puncture
-
‘డిగ్రీలతో ఉపయోగం లేదు.. పంక్చర్ షాప్ తెరవండి’
భోపాల్: మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య విద్యార్థులను ఉద్దేశించి విచిత్రమైన వ్యాఖ్యాలు చేశారు. ఆయన సోమవారం గుణ అసెంబ్లీ నియోజకవర్గంలో పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డిగ్రీలు చదవటం వల్ల ఏం రాదు.. డబ్బులు సంపాదించాలంటే విద్యార్థులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకొవాలని సూచించారు.‘మేము ఇవాళ పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ప్రారంభించాం. నేను అందరికీ ఒక్కటే మాట చెప్పదల్చుకున్నా.. దానిని మీరు గుర్తు పెట్టుకోండి. కాలేజీలో డిగ్రీలతో ఏం రాదు. దాని బదులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకోండి. కనీసం దాని వల్ల రోజువారిగా డబ్బులు సంపాదించుకోవచ్చు’ అని అన్నారు.डिग्री से कुछ नहीं होने वाला, पंक्चर की दुकान खोल लेना" गुना से BJP विधायक पन्नालाल शाक्य ने कहा #Guna | Pannalal Shakya | #PannalalShakya pic.twitter.com/j3u7w4HvQ7— Deshhit News (@deshhit_news) July 15, 2024 ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మధ్యప్రదేశ్‌లోని 55 జిల్లాలో ఏర్పాటు చేసిన పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీని వర్చువల్‌గా ప్రారంభించారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
పంక్చర్లకీ చెక్..!ఈ టైర్లు వాటంతంటా అవే సెల్ఫ్ హీల్..!
ప్రముఖ టైర్స్ అండ్ ట్యూబ్స్ తయారీ సంస్థ జేకే టైర్స్ అండ్ ఇండస్ట్రీస్ భారత మార్కెట్లలోకి సరికొత్త టైర్లను లాంచ్ చేసింది. తొలిసారిగా టైర్లలో పంక్చర్ గార్డ్ టెక్నాలజీని తీసుకువస్తోనట్లు జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ తెలియజేసింది. వాటంతటా అవే సెల్ఫ్ హీల్..! ఫోర్ వీలర్ల కోసం పంక్చర్ గార్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుందని జేకే టైర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ టెక్నాలజీ సహాయంతో టైర్లు పంక్చర్ అయినప్పుడు గాలి బయటకు పోకుండా సెల్ఫ్ హీల్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఆటోమెటిక్ ప్రాసెస్ ద్వారా టైర్ లోపల సెల్ఫ్-హీలింగ్ ఎలాస్టమర్ ఇన్నర్ కోట్ సహాయంతో ఇది సాధ్యమవుతోందని జేకే టైర్స్ తెలియజేసింది. 6 ఎంఎం వరకూ మందంతో ఉండే మేకులు, ఇతరత్రా వస్తువులు టైర్‌కు దిగితే...ఇబ్బంది లేకుండా వాహనదారులు తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చునని పేర్కొంది. ఇక టైర్ అరిగిపోయేంత వరకు పంక్చర్ల బాధే ఉండదని కంపెనీ అభిప్రాయపడింది. వాహనదారుల కోసం 2020లో స్మార్ట్ టైర్ టెక్నాలజీని పరిచయం చేశామని , ఇప్పుడు పంక్చర్ గార్డ్ టెక్నాలజీని అందిస్తున్నామని జేకే టైర్ సీఎండీ రఘుపతి సింఘానియా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వాహనదారుల కోసం అదిరిపోయే టెక్నాలజీతో టైర్లను తెచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. చదవండి: కలిసొచ్చిన రష్యా-ఉక్రెయిన్ వార్..! తొలిసారి టాప్-5 క్లబ్‌లోకి భారత్..! -
ఈ టైర్లు అసలు పంక్చరే కావు..!
వాహనాలకు మరింత వేగాన్ని, స్టెబిలిటీని అందించడంలో టైర్లు ముఖ్యమైన పాత్ర వహిస్తాయి.సరియైన మోతాదులో టైర్లలో గాలి ఉంటే వాహనం ఎక్కువ పికప్‌ను అందుకుని వేగంగా వెళ్తుంది. సంప్రాదాయక టైర్లు ఎక్కువగా పంక్చర్ అవ్వడం చూసే ఉంటాం. వాటి స్థానంలో ట్యూబ్‌లెస్ టైర్లు మార్కెట్లలోకి వచ్చాయి. ట్యూబ్‌లెస్ టైర్లతో కాస్త ఉపశమనం కల్గిన అది కొంత సేపు వరకే మాత్రమే. ట్యూబ్‌లెస్ టైర్లు పంక్చర్ అయితే కొంత దూరం మేర వచ్చినా.. ఈ టైర్లు కచ్చితంగా పంక్చర్ ప్రూఫ్ మాత్రం కాదు. తిరిగి వాటికి పంక్చర్ చేయల్సిందే. పంక్చర్ ప్రూఫ్ టైర్ల కోసం అనేక కంపెనీలు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి. పంక్చర్ ప్రూఫ్ టైర్లను అందించడంలో మిచెలిన్ సంస్థ ముందుంది. తాజాగా మిచెలిన్ పంక్చర్ ప్రూఫ్ టైర్లను టెస్ట్ చేసింది. చదవండి: వాహనదారులకు షాకింగ్ న్యూస్...! 3డీ ప్రింటింగ్‌తో...! 2005 నుంచి ప్రముఖ టైర్ల తయారీదారు మిచెలిన్ పంక్చర్ ప్రూఫ్ టైర్లపై పనిచేస్తోంది. ఒక దశాబ్దకాలంపాటు చేసిన పరిశోధనల ఫలితంగా మిచెలిన్ పంక్చర్ ఫ్రూఫ్ టైర్లను రియాల్టీలోకి తెచ్చింది. భవిష్యత్తులో రానున్న ఎలక్ట్రిక్ వాహనాలకు పంక్చర్ ప్రూఫ్ టైర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మిచెలిన్ భవిష్యత్తులో పర్యావరణానికి అనుకూలంగా ఉండే గ్రీన్ టైర్లను అందుబాటులోకి తీసుకురానుంది. యూనిక్ పంక్చర్‌ప్రూఫ్ టైర్ సిస్టమ్ ద్వారా ఎయిర్‌లెస్ టైర్, పంక్చర్ ప్రూఫ్ టైర్లను అందించనుంది. 3 డీ ప్రింటింగ్‌తో తయారుచేసిన టైర్లను మిచెలిన్ అందుబాటులోకి తీసుకురానుంది. ఫోటోకర్టసీ: మిచెలిన్ టైర్స్ మిచెలిన్ 2017లో పంక్చర్ ప్రూఫ్ టైర్ల వీడియోను టీజ్ చేసింది. కంపెనీ డెవలప్ చేసిన టైర్లు గ్లాస్ ఫైబర్ రీఈన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ తయారు చేయబడిన సౌకర్యవంతమైన లోడ్-బేరింగ్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇలాంటి టైర్లను మార్స్‌పైకి పంపిన రోవర్, క్యూరియాసిటీలో నాసా ఉపయోగించింది. ఈ టైర్లను 2024లోపు మార్కెట్లలోకి తీసురావాలని మిచెలిన్ భావిస్తోంది. తొలుత రీసైకిలింగ్ చేయబడిన టైర్లనుపయోగించి పంక్చర్ ప్రూఫ్ టైర్లను తయారు చేయనుంది. టైర్లతో పొంచి ఉన్న ముప్పు...! ప్రపంచవ్యాప్తంగా ఏటా మూడు బిలియన్లకు పైగా టైర్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ టైర్ల జీవితకాలం దాటిన తర్వాత, ఈ టైర్లను నిర్వీర్యం చేస్తారు. అందులో కొన్ని టైర్లను రీసైకిలింగ్ చేయగా.. మిగతావి వ్యర్థాలుగా మిగిలిపోనున్నాయి. కొన్ని సందర్భాల్లో వాడి పడేసిన టైర్లు అగ్నిప్రమాదాలకు గురై.. వాతావరణంలో విషపూరిత వాయువులను వెదజల్లే అవకాశం ఉంది. చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..! -
నలుగురు కుర్రాళ్ల కథ
హరీష్, వినోద్, కార్తీక్, వెంకట చరణ్ హీరోలుగా, గీత్ షా, సంజన, లాస్యశ్రీ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పంక్చర్’. చంద్రుడు క్రియేష¯Œ ్స సమర్పణలో శ్రీలక్ష్మి ప్రొడక్ష¯Œ ్స పతాకంపై శ్రీరంగం శేషశ్రీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో శ్రీరంగం శేషశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇది నా మొదటి సినిమా. నలుగురు కుర్రాళ్ల మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలోనే కథ ఉంటుంది. చక్కటి హాస్యంతో నిండిన కథతో రూపొందుతోంది’’ అన్నారు. ‘‘సమాజానికి ఉపయోగపడేలా మా సినిమా ఉంటుంది’’అన్నారు సమర్పకులు రాజు రాళ్లబండి. ‘‘ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. చిన్న చిత్రాలను ప్రోత్సహించాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అర్జున్. ‘‘వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమా ఇది’’ అన్నారు రచయిత సాయినాథ్. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ఎల్బీశ్రీరామ్, జయప్రకాష్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఎస్. శ్రీనివాస్. -
ప్రగతి చక్రానికి పంక్చర్
రికార్డు స్థాయి నష్టాల్లో ఆర్టీసీ ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల్లోనే రూ. 931 కోట్లు హాంఫట్ ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు రవాణా వ్యవస్థగా గిన్నిస్ రికా ర్డు సృష్టించిన ఆర్టీసీ... ఇప్పుడు నష్టాలు మూటగట్టుకోవడంలోనూ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. 75 ఏళ్ల చరిత్రలో 2013-14లో అత్యధికంగా రూ. 902 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మరింతగా ఊబిలో కూరుకు పోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 931.77 కోట్ల నష్టాలను చవిచూసింది. ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి ఈ నష్టం రూ. 1,100 కోట్లకు చేరే అవకాశం కనిపిస్తోంది. - సాక్షి, హైదరాబాద్ ఠీ డీజిల్ దెబ్బ.. ఇప్పటికే నష్టాల తో కుదేలవుతున్న ఆర్టీసీపై డీజిల్ బాంబు పడింది. పన్నులతో కలుపుకొని ఒక్కసారిగా రూ. 4 వరకు పెరగటంతో ఆర్టీసీపై వార్షిక లెక్కన రూ. 230 కోట్ల భారం పడింది. సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగానే కొనసాగుతున్న ఆర్టీసీ రోజూ సగటున 16 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. ఈ లెక్కన తాజా పెంపుతో రోజువారీ అదనపు భారం రూ. 64 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇంతకుముందే తెలంగాణలో లీటర్ డీజిల్‌కు రూ. 2 చొప్పున అదనపు మొత్తాన్ని చెల్లించాలన్నప్పుడే భరించలేమంటూ ఆర్టీసీ చేతులెత్తేసింది. దీంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నా... వ్యాట్‌ను పెంచడంతో ఆ భారం కొనసాగుతూనే ఉంది. దీనికితోడు తాజా పెంపు వల్ల భారం మరింతగా పెరగడంతో... తమను ఆదుకోవాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను కోరాలని ఆర్టీసీ భావిస్తోంది. ఠీ ఏపీ నుంచి ఎక్కువ! 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అధికారులు ఫిబ్రవరి నెల వరకూ రూపొందించిన ఆదాయ-వ్యయాల పట్టికను రూపొందించారు. దానిని పరిశీలించి ఈ పదకొండు నెలల కాలంలోనే ఆర్టీసీ రూ. 931.77 కోట్ల నష్టాలను చవిచూసినట్లు గుర్తించి కంగుతిన్నారు. ఈ లెక్కన ఈసారి నష్టాలు రూ. 1,100 కోట్లను చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నష్టాల్లో సింహభాగం ఆంధ్ర ప్రదేశ్ నుంచే వచ్చింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రం నుంచి రూ. 573.56 కోట్లు. తెలంగాణ పరిధిలో రూ. 358.21 కోట్లుగా నష్టం వచ్చినట్లుగా తేలింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిధిలో నష్టాలు ఎక్కువగా వస్తుండగా... ఒక్క జనవరిలో మాత్రం తెలంగాణ కంటే తక్కువగా రూ. 4.48 కోట్ల నష్టం మాత్రమే వచ్చింది. రెండేళ్లలో ఒక నెలలో ఇంత తక్కువ నష్టం రావటం ఇదే మొదటిసా రి. ఈ నెలలో తెలంగాణ పరిధిలో నష్టాలు రూ. 12.47 కోట్లుగా నమోదయ్యాయి. ఠీ పట్టించుకోని ప్రభుత్వాలు.. ఆర్టీసీ 75 ఏళ్ల చరిత్రలో 2013-14లో అత్యధికంగా రూ. 902 కోట్ల నష్టాలు వచ్చాయి. దానిపై దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉన్నా.. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోకపోవడంతో నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు విభజన అనంతరం ఏర్పడిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉమ్మడిగా కొనసాగుతున్న ఆర్టీసీలో సంస్కరణల జోలికి వెళ్లకపోవడంతో నష్టాలు తార స్థాయికి చేరుతున్నాయి. ఇరు ప్రభుత్వాలు కూడా కేవలం మొక్కుబడిగా అధికారులను వివరాలు అడగడం తప్ప సమీక్షలు నిర్వహించడం లేదు. దీంతో ఆర్టీసీ నష్టాలు పెరుగుతున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గా ఉంటున్నప్పటికీ నష్టాలు రావడానికి కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నా... ఎవరూ పట్టించుకోవటం లేదు. విభజన నేపథ్యంలో అంతర్గతంగా అధికారుల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలతో వారెవరూ పరిస్థితిని పట్టించుకోవటానికి ముందుకు రావటం లేదు. ఆర్టీసీ విభజనకు మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉన్నందున.. దిద్దుబాటు చర్యలకు అవకాశం కనిపించడం లేదు. అయితే ఇటీవలే ఆర్టీసీ బాధ్యతలు స్వీకరించిన సాంబశివరావు పరిస్థితిని కొలిక్కి తెచ్చే యత్నం చేస్తున్నా... ప్రభుత్వాల నుంచి సహకారం లేకపోవటం గమనార్హం.