టైర్ల ధరలు 2–2.5 శాతంమేర పెరగొచ్చు’ అని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ అనలిస్ట్‌లు నిశిత్ జలాన్, హితేశ్ గోయెల్ వివరించారు. కంపెనీ ఇన్వెస్ట్మెంట్లు (రూ.కోట్లు) ఉద్దేశం ఎంఆర్ఎఫ్ 4,500 గుజరాత్లో గ్రీన్‌ఫీల్డ్ ఫెసిలిటీ ఏర్పాటు అపోలో 4,500 ఏపీలో గ్రీన్‌ఫీల్డ్ ఫెసిలిటీ ఏర్పాటు, యూనిట్ల విస్తరణ జేకే టైర్స్ 500 ప్రస్తుత యూనిట్ల విస్తరణ సియట్ టైర్స్ 1,300 గ్రీన్‌ఫీల్డ్ ఫెసిలిటీ ఏర్పాటు, ప్రస్తుత యూనిట్ల విస్తరణ మాక్సిస్ 2,640 గుజరాత్లో గ్రీన్‌ఫీల్డ్ యూనిట్ ఏర్పాటు - (సాక్షి, బిజినెస్ విభాగం) -
ఎమ్మెల్యే తండ్రి టైర్లకు పంక్చర్లు వేస్తున్నారు!
భోపాల్: ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ)కి చెందిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన, జంగ్ పురా నియోజకవర్గం నుంచి గెలుపొందిన ప్రవీణ్ దేశ్ ముఖ్ తండ్రి పీఎన్ దేశ్ ముఖ్(55) మధ్యప్రదేశ్ లోని భోపాల్ దగ్గరలోని జిన్సీలో టైర్ పంక్చర్ షాపు నడుపుకుంటు జీవనం సాగిస్తున్నారు. పార్లమెంటరీ సెక్రటరీ వ్యవహారాల నుంచి విద్యాశాఖను చూసే ప్రవీణ్ పై కూడా ‘ఆఫీస్ ఆఫ్ ఫ్రాఫిట్’ కింద ఆఫీస్ స్పేస్ కింద అసెంబ్లీ స్పీకర్ ద్వారా రూమ్ లు కేటాయించుకున్నారని బీజేపీ, కాంగ్రెస్ లు ఆరోపించాయి. దీన్ని ఖండించిన ఏఏపీ ఎమ్మెల్యేలు వాటిని కొట్టిపారేశారు. తాము విధుల్లోకి వచ్చిన నాటి నుంచి ఎటువంటి జీతభత్యాలను స్వీకరించకుండా పనిచేస్తున్నామని ప్రవీణ్ తెలిపారు. ఈ విషయం స్పందించిన ప్రవీణ్ తండ్రి తనకు గానీ తన కుటుంబంలో ఏ ఒక్కరికీ గానీ అధికారం చేతిలో ఉందన్న గర్వం లేదని అన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రవీణ్ తన స్నేహితులతో కలిసి అద్దెకు ఓ ఫ్లాట్ లో నివసిస్తున్నట్లు తెలిపారు. మేం జీవించే జీవనంలో కూడా ఎటువంటి మార్పులు లేవని చెప్పారు. మొదట ప్రవీణ్ ఎమ్మెల్యే అయినప్పుడు తాను ఆనందించినట్లు ఏడాది తర్వాత అతని సింపుల్ జీవితాన్ని, ఢిల్లీలో విద్యను అందించడానికి చేసిన కృషిని చూసి గొప్పగా ఫీలయినట్లు వివరించారు. డబ్బుకోసమే ఇదంతా చేసి ఉంటే పెద్ద కంపెనీలో రీజనల్ మేనజర్ ఉద్యోగాన్ని ప్రవీణ్ వదులుకునేవాడు కాదని అన్నారు. ఒక ఎమ్మెల్యే డిస్ క్వాలిపై అయినా, ప్రవీణ్ సామాజిక సేవ చేస్తాడని ఆయన తేల్చి చెప్పారు. -
రూ.1,000 కోట్లతో తెలంగాణలో ఎంఆర్ఎఫ్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టైర్ల తయారీలో ఉన్న ఎంఆర్ఎఫ్ (మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ) తెలంగాణలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఈ మొత్తాన్ని మెదక్ జిల్లా సదాశివపేట ప్లాంటు విస్తరణకు వెచ్చించనుంది. తెలంగాణలో పెట్టుబడికి ఎంఆర్ఎఫ్ సుముఖంగా ఉందని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు. ప్రభుత్వ పరంగా కంపెనీకి అన్ని రకాల అనుమతులను సత్వరం ఇస్తామని చెప్పారు. తెలంగాణలో కంపెనీకి మెదక్ జిల్లా సదాశివపేటతోపాటు ఇదే జిల్లాలో అంకెన్‌పల్లి వద్ద ప్లాంట్లున్నాయి. అటు ఎంఆర్ఎఫ్ పెద్ద ఎత్తున విస్తరణ బాట పట్టింది. ప్లాంట్ల విస్తరణకు వచ్చే మూడేళ్లలో రూ.4,000 కోట్లు వెచ్చిస్తామని 2014 డిసెంబర్లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కోషీ వర్గీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2010 తర్వాత కంపెనీ ఇంత పెద్ద ఎత్తున విస్తరణ ప్రణాళికతో ముందుకు రావడం ఇదే మొదటిది. రూ.3,000 కోట్లతో అయిదేళ్ల క్రితం ఎంఆర్ఎఫ్ విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగానే తిరుచ్చి సమీపంలో ప్లాంటును స్థాపించింది. తాజాగా ఎంఆర్ఎఫ్ ఉత్తరాఖండ్‌లో బిర్లా టైర్స్‌కు చెందిన ఒక యూనిట్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు రూ.1,600 కోట్లకుపైగా వెచ్చిస్తున్నట్టు సమాచారం. ఎంఆర్ఎఫ్కు దేశవ్యాప్తంగా 10 ప్లాంట్లున్నాయి. రోజుకు 1.2 లక్షల టైర్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. సెప్టెంబర్ 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.14,789 కోట్ల టర్నోవర్‌పై రూ.908 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
30% వాటాతో అగ్రస్థానంలో ఉన్నాం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: అపోలో టైర్స్.... దేశంలో వాణిజ్యవాహనాల మార్కెట్ విభాగంలో 30 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఏటా రూ. 10 వేల కోట్ల (2 బిలియన్ డాలర్లు) టర్నోవర్‌తో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టైర్ల కంపెనీగా గుర్తింపు పొందింది. యూరప్‌లో 3,500 డీలర్లు, ఇండియాలో 4,900 రిటైల్ ఔట్లెట్లతో ప్రపంచవ్యాప్తంగా 15 వేల మంది ఉద్యోగులు కలిగిన అపోలో టైర్స్ దేశీయ టైర్ల రంగంలో తొలి బహుళజాతి టైర్ల కంపెనీగా తన జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో రేడియల్ టైర్ల సెగ్మెంట్లో తమ పట్టు మరింత పెంచుకునేందుకు వచ్చే రెండు మూడేళ్లలో రూ. 1,500 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ సతీష్ శర్మ సాక్షి ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా ఎదగాలన్నదే తమ లక్ష్యం అన్నారు. చైనా పోటీతో టైర్ల మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతోపాటు రానున్న రోజు ల్లో సంస్థ వ్యూహాలు, విస్తరణ లాంటి పలు అంశాలపై ఇంటర్వ్యూలో వివరించారు. ఆ వివరాలు... అపోలో టైర్స్ ప్రస్థానం? కేరళలో 1976లో పెరంబారే ప్రాంతంలో తొలి ప్లాంట్ నెలకొల్పాం. 1991లో గుజరాత్లో రెండోప్లాంట్, 1995లో కేరళలో మూడోప్లాంట్ ఏర్పాటు చేశాం. 2006లో డన్లప్ ఆఫ్రికా యూనిట్‌ను కొనుగోలు చేశాం. 2009లో నెదర్లాండ్స్‌కు చెందిన వ్రెడ్‌స్టైన్, 2010లో చెన్నైలో గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు. ఈ ఏడాది తూర్పు ఐరోపాలో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టును చేపడుతున్నాం. చెన్నై ప్లాంట్ అత్యాధునిక టెక్నాలజీతో ప్రపంచదృష్టిని ఆకర్షిస్తోంది. టైర్స్ రంగంలో ఇండియన్ ఎంఎన్‌సీగా ఎలా ఎదిగారు? ఇండియా తర్వాత ఐరోపాలో మేం చాలా బలంగా ఉన్నాం. ముడిసరుకు రబ్బర్‌పై లోతైన అవగాహన మాకు వుంది. రహదారి భద్రత అంశంలో రాజీలేని ఉత్పత్తుల తయారీకి మొగ్గుచూపాం. దీంతో సేఫ్టీ విషయంలో మాకు పోటీనే లేదు. ఆఫ్రికా,ఐరోపాల్లో డన్లప్, వ్రెడ్‌స్టైన్ సంస్థలను కొనుగోలు చేయటంతో అక్కడ బలపడ్డాం. మాకు ఐరోపాలో డీలర్ నెట్వర్క్ దాదాపు ఇండియాకు సమానంగా ఉంది. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా తూర్పూ ఐరోపాలోని హంగరీలో మరో గ్రీన్‌ఫీల్డ్ యూనిట్‌ను నెలకొల్పుతున్నాం. వచ్చే ఐదేళ్లలో ఇక్కడ 475 మిలి యన్ యూరోల పైచిలుకు పెట్టుబడులు చేస్తున్నాం. రేడియల్ టైర్ల మార్కెట్లో వృద్ధి ఎలా వుంది? దేశంలో వినియోగించే టైర్లలో రెండింట మూడొం తులు రేడియల్ టైర్లే. బస్సులు, లారీలు, ట్రక్కులకు ఈ టైర్లను విరివిగా వాడుతారు. ఏటా 25% సంచిత వృద్ధితో పురోగమిస్తున్నాం. వచ్చే రెండు మూడేళ్లలో రేడియల్ టైర్స్ స్థాపక సామర్థ్యం రోజుకు 8,900 టైర్లకు పెంచేలా ప్లాంట్ల ఆధునీకరణ, విస్తరణ పనుల కోసం రూ.1,500 కోట్లు కేటాయించాం. అపోలో టైర్స్ మార్కెట్ షేర్ 30%. మేమే నంబర్ వన్. టైర్ల మార్కెట్లో చైనా పోటీ ఎలా ఉంది? చైనా టైర్లు ఇక్కడి మార్కెట్‌ను దెబ్బకొడుతున్నాయి. వినియోగదారులకు రోడ్ సేఫ్టీపై అవగాహన లేకపోవటంతో చౌక టైర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దేశంలో 10% వాటా చైనా టైర్లదే అంటే అతిశయోక్తి కాదు. చైనా టైర్ల దిగుమతి దారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా దేశీయ టైర్ల తయారీదారులు కేంద్ర ప్రభుత్వానికి గతంలో ఎన్నో విన్నపాలు ఇచ్చాయి. అయినా చైనా ధాటిని కట్టడిచేయలేకపోవటంతో దేశీయ పరిశ్రమలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం పరిశ్రమను కుదిపేస్తున్న సమస్యలు? అధిక ఉత్పాదక సామర్థ్యం. అంచనాలను మించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటంతో డిమాండ్‌కంటే సరఫరా అధికమైపోతున్నది. స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ) 7 శాతం పైగా ఉంటే ప్రస్తుత స్థాపిత సామర్థ్యానికి తగిన డిమాండ్ ఏర్పడుతుంది. దేశీయ కంపెనీలైన ఎంఆర్ఎఫ్, జేకే టైర్స్‌తో పాటు బ్రిడ్జిస్టోన్ లాంటి విదేశీ సంస్థలూ కెపాసిటీ పెంచాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాయి. మార్కెట్ వాటా వివరాలు? వాణిజ్యవాహనాల విభాగంలో మేం 30 శాతంతో నంబర్ వన్‌గా ఉన్నాం. ఇక ప్యాసింజర్ కార్ల విభాగంలో మా వాటా 17 శాతం. అయితే ఈ సెగ్మెంట్లో 30కి పైగా టైర్ బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 17 శాతం వాటా గణనీయమైనదే. వచ్చే రెండేళ్లలో 25 శాతానికి పెంచాలన్నది మా లక్ష్యం. ఆధునీకరణ, విస్తరణ వ్యూహాలు? వచ్చే రెండు మూడేళ్లలో చెన్నై, కేరళ ప్లాంట్లను విస్తరిస్తున్నాం. ఇక్కడ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఆఫ్‌హైవే టైర్ల ఉత్పత్తి, ఫ్లోటింగ్ టైర్స్, అగ్రి టైర్స్, ఓటీఆర్ టైర్ల ఉత్పత్తిని చేపడుతున్నాం. దీని కోసం రూ. 500 కోట్లు వెచ్చిస్తున్నాం. ఏపీ, తెలంగాణ మార్కెట్ ప్రణాళికలు? మొదటి నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో మాకు మంచి పట్టుంది. పటిష్టమైన డీలర్ నెట్వర్క్ ఉంది. వినియోగదారుల అవసరాల మేరకు మరిన్ని కేంద్రాల్లో నెట్వర్క్ పెంచే ఆలోచన ఉంది. విజయవాడ, వైజాగ్ కేంద్రాల్లో రీట్రెడ్డింగ్పై అవగాహన కేంద్రాలను తరచు నిర్వహిస్తుంటాం. -
ప్రపంచ వేగానికి కారకుడు
సత్వం మానవ చరిత్రలో ‘చక్రం’ ఆవిష్కరణ తెచ్చిన పురోగతి మామూలుది కాదు! జీవితపు వేగాన్ని చక్రం ప్రభావితం చేసింది. ఆలాంటి చక్రం ఎన్నో చక్రాలుగా బహుముఖీనంగా విస్తరించింది. ఆ చక్రానికి కొనసాగింపయిన ‘టైరు’ ప్రవేశంతో రవాణావ్యవస్థ చాలాముందుకు లంఘించింది. అయితే, ఒక కన్నతండ్రి ప్రేమకూ, ఇప్పటి ఆధునిక టైరు రూపకల్పనకూ సంబంధం ఉంది! జాన్ బాయ్డ్ డన్లప్ తన కొడుకు సమస్యను పరిష్కరించడం కోసం చేసిన సృజన... రవాణావ్యవస్థ రూపురేఖల్ని మార్చేసింది. స్కాట్లాండ్లో 1840 ఫిబ్రవరి 5న జన్మించాడు జాన్ బాయ్డ్ డన్లప్. ఎడింబరో విశ్వవిద్యాలయంలో చదివాడు. వృత్తిరీత్యా వెటర్నరీ సర్జన్. కొన్నాళ్ల ప్రాక్టీస్ తర్వాత ఆయన కుటుంబం స్కాట్లాండ్ నుంచి ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్ నగరానికి తరలివచ్చింది. బెల్ఫాస్ట్లో రోడ్లు కంకరతేలి ఉండటం, వాటిమీద కొడుకు తన ట్రైసైకిల్‌ను నడపడానికి తిప్పలు పడుతుండటం గమనించాడు డన్లప్. ట్రైసైకిల్ అంటే ఇప్పటి పిల్లల ఆటసైకిల్లాంటిది కాదు. పెద్దవాళ్లు కూడా తొక్కుకుంటూ వెళ్లేదే! అప్పటి చక్రాలు ఇనుముతోనో, చెక్కతోనో తయారుచేసేవారు. కొన్నిచోట్ల ఇనుప రీముల చుట్టూతా రబ్బరు చుట్టడం కూడా వినియోగంలోకి వచ్చినా, అది చక్రానికీ, నేలకూ మధ్య ఘర్షణను తగ్గించడానికే ఎక్కువగా ఉపయోగపడింది. 1887 నాటికి అలా రబ్బరు చుడుతున్నారన్న సంగతి బెల్ఫాస్ట్లో ఇంకా తెలియదు. సహజంగానే డన్లప్కూ తెలియదు. అయితే, తన కొడుకు ఆ దోవల్లో ట్రైసైకిల్ నడపలేక పడుతున్న అవస్థను గమనించాక, ఆ ఇనుప చక్రాల చుట్టూ రబ్బరు చుడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆయనలో తనకుతానుగా మొలకెత్తింది. అంతకంటే ముఖ్యం, ఆ రబ్బరులో గాలినింపాలని మరింత ‘అడ్వాన్సు’గా కూడా ఆలోచించాడు. అందుకు ఫుట్‌బాల్‌లో గాలినినింపే పంపు ఆయనకు పనికొచ్చింది. గాలినింపిన టైరు... నేలకూ, చక్రానికీ మధ్య ‘కుషన్’గా ఉపయోగపడింది. వేగం పెరిగింది. ప్రయాణం సుఖవంతం అయింది. ఇది మరింత ప్రాక్టికల్ విధానం కూడా! చాలా పెద్ద పరిష్కారాలు కూడా అప్పటి తక్షణ సమస్యలోంచే పుడతాయేమో! దళసరి రబ్బరును టైరుగా వాడొచ్చన్న ఆలోచన అదివరకే వేరొకరికి వచ్చివుండటం మూలాన డన్లప్ ‘టైరు ఆవిష్కర్త’ కాలేకపోయాడు. కానీ టైరులో గాలినింపి వాడాలన్న ఆలోచన అచ్చంగా ఆయనదే! ఈ ‘గాలి నింపిన టైరు’ గురించి ఇంకా ప్రపంచానికి తెలియదు. రెండేళ్ల తర్వాత, 1889లో డన్లప్ దాన్ని మరింత ఆధునికపరచి, సైక్లిస్ట్ విలియమ్ హ్యూమ్‌తో తన ఆలోచన పంచుకున్నాడు. ఈ హ్యూమ్ ‘బెల్ఫాస్ట్ క్రూయిజర్స్ సైక్లింగ్ క్లబ్’ జట్టు కెప్టెన్. తను రూపొందించిన టైర్లు వాడుతూ హ్యూమ్ పందెంలో పాల్గొనేలా చేశాడు డన్లప్. ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించేలా, హ్యూమ్ ఆ పోటీల్లో విజయం సాధించాడు. దృఢమైన రబ్బరు కంటే గాలి నింపిన టైర్లు వేగవంతమైనవని అలా నిరూపణ జరిగింది. 1921 అక్టోబర్ 23న మరణించిన డన్లప్ అలా చరిత్రలో నిలిచిపోయాడు.