ప్రముఖ టైర్స్ అండ్ ట్యూబ్స్ తయారీ సంస్థ జేకే టైర్స్ అండ్ ఇండస్ట్రీస్ భారత మార్కెట్లలోకి సరికొత్త టైర్లను లాంచ్ చేసింది. తొలిసారిగా టైర్లలో పంక్చర్ గార్డ్ టెక్నాలజీని తీసుకువస్తోనట్లు జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ తెలియజేసింది.
వాటంతటా అవే సెల్ఫ్ హీల్..!
ఫోర్ వీలర్ల కోసం పంక్చర్ గార్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుందని జేకే టైర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ టెక్నాలజీ సహాయంతో టైర్లు పంక్చర్ అయినప్పుడు గాలి బయటకు పోకుండా సెల్ఫ్ హీల్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఆటోమెటిక్ ప్రాసెస్ ద్వారా టైర్ లోపల సెల్ఫ్-హీలింగ్ ఎలాస్టమర్ ఇన్నర్ కోట్ సహాయంతో ఇది సాధ్యమవుతోందని జేకే టైర్స్ తెలియజేసింది. 6 ఎంఎం వరకూ మందంతో ఉండే మేకులు, ఇతరత్రా వస్తువులు టైర్‌కు దిగితే...ఇబ్బంది లేకుండా వాహనదారులు తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చునని పేర్కొంది. ఇక టైర్ అరిగిపోయేంత వరకు పంక్చర్ల బాధే ఉండదని కంపెనీ అభిప్రాయపడింది.
వాహనదారుల కోసం 2020లో స్మార్ట్ టైర్ టెక్నాలజీని పరిచయం చేశామని , ఇప్పుడు పంక్చర్ గార్డ్ టెక్నాలజీని అందిస్తున్నామని జేకే టైర్ సీఎండీ రఘుపతి సింఘానియా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వాహనదారుల కోసం అదిరిపోయే టెక్నాలజీతో టైర్లను తెచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
చదవండి: కలిసొచ్చిన రష్యా-ఉక్రెయిన్ వార్..! తొలిసారి టాప్-5 క్లబ్‌లోకి భారత్..!
Comments
Please login to add a commentAdd a comment